Guppedantha Manasu February 3rd Episode: వసుధారకు పెద్ద షాక్.. పోలీసుల నుంచి తప్పించుకున్న భద్ర.. సంతోషంలో శైలేంద్ర-guppedantha manasu serial february 3rd episode vasudhara gets shocked over bhadra escape from mukul custody ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu February 3rd Episode: వసుధారకు పెద్ద షాక్.. పోలీసుల నుంచి తప్పించుకున్న భద్ర.. సంతోషంలో శైలేంద్ర

Guppedantha Manasu February 3rd Episode: వసుధారకు పెద్ద షాక్.. పోలీసుల నుంచి తప్పించుకున్న భద్ర.. సంతోషంలో శైలేంద్ర

Sanjiv Kumar HT Telugu
Feb 03, 2024 08:04 AM IST

Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఫిబ్రవరి 3వ తేది ఎపిసోడ్‌లో భద్రను ముకుల్ ఇంట్రాగేట్ చేస్తాడు. కానీ, నిజం చెప్పేందుకు ఉదయం వరకు టైమ్ ఇవ్వమంటాడు. కానిస్టేబుల్ ద్వారా భద్రను తప్పిస్తాడు శైలేంద్ర. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఫిబ్రవరి 3వ తేది ఎపిసోడ్‌
గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఫిబ్రవరి 3వ తేది ఎపిసోడ్‌

Guppedantha Manasu Serial Episode 990: గుప్పెడంత మనసు సీరియల్‌లో భద్ర గురించి తెలిసిందని, అతన్ని ముకుల్‌కు అప్పగించానని తనకు చెప్పింది ఆలోచిస్తుంటాడు శైలేంద్ర. ఇప్పుడు భద్ర గాడు నిజం చెబితే ఏంటీ పరిస్థితి, ఆ ముకుల్ గాడు ఎలాగోలా నిజం చెప్పిస్తాడు. ఈ గండం నుంచి ఎలా బయటపడాలని రాత్రి పూట ఆలోచిస్తుంటాడు శైలేంద్ర. అది చూసిన ధరణి ఏమైందని, నల్ల తేలు కుట్టినట్లు చెమటలు పడుతున్నాయని అడుగుతుంది.

ఎందుకు టెన్షన్ పడతాను

ఏం లేదని, మొహంపై వాటర్ పడిందని ఏదో ఒకటి కవర్ చేస్తాడు శైలేంద్ర. ఏం జరిగిందే చెప్పండి. కషాయం తీసుకురమ్మాంటారా, ట్యాబ్లెట్స్ తీసుకురమ్మాంటారా.. లేకుంటే మిమ్మల్ని బాగా చూసుకుంటలేనని నన్ను అంటారు. ఎవరో ఎందుకు అత్తయ్యా గారే అంటారు. లేకుంటే ఏదైనా మంచి విషయం జరిగిందా అని ధరణి అంటుంది. మంచి జరిగితే నేనెందుకు టెన్షన్ పడతాను అని శైలేంద్ర అంటాడు. అంటే ఇతరులకు మంచి జరిగేది మీకు నచ్చదు కదండి అందుకే అని ధరణి తన మాటలతో ముప్పుతిప్పలు పెడుతుంది.

అలాంటిదేం లేదు. నేను ఫ్రెష్ అయ్యే పడుకుంటానని శైలేంద్ర అంటాడు. నాకున్న ప్లాబ్లమ్స్ కంటే దీని మాటలే ఎక్కువ కష్టంగా ఉందని శైలేంద్ర అనుకుంటాడు. మరోవైపు వసుధార కోసం కంగారుపడుతుంటారు మహేంద్ర, అనుపమ. ఇంతలో వసుధార వచ్చి ఒక చీడ పురుగును పోలీసులకు అప్పజెప్పాను అంటుంది. ఎవరని మహేంద్ర అడిగితే.. ఇంకెవరు మావయ్య.. భద్ర. ఆ భద్ర శైలేంద్ర మనిషి. మనలో ఉన్న కోవర్ట్ వాడే అని వసుధార అంటుంది.

