Akka OTT: 'అక్క'గా రానున్న కీర్తి సురేష్.. బోల్డ్ బ్యూటీతో రివేంజ్ థ్రిల్లర్.. మహానటి ఫస్ట్ వెబ్ సిరీస్-keerthy suresh radhika apte joins in yrf revenge thriller akka web series ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Akka Ott: 'అక్క'గా రానున్న కీర్తి సురేష్.. బోల్డ్ బ్యూటీతో రివేంజ్ థ్రిల్లర్.. మహానటి ఫస్ట్ వెబ్ సిరీస్

Akka OTT: 'అక్క'గా రానున్న కీర్తి సురేష్.. బోల్డ్ బ్యూటీతో రివేంజ్ థ్రిల్లర్.. మహానటి ఫస్ట్ వెబ్ సిరీస్

Sanjiv Kumar HT Telugu

Keerthy Suresh Akka Web Series: మహానటి కీర్తి సురేష్ చేస్తున్న తొలి వెబ్ సిరీస్ అక్క. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలీంస్ బ్యానర్‌పై రూపొందుతున్న సీట్ ఎడ్జ్ రివేంజ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అక్కలో మరో బోల్డ్ బ్యూటి నటిస్తోంది.

కీర్తి సురేష్ తొలి పీరియాడిక్ వెబ్ సిరీస్ అక్క.. బోల్డ్ బ్యూటితో కలిసి రివేంజ్ థ్రిల్లర్ (Instagram)

Keerthy Suresh Radhika Apte Akka: మహానటి, తెలుగు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇదివరకు ఓటీటీ సినిమాలు చేసింది. మిస్ ఇండియా, చిన్ని వంటి సినిమాలతో ఓటీటీలోకి అడుగు పెట్టింది కీర్తి సురేష్. ఇప్పుడు తాజాగా కీర్తి సురేష్ మొదటిసారి వెబ్ సిరీస్ చేయనుంది. అది కూడా హిందీ చిత్రసీమలో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరొందిన యష్ రాజ్ ఫిలీంస్ బ్యానర్‌లో. సీట్ ఎడ్జ్ రివేంజ్ థ్రిల్లర్ జోనర్‌లో పీరియాడిక్ డ్రామాగా 'అక్క' వెబ్ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు.

కీర్తి సురేష్ నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ అక్కలో బాలీవుడ్ బోల్డ్ బ్యూటి రాధికా ఆప్టే నటిస్తోంది. బోల్ట్ పాత్రలు చేయడంలో రాధికా ఆప్టే చాలా పాపులర్. లస్ట్ స్టోరీస్ వంటి అనేక ఓటీటీ సిరీసులు, సినిమాల్లో బోల్డ్ క్యారెక్టర్స్‌తో అలరించింది రాధికా ఆప్టే. బాలకృష్ణ లెజెండ్ మూవీలో కూడా రాధికా నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహానటి కీర్తి సురేష్, బోల్డ్ బ్యూటి రాధికా ఆప్టే కలిసి నటించడంతో అక్క సిరీస్‌పై అంచనాలు పెరగడంతోపాటు హాట్ టాపిక్ అవుతోంది.

అక్క వెబ్ సిరీస్‌ను సినీ ఇండస్ట్రీలో భారీ సినిమాలను రూపొందిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకున్న ప్రొడక్షన్ హౌజ్ యష్ రాజ్ ఫిలిమ్స్ వైఆర్ఎఫ్ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తోంది. ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్న అక్క సిరీస్‌తో ధర్మరాజ్ శెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అయితే, అక్క ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలను వైఆర్ఎఫ్ సంస్థ సీక్రెట్‌గా ఉంచింది. త్వరలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

"మన చిత్ర పరిశ్రమలో కీర్తి సురేష్, రాధికా ఆప్టే వంటి నటీమణులు ఉండటం అనేది మనకు ఓ బహుమానంగా చెప్పొచ్చు. వారు సహజ సిద్ధమైన నటనతో మెప్పిస్తారు. వారి అద్భుతమైన నటనతో ప్రశంసలను పొంది, తమదైన క్రేజ్‌ను సంపాదించుకున్నారు. పోటా పోటీగా నటించే వీరిద్దరూ కలిసి ‘అక్క’ అనే స్ట్రీమింగ్ ప్రాజెక్ట్‌తో అలరించనున్నారు" అని మేకర్స్ తెలిపారు.