Tillu Square Trailer: టిల్లు స్క్వేర్ సినిమా ట్రైలర్ వచ్చేసింది.. సిద్ధు, అనుపమ కెమెస్ట్రీ, డైలాగ్స్ అదుర్స్
Tillu Square Trailer Released: టిల్లు స్క్వేర్ సినిమా ట్రైలర్ వచ్చేసింది. హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) మరోసారి తన మార్క్ నటనతో చెలరేగిపోయారు. అనుపమ పరమేశ్వరన్ కూడా అదిరిపోయారు.

Tillu Square Trailer: రెండేళ్ల కిందట వచ్చిన డీజే టిల్లు సినిమా క్రేజీ హిట్ అయింది. హీరో సిద్ధు జొన్నలగడ్డ తన మార్క్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో అదరగొట్టారు. టిల్లుగా ఫేమస్ అయ్యారు. కామెడీ, రొమాన్స్, క్రైమ్‍తో డీజే టిల్లు ప్రేక్షకులను అలరించి.. బ్లాక్‌బాస్టర్ అయింది. ఇప్పుడు.. ఆ చిత్రానికి సీక్వెల్‍గా టిల్లు స్క్వేర్ వస్తోంది. మాలిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సిద్ధు సరసన అనుపమ పరమేశ్వర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఈ సినిమా మార్చి 29వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. అయితే, నేడు (ఫిబ్రవరి 14) వాలెంటైన్స్ డే సందర్భంగా టిల్లు స్క్వైర్ ట్రైలర్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది.
టిల్లు స్క్వైర్ మూవీ ట్రైలర్లోనూ సిద్దు జొన్నలగడ్డ జోష్ అదిరిపోయింది. అనుపమ పరమేశ్వరన్ కూడా సూపర్‌గా ఉన్నారు. ఇద్దరి మధ్య కెమెస్ట్రీ అట్రాక్టివ్‍గా ఉంది. లిప్‍లాక్‍తోనూ రెచ్చిపోయారు. తన మార్క్ డైలాగ్ డెలివరీతో సిద్ధు మరోసారి రెచ్చిపోయారు.
ట్రైలర్ ఇలా..
ముఖానికి బ్లాక్ ఫేస్ ప్యాక్ వేసుకొని టిల్లు స్క్వేర్ ట్రైలర్లో ఎంట్రీ ఇచ్చాడు టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ). అతడికి బంధువులు పెళ్లి సంబంధం తీసుకొస్తే.. డీజే టిల్లు.. రాధికను గుర్తు చేసుకుంటారు. బాంబు చికెన్ తిందామని చెప్పి.. రాధిక చికెన్ తిని.. బాంబూ తన నోట్లో పెట్టిందని టిల్లు స్టైల్ డైలాగ్ ఉంది. ఆ తర్వాత లిల్లీ (అనుపమ పరమేశ్వరన్)తో కార్లో లిప్‍లాక్ సీన్ ఉంది. బాడీలో తన వీక్ పార్ట్ కళ్లు అని లిల్లీ అంటే.. తనకు మనసేనని టిల్లు అంటాడు. “పోయిన సారి కంటే ఈసారి నాకు గట్టిగా తగిలేట్టుంది దెబ్బ” అంటాడు.
“మీ బాధలన్నీ విని.. మీ ప్రాబ్లంలను నా ప్రాబ్లంలా ఫీలై.. ఆ ప్రాబ్లంను సాల్వ్ చేసేందుకు టిప్పు సుల్తాన్‍లాగా దాంట్లోకి దూరి.. మళ్లీ లాస్టులో నేనే ఫీలై.. మీకు డిస్కౌంట్ ఇచ్చి.. నేను షాప్ మూసుకునుడేంది” అని లిల్లీతో టిల్లు చెబుతాడు. ఇలా ట్రైలర్లో కొన్ని డిఫరెంట్ డైలాగ్స్ ఉన్నాయి. మొత్తంగా లిల్లీ వల్ల టిల్లు చిక్కుల్లో పడినట్టు ట్రైలర్లో మేకర్స్ చూపించారు. టిల్లు కారణజన్ముడని.. లేడీస్ సమస్యలన్నీ తలమీదికి తెచ్చుకుంటాడంటూ చెప్పే డైలాగ్‍తో ట్రైలర్ ముగిసింది.
3 నిమిషాల 35 సెకన్లు ఉన్న టిల్లు స్క్వైర్ ట్రైలర్ రొమాన్స్, క్యాచీ డైలాగ్స్, ఎంటర్‌టైన్‍మెంట్‍తో ఆకట్టుకుంది. ముఖ్యంగా డైలాగ్ డెలివరీలో సిద్ధు మరోసారి దుమ్మురేపాడు. ఈ ట్రైలర్‌తో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగేశాయి. మార్చి 29న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ మూవీ స్క్రిప్ట్ రాసింది కూడా సిద్ధునే.
టిల్లు స్క్వైర్ సినిమా పాటలకు మ్యూజిక్ డైరెక్టర్లు రామ్ మిర్యాల, అచ్చు రాజమణి ట్యూన్స్ ఇచ్చారు. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍ను థమన్ అందించారు. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.
టిల్లు తండ్రిగా మురళీధర్ గౌడ్ ఈ చిత్రంలో నటించారు. ప్రణీత్ రెడ్డి, మురళీశర్మ కూడా కీరోల్స్ చేశారు. సాయి ప్రకాశ్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్నారు.
టాపిక్