జుట్టు పలచబడుతోందా! ఈ సమస్య తగ్గేందుకు ఉపకరించే 5 రకాల ఆహారాలు ఇవి

Photo: Unsplash

By Chatakonda Krishna Prakash
Mar 04, 2024

Hindustan Times
Telugu

జుట్టు పలచబడడం చాలా మందికి సమస్యగా ఉంటుంది. ఇలా జరిగితే జుట్టు రాలడం ఎక్కువవుతుంది. అందుకే జుట్టు మందంగా ఉండేందుకు ఉపకరించే పుడ్స్ తీసుకోవాలి. అలా.. వెంట్రుకలు మందంగా మారేందుకు సహకరించే ఐదు రకాల ఆహారాలు ఇవే..

Photo: Unsplash

నిమ్మ, నారింజ లాంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇవి తింటే జుట్టు మందం పెరిగేందుకు ఉపయోగపడే కొలిజెన్ ఉత్పత్తి మెరుగవుతుంది. దీంతో జుట్టు దృఢంగా అవుతుంది. 

Photo: Unsplash

కోడిగుడ్లలో విటమిన్ ఏ, విటమిన్ ఈ, ఫోలెట్ పుష్కలంగా ఉంటాయి. దీంతో జుట్టు మందంగా ఉండేందుకు గుడ్లు కూడా సహకరిస్తాయి.

Photo: Unsplash

అవకాడోల్లో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. ఇవి తీసుకుంటే జుట్టు పలచబడడం తగ్గుతుంది. జుట్టు దృఢత్వాన్ని, తేమను ఇది పెంచగలదు. 

Photo: Unsplash

ఆలివ్ ఆయిల్‍లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఈ నూనె తీసుకుంటే జుట్టు మందంగా అయ్యేందుకు, పెరుగుదల మెరుగయ్యేందుకు ఉపకరిస్తుంది. 

Photo: Unsplash

బాదం పప్పు, వాల్‍నట్స్, గుమ్మడి కాయ విత్తనాలు లాంటి నట్స్, విత్తనాల్లోనూ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీంతో ఇవి కూడా జుట్టు మందం పెరిగేందుకు ఉపయోగపడతాయి. 

Photo: Unsplash

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేకమైన లక్షణాలు, శక్తులు ఉంటాయి.వాటి అనుగుణంగా చూస్తే ఒక్కో రాశి వారికి ఒక్కో రకమైన రంగు బాగా కలిసొస్తుంది.

pixabay