Krishna Mukunda Murari Serial Actors: చిన్న పిల్లలలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌కు సంబంధించిన కీలకమైన సమస్య గురించి అవగాహన కల్పించారు స్టార్ మా ప్రముఖ సీరియల్ కృష్ణ ముకుంద మురారి హీరో హీరోయిన్ మధుసూదన్ (Madhu Sudhan), ప్రేరణ కంబం (Prerana Kambam). హైదరాబాద్‌లోని తిరుమలగిరిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో స్టార్ మా పాపులర్ సీరియల్, కృష్ణ ముకుంద మురారి నుంచి ప్రముఖ లీడ్ ఆర్టిస్టులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి పిల్లలకు జ్ఞానాన్ని అందించడానికి, అలాగే సేఫ్ టచ్ వంటి సున్నితమైన విషయం గురించి అవగాహన పెంపొందించేలా ఈ కార్యకమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ నవలా, కథా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ (Yandamuri Veerendranath) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్కూల్ పిల్లకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ వంటి అంశాల పట్ల వారికి అర్థమయ్యే విధంగా వివరించారు. వారు కౌమారదశ, యుక్తవయస్సులో ఉన్నప్పుడు వారి మానసిక అభివృద్ధిపై ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎలాంటి తీవ్ర ప్రభావాన్ని చూపుతుందో హైలైట్ చేసి చెప్పారు. కృష్ణ ముకుంద మురారి సీరియల్ నటీనటులు సైతం విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఈ అంశాలపై వివరంగా తెలిపారు.
వివిధ రకాల టచ్‌లను గుర్తించడం, వాటికి ప్రతిస్పందించడం వంటి తదితర ప్రాముఖ్యత గురించి బహిరంగ సంభాషణను నిర్వహించారు. మంచి స్పర్శ, చెడు స్పర్శల మధ్య తేడాను గుర్తించడానికి, వారి భద్రత, శ్రేయస్సును నిర్ధారించడానికి విద్యార్థులకు జ్ఞానం, నైపుణ్యాలను అందించడం గురించి తెలిపారు. ఈ కార్యక్రమానికి నిపుణుల దృక్పథాన్ని జోడించేవిధంగా ప్రముఖ మనస్తత్వవేత్త శ్రీమతి నళిని గోటేటి పిల్లలకు అవగాహన కల్పించారు.
శ్రీమతి గోటేటి ఒక నిపుణుల సెషన్ ద్వారా విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. మంచి, చెడు టచ్‌ల సూక్ష్మ నైపుణ్యాలను ఎలా గుర్తించాలి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి అనే దానిపై చాలా బాగా వివరించారు. చివరికి వారికి తమను తాము రక్షించుకోవడానికి సాధనాలను అందించారు. సామాజిక బాధ్యత పట్ల స్టార్ మా నిబద్ధత కలిగి ఉండటంపై హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులలోను, తల్లిదండ్రులలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఎంతో ఉపయోగపడుతుంది అని తెలిపారు.
పాఠశాలల్లో విద్యార్థులకు కీలకమైన సామాజిక సమస్యలపై అవగాహన పెంచడంలో యండమూరి వీరేంద్రనాథ్, శ్రీమతి నళిని గోటేటి వంటి గౌరవప్రదమైన వ్యక్తులు సహకరించడం కీలక పాత్ర పోషించింది. అలాగే కృష్ణ ముకుంద మురారి వంటి పాపులర్ సీరియల్ హీరోహీరోయిన్స్ రావడం వల్ల దీనిపై మరింత అవగాహన పెరుగుతుందని పాఠశాల యాజమాన్యం భావిస్తోంది. ఇదిలా ఉంటే స్టార్ మా ఛానెల్‌లోని పాపులర్ సీరియళ్లలో ఒకటిగా కృష్ణ ముకుంద మురారి ప్రశంసలు అందుకుంటోంది.
కృష్ణ ముకుంద మురారి సీరియల్‌లో కృష్ణగా ప్రేరణ కంబం, మురారి పాత్రలో మధుసూదన్, ముకుందగా యష్మీ గౌడ తమ నటనతో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా చక్కని కథనంతో కృష్ణ ముకుంద మురారి సీరియల్ సాగుతోంది.