Guppedantha Manasu February 10th Episode: గుప్పెడంత మనసు.. శైలేంద్రకే ఎదురుతిరిగిన రాజీవ్.. చంపుతానని సీరియస్ వార్నింగ్
Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్ ఫిబ్రవరి 10వ తేది ఎపిసోడ్‌లో శైలేంద్రకు ఎదురుతిరుగుతాడు రాజీవ్. తను చెప్పిన వినకుండా వసుధారను కలుస్తానని అంటాడు. మరోవైపు వసుధార, మహేంద్రలకు కాలేజీ గురించి కొత్త సమస్య ఎదురవుతుంది. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Guppedantha Manasu Serial Episode 996: గుప్పెడంత మనసు సీరియల్‌లో వసుధార దిగాలుగా కూర్చుని ఉంటుంది. ఇంతలో మహేంద్ర, అనుపమ వస్తారు. వసుధార చాలా బాధలో ఉంది. అసలు ఏం తిననట్లు ఉంది. నేను వంట అంతా రెడీ చేశాను. తనను భోజనానికి తీసుకురా అని మహేంద్రకు చెప్పి లోపలికి వెళ్లిపోతుంది అనుపమ. వసుధార ఎదుట కూర్చున్న మహేంద్ర.. రిషినే నీ జీవితం అనుకున్నావ్. కానీ, ఇప్పుడు ఆ జీవితమే లేకుండా పోయిందమ్మా అని మనసులో అనుకుంటాడు మహేంద్ర.
ఓ రాక్షసుడు వచ్చాడు
రిషి ఇంకా బతికి ఉన్నాడని అనుకుంటున్నావ్. కానీ, రిషి చనిపోయాడని తెలిసి నా గుండె ముక్కలు అవుతోంది. నీ ముందు బయటపడితే నువ్ ఏమైపోతావో అని నీ ముందు ధైర్యంగా ఉంటున్నాను అని మనసులో అనుకుంటాడు మహేంద్ర. ఇంతలో మహేంద్రను వసుధార చూస్తుంది. ఏమైందమ్మా. ఎవరైనా వచ్చారా. ఏమైనా అన్నారా అని మహేంద్ర అడుగుతాడు. ఓ రాక్షసుడు వచ్చాడు అని రాజీవ్ వచ్చి వెళ్లింది ఆవేశంగా చెబుతాడు చక్రపాణి. అప్పుడే వచ్చిన అనుపమ అది విని రాక్షసుడా ఎవరు అని అడుగుతుంది.
ఉన్నాడులే అమ్మా ఒక దుర్మార్గుడు అని రిషి, వసుధార విషయంలో రాజీవ్ ఏం చేశాడో చెబుతాడు చక్రపాణి. మనుషులు ఇలా కూడా ఉంటారా అని అనుపమ అంటుంది. నాకు కూడా వాడిని చూశాకే మన చుట్టూనే ఇలా ఉంటారా అని అనిపించింది అని ఆవేశంగా మాట్లాడుతాడు చక్రపాణి. అమ్మా వసుధార నువ్ ఇలా డల్‌గా ఉంటే ఆ శైలేంద్ర, రాజీవ్ లాంటి వాళ్లు ఇలాగే టార్చర్ పెడతారు. వచ్చి భోజనం చేయమ్మా అని అనుపమ అంటుంది.
తినకుంటే రిషి వస్తాడా
నాకు వద్ద ఆంటీ. మీరు వెళ్లి చేయండి అని వసుధార అంటుంది. రిషి బతికి ఉన్నాడని నువ్ నమ్ముతున్నావ్. కానీ, డీఎన్ఏ రిపోర్ట్స్ నిజం చెబుతున్నాయని మహేంద్ర అంటున్నాడు అని అనుపమ అంటుంది. నమ్మటం కాదు రిషి సార్ బతికే ఉన్నారు అని వసుధార అంటుంది. రిషి బతికి ఉంటే మనకు అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది. అలా అని నువ్ ఇలా తినకుండా ఉంటే రిషి తిరిగి వస్తాడా చెప్పు అని నచ్చజెప్పి వసుధారను తినేందుకు ఒప్పిస్తుంది అనుపమ. దాంతో అంతా భోజనానికి వెళ్తారