శరీరంలో విటమిన్ బీ12 లోపం ఉంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఈ విటమిన్ ఉండే ఆహారాలను తీసుకోవాలి. విటమిన్ బీ12 అధికంగా ఉండే 5 రకాల ఫుడ్స్ ఇక్కడ చూడండి.
Photo: Pexels
టున, సార్డైన్, సాల్మన్ లాంటి చేపల్లో విటమిన్ బీ12 పుష్కలంగా ఉంటుంది. వీటిని తింటే ఈ విటమిన్ శరీరానికి అందుతుంది.
Photo: Pexels
పాలల్లోనూ విటమిన్ బీ12 ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ విటమిన్ లోపం ఉన్న వారు ప్రతీ రోజూ పాలు తాగడం చాలా ముఖ్యం.
Photo: Pexels
కోడిగుడ్లలో విటమిన్ బీ12, విటమిన్ డీ, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు చాలా పోషకాలు ఉంటాయి. గుడ్లు తింటే మీ ఆరోగ్యానికి చాలా రకాలుగా ప్రయోజనం చేకూరుతుంది.
Photo: Pexels
యగర్ట్, చీజ్, వెన్న లాంటి డెయిరీ ఉత్పత్తుల్లోనూ విటమిన్ బీ12 పుష్కలంగా ఉంటుంది.
Photo: Pexels
చికెన్ బ్రెస్ట్‌లో విటమిన్ బీ12, లీన్ ప్రొటీన్, పాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి. ఇది తింటే చాలా లాభాలు దక్కుతాయి.
Photo: Pexels
చలికాలంలో పాలకూరను కచ్చితంగా ఎందుకు తినాలి? కారణాలు ఇవే