Krishna mukunda murari serial march 9th: అల్లాడించేసిన ఆదర్శ్.. దోషిగా నిలబడ్డ మురారి, ముకుంద చెంప పగలగొట్టిన కృష్ణ-krishna mukunda murari serial march 9th episode adarsh grows furious with murari about mukunda ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari Serial March 9th: అల్లాడించేసిన ఆదర్శ్.. దోషిగా నిలబడ్డ మురారి, ముకుంద చెంప పగలగొట్టిన కృష్ణ

Krishna mukunda murari serial march 9th: అల్లాడించేసిన ఆదర్శ్.. దోషిగా నిలబడ్డ మురారి, ముకుంద చెంప పగలగొట్టిన కృష్ణ

Gunti Soundarya HT Telugu
Mar 09, 2024 07:13 AM IST

Krishna mukunda murari serial march 9th episode: ముకుంద శోభనం గదిలో ఆదర్శ్ కి నిజం చెప్పేస్తుంది. మురారితోనే తను జీవితం పంచుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పడంతో ఆదర్శ్ గుండె ముక్కలవుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

కృష్ణ ముకుంద మురారి సీరియల్ మార్చి 9వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ మార్చి 9వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Krishna mukunda murari serial march 9th episode: ముకుంద పాల గ్లాసుతో శోభనం గదిలోకి వస్తుంది. ఆ గ్లాసు ఆదర్శ్ అందుకోబోతుంటే ఇవ్వకుండా టేబుల్ మీద పెట్టేస్తుంది. దీంతో షాక్ అవుతాడు. మళ్ళీ కవర్ చేసుకుని పాలు తాగితే మత్తు వస్తుంది నిద్రపోవాల్సి వస్తుందని నవ్వుతూ అంటాడు. అమ్మాయిలకి ఈ టైమ్ లో సిగ్గు ఉంటుంది కదా అందుకే అది పోగొట్టడానికి అన్నానని చెప్తాడు. ఆదర్శ్ తనని పట్టుకోబోతుంటే వెనక్కి జరిగి మంచం మీద కూర్చుంటుంది. నీతో చాలా విషయాలు చెప్పాలని అనుకున్నాను. అసలు నేను ఈ ఇంటికి ఎలా వచ్చానో తెలుసా? అంటే తెలుసు మురారి చెప్పాడని అంటుంది.

నా అణువణువునా మురారి ఉన్నాడు 

ఆదర్శ్ తన గురించి చెప్పబోతుంటే మురారి చెప్పాడని అంటుంది. వాడికి నేనంటే చాలా ఇష్టమని అంటాడు. ఆదర్శ్ సంతోషంగా పాలు తగమని తనకి అందిస్తాడు. ఆలోచిస్తుంటే ఆదర్శ్ ముందు నేను తాగాలి కదా మర్చిపోయానని చెప్పి తను తాగి మిగతావి ముకుందకి ఇవ్వబోతాడు. అటు గదిలో కృష్ణ, మురారి టెన్షన్ పడుతూ ఉంటారు. ముకుంద కాంప్రమైజ్ అవదని అంటాడు. తను మన శోభనం ఆపాలని అనుకుంటుంది కదా ఏం చెప్తుందో ఎలా రియాక్ట్ అవుతాడోనని మురారి టెన్షన్ పడతాడు. ఆదర్శ్ పాలు ఇస్తే వద్దని చెప్తుంది.

మీరు పాలు ఎంగిలి చేశారు. ఏం మాట్లాడుతున్నావ్ ముకుంద భార్యాభర్తలు ఒకటి అని చెప్పడానికి కదా ఈ మొదటి రాత్రి ఏర్పాటు చేయడం ఎంగిలి పాలు తాగడం అంటే అది కూడా తెలుసు ఆది. ఇదే ఎంగిలి పాలు మురారి చేత్తో ఇచ్చి ఉంటే సంతోషంగా తాగి ఉండేదాన్ని అంటుంది. ఆదర్శ్ గుండె ముక్కలైపోతుంది. ఎందుకంటే నేను జీవితాన్ని పంచుకోవాలని అనుకుంది మురారితో కదా. ఏం మాట్లాడుతున్నావ్ ముకుంద అంటాడు. నిజం ఇప్పటికైనా నువ్వు తెలుసుకోవాల్సిన నిజం. నా మనసులో ఆలోచనలో అణువణువునా మురారి నిండిపోయాడు. మురారి తప్ప మరొకరు నా జీవితంలోకి కాదు నా ఆలోచనాల్లోకి రావడం అసాధ్యం. మరి ఇన్నాళ్ళూ నాతో క్లోజ్ గా ఎలా ఉన్నావ్ అని అనుమానం రావచ్చు.

మారిపోదామని అనుకున్నా కానీ నా వల్ల కాలేదు 

క్లోజ్ గా ఉండే పరిస్థితి వచ్చిన ప్రతి సారి నరకం చూశాను. కానీ వెంటనే మీలో మురారిని చూసుకునే దాన్ని అంతే నరకం స్వర్గంగా మారిపోయేది. ఈ విషయం ఇప్పుడు చెప్తున్నావ్ ఏంటి? వచ్చాక చెప్పవచ్చు కదా మారిపోయానని చెప్పి మాట మారుస్తున్నావ్ ఏంటని మీరు అడగవచ్చు. నేను మారిపోయానని ఎప్పుడు చెప్పలేదు నా మౌనాన్ని మార్పులా అర్థం చేసుకున్నారు. మౌనంగా ఎందుకు ఉన్నానని అంటే నేను నిజంగానే మారిపోదామని అనుకున్నాను. మిమ్మల్ని నా జీవితంలోకి ఆహ్వానించాలని కృష్ణ, మురారి సంతోషంగా ఉంటే చూడాలని చాలా అనుకున్నాను. కానీ మురారి ప్రతి క్షణం నా కళ్ళ ముందు తిరుగుతుంటే తనని మర్చిపోయి బతకడం నా వల్ల కాలేదు.

