Siren OTT: ఓటీటీలోకి తమిళ థ్రిల్లర్ సైరన్.. కీర్తి సురేష్, అనుపమ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?-jayam ravi keerthy suresh siren ott streaming on disney plus hotstar siren satellite rights to star maa channel ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Siren Ott: ఓటీటీలోకి తమిళ థ్రిల్లర్ సైరన్.. కీర్తి సురేష్, అనుపమ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Siren OTT: ఓటీటీలోకి తమిళ థ్రిల్లర్ సైరన్.. కీర్తి సురేష్, అనుపమ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Feb 18, 2024 05:57 AM IST

Keerthy Suresh Siren OTT Streaming: బ్యూటిఫుల్ హీరోయిన్ కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ నటించిన లేటెస్ట్ మూవీ సైరన్. ఫిబ్రవరి 16న తమిళంలో విడుదలైన సైరన్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై ఆసక్తి నడుస్తోంది. ఈ నేపథ్యంలో సైరన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఏదని చూస్తే..

ఓటీటీలోకి తమిళ థ్రిల్లర్ సైరన్.. కీర్తి సురేష్, అనుపమ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి తమిళ థ్రిల్లర్ సైరన్.. కీర్తి సురేష్, అనుపమ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Jayam Ravi Siren OTT Release: మహానటి కీర్తి సురేష్, టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తొలిసారిగా కలిసి నటించిన సినిమా సైరన్. దీంతో ఇద్దరు టాలీవుడ్ పాపులర్ హీరోయిన్స్ కలిసి నటించిన తమిళ సినిమాగా సైరన్‌ విశేషంగా మారింది. ఈ సైరన్ మూవీలో తమిళ స్టార్ హీరో జయం రవి ప్రధాన పాత్ర పోషించాడు. ఆయన రెండు క్యారెక్టర్స్‌లో కనిపిస్తారని సమాచారం. రివేంజ్ డ్రామా థ్రిల్లర్‌గా తెరకెక్కిన సైరన్ మూవీకి ఆంటోనీ భాగ్యరాజ్ కథ, దర్శకత్వం వహించారు.

సూజాత విజయ్ కుమార్, అనూష విజయ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించిన సైరన్ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. స్‌కే సెల్వ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. రూబెన్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. సైరన్ మూవీలో తమిళ పాపులర్ కమెడియన్ యోగిబాబు, నటుడు సముద్రఖని, కౌశిక్ మెహతా, తులసి తదితరులు కీలక పాత్రలు పోషించారు. 2023లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ కోలీవుడ్ మూవీ తాజాగా తమిళంలో విడుదలైంది.

ఫిబ్రవరి 16న తమిళంలో రిలీజైన సైరన్ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. అయితే, ఈ సినిమాను తెలుగులో కూడా ఇదే టైటిల్‌తో రిలీజ్ చేయనున్నారు. 'గంగ ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్‌పై మహేశ్వర్ రెడ్డి మూలి ఫిబ్రవరి 23న సైరన్ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు. కొన్ని రోజుల గ్యాపుతో కీర్తి సురేష్, జయం రవి నటించిన సైరన్ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది, చేయనుంది. ఈ సమయంలో సైరన్ ఓటీటీ డీల్ ఫిక్స్ అయిందని తాజాగా ఓ టాక్ నడుస్తోంది.

సైరన్ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్ మంచి ధర వెచ్చించి కొనుగోలు చేసిందని సమాచారం. థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత నెల లేదా, 45 రోజుల తర్వాత డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో సైరన్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. సాధారణంగా తమిళ, మలయాళ చిత్రాలు ఎక్కువగా హాట్‌స్టార్‌లోనే స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఇదే బాటలో హాట్‌స్టార్‌లో సైరన్ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఇదే కాకుండ సైరన్ శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా ఛానెల్ భారీ మొత్తానికి దక్కించుకుందని సమాచారం.

ఇలా తెలుగులో విడుదల కాకముందే తమిళంలో మంచి టాక్‌తో దూసుకుపోతోన్న సైరన్ మూవీ ఓటీటీ, శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోవడం విశేషం. ఇదిలా ఉంటే సైరన్ మూవీలో హీరోగా జయం రవి నటించాడు.

'తని ఒరువన్' (తెలుగులో ధ్రువకి రీమేక్) 'కొమాలి' 'పొన్నియిన్ సెల్వన్' లాంటి చిత్రాలతో తెలుగులో మంచి ఆదరణ పొందాడు హీరో జయం రవి. సైరన్ మూవీలో కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోంది. ఇందులో జయం రవికి జంటగా అనుమప పరమేశ్వరన్ నటించింది.

సైరన్ ఒక రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా అని మేకర్స్ చెబుతున్నారు. "సైరన్ సినిమాను భారీ బడ్జెట్ తో ఫ్యామిలీ, కమర్షియల్ ఎలిమెంట్స్ కుదిరేలా తెరకెక్కించాం. జయం రవి ఇంతకుముందు ఎప్పుడు కనిపించని పాత్రలో కనిపించనున్నారు. కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ మొదటి సారి ఆయనతో కలిసి నటించారు. ఫిబ్రవరి 23న తెలుగు ప్రేక్షకులు థియేటర్లలో ఈ చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం" అని చిత్ర నిర్మాత సుజాత విజయకుమార్ ఇటీవల ఓ ప్రెస్ మీట్‌లో తెలిపారు.