Brahmamudi: కావ్య బావపై రాజ్ రివర్స్ డ్రామా.. నిజం తెలిసిపోయిందా? మను బిగ్ ట్విస్ట్, షాక్‌లో ముకుంద-brahmamudi guppedantha manasu krishna mukunda murari serial march 11th episode promo raj reverse drama to kavya bhaskar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi: కావ్య బావపై రాజ్ రివర్స్ డ్రామా.. నిజం తెలిసిపోయిందా? మను బిగ్ ట్విస్ట్, షాక్‌లో ముకుంద

Brahmamudi: కావ్య బావపై రాజ్ రివర్స్ డ్రామా.. నిజం తెలిసిపోయిందా? మను బిగ్ ట్విస్ట్, షాక్‌లో ముకుంద

Sanjiv Kumar HT Telugu
Mar 10, 2024 06:41 AM IST

Brahmamudi Serial Promo: స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతున్న టాప్ పాపులర్ తెలుగు సీరియల్స్ గుప్పెడంత మనసు, బ్రహ్మముడి, కృష్ణ ముకుంద మురారి చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్నాయి. అలాంటి ఈ సీరియల్స్ మార్చి 11వ తేది ఎపిసోడ్స్‌లలో ఏం జరిగిందని ప్రోమోల్లో చూస్తే..

గుప్పెడంత మనసు, బ్రహ్మముడి, కృష్ణ ముకుంద మురారి సీరియల్స్ ఎపిసోడ్ ప్రోమో
గుప్పెడంత మనసు, బ్రహ్మముడి, కృష్ణ ముకుంద మురారి సీరియల్స్ ఎపిసోడ్ ప్రోమో

Brahmamudi Serial Promo: బ్రహ్మముడి సీరియల్ మార్చి 11వ తేది ఎపిసోడ్ ప్రోమోలో తన బావతో కావ్య సరదాగా ముచ్చట్లు పెట్టుకోడవం కిటికీ లో నుంచి చూసి రాజ్ ఉడికిపోతాడు. ఇంతలో రాజ్ అంతరాత్మ వచ్చి కళావతి మొహం వెలిగిపోతుంది. నీ మొహం ఏంట్రా వెలవెలబోయింది. ఇగ నా వల్ల కాదురా. ఇలాగే చూస్తుంటే ఏదో ఒక రోజు తన బావ దాన్ని ఎగురేసుకుపోతాడు అని అంటాడు. కట్ చేస్తే భాస్కర్‌తో రాజ్ రివర్స్ డ్రామా స్టార్ట్ చేస్తాడు.

బావతో కలిసి వెళ్లు

ఇంతసేపు ఎక్కడికి వెళ్లావ్ తమ్ముడు అన్నయ్య.. ఇది నీ ఇల్లు. నీ ఇంట్లో స్వేచ్ఛగా ఉండొచ్చు అని రాజ్ అంటాడు. దాంతో భాస్కర్, కావ్య ఇద్దరూ షాక్ అవుతారు. కళావతి నువ్ కూడా మీ బావతో కలిసి వెళ్లు. నీ బుజ్జిని కూడా నీ వెంట తీసుకెళ్లు. సినిమాకు వెళ్తారా.. షికారుకు వెళ్తారా.. పబ్‌కు వెళ్తారా.. అని రాజ్ అంటాడు. రాజ్ మాటలు చూసి అర్థం కాగా అయోమయంగా ఉంటుంది కావ్య.

తర్వాత ఇదిగో నా కారు కీస్.. కారు తీసుకెళ్లు. బుజ్జిని కూడా కారులో తీసుకెళ్లు. కారులో తీసుకెళ్లు, మోసుకెళ్లు.. నీ ఇష్టం.. ఎలాగోలా తీసుకెళ్లు అని రాజ్ అంటాడు. రాజ్ ప్రవర్తన చూసి కావ్య, తన బావ భాస్కర్ ఇద్దరూ షాక్ అవుతారు. ఆలోచనలో పడిపోతారు. చూస్తుంటే కావాలనే వాళ్లతో రాజ్ రివర్స్ డ్రామా ఆడుతున్నట్లు తెలుస్తోంది. లేకపోతే రాజ్‌కు కావ్య, బావ నాటకం ఆడుతున్నారన్న నిజం తెలిసి ఇలా ప్రవరిస్తున్నాడని కూడా అనుకోవచ్చు. ఏమైందనేది తెలియాలంటే సోమవారం నాటి ఫుల్ ఎపిసోడ్ కోసం ఆగాల్సిందే.

