Siren Release Date: నేరుగా ఓటీటీలోకి కాదు.. థియేటర్లలోనే రిలీజవుతోన్న కీర్తి సురేష్ మూవీ సైరన్-keerthy suresh jayam ravi siren theatrical release date announced ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Siren Release Date: నేరుగా ఓటీటీలోకి కాదు.. థియేటర్లలోనే రిలీజవుతోన్న కీర్తి సురేష్ మూవీ సైరన్

Siren Release Date: నేరుగా ఓటీటీలోకి కాదు.. థియేటర్లలోనే రిలీజవుతోన్న కీర్తి సురేష్ మూవీ సైరన్

Sanjiv Kumar HT Telugu
Jan 24, 2024 08:35 AM IST

Keerthy Suresh Siren Release Date: కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ మూవీ సైరన్. అనుపమ పరమేశ్వరన్, జయం రవి సైతం కీలక పాత్రలు పోషించిన సైరన్ మూవీని నేరుగా ఓటీటీలో కాకుండా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. సైరన్ థియేట్రికల్ రిలీజ్ డేట్ ఏంటనే వివరాల్లోకి వెళితే..

నేరుగా ఓటీటీలోకి కాదు.. థియేటర్లలోనే రిలీజవుతోన్న కీర్తి సురేష్ కొత్త మూవీ సైరన్
నేరుగా ఓటీటీలోకి కాదు.. థియేటర్లలోనే రిలీజవుతోన్న కీర్తి సురేష్ కొత్త మూవీ సైరన్

Keerthy Suresh Siren Theatrical Release: ఈ మధ్య కాలంలో ఓటీటీ హవా పెరిగిన నేపథ్యంలో నేరుగా సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. థియేటరల్లో విడుదలైన సినిమాలు సైతం 20, 30 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. అయితే, థియేటర్లలో విడుదలైన వాటి కంటే నేరుగా ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలపై కాస్తా ఆసక్తి చూపిస్తుంటారు మూవీ లవర్స్. అలా ఈ మధ్య సైరన్ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోందంటూ వార్తలు వచ్చాయి.

తాజాగా సైరన్ మూవీని ఓటీటీలో కాకుండా థియేటర్‌లలోనే విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మహానటి కీర్తి సురేష్, కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి ప్రధాన పాత్రలు పోషించిన లేటెస్ట్ మూవీ సైరన్ (Siren Movie 2023). 108 అనేది ఉపశీర్షిక. ఈ సైరన్ మూవీలో టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా కీలక పాత్ర పోషించింది. ఇందులో జయం రవి పాత్రకు అనుపమ పరమేశ్వరన్ భార్యగా నటిస్తున్నట్లు టాక్.

అంతేకాకుండా సైరన్ మూవీలో కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ తొలిసారిగా కలిసి నటించారు. మరి వీరి మధ్య సన్నివేశాలు ఉన్నాయో లేవో అనేది తెలియాల్సి ఉంది. అయితే, సైరన్ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్, పోస్టర్స్‌కి ఇప్పటికే మంచి ఆదరణ వచ్చింది. అయితే, గతేడాదే షూటింగ్ పూర్తి చేసుకున్న సైరన్ మూవీని డిసెంబర్‌లో థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కానీ, చెప్పిన సమయానికి సైరన్ మూవీ థియేటర్లలో విడుదల కాలేదు.

దీంతో సైరన్ మూవీ డైరెక్టుగా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు కథనాలు వెలువడ్డాయి. అంతేకాకుండా గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26 ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో సైరన్‌ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. అందుకు సంబంధించిన వార్తలు సైతం వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చింది. సైరన్ మూవీని థియేటర్‌లలోనే విడుదల చేయనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు.

ఫిబ్రవరి 16వ తేదిన తెలుగు, తమిళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా సైరన్ మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అంటే, మహాశివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు సైరన్ మూవీని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మూవీ పోస్టర్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మేకర్స్. దీంతో రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన కీర్తి సురేష్, జయం రవి, అనుపమ పరమేశ్వరన్ సైరన్ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ వార్తలకు పులిస్టాప్ పడినట్లు అయింది.

సైరన్ చిత్రంలో తమిళ పాపులర్ కమెడియన్ యోగిబాబు, నటుడు సముద్రఖని, కౌశిక్ మెహతా, తులసి తదితరులు కీలక పాత్రలు పోషించారు. అభిమన్యుడు, విశ్వాసం సినిమాలకు రచయితగా పని చేసిన ఆంటోని భాగ్యరాజ్ సైరన్ మూవీతో డైరెక్టర్‌గా పరిచయం కానున్నాడు. దీనికి కథ, దర్శకత్వం ఆంటోనీ భాగ్యరాజ్ వహించారు.

సైరన్‌కు సుజాత విజయ్ కుమార్, అనూష విజయ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించారు. సైరన్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్, హీరో జీవీ ప్రకాష్ కుమార్ సంగీంత అందించారు. ఎస్‌కే సెల్వ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. రూబెన్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.

టీ20 వరల్డ్ కప్ 2024