Guppedantha Manasu February 19th Episode: గుప్పెడంత మనసు.. కాలేజీ డైరెక్టర్‌గా మను.. ఒకేలా ఆలోచిస్తున్న వసుధార, శైలేంద్ర-guppedantha manasu serial february 19th episode manu is college director guppedantha manasu today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu February 19th Episode: గుప్పెడంత మనసు.. కాలేజీ డైరెక్టర్‌గా మను.. ఒకేలా ఆలోచిస్తున్న వసుధార, శైలేంద్ర

Guppedantha Manasu February 19th Episode: గుప్పెడంత మనసు.. కాలేజీ డైరెక్టర్‌గా మను.. ఒకేలా ఆలోచిస్తున్న వసుధార, శైలేంద్ర

Sanjiv Kumar HT Telugu
Feb 19, 2024 08:11 AM IST

Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఫిబ్రవరి 19వ తేది ఎపిసోడ్‌లో శైలేంద్రకు మను వార్నింగ్ ఇస్తాడు. అడుగడుగునా అడ్డు పడతానని చెబుతాడు. అలాగే కాలేజీ డైరెక్టర్లలో ఒకరిగా అధికారం కావాలని బోర్డ్ మీటింగ్ ఏర్పాటు చేస్తాడు మను. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఫిబ్రవరి 19వ తేది ఎపిసోడ్‌
గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఫిబ్రవరి 19వ తేది ఎపిసోడ్‌

Guppedantha Manasu Serial Episode 1003: గుప్పెడంత మనసు సీరియల్‌లో చెక్కు ఎందుకు చంపేశారు సార్. మా డబ్బు ఇవ్వలేదని మేము కోర్టుకు వెళ్తాం అని శైలేంద్ర బినామీలు అంటారు. మీరు రిషికి ఎలాంటి అప్పు ఇవ్వలేదని బ్యాంక్ వెరిఫికేషన్‌లో తేలింది. అసలు డీబీఎస్టీ కాలేజీకి ఎలాంటి అప్పు లేదని ఇన్వేస్టిగేషన్‌లో వెల్లడైంది. మీరు అప్పు తీసుకునేవారే కానీ, ఇచ్చేవారు కాదని తెలిసింది. ఇక బుకాయించడం ఆపేయండి అని మనో పీఏ అంటాడు.

అబద్ధమని తేలుతుంది

అయితే, ఇప్పుడు ఏంటీ అని శైలేంద్ర అంటే.. అందరిముందు నీ బండారం బయటపెడతాను అని మను అంటాడు. అయితే అప్పుడు నీ బండారం కూడా బయటపడుతుంది. నేను అప్పు తీసుకున్నారని సృష్టిస్తే.. నువ్ లేని అప్పు తీర్చినట్లు చేశావ్. 50 కోట్లు ఇచ్చి అప్పు తీర్చినట్లు బిల్డప్ ఇచ్చావ్. నీకు కాలేజీ 50 కోట్ల రుణం ఉన్నట్లు చూపించావ్ కదా. అదంతా అబద్ధం అని తేలుతుంది. అసలు ఎవడ్రా నువ్. మా కథలోకి సడెన్‌గా వచ్చావ్. హీరోవా, కొత్త క్యారెక్టర్‌వా, విలన్‌వా అని శైలేంద్ర అంటాడు.

నువ్ ఏమైనా అనుకో అని మను అంటాడు. దక్కుతుందనుకున్న ఎండీ సీటు దక్కుండా చేశావ్ కదా. ఆ ఫ్యామిలీకి నీకు సంబంధం ఏంట్రా. వసుధారకు నీకు ఏంటీ. దేనికి ఇదంతా చేస్తున్నావ్. ఏం చేయకుండానే కప్పు కొట్టేందుకు ప్రయత్నిస్తున్నావ్ అని శైలేంద్ర అంటే.. నువ్ ఏమనుకున్న సరే కానీ నీ అంత వెధవ ఉండడు అని మను అంటాడు. నేను వెధవే నాకు తెలుసు. కానీ నువ్ జగజంత్రీలా ఉన్నావ్. ఎందుకురా ఆ ఫ్యామిలీ పక్కన చేరావ్. పాపం తగులుతుందిరా అని శైలేంద్ర అంటాడు.