సంతోషపడకుంటే

Guppedantha Manasu Serial Promo: గుప్పెడంత మనసు సీరియల్‌లో తన బర్త్ డే పోస్టర్స్ ఎందుకు వేయించారని మనుపై ఫైర్ అవుతుంది వసుధార. మీ పై లీగల్‌గా యాక్షన్ కూడా తీసుకోగలను అని చెబుతుంది. మీరు నేను చేసినదానికి నిజంగా సంతోషపడకుంటే అలాగే చేయండి. మీరు ఏం చేసిన దానికి నేను రెడీనే అని మను అంటాడు. అసలు ఇదంతా ఎందుకు చేశారని వసుధార అడిగితే రిషి సార్ కోసం. ఆయన ఆశయాల కోసం పని చేసే మీరు సంతోషంగా ఉండాలని చేశానని మను అంటాడు.

రిషి సార్ పేరు అడ్డంపెట్టుకుని మీరు ఇలా చొరవ చూపించడం కరెక్ట్ కాదని వసుధార అంటుంది. మరోవైపు అసలు పోస్టర్స్ ఎలా మారాయా అని శైలేంద్ర, రాజీవ్ ఆలోచిస్తుంటారు. ఇంతలో మను వస్తే అది కవర్ చేయడానికి వేరే మాట్లాడుతారు. మీ వెధవ వేషాలు నాకు తెలుసు. ఆ పోస్టర్స్ తానే మార్చినట్లు మను చెబుతాడు. దాంతో ఒక్కసారిగా షాక్ అవుతారు రాజీవ్ అండ్ శైలేంద్ర. అయితే. ఆ పోస్టర్స్ రాజీవ్ ప్రింట్ చేయించిన చోటుకే మను వెళ్లడంతో వాళ్ల ప్లాన్ అర్థం చేసుకుని తిప్పి కొడతాడు మను.

ముకుందకు షాక్

Krishna Mukunda Murari Promo: కృష్ణ ముకుంద మురారి మార్చి 11వ తేది ఎపిసోడ్ ప్రోమోలో శోభనం గదిలో మురారిని ప్రేమిస్తున్నట్లు చెప్పడంతో ఆదర్శ్ కోపంతో రగిలిపోతాడు. మురారిని నిందిస్తాడు. ముకుంద ఆ గదిలో నీకోసం ఎదురుచూస్తుంది వెళ్లు అని అరుస్తుంటాడు. అదంతా పైనుంచి ముకుంద చూస్తుంది. పై నుంచి ముకుందను కిందకు లాక్కొస్తుంది కృష్ణ. దాంతో రేవతి గట్టిగా అరుస్తుంది.

అత్తయ్య.. ఎవరి మనసులో ఏముందో.. ఎవరి ఉద్దేశాలు ఏంటో మొత్తం తేలిపోవాలి అని కృష్ణ అంటుంది. నా మనసులో ఉన్నది.. ఉంటున్నది.. ఉండబోయేది మురారియే. ఇందులో ఏ మార్పు లేదు. మురారితోనే నా జీవితం అని గట్టిగా అరిచి మరి చెబుతుంది ముకుంద. దాంతో మురారి తెగ షాక్ అవుతాడు. ముకుంద మాట భరించలేక కోపంతో చెంప చెల్లుమనిపిస్తుంది కృష్ణ. అది చూసి ముకుందతో పాటు ఆదర్శ్, మురారి, రేవతి షాక్ అవుతారు.

WhatsApp channel