Guppedantha Manasu: శైలేంద్రను చంపుతానన్న మహేంద్ర.. కావ్యకు పెరిగిన శత్రువులు.. దేవ్ హంతకుడంటూ కృష్ణ ఫైర్-guppedantha manasu brahmamudi krishna mukunda murari serial january 8th episode promo ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu: శైలేంద్రను చంపుతానన్న మహేంద్ర.. కావ్యకు పెరిగిన శత్రువులు.. దేవ్ హంతకుడంటూ కృష్ణ ఫైర్

Guppedantha Manasu: శైలేంద్రను చంపుతానన్న మహేంద్ర.. కావ్యకు పెరిగిన శత్రువులు.. దేవ్ హంతకుడంటూ కృష్ణ ఫైర్

Sanjiv Kumar HT Telugu
Jan 07, 2024 07:05 AM IST

Guppedantha Manasu Serial Promo: స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతున్న టాప్ పాపులర్ తెలుగు సీరియల్స్ గుప్పెడంత మనసు, బ్రహ్మముడి చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. అలాంటి ఈ సీరియల్స్ జనవరి 8వ తేది ఎపిసోడ్స్‌లలో ఏం జరిగిందని ప్రోమోల్లో చూస్తే..

శైలేంద్రను చంపుతానన్న మహేంద్ర.. కావ్యకు పెరిగిన శత్రువులు.. దేవ్ హంతకుడంటూ కృష్ణ ఫైర్
శైలేంద్రను చంపుతానన్న మహేంద్ర.. కావ్యకు పెరిగిన శత్రువులు.. దేవ్ హంతకుడంటూ కృష్ణ ఫైర్

గుప్పెడంత మనసు సీరియల్‌లో తండ్రి చక్రపాణి ఇంటికి రిషిని తీసుకొస్తుంది వసుధార. రిషి ఆరోగ్య పరిస్థితి చూసి చక్రపాణి చాలా బాధపడుతాడు. చాలా గొప్పగా బతికేవారు, ఎంతో ఆస్తి ఉంది.. అలాంటిది సరిగ్గా భోజనం కూడా చేయలేకపోతున్నారు అని చక్రపాణి అంటాడు. మందులు ఏమైనా వాడుతున్నారా.. అలా సార్‌ని వదిలేయడం కరెక్ట్ కాదు. ఏదైనా హాస్పిటల్‌కు తీసుకెళ్లడం మంచిది అని చక్రపాణి చెబుతాడు.

మహేంద్ర సంతోషం

అక్కడ వాళ్లు పసరుతో వైద్యం చేశారు. హాస్పిటల్‌లో చూపించలేదు. తర్వాత అదే చేయాలి అని వసుధార అంటుంది. అనంతరం జగతి మేడమ్ కేస్ గురించి చక్రపాణి అడిగితే.. అదంతా చేసింది శైలేంద్ర అని వసుధార చెబుతుంది. మరుసటి రోజు ఉదయం మహేంద్రకు వసుధార ఫోన్ నుంచి రిషి కాల్ చేస్తాడు. రిషి మాట విని చాలా సంతోషిస్తాడు మహేంద్ర. రిషి, వసుధార క్షేమంగా ఉన్నారని తెలుసుకుంటాడు.

వెంటనే చక్రపాణి ఇంటికి మహేంద్ర, అనుపమ వెళ్తారు. రిషిని చూసి చాలా సంతోషపడి.. దెబ్బల గురించి అడుగుతాడు. సార్ నిల్చోలేక, కూర్చోలేకపోతున్నారని వసు చెబితే.. వెన్నెముకలో నొప్పిగా ఉందని రిషి అంటాడు. అటాక్ జరిగినప్పుడు లోయలో పడిపోయారని, అప్పుడు దెబ్బ తగిలి ఉండవచ్చని వసుధార అంటుంది. మన ఇంటికి వెళ్దాం అని మహేంద్ర అంటాడు.

షూట్ చేసి పడేస్తా

వద్దని వసుధార అడ్డుకుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్ ఇక్కడ ఉండటమే మంచిది. చెప్పాగా అటాక్స్ చాలా జరిగాయని వసుధార అంటుంది. వాడికి భయపడుతూ ఉండాలా. ఈసారి రాని షూట్ చేసి పడేస్తాను అని పరోక్షంగా శైలేంద్రను అంటాడు మహేంద్ర. తర్వాత అనుపమ సర్ది చెప్పడంతో అక్కడ ఉండేందుకు ఒప్పుకుంటాడు మహేంద్ర.