పిసుక్కోవడమే

పాపం సంగతి దేవుడెరుగు. కానీ, నువ్ ఇలా మాట్లాడుతుంటేనే విడ్డూరంగా ఉందని మనో అంటాడు. ఇప్పుడంటే ఆపావ్. ప్రతిసారి ఆపగలవా. ఆ సీటులోనుంచి వసుధారను తప్పిస్తా అని శైలేంద్ర అంటాడు. ఆపుతా.. నేనే ఆపుతా. ఎలా ఆపుతానో చూడు అని మనో వార్నింగ్ ఇచ్చేసి వెళ్లిపోతాడు. సర్ ఇప్పుడు 50 కోట్లు పోయాయి ఏం చేద్దాం సార్ అని బినామీలు అంటారు. వాళ్ల చేతిలో ఉన్న స్ట్రెస్ బాల్ తీసుకుని పిసుక్కుని రిలాక్స్ అవుతాడు. తర్వాత మీరు కూడా కొనుక్కోని పిసుక్కోండి అని శైలేంద్ర అంటాడు.

ఆ వసుధార సంగతి చూడాలి అని అనుకున్న శైలేంద్ర కాలేజీలో రిషి సంతాప సభ ఏర్పాటు చేస్తారు. కాలేజీ లెక్చరర్‌తో రిషికి పూలదండ వేయించాలని చూస్తాడు. అప్పుడే ఎంట్రీ ఇచ్చిన వసుధార ఏంటిది. నేను వద్దన్నకూడా ఇలా ఎందుకు చేస్తున్నారు. సర్ ఎక్కడో చోట క్షేమంగా బతికే ఉన్నారని చెబుతున్నాను కదా. ఎందుకు అర్థం కావడంలేదు అని వసుధార అంటుంది.

శైలేంద్ర షాక్

సర్ మాకు చాలా ఇష్టం. ఎంతోమందికి రోల్ మోడల్. ఇన్నాళ్లు మీరు భ్రమలో ఉన్నారు. దాని నుంచి బయటకొస్తారు అనుకున్నా. కానీ మీరు అలాగే ఉన్నారు. మా ఉద్యోగం పోయిన పర్వాలేదు. రిషి సార్‌కు సంతాపం తెలిపి, ఆత్మకు శాంతి చేకూరేలా చేస్తాం అని లెక్చరర్ దండ వేస్తుంటాడు. అప్పుడే ఆ చేయిని మనో పట్టుకుని ఆపుతాడు. మనోను చూసి శైలేంద్ర షాక్ అవుతాడు. పక్కనే అనుపమ, మహేంద్ర కూడా ఉంటారు. వీడు ఇక్కడికీ ఎందుకు వచ్చాడు అని శైలేంద్ర అనుకుంటాడు.

అసలు ఈ సంతాప సభ ఏంటీ. ఇది మీరే చేస్తున్నారా. మీతో ఎవరైనా చేయిస్తున్నారా. మీతో ఎవరు చేయిస్తున్నారో నాకు పక్కాగా తెలుసు. సంతాప సభ అనేది అందరూ కలిసి చేయాలి. అంతేకానీ, ఒకరు బాధపడేలా చేయకూడదు. వసుధార మేడమ్ మీ ఎండీ. స్వయానా రిషి సార్ భార్య. ఆమెకు ఇష్టం లేకుండా ఇలా చేయడం ఏంటీ. స్టూడెంట్స్ చదువుపై శ్రద్ద పెట్టండి. లెక్చరర్స్ సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలి. కంప్లీట్ అయింది ఎలా రివిజన్ చేయాలి అనేది చూడండి. అనవసరమైన వాటిలో తల దూరిస్తే బాగుండదు అని అందరిని పంపించేస్తాడు మనో.

50 కోట్లు ఇచ్చేస్తాను

ఇంతలో మనో పీఏ వచ్చి క్యాబిన్ రెడీ సార్ అని చెబుతాడు. దాంతో అంతా షాక్ అవుతారు. క్యాబిన్ ఏంటీ అని వసుధార అనుకుంటుంది. వీడేంట్రా ఇలా శనిలా తగులుకున్నాడు. క్యాబిన్ ఏంటీ అసలు అని శైలేంద్ర అనుకుంటాడు. మరోవైపు దీని గురించి మహేంద్రతో డిస్కషన్ పెడుతుంది వసుధార. చూశారా. ఆ మనో మనసులో ఏదో ఉంది. 50 కోట్లు ఇచ్చినంతా మాత్రానా ఎవరినీ అడగడా. పర్మిషన్ అనేది ఉంటుంది కదా. తనకు నచ్చినట్లు చేస్తాడా అని వసుధార అంటుంది.

కానీ, తను నీకు మంచే చేశాడు కదమ్మా. రిషి సంతాపం రద్దు చేయించాడు కదా అని శైలేంద్ర అంటాడు. అదే అతని టెక్నిక్. ముందు ఇలా మంచి చేస్తూనే తన ప్లాన్స్ వేసుకుంటూ పోతున్నాడు. మీరేమంటారు అని అనుపమను అడుగుతుంది వసుధార. అప్పుడే వసుధార కరెక్ట్ అన్న అనుపమ తర్వాత మహేంద్ర కరెక్ట్ అంటుంది. మీరేంటీ మేడమ్ మనో విషయంలో ఎందుకుం క్లారిటీగా లేరు అని వసుధార అంటుంది. అలాంటిదేం లేదని అనుపమ అంటుంది. ఆ 50 కోట్లు వడ్డీతో సహా ఇచ్చేస్తాను. లేదంటే మనమీద ఇంకా అజమాయిషీ చెలాయించాలని చూస్తాడు అని వసుధార అంటుంది.