శైలేంద్రను అరెస్ట్ చేస్తాడు

రిషి సార్ గురించి తెలిసిందని కావాలనే గట్టిగా భద్రకు వినిపించేలా మాట్లాడాను. అది నమ్మి వాడు నా వెంటే వచ్చాడు. అంతేకాకుండా శైలేంద్రకు ఆ వార్త కూడా చేరవేశఆడు. దాంతో భద్రను ముకుల్‌కు అప్పజెప్పాను. అక్కడికి శైలేంద్ర వస్తే.. ఇక్కడికి ఎలా వచ్చావని అడిగాను. ఏవేవో కవర్ చేస్తూ అబద్ధాలు ఆడాడు అని వసుధార అంటుంది. వాన్ని కూడా పోలీసులకు అప్పజెపితే అయిపోయేది అని మహేంద్ర అంటాడు. అది కూడా తొందర్లోనే అవుతుంది. ముకుల్ ఇంట్రాగెట్ చేసి శైలేంద్రను అరెస్ట్ చేస్తాడు అని వసుధార అంటుంది.

ఆ భద్ర ఎన్ని మాటలు చెప్పాడు. ఎన్ని నీతులు మాట్లాడాడు. డబ్బు, లైఫ్ గురించి అని చెబితే.. జీవితంలో ఏవో కోల్పోయాడు అనుకున్నా. ఎంత నమ్మించాడు అని మహేంద్ర అంటాడు. వసుధార ముందు నుంచే చెప్పింది కదా మహేంద్ర. వాడు మీద అనుమానంగా ఉందని, ఏదో ఒక కారణంతో మన మధ్యకు రావడం, మాటలు వినడం, ఫోన్ మాట్లాడటం అన్ని 420 వేశాలు అని అనుపమ అంటుంది. ముకుల్ ఇంట్రాగేషన్ మొదలు పెడతానని చెప్పారు. రిషి సార్ గురించి కూడా తెలిసే అవకాశం ఉందని వసుధార అంటుంది.

భద్రపై ఇంట్రాగేషన్

తెలియాలి. రిషి జాడ తొందరగా తెలియాలి. వాడు ఎలా కష్టపడుతున్నాడో అని మహేంద్ర అంటాడు. సార్ తొందర్లేనే మన దగ్గరకు వస్తారు అని చెప్పిన వసుధార వెళ్లిపోతుంది. మరోవైపు భద్రను ఇంట్రాగేట్ చేస్తుంటాడు ముకుల్. వయెలెన్స్ లేకుండా నిజం చెబితే నీకే మంచిది లేకుంటే నా సీరియస్ యాక్షన్ చాలా తీవ్రంగా ఉంటుందని ముకుల్ అంటాడు. మహేంద్ర వాళ్ల ఇంటికి ఎందుకు వచ్చావ్, ఎవరు పంపించారు అని అన్ని ప్రశ్నలు అడుగుతాడు ముకుల్. కానీ, ఏది నిజం చెప్పడు భద్ర.

ఇవన్నీ ఎందుకు చేశావ్. డబ్బు కోసమే కదా. ఆ డబ్బు నేను ఇస్తాను. వాళ్లు ఆఫర్ చేసినదానికంటే ఎక్కువే ఇస్తాను. నిజం భద్ర అని ముకుల్ అంటాడు. నాకు కొంచెం టైమ్ కావాలి. ఆలోచించుకుని చెబుతాను. ఒక గంట సరిపోదు. పూట కావాలి. ఉదయం లోపు చెబుతాను అని భద్ర అంటాడు. ఉదయం నిజం చెబుతావని అనుకుంటున్నాను. రెండో ఆన్సర్ రాకూడదు అని భద్రతో అన్న ముకుల్‌ పక్కనే ఉన్న కానిస్టేబుల్‌కు జాగ్రత్త అని చెబుతాడు. ఇంతలో అదే కానిస్టేబుల్‌కు శైలేంద్ర నుంచి మెసేజ్ వస్తుంది.

