Guppedantha Manasu March 4th Episode: గుప్పెడంత మనసు.. రిషి లాగే మనుతో వసుధార ప్రయాణం.. చంపేస్తానన్న రాజీవ్-guppedantha manasu serial march 4th episode vasudhara journey with manu like rishi guppedantha manasu today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu March 4th Episode: గుప్పెడంత మనసు.. రిషి లాగే మనుతో వసుధార ప్రయాణం.. చంపేస్తానన్న రాజీవ్

Guppedantha Manasu March 4th Episode: గుప్పెడంత మనసు.. రిషి లాగే మనుతో వసుధార ప్రయాణం.. చంపేస్తానన్న రాజీవ్

Sanjiv Kumar HT Telugu
Mar 04, 2024 08:11 AM IST

Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ మార్చి 4వ తేది ఎపిసోడ్‌లో కారులో మనుతో వసుధార వెళ్లడం చూసిన రాజీవ్ మనును చంపేస్తానని ఫైర్ అవుతాడు. కానీ శైలేంద్ర కొత్త ప్లాన్ వేస్తాడు. రిషితో ప్రయాణించినట్లే మనుతో జర్నీ చేస్తుంది వసు. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

గుప్పెడంత మనసు సీరియల్‌‌ మార్చి 4వ తేది ఎపిసోడ్‌
గుప్పెడంత మనసు సీరియల్‌‌ మార్చి 4వ తేది ఎపిసోడ్‌

Guppedantha Manasu Serial Episode 1015: గుప్పెడంత మనసు సీరియల్‌లో వసుధార కారు ఆగిపోవడంతో మను ఏమైందని అడుగుతాడు. కారు ప్లాబ్లమ్ వచ్చిందని వసుధార అంటుంది. నేను చూస్తాను. మీరు కారు స్టార్ట్ చేయండి అని మను అంటాడు. కారు చూసిన మను ఇలా కుదరదు మెకానిక్‌ను రమ్మనాలి అని మను అంటాడు. సరే నేను ఆన్‌లైన్‌లో మెకానిక్‌ను పిలిచి రిపేర్ చేసుకుని వెళ్తాను అని వసుధార అంటుంది. దానికి మీరు ఇక్కడ ఉండటం దేనికి. మెకానిక్‌నే ఇంటికి తీసుకురమ్మనండి. నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని మను అంటాడు.

ఏమైనా ఆలోచించావా

వసుధార వద్దంటే.. పర్లేదండి నేను డ్రాప్ చేస్తాను అని మను అంటాడు. నేను ఇంటికి వెళ్లట్లేదు అండి. వేరే చోటుకు వెళ్తున్నాను. అక్కడికి మీరు రాలేరు అని వసుధార అంటుంది. అయ్యో వస్తానండి. నేను రాను అంటుంటే నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. మీరు ఇప్పుడు నరకానికి రమ్మన్నా, డేంజర్ జోన్‌కు రమ్మన్నా వస్తాను అని మను అంటాడు. దాంతో ఇద్దరూ కలిసి వెళ్తారు. మరోవైపు నా గురించి ఏమైనా ఆలోచించావా అని ఒకరికొకరు అనుకుంటారు రాజీవ్, శైలేంద్ర.

ఎవరికీ ఆలోచనలు రావట్లేదు. బొత్తిగా క్రియేట్ థాట్స్, క్రిమినల్ థాట్స్ పోయాయి. ఇలా అయితే కష్టం అని రాజీవ్ అంటుంటే.. వసుధార, మనులు కారులో వెళ్లడం శైలేంద్ర షాక్ అవుతాడు. బుర్రకు సాన బెట్టడం కాదు. ఈ దృశ్యం చూస్తే నీ బుర్రకు బూజు పడుతుంది అటువైపు చూపిస్తాడు శైలేంద్ర. అది చూసి షాక్ అవుతాడు రాజీవ్. దాంతో కోపంతో తెగ రగిలిపోతాడు. నా మరదలితో ఆ మను గాడు ఏంటీ భయ్యా. ఉండు ఇప్పుడే వాన్ని ఏసేస్తాను అని వెళ్లబోతుంటాడు. కానీ శైలేంద్ర ఆపుతాడు.