నాలాగే చాలా మంది అమ్మాయిలు ఇష్టం లేని పెళ్లి చేసుకుని కొన్నాళ్ళు ఏదో ఒక కారణం చెప్పి దూరంగా ఉన్నా మెల్లగా కాపురం చేసుకున్న కథలు చాలా విన్నాను. మీరు కూడా అలా వేరే ఇంట్లో ఉండి ఉంటే అక్కడికి నేను కాపురానికి వచ్చి ఉంటే మురారిని మర్చిపోయి మీతో కాపురం చేసి ఉండేదాన్ని. కానీ కళ్ళ ముందు మురారి తిరుగుతుంటే తనని మర్చిపోయి మిమ్మల్ని ఎలా అంగీకరిస్తాను నా వల్ల కాలేదు. నేనే కాదు నా స్థానంలో ఎవరు ఉన్నా మీరు ఉన్నా కూడా ఇలాగే చేసేవాళ్ళు. నా పరిస్థితి ఏంటో మీకు మొత్తం చెప్పాను మురారి లేకుండా బతకడం, తనని మర్చిపోయి బతకడం నా వల్ల కాదు ఇది కన్ఫామ్. ఇంత చెప్పిన తర్వాత మనం కలిసి బతకాలని మీరు ఆలోచించా మీ ఆలోచనకు నేను తల వంచినా ఇద్దరం ఒకరినొకరు మోసం చేసుకున్నట్టే ఇంకా చెప్పాలంటే అంటుంటే ఆదర్శ్ ఆపేస్తాడు.

నా జీవితంతో ఎందుకు ఆడుకున్నారు 

నా మనసు ఏదో కీడు సంకిస్తుంది ఏదో జరగబోతుందని కృష్ణ అంటుంది. ఏది జరిగినా య్ ఎదుర్కొంటాను మనల్ని ఆ దేవుడు కూడా వేరు చేయలేడు ఈ మురారి ఎంత అంటాడు. అప్పుడే ఆదర్శ్ మురారి అని గట్టిగా అరిచి పిలుస్తాడు. రెయ్ మురారి బయటకి రా అని కోపంగా బాధగా అరుస్తాడు. ఇంట్లో ఉన్న అందరూ పరుగున వస్తారు. రేవతి వచ్చి ఏమైందని అడుగుతుంది. మొదటి రాత్రి ఇలా బయటకి రాకూడదని అంటే నేను ఆ గదిలోకి వెళ్ళే అర్హత లేదు నేను ఉండాల్సింది బయటే అంటాడు. సుమలత కంగారుగా నీకు అర్హత లేకపోవడం ఏంటని అంటుంది. లేదు మీకు తెలియదు తెలిసిన వాళ్ళు నోరు విప్పలేదు అందుకే నా పరిస్థితి ఇలా అయ్యిందని బాధపడతాడు.

కృష్ణ, మురారి కంగారుగా కిందకి వస్తారు. అందరూ నవ్వుతూ కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. దీంతో ఆదర్శ్ గట్టిగా తల పట్టుకుంటాడు. ముకుంద గది నుంచి బయటకి వస్తుంది. ఈరోజు నేను ఇలా ఉండటానికి కారణం వీళ్ళే. నా జీవితాన్ని నాశనం చేసేశారు. ఇదిగో వీళ్ళిద్దరూ నా జీవితాన్ని సర్వనాశనం చేసేశారు. ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకున్నారు. ఏం అన్యాయం చేశాను మీరందరూ నాతో ఆడుకున్నారని చాలా బాధపడతాడు. ముకుంద అదంతా చూస్తూ ఉంటుంది. మురారి తనని ఆపడానికి చూస్తే చెయ్యి తీయి నీకు తెలియదా ఇదంతా జరుగుతుందని తెలియదా అని కాలర్ పట్టుకుని అడుగుతాడు.

ఏం జరిగిందో చెప్పకుండా ఏంటి గొడవ అని రేవతి అడుగుతుంది. ఎక్కడికి వెళ్ళమంటావ్ ఆ గదిలోకి వెళ్లాల్సింది నేను కాదు వీడు అంటాడు. ఆ గదిలో ముకుంద ఎదురు చూసేదీ నాకోసం కాదు నీకోసమని నీకు తెలియదా అని నిలదీస్తాడు. వెళ్ళు ఆ గదిలో నీకోసం ఎదురుచూస్తుంది వెళ్ళు అనేసరికి అందరూ షాక్ అవుతారు.

తరువాయి భాగంలో..

కృష్ణ ముకుందని కిందకి తీసుకొస్తుంది. ఎవరి మనసులో ఏముందో ఏ ఉద్దేశం ఉందో తేలిపోవాలని కృష్ణ కోపంగా అంటుంది. నా మనసులో ఉన్నది, ఉంటుంది, ఉండబోయేది మురారి. ఇందులో ఏ మార్పు లేదు మురారితోనే నా జీవితం అనేసరికి కృష్ణ లాగిపెట్టి చెంప పగలగొడుతుంది.