అతివినయం చూపించి

ఎట్టి పరిస్థితుల్లో భద్ర తప్పించుకోవాలి. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను అని శైలేంద్ర చేసిన మెసేజ్‌లో ఉంటుంది. కష్టం సార్ అని ఆ కానిస్టేబుల్ రిప్లై ఇస్తాడు. మరుసటి రోజు ఉదయం మహేంద్ర ఇంటికి ముకుల్ వెల్తాడు. అంతా కూర్చుని ఉంటారు. మీకో విషయం చెప్పాలి అని ముకుల్ అంటాడు. ఆ భద్ర గాడి గురించే కదా. వాడిపై వసుధారకు ఎన్నోసార్లు డౌట్ వచ్చిన వాడి అతివినయం చూపించి తప్పించుకునేవాడు అని మహేంద్ర అంటాడు. వాడు ఎందుకు వచ్చాడో తెలిసింది కదా మావయ్య. అలా ఎలా త్వరగా బయటపడతాడు అని వసుధార అంటుంది.

రిషి గురించి ఏమైనా తెలిసిందా, రిషిని చూడాలని ఉందని, ఆ వీడియో డిలీట్ చేసింది వాడేనా అని మహేంద్ర అంటాడు. ఆ వీడియో డిలీట్ చేసింది వాడే. కానీ అని ముకుల్ అంటాడు. మరి రిషి ఏమయ్యాడో తెలియదా అని మహేంద్ర అడుగుతాడు. అందరూ రిషి గురించి చెప్పమని అడుగుతారు. ఏంటీ ముకులు అంతా అడిగితే సైలెంట్‌గా ఉన్నావ్. ఏమైంది అని అనుపమ అంటుంది. భద్ర కస్టడీ నుంచి తప్పించుకున్నాడు అని ముకుల్ అంటాడు. దాంతో అంతా షాక్ పైకి లేచి నిల్చుంటారు.

నిజం చెబుతాడేమో అని

మరోవైపు ఏంటీ.. ఆ భద్ర గాడు తప్పించుకున్నాడా.. చాలా మంచి విషయం చెప్పావ్. థ్యాంక్యూ సోమచ్ అని ఫోన్‌లో ఎవరితోనో అంటాడు శైలేంద్ర. తర్వాత మామ్.. మామ్ అంటూ దేవయాని దగ్గరికి వెళ్లి తెగ సంబరపడిపోతాడు. అదంతా పక్కన చాటుగా ఉండి ధరణి వింటుంది. టెన్షన్‌గా ఉంటే ఇలా చేస్తావేంటీ. భద్ర గాడు ఎక్కడ నోరు తెరచి మన గురించి చెబుతాడేమో అని భయంగా ఉందని దేవయాని అంటుంది. దాంతో వాడు చెప్పడు మామ్ అని శైలేంద్ర అంటాడు. టెర్రరిస్టులే నోరు విప్పుతారు. వీడో లెక్కనా. వాడు నిజం చెబితే ఎలా అని గుండెల్లో గుబులు పుడుతుంది అని దేవయాని అంటుంది.

కంగారుపడకు మామ్.. నేను ఉన్నాను కదా. టెన్షన్ ఎందుకు. మన నిజ స్వరూపం ఇప్పుడే కాదు. ఎప్పటికీ తెలియదు. ఏదైనా చెప్పాలంటే వాడు ఉండాలి కదా అని శైలేంద్ర అంటాడు. దాంతో ఏంటీ అని దేవయాని అంటుంది. అది విని షాక్ అవుతుంది ధరణి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. చూస్తుంటే శైలేంద్ర గురించి తెలియడం కానీ, పోలీసులకు దొరకడం కానీ ఇప్పట్లే జరిగేలా లేదు.

Whats_app_banner