రెండు పిట్టలు

అయినా రాజీవ్ వినకుండా చంపేస్తాను అన్నట్లుగా మాట్లాడతాడు. శైలైంద్ర ఆపుతాడు. కారు వెళ్లిపోతుంది. ఇప్పుడు చెప్పు ఏం చెబుతావో అని రాజీవ్ అంటాడు. ఇప్పటిదాకా మనకు ఏ ఆలోచనలు రాలేదు. ఇప్పుడు మనకు అవకాశం దొరికింది. ఈ సిచ్యువేషన్ ఉపయోగించుకోని నీకు వసుధార, నాకు ఆ మనుగాడి పీడ విరగడా. ఒక దెబ్బకు రెండు పిట్టలు అని శైలేంద్ర అంటాడు. చెప్పు ఏం చేయబోతున్నావ్ అని రాజీవ్ అంటాడు. వెయిట్ అండ్ సీ బ్రదర్ ఫర్ అప్ కమింగ్ ఎపిసోడ్స్ అని శైలేంద్ర అంటాడు.

మరోవైపు ఎక్కడికి వెళ్తున్నాం మేడమ్. ఏమైనా సీక్రెటా అని మను అంటాడు. దాంతో రిషి సార్ దగ్గరికి అని వసుధార చెప్పడంతో మను షాక్ అయి కారు ఆపుతాడు. రిషి సార్‌తో నాకున్న జ్ఞాపకాలు పంచుకునేందుకు వెళ్లే ప్లేస్ అది. బస్తీకి వెళ్తున్నాం, మాకు సిటీ నుంచి బస్తీకి వచ్చిన ప్రతిసారి కొత్తగా ఉంటంది. బస్తీలో వాళ్ల జీవితం వేరేగా ఉంటుంది. ప్రతిసారి ఆ లైఫ్ స్టైల్‌ను ఆస్వాదించేవాళ్లం అని వసుధార చెబుతుంది. తర్వాత ఇద్దరు కలిసి బస్తీకి వెళ్తారు.

రోడ్లు బాగుండవు

ఓ చోట మను కారు ఆపుతాడు. దిగిన వసుధార ఆ బస్తీలోని రోడ్లు చూసి రిషిని గుర్తు చేసుకుంటుంది. రోడ్లపై రిషి బైక్‌పై తిప్పింది గుర్తు చేసుకుంటుంది. ఏమైంది మేడమ్. అలా ఎమోషనల్ అవుతున్నారు అని మను అడిగితే.. రిషితో గడిపిన విషయం చెబుతుంది. తర్వాత ఇద్దరూ పంట పొలాల్లో నుంచి బస్తీకి నడుచుకుంటూ వెళ్తారు. కారులు వెళ్లవా అని మను అంటే.. రోడ్లు బాగుండవు. ఇది షార్ట్ కట్ అని వసుధార అంటుంది. ఇప్పుడు ఈ గట్టుమీద నడవాలా అని మను అంటాడు.

అందుకే చెప్పాను మీకు కష్టంగా ఉంటుందని. మీరు వెళ్లిపోండి. నేను క్యాబ్‌లో వస్తాను అని వసుధార అంటుంది. పర్లేదు నేను వస్తాను అని మను అంటాడు. తర్వాత అక్కడు ఆడుకుంటున్న పిల్లలను చూసి గతంలో రిషితో జరిగింది తలుచుకుంటుంది. అదే విషయం మళ్లీ మనుకు చెబుతుంది వసుధార. ఆ తర్వాత బస్తీలో మనుకు ఏదో చెప్పుకుంటూ తీసుకెళ్తుంది వసుధార. అక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఇవాళ ఆదివారం కాదు కదా స్కూల్‌కు వెళ్లలేదా అని అడుగుతుంది వసుధార.

చాలా ఖర్చు అవుతుంది

ఇక్కడ దగ్గర్లో స్కూల్ లేదు అని పిల్లలు చెబుతారు. మీకు చదువుకోవాలని ఉందా అని వసు అడిగితే పిల్లలు ఉంది అని చెబుతారు. మీ తల్లిదండ్రులను పిలుచుకురమ్మని వసుధార చెబితే వాళ్లు అలాగే చేస్తారు. పిల్లల తల్లిదండ్రులకు మిషన్ ఎడ్యుకేషన్ గురించి చెప్పి మీ పిల్లలకు బస్ సౌకర్యం ఏర్పాటు చేస్తాం, లేదా ఇక్కడే స్కూల్ కట్టిస్తామని చెబుతుంది వసుధార. చాలా ఖర్చు అవుతుంది కదా అని పిల్లల తల్లిదండ్రులు అంటే.. అదంతా మేము చూసుకుంటాం అని వసుధార అంటుంది.

