Krishna mukunda murari march 5th episode: తీరబోతున్న ముకుంద కోరిక.. కృష్ణ ఇచ్చిన షాక్ కి బిత్తరపోయిన మురారి-krishna mukunda murari serial march 5th episode krishna gets upset as mukunda wishes for murari ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari March 5th Episode: తీరబోతున్న ముకుంద కోరిక.. కృష్ణ ఇచ్చిన షాక్ కి బిత్తరపోయిన మురారి

Krishna mukunda murari march 5th episode: తీరబోతున్న ముకుంద కోరిక.. కృష్ణ ఇచ్చిన షాక్ కి బిత్తరపోయిన మురారి

Gunti Soundarya HT Telugu
Mar 05, 2024 09:10 AM IST

Krishna mukunda murari serial march 5th episode: గుడిలో కాయిన్ నిలబెడితే కోరిక తీరుతుందని రేవతి చెప్పడంతో ముకుంద కాయిన్ నిలబెట్టడానికి ట్రై చేస్తుంది. కృష్ణ కూడా ప్రయత్నిస్తుంది కానీ కాయిన్ నిలబడదు. ముకుంద కాయిన్ మాత్రం నిలబడుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

కృష్ణ ముకుంద మురారి సీరియల్ మార్చి 5వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ మార్చి 5వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Krishna mukunda murari serial march 5th episode: గుడిలో కాయిన్ నిలబెడితే కోరిక తీరుతుందని చెప్పేసరికి ముకుంద మురారి దగ్గర కాయిన్ తీసుకుంటుంది. ఇక కృష్ణ కూడా ముకుంద కోరిక నెరవేరుతుందేమోనని భయంతో తాను కూడా కాయిన్ నిలబెడతానని చెప్తుంది. కృష్ణ రెండు సార్లు ప్రయత్నించినా కూడా కాయిన్ నిలబడదు. మురారి తన సొంతం కావాలని కోరుకుంటూ ముకుంద కాయిన్ నిలబెడితే నిలబడుతుంది. దీంతో సంతోషంగా దేవుడికి థాంక్స్ చెప్పి తన కోరిక తీరబోతుందని సంతోషపడుతుంది. ఏసీపీ సర్ నేను నూరేళ్ళు ఇలాగే కలిసి ఉండాలని కోరుకుని కృష్ణ పెట్టె కాయిన్ నిలబడకపోయేసరికి చాలా బాధపడుతుంది.

ముకుంద కోరిక నెరవేరుతుంది అంటే నా కోరిక నెరవేరదా అని ఫీల్ అవుతుంది. నేనే నీ సొంతం అయినప్పుడు ఇంక భయం ఎందుకు, తమ మీద నమ్మకం లేని వాళ్ళు ఇలా చేస్తారు. ఏంటి నువ్వు నేను విడిపోతామని నీకేమైన అనుమానంగా ఉండాని మురారి అనబోతుంటే కృష్ణ తన నోటికి చెయ్యి అడ్డం పెడుతుంది. లేదని అంటుంది. అదేదో పిచ్చితో వంద చేస్తుంది వాటికి మనకి ఏంటి సంబంధం మనం ఏం చేయాలో ఆలోచించాలి ఇది కాదని సర్ది చెప్తాడు. కానీ కృష్ణ తన కాయిన్ నిలబడిందని అంటే తనకి ఆ టాలెంట్ ఉంది నీకు లేదు పద అంటాడు. కృష్ణ వెళ్ళిపోయిన తర్వాత ముకుంద పెట్టిన కాయిన్ నిలబడటం ఏంటని మురారి ఆలోచిస్తాడు.

