Brahmamudi: కావ్య లైఫ్‌లోకి కొత్త హీరో .. విలవిల్లాడిన శైలేంద్ర.. ఆదర్శ్‌కు అడ్డంగా దొరికిన ముకుంద-brahmamudi guppedantha manasu krishna mukunda murari serial february 19th episode promo raj shock with kavya bava entry ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi: కావ్య లైఫ్‌లోకి కొత్త హీరో .. విలవిల్లాడిన శైలేంద్ర.. ఆదర్శ్‌కు అడ్డంగా దొరికిన ముకుంద

Brahmamudi: కావ్య లైఫ్‌లోకి కొత్త హీరో .. విలవిల్లాడిన శైలేంద్ర.. ఆదర్శ్‌కు అడ్డంగా దొరికిన ముకుంద

Sanjiv Kumar HT Telugu
Feb 18, 2024 06:56 AM IST

Brahmamudi Serial Promo: స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతున్న టాప్ పాపులర్ తెలుగు సీరియల్స్ గుప్పెడంత మనసు, బ్రహ్మముడి, కృష్ణ ముకుంద మురారి చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్నాయి. అలాంటి ఈ సీరియల్స్ ఫిబ్రవరి 19వ తేది ఎపిసోడ్స్‌లలో ఏం జరిగిందని ప్రోమోల్లో చూస్తే..

గుప్పెడంత మనసు, బ్రహ్మముడి, కృష్ణ ముకుంద మురారి సీరియల్స్ ప్రోమో
గుప్పెడంత మనసు, బ్రహ్మముడి, కృష్ణ ముకుంద మురారి సీరియల్స్ ప్రోమో

Brahmamudi Serial Promo: బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 19వ తేది ఎపిసోడ్ ప్రోమోలో తన బావ అమెరికా నుంచి వస్తున్నట్లు రాజ్‌కు చెబుతుంది కావ్య. దాంతో కాస్తా ఉడికిపోయిన రాజ్ తర్వాత తన బావ వస్తే నేను ఎందుకు టెన్షన్ పడుతున్నాను. వాళ్లు ఏదో బావా మరదళ్లు అని అనుకుంటాడు రాజ్. తర్వాత ఆఫీస్‌లో ఫారెన్ నుంచి వాళ్ల బావ వస్తే నాకెంటీ, వాడి చావు వస్తే నాకేంటీ అని శ్వేతతో అంటుంటాడు రాజ్. పైకి అలా అన్న లోపల మాత్రం కుళ్లుతో రాజ్ రగిలిపోతున్నట్లు కనిపిస్తుంది.

కావ్య బావ ఎంట్రీ

ఇంతలో ఆఫీస్ బయట ఓ కారు వచ్చిన సౌండ్ వస్తుంది. అది విని అలర్ట్ అయిన రాజ్.. అదిగో కారు వచ్చినట్లు ఉంది అని శ్వేతతో అంటాడు. అంతేకాకుండా కిటికీ దగ్గరికి వెళ్లి కావ్య బావను చూస్తాడు రాజ్. రాజ్ వెనుకే శ్వేత కూడా వెళ్తుంది. ఇద్దరు కావ్య బావ ఎవరా అని చూస్తారు. అప్పుడే కారులో నుంచి ముందు కావ్య దిగుతుంది. అనంతరం కావ్య బావ కూడా కారులో నుంచి దిగుతాడు. కానీ, కావ్య బావ మొహం చూపించారు. దాన్ని సస్పెన్స్‌గా ఉంచారు.

ఉడికిపోయిన రాజ్

కావ్య చాలా సంతోషంతో తన బావతో వస్తూ ఉంటుంది. అది చూసి రాజ్ ఉడికిపోతుంటాడు. శ్వేత కాస్తా నవ్వుతూ చూస్తుంది. ఇలా సోమవారం నాటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ప్రోమోను ముగించారు. కావ్య బావ పాత్ర ఎవరనేది పూర్తి ఎపిసోడ్‌లో రివీల్ కానున్నట్లు తెలుస్తోంది. శ్వేతను ఎలాగైతే అడ్డం పెట్టుకుని కావ్యను పంపిద్దామనుకుని రాజ్ అనుకున్నాడో.. తనతో ఒక్కటి అయ్యేందుకు కావ్య తన బావను అడ్డు పెట్టుకుంటుంది. అంటే కావ్య జీవితంలోకి కొత్త హీరో ఎంట్రీ ఇచ్చాడని తెలుస్తోంది. మరి ముందు ముందు సీరియల్ ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.

Guppedantha Manasu Serial Promo: గుప్పెడంత మనసు సీరియల్‌లో మను మంచితనంపై వసుధార అనుమానం పడుతుంది. భద్ర చాలా మంచివాడిగా నటించి మోసం చేశాడని, అందుకే మనుషులను నమ్మాలంటే భయంగా ఉందని సంశయం వ్యక్తం చేస్తుంది వసుధార. మనును చెడ్డవాడిగా ఫిక్స్ కావడం కరెక్ట్ కాదని, ముక్కు మొహం తెలియని వాళ్లకు 50 కోట్లు ఎందుకు ఇస్తాడని మహేంద్ర సర్ది చెప్పుతాడు. రిషినే తనను పంపించాడని అని గుర్తు చేసుకున్న వసుధార మరింత జాగ్రత్తగా ఉండాలని అంటుంది.

కన్నీళ్లు పెట్టుకున్న శైలేేంద్ర

మను గురించి అనుపమను అడిగితే.. ఏదో ఒకటి చెప్పి దాటేస్తుంది. దాంతో తనపై మహేంద్ర, వసుధారకు అనుమానం రావడంతో అనుపమకు టెన్షన్ మొదలవుతుంది. మను గురించి ఎలాంటి పరిస్థితుల్లో నిజం తెలియకూడదని మనసులో అనుకుంటుంది అనుపమ. ఎండీ సీటి వచ్చినట్లే వచ్చి చేజారడంతో ఒంటరిగా రూమ్‌లో కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటాడు శైలేంద్ర. ఏడవకూడదని కొడుకుని ఓదార్చుతుంది దేవయాని.

మరోవైపు బినామీ మనుషులతో శైలేంద్ర మాట్లాడుతుంటాడు. వాళ్లకు చెరో కోటి ఇస్తానంటాడు. 50 కోట్లు వచ్చేలా చేస్తే కోటి ఇస్తారంటారేంటీ అని వాళ్లు అంటారు. మరి నేను సెట్ చేయనా అని మను ఎంట్రీ ఇవ్వడంతో వాళ్లంతా షాక్ అవుతారు. శైలేంద్ర చేతిలో ఉన్న చెక్ తీసుకుని చింపేస్తాడు మను. దాంతో శైలేంద్ర, వాళ్లు షాక్ అవుతారు. మాకు డబ్బు ఇవ్వలేదని మేము కోర్ట్‌కు వెళ్తామని వాళ్లు అంటే నేను కూడా వస్తాను. మీరు రిషి సంతకం ఫోర్జరీ చేశారని మా ఇన్వెస్టిగేషన్‌లో తేలింది అని మను అంటాడు. దాంతో శైలేంద్ర విలవిల్లాడిపోతే.. వాళ్లు కంగారు పడిపోతారు.

మురారి కృష్ణ రొమాన్స్

Krishna Mukunda Murari Promo: కృష్ణ ముకుంద మురారి ఫిబ్రవరి 19వ తేది ఎపిసోడ్ ప్రోమోలో ఆదర్శ్-ముకుంద, మురారి-కృష్ణ ఓ హౌటల్‌కు వెళ్తారు. అక్కడ గదిలో అంతా బాగుంది కదా అని హెయిర్ తుడుచుకుంటూ మురారితో అంటుంది కృష్ణ. హా చాలా బాగుంది అని చెప్పిన మురారి.. హమ్ తుమ్ ఏక కమ్‌రే మే బంద్ హో అని పాట పాడి కృష్ణను చేతితో చుట్టూ తిప్పుతాడు. అప్పుడు మురారి కృష్ణ పడిపోతుంది. ఇక్కడ సీన్ రొమాంటిక్‌గా చూపిస్తారు.

మరోవైపు ముకుందకు దేవ్ కాల్ చేసి మాట్లాడుతాడు. నీ జీవితానికి తను పెద్ద అడ్డేమో కదా. ఆ అడ్డు తొలగిద్దామనుకుంటే అస్సలు కుదరడం లేదు అని దేవ్ అంటాడు. ప్రాణాలు తీయడం లాంటి పిచ్చి పనులు చేయొద్దు అని ముకుంద అతనితో ఫోన్‌లో అంటుంది. అప్పుడే వచ్చిన ఆదర్శ్ ఆ మాటలు విని అనుమానంగా చూస్తాడు. ఆదర్శ్‌ను చూసిన ముకుంద ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి ఆ మాటలు ఆదర్శ్ విన్నాడా లేదా అనేది సోమవారం నాటి పూర్తి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.

IPL_Entry_Point