Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్‌కు లవ్ బ్రేకప్.. సిద్ధు జొన్నలగడ్డతో లిప్ లాక్ సీన్లే కారణం-anupama parameswaran siddu jonnalagadda lip lock scenes in tillu square movie trailer ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Anupama Parameswaran Siddu Jonnalagadda Lip Lock Scenes In Tillu Square Movie Trailer

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్‌కు లవ్ బ్రేకప్.. సిద్ధు జొన్నలగడ్డతో లిప్ లాక్ సీన్లే కారణం

Sanjiv Kumar HT Telugu
Feb 15, 2024 08:07 AM IST

Anupama Parameswaran Lip Lock In Tillu Square: బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్‌ నటించిన టిల్లు స్క్వైర్ మూవీ ట్రైలర్ విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో సిద్ధు జొన్నలగడ్డతో డీల్ లిప్ లాక్ సీన్లతో నటించింది అనుపమ పరమేశ్వరన్. దాంతో ఆమెకు లవ్ బ్రేకప్ అయినట్లు తెలుస్తోంది.

అనుపమ పరమేశ్వరన్‌కు లవ్ బ్రేకప్.. సిద్ధు జొన్నలగడ్డతో లిప్ లాక్ సీన్లే కారణం
అనుపమ పరమేశ్వరన్‌కు లవ్ బ్రేకప్.. సిద్ధు జొన్నలగడ్డతో లిప్ లాక్ సీన్లే కారణం

Anupama Parameswaran Siddu Jonnalagadda Lip Locks: ఆకట్టుకునే అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి స్థానం సంపాదించుకుంది అనుపమ పరమేశ్వరన్. ముఖ్యంగా యూత్‌లో అదిరిపోయే ఫాలోయింగ్ తెచ్చుకుంది. కేరళకు చెందిన అనుపమ తెలుగులో స్టార్ హీరోయిన్ రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకుంది. మలయాళంలో ప్రేమమ్ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనుపమ తెలుగులో సమంత, నితిన్ అఆ మూవీతో ఎంట్రీ ఇచ్చింది.

అనంతరం నాగచైతన్య ప్రేమమ్ మూవీలో అట్రాక్ట్ చేసింది అనుపమ పరమేశ్వరన్. శతమానం భవతి సినిమాతో మంచి హిట్ కొట్టింది. ఇక కార్తికేయ 2 మూవీ పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అందుకున్న అనుపమ పరమేశ్వరన్ బటర్ ఫ్లై వంటి హీరోయిన్ ఒరియెంటెడ్ చిత్రాల్లో నటించేంతలా స్థాయికి ఎదిగింది. అయితే, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ టిల్లు స్వైర్. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ సూపర్ హిట్ మూవీ డీజే టిల్లుకు సీక్వెల్‌గా ఈ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.

టిల్లు స్క్వేర్‌పై మొదటి నుంచే సూపర్ బజ్ క్రియేట్ కాగా తాజాగా వాలంటైన్స్ డే సందర్భంగా ట్రైలర్ విడుదల చేశారు. టిల్లు స్క్వేర్ ట్రైలర్‌లో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ఘాటు లిప్ లాక్ సీన్లతో అరాచకం సృష్టించారు. కారులో సిద్ధు, అనుపమ కిస్సింగ్ సీన్ ట్రైలర్‌కే హైలెట్ అయింది. అందరి అటెన్షన్ ఈ సీన్‌పై పడింది. అంతేకాకుండా మరో సీన్‌లో కూడా సిద్దు, అనుపమ లిప్ లాక్ అట్రాక్ట్ చేసింది. సిద్దు డైలాగ్‌లతోనే కాకుండా అనుపమ ముద్దు సీన్లతో కూడా టిల్లు స్క్వేర్ ట్రైలర్ తెగ వైరల్ అయిపోతుంది.

అయితే, టిల్లు స్క్వేర్ ట్రైలర్ చూసిన అనుపమ అభిమానులు తెగ హర్ట్ అయినట్లు తెలుస్తోంది. "ఇంతవరకు నువ్ నా పిల్ల అనుకున్నా.. ఇకపై బ్రేకప్" అంటూ నెటిజన్ కామెంట్ చేశాడు. "ఇకపై నీ సినిమాలు చూడను" అని మరో అభిమాని హర్ట్ అవుతూ రాసుకొచ్చాడు. "ఇలాంటి రోల్స్ మనకెందుకు అను" అంటూ మరొకరు స్పందించారు. ఇలా టిల్లు స్క్వేర్ చూసి అనేకమంది అభిమానులు పలు విధాలుగా అనుపమ పరమేశ్వరన్‌పై కామెంట్స్ చేస్తున్నారు.

ఇలా అనుపమకు లవ్ బ్రేకప్ అంటూ అభిమానులు చెబుతున్నారు. కాగా మొదటి నుంచి సినిమాల్లో ఎంతో పద్ధతిగా, చీరకట్టు, ట్రెడిషన్‌గా కనిపించిన అనుపమ ఎంతో మంది యువతకు హార్ట్ ఫేవరెట్‌గా నిలిచింది. ఇంట్లోని అమ్మాయిలా చూసే అనుపమ తొలిసారి ఆశీష్‌ హీరోగా చేసిన రౌడీ బాయ్స్ మూవీలో లిప్ లాక్ సీన్లలో నటించి షాక్ ఇచ్చింది. అప్పుడే అనుపమ కిస్సింగ్ సీన్లపై తెగ హర్ట్ అయ్యారు అభిమానులు. అలాంటి సీన్‌లో అనుపమను చూసి తట్టుకోలేకపోయారు.

మళ్లీ ఇప్పుడు సిద్ధుతో అనుపమ చాలా ఘాటుగా లిప్ లాక్ సీన్లలో నటించేసరికి అభిమానులు ఆమెకు బ్రేకప్ చెబుతున్నారు. ఇలా మరోసారి అనుపమ పరమేశ్వరన్ హాట్ టాపిక్ అయింది. ఇదిలా ఉంటే టిల్లు స్క్వేర్ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. టిల్లు స్క్వేర్ మూవీ వరల్ వైడ్‌గా మార్చి 29న చాలా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. మూవీకి ఎస్ఎస్ థమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు.

టిల్లు స్క్వేర్ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ చిత్రానికి రామ్ మిరియాల, అచ్చు రాజమణి సంగీతం అందిస్తుండగా, సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ బాధ్యతలు వహించారు. నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

WhatsApp channel