ముకుందకి అదిరే షాక్ ఇచ్చిన మురారి

ముకుంద వచ్చి ఇప్పటికైనా నమ్ముతావా? నా కోరిక నెరవేరుతుందని నువ్వు నా వాడివి అవుతావని అంటుంది. ఎందుకని మురారి అంటే కాయిన్ నిలబడింది కదా అంటుంది. ఏది అని అంటే కాయిన్ పడిపోయి ఉంటుంది. అది చూసి ముకుంద షాక్ అవుతుంది. నిలబడింది అన్నావ్ కదా కాయిన్ ఏది ఇప్పటికైనా నమ్ముతావా నువ్వు కోరుకున్న కోరిక ఎప్పటికీ నెరవేరదని మురారి రివర్స్ పంచ్ ఇస్తాడు. నో నెరవేరుతుంది నేను కోరుకున్నప్పుడు నిలబడింది అంటే ఆ కోరిక నెరవేరుతుందని అంటుంది. తర్వాత పడిపోయింది కదా అంటే ఏంటి అర్థం మనం కోరుకున్న వాటిలో కొన్నే తీరతాయి మిగతావి పడిపోతాయి ఇలాగా కాబట్టి ఎక్కువ ఆశలు పెట్టుకోకు నీది ఎప్పటికీ తీరే కోరిక కాదని స్ట్రాంగ్ గా చెప్తుంది. తీరుతుంది ఖచ్చితంగా నేను అనుకున్నది సాధించి తీరతాను ముందు ఈరోజు శోభనం ఎలా ఆపాలో ఆలోచించు లేదంటే నేను ఏం చేస్తానో నువ్వు ఊహించలేవని ముకుంద వార్నింగ్ ఇస్తుంది.

కృష్ణ డల్ గా ఉంటే ఏమైందని అడుగుతాడు. అటు చూస్తే పెద్దత్తయ్యకి మాట ఇచ్చాను ఇటు చూస్తే ముకుంద ఇలా ఏం చేయాలో అర్థం కావడం లేదు భయంగా ఉందని అంటుంది. నేను పిరికి వాడినని అంటావ్ నువ్వు పిరికీదానివి అవుతున్నావా? అంటే నేను పెట్టిన కాయిన్ పడిపోయింది ముకుంద పెట్టిన కాయిన్ నిలబడింది అంటే తను అనుకున్నదే జరుగుతుంది కదా అని అంటుంది. ఇవన్నీ వాళ్ళు అనుకున్నవి జరుగుతాయో లేదో అని తృప్తి కోసం చేసుకుంటారు నేను ముకుందకి దగ్గరయ్యేది లేదు ఇలాంటివి పట్టించుకోవద్దని చెప్పాను కదా అంటాడు. అంతా ముకుంద అనుకున్నట్టే జరుగుతుంది అదే నా భయమని చెప్తుంది. తను నిలబెట్టిన కాయిన్ పడిపోతుంది అది నువ్వు చూడలేదు. తాళి కట్టిన భర్తని దూరం పంపించేసి ఇంకొకరి భర్తని అడిగితే దేవుడు తీర్చేస్తాడా? తీర్చడు కదా పడిపోయిన కాయిన్ గురించి ఆలోచించకుండా ముకుందని ఎలా హ్యాండిల్ చేయాలో ఆలోచిద్దామని అంటాడు.

శోభనం రోజే నా భార్య వెళ్ళిపోయింది సార్

ముకుంద, రేవతి, ఆదర్శ్ ఇంటికి వస్తారు. కానీ మురారి వాళ్ళు మాత్రం రెస్టారెంట్ కి వెళతారు. ఆదర్శ్ నడవలేక ఇబ్బంది పడుతుంటే ముకుంద మురారి వాళ్ళు ఇంకా రాలేదు ఏంటని చూస్తుంది. ఆదర్శ్ అడుగు వేయలేకపోతుంటే పట్టుకోవాలి కదాని రేవతి ముకుందకి చెప్తుంది. తనని పట్టుకుని జాగ్రత్తగా లోపలికి తీసుకురమ్మని చెప్తుంది. మధు రేవతిని ఆపి ఆదర్శ్ ని పట్టించుకోవడం లేదని చెప్తుంటే నువ్వు నమ్మడం లేదని అంటాడు. రేవతి తనని తిడుతుంది. ఇంట్లోకి రాగానే సుమలత ఉంటుంది. కృష్ణ ఫోన్ చేసి శోభనానికి ముహూర్తాలు పెట్టారు వెంటనే వచ్చేయమని చెప్పిందని సుమలత చెప్తుంది. నందినికి కూడా ఫోన్ చేసింది కానీ తను రావడం కుదరదని చెప్పిందని మధు చెప్తాడు.