ఆలోచించండి. వాళ్లు చదువుకోవాలని అనుకుంటున్నారు. మీ నిర్ణయం వాళ్లకు అడ్డు కాకూడదు. తల్లిదండ్రులు తమ పిల్లలు తమలా కాకూడదని అనుకుంటారు. మీ పిల్లలు పై స్థాయికి వెళ్తే మీకు ఎంత సంతోషంగా ఉంటుందో ఆలోచించండి అని మను చెబుతాడు. పిల్లలు కూడా మేము చదువుకుంటాం అని మారాం చేస్తారు. దాంతో తల్లిదండ్రులు ఒప్పుకుంటారు. పిల్లలను బడికి పంపిస్తామంటారు. మా టీమ్ వచ్చి మీ పిల్లలు స్కూల్‌కు వెళ్లేలా చూసుకుంటుంది అని వసుధార చెబుతుంది. వసుని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు మను.

మంచి ఐడియాస్ ఇచ్చాడు

లోపలికి వచ్చి మంచి నీళ్లు తాగి వెళ్లండి. బయట తాగలేదు కదా అని వసుధార పిలుస్తుంది. దాంతో సరే అని మను చెప్పి ఇంట్లోకి వస్తాడు. మిషన్ ఎడ్యుకేషన్ మీద ఇద్దరం వెళ్లాం అని మహేంద్రకు చెబుతుంది వసు. అనుపమ కదా ఇంఛార్జ్. తనకు చెప్పలేదేంటీ అని మహేంద్ర అడుగుతాడు. నేను ఒక్కదాన్నే వెళ్తుంటే కారు రిపేర్ అయింది. మనునే లిఫ్ట్ ఇచ్చాడు. ఆయన చాలా సపోర్టివ్‌గా ఉన్నారు. రిషి సార్ నేను ఇదివరకు తిరిగిన ఏరియాల్లోనే తిరిగాం. అదే విషయం మనుకు చెప్పాను. ఆయన కూడా మంచి ఐడియాస్ చెప్పాడు అని వసుధార అంటుంది.

రిషి సార్ కనిపించకపోయినప్పటి నుంచి నేను బాధలో ఉన్నాను. ఏదో నడిసంద్రలో చిక్కుకుపోయినట్లు అనిపించింది. కానీ, మను గారు ఈరోజు నాకు సపోర్టింగ్‌గా నిలిచింది చూస్తే నడిసముద్రంలో చిక్కుకున్న నాకు ఒక ఊతకర్ర దొరికినట్లు అనిపించింది అని వసుధార అంటుంది. వెరీ గుడ్ మను. ఇక నుంచి మిషన్ ఎడ్యుకేషన్‌లో నువ్ పాల్గొనొచ్చు అని మహేంద్ర అంటాడు. చింతల్ బస్తీలో పిల్లల తల్లిదండ్రులు చదివించేలేం అని చెబితే మను గారు వాళ్లను మోటివేట్ చేసి ఒప్పించారు అని వసుధార అంటుంది.

ఒంటరితనం ఫీల్ అవ్వొద్దు

హో గ్రేట్ మను అని మహేంద్ర అంటాడు. ఈ గొప్పతనం నాది కాదు. మిషన్ ఎడ్యుకేషన్‌ది. చదువుకోవాల్సిన పిల్లలను ఏవేవో కారణాలు చెప్పి పనికి పంపిస్తున్నారు వాళ్ల తల్లిదండ్రులు. అలాంటి వాళ్లందరికి ఈ ప్రాజెక్ట్ ద్వారా చదువు అందించడం గొప్ప విషయం అని మను అంటాడు. అలసిపోయి ఉంటారు. రండి భోజనం చేద్దాం అని అనుపమ అంటుంది. లేదు స్నాక్స్ తిన్నాం అని మను అంటే.. మొహమాట పడొద్దు. నువ్ ఎప్పుడు ఒంటరితనం ఫీల్ అవ్వొద్దు. రా భోజనం చేద్దాం అని మహేంద్ర అంటాడు.

స్నాక్స్ తిన్నామని చెప్పాగా. ఇప్పుడు భోజనం వద్దు. ఏమనుకోకండి. మంచి నీళ్లు ఇవ్వండి చాలు అని మను అంటే.. అనుపమ తీసుకొచ్చి ఇస్తుంది. తర్వాత మనును ప్రేమగా చూస్తుంది అనుపమ. మను వెళ్లిపోతాడు. అలాగే చూస్తుంది అనుపమ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. మొత్తంగా మిషన్ ఎడ్యుకేషన్‌లో రిషితో ప్రయాణించినట్లే మనుతో వసుధార ప్రయాణం చేసినట్లుగా చూపించారు.

Whats_app_banner