కాలేజీలో బోర్డ్ మీటింగ్

ఇంతలో అటెండర్ వచ్చి బోర్డ్ మీటింగ్ ఏర్పాటు చేశారు మేడమ్. మీరు కూడా రండి. మినిస్టర్ గారు కూడా వచ్చారు అని చెబుతాడు. అదేంటీ నేను చెప్పకుండా బోర్డ్ మీటింగ్ ఏంటీ అని అనుకున్న వసుధార వాళ్లు మీటింగ్‍కి వెళ్తారు. ఈ బోర్డ్ మీటింగ్ దేనికి సార్ అని వసుధార అడుగుతుంది. ఏంటీ నువ్ చెప్పకుండా మీటింగ్ అరెంజ్ చేయడం ఏంటీ. దేనికి ఇది అని శైలేంద్ర అడుగుతాడు. మను వచ్చాకా చెబుతాను అని మినిస్టర్ అంటాడు. శైలేంద్ర మళ్లీ అడిగినా చెప్పడు. దేనికి కంగారు చెబుతాను కదా అని మినిస్టర్ అంటాడు.

ఈ మను ఏంటీ మీటింగ్ ఎందుకు పెట్టాడు. అతని మనసులో ఏముంది అని శైలేంద్ర ఆలోచిస్తే.. వీడు మళ్లీ ఏం చేయబోతున్నాడు అని శైలేంద్ర అనుకుంటాడు. ఇంతలో మను వస్తాడు. డీబీఎస్టీ కాలేజీ డైరెక్టర్లలో ఒకరిగా తాను ఉండాలని అనుకుంటున్నాడు అని మినిస్టర్ చెబుతాడు. దాంతో అంతా షాక్ అవుతారు. అసలు అతనికి ఎందుకు ఇవ్వాలి. అతనికి ఏం అర్హత ఉంది అని శైలేంద్ర కంగారుగా అడుగుతాడు. దాంతో చెప్పమని మినిస్టర్ అంటాడు.

సమస్య ఏంటో తెలిసింది

నాకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్ పీరియన్స్ ఉంది. మీలాగే నేను కూడా కాలేజీ బాగు కోరుకుంటున్నాడు. 50 కోట్లు ఇచ్చాను. అది సరిపోదా అని మను అంటాడు. మరి అప్పుడు ఎలాంటి పదవులు వద్దన్నారు. ఇప్పుడు ఏంటీ అని వసుధార అంటుంది. అవును, ఎండీ మేడమ్ అడుగుతున్నారు కదా చెప్పండి మను గారు అని శైలేంద్ర అంటాడు. ఈ కాలేజీ కష్టాల్లో ఉందని తెలిసి వచ్చాను. అందుకే 50 కోట్లు ఇచ్చాను. అప్పుడు నాకు కాలేజీ సమస్య తెలియదు. అందుకే నాకు పదవులు వద్దన్నాను. నేనే సవ్యంగా నడిపించమని చెప్పాను. కానీ, నాకు ఇప్పుడు కాలేజీ సమస్య ఏంటో బాగా తెలిసింది అని మను అంటాడు.

ఆయన మనసులో ఇంకేదే ఉద్దేశం ఉందని అనిపిస్తుంది అని వసుధార అంటుంది. అవును, అప్పుడు కనిపించని సమస్య ఇప్పుడెలా కనిపించింది. కామెడీ కాకపోతే అని శైలేంద్ర అంటాడు. పంటను చీడపురుగు నాశనం చేసినట్లు ఈ కాలేజీ పతనాన్ని కొంతమంది కోరుకుంటున్నారు. వాళ్ల ఆట కట్టించడానికే నేను అధికారం అడుగుతున్నాను అని మను అంటాడు. ఆ గుంటనక్క శైలేంద్ర అని మనుకు తెలిసిపోయినట్లు ఉంది అని మహేంద్ర అనుకుంటాడు.

శైలేంద్రకు షాక్

అసలు మను ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అనుపమ మనసులో అనుకుంటాడు. మను చెప్పేది నిజమే. అతను చెప్పింది చాలా బాగుంది. కాలేజీ డైరెక్టర్ అయితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అని మినిస్టర్ అంటాడు. దాంతో శైలేంద్ర షాక్ అవుతాడు.

Whats_app_banner