సుమలత కాసేపు ముకుంద సిగ్గుపడుతుందని ఆటపట్టిస్తుంది. నా చిరాకు సిగ్గులాగా అనిపిస్తుందా వీళ్ళు ఇంకా రాలేదు ఏంటని మనసులో టెన్షన్ పడుతుంది. మురారి వాళ్ళు రెస్టారెంట్ కి వస్తారు. అక్కడ ఒక బేరర్ తన బాధని కృష్ణ వాళ్ళతో పంచుకుంటాడు. మొన్న నాకు పెళ్లి అయ్యింది. నిన్న శోభనం అనేసరికి మురారి వెంటనే వావ్ మొన్న పెళ్లి నిన్న శోభనం. కొంతమందికి పెళ్లి అయి రెండేళ్ళు అవుతున్నా శోభనం ఉండదు దేనికైనా రాసి పెట్టి ఉండాలని మురారి విరక్తిగా అంటాడు. నా పెళ్ళాంకి నేనంటే ఇష్టం లేదు, నేను నచ్చలేదని ఆ విషయం మొహం మీద చెప్పేసి శోభనం రోజు రాత్రి చెప్పేసి తను వెళ్లిపోయిందని బేరర్ చెప్పుకుని బాధపడతాడు. ఎవరితో చెప్పుకోవాలి నా బాధ చచ్చిపోవాలని అనిపించింది కానీ నాకు ఒక చెల్లి ఉంది తనని చూసుకోవడం కోసం బాధ్యతగా ఉన్నానని అంటాడు.

మురారి కొట్టాడన్న కృష్ణ

ముకుంద కూడా శోభనం గదిలో ఆదర్శ్ కి ఇలాగే చెప్తే అని మురారి అంటే తట్టుకోలేడని కృష్ణ భయంగా చెప్తుంది. వీడికి అయితే ఒక చెల్లి ఉంది చూసుకోవాల్సిన బాధ్యత ఉందని తట్టుకుని ప్రాణాలతో ఉన్నాడు కానీ ఆదర్శ్ అని మురారి అనబోతుంటే కృష్ణ అడ్డుపడుతుంది. ఆ మాట చెప్పొద్దు ఆదర్శ్ కి ఏం కాదు కాకుండా ఏదో ఒకటి చేయాలని అంటుంది. కృష్ణ వాళ్ళు డల్ గా ఇంటికి వస్తారు. ఇంతసేపు ఎక్కడికి వెళ్లారని రేవతి అడుగుతుంది. మురారి చెప్పొద్దని సైగ చేస్తాడు కృష్ణ బాధగా లోపలికి వెళ్లిపోతుంటే రేవతి పిలిచి వెనక్కి రమ్మని పిలుస్తుంది. ఏమైంది మొహం మాడ్చుకుని వెళ్తున్నావని అడుగుతుంది. చెప్పాలా వద్దా అని మీ అబ్బాయిని అడిగితే చెప్పొద్దని మీ అబ్బాయి సైగ చేస్తున్నాడని కృష్ణ అనేస్తుంది.

ఏబీసీడీల అబ్బాయి నన్ను కొట్టారు అత్తయ్య అనేసరికి అందరూ షాక్ అయిపోతారు. ఏమైంది నీకు నేను నిన్ను కొట్టడం ఏంటని మురారి అంటాడు కాఫీ షాప్ లో కాఫీ తాగి వచ్చాము మందు తాగినట్టు మాట్లాడతావ్ ఏంటని అంటాడు. నేను కాదు మీరే మందు కొట్టి నన్ను కొట్టారని కృష్ణ చెప్పేసరికి మురారి బిత్తరపోతాడు.

తరువాయి భాగంలో..

ముకుంద అద్దం ముందు నిలబడితే అందులో అంతరాత్మ ప్రత్యక్షం అవుతుంది. ఈరోజు నీ శోభనం అంట ముందు శోభనం ఎలా ఆపాలో చూడమని అంటుంది. ముకుంద మారదు కృష్ణ ఆదర్శ్ కి ఎలాగైనా నిజం చెప్పేద్దామని మురారి డిసైడ్ అవుతాడు. ఆదర్శ్ దగ్గరకి వచ్చి ముకుంద గురించి మాట్లాడాలని అంటాడు.