Brahmamudi Serial Promo: బ్రహ్మముడి సీరియల్ జనవరి 8వ తేది ఎపిసోడ్ ప్రోమోలో పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్తుంది కావ్య. ఉదయం అనగా రాజ్‌కు టిఫిన్ తీసుకెళ్తున్న అని చెప్పి ఆఫీస్‌కు వెళ్లావ్. ఎందుకు ఇంత ఆలస్యం అయింది అని కావ్యను అపర్ణ నిలదీస్తుంది. దారిలో మా అప్పు కనిపిస్తే మా పుట్టింటికి వెళ్లొస్తున్నాను అని కావ్య సమాధానం ఇస్తుంది.

ఎదిరించి మాట్లాడుతారా

దాంతో ఆ ఇంటితో సంబంధాలు పెట్టుకోవద్దు అని చెప్పాం కదా. మళ్లీ ఎందుకు వెళ్లావ్. ఎందుకు మాట్లాడవ్ అని కావ్యపై ధాన్యలక్ష్మీ ఫైర్ అవుతుంది. అక్కడున్న వాళ్లు నా కన్నవాళ్లు. అక్కడికి వెళితే.. ఏదో శత్రు దేశానికి వెళ్లినట్లు తప్పు పడుతున్నారు అని కావ్య ఆవెదనగా అంటుంది. దానికి ఏంటీ కావ్య ఇది. పెద్దవాళ్లు ఏదో ఆవేశంగా మాట్లాడుతారు. అలా అని పెద్దవాళ్లను ఎదిరించి మాట్లాడుతారా అని అనామిక మధ్యలో దూరి అంటుంది.

ఆ బుద్ధి తనకుంటే నాకు ఇన్ని బాధలు ఎందుకు ఉంటాయి అనామిక అని అపర్ణ అంటుంది. నువ్వంటే గొప్పింటి నుంచి వచ్చావ్ కాబట్టి.. గొప్పగా ఆలోచిస్తావ్ అనామిక. కానీ, కావ్య అలా కాదు కదా. తన బుద్ధులే అంతా అని రుద్రాణి రెచ్చిపోతుంది. ఇలా కావ్యకు ఇంట్లో అంతా శత్రువులుగా మారుతారు. మరోవైపు కావ్యకు రాజ్ విడాకులు ఇచ్చేందుకు లాయర్‌తో మాట్లాడటం కళావతి చూసిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో కావ్య ఏం చేస్తుందో ఆసక్తిగా మారింది.

చేసేదే తప్పు

Krishna Mukunda Murari Promo: కృష్ణ ముకుంద మురారి జనవరి 8వ తేది ఎపిసోడ్ ప్రోమోలో పెళ్లి ఏర్పాట్లు, భోజనం ఏర్పాట్లు గురించి భవానీ మాట్లాడుతుంది. భవానీ దగ్గరికి వచ్చిన దేవ్.. మీరు చేస్తుందో తప్పు. మళ్లీ అందులో భోజనం ఏర్పాట్లు. బాగుంది మేడమ్ అని అంటాడు. దాంతో దేవ్.. అని అతనిపైకి చేయి ఎత్తి చూపుతుంది.

అవతలి వాళ్లు తప్పు అని రుజువు చేస్తున్నాను. అన్ని ఆలోచించే చేస్తున్నాను అని భవానీ అంటుంది. తర్వాత పెద్దపల్లి ప్రభాకర్‌ను నేను రిలీజ్ చేయిస్తానని నీకు ప్రామిస్ చేస్తున్నాను అని కృష్ణ చేతిలో చేయి వేసి ప్రామిస్ చేస్తాడు దేవ్. అప్పుడే దేవ్ వేలికి ఉన్న ముద్ర, ఉంగరం చూసి షాక్ అవుతుంది. అది ఆర్టిస్ట్ చనిపోయినప్పుడు మొహంపై ఉన్న ఉంగరం మార్క్.

శ్రీధర్ ను చంపింది వీడే

దాంతో చేయి విదిలించుకుని కోపంగా దేవ్ కాలర్ పట్టుకుంటుంది కృష్ణ. యూ చీటర్ అని అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. ఏసీపీ సార్ శ్రీధర్‌ను చంపింది వీడే అని కృష్ణ గట్టిగా అరుస్తుంది కృష్ణ. దాంతో ముకుంద షాక్ అవుతుంది. అంతా అయోమయంగా చూస్తారు. మురారి కన్ఫ్యూజ్‌డ్‌గా చూస్తాడు. మరి ఆ ఉంగరం గురించి కృష్ణ చెబితే మురారి నమ్ముతాడా. భవానీ అడ్డుపడుతుందా. దేవ్ ఇంకేదైనా ప్లాన్ వేస్తాడా అనేది చూడాలి.

IPL_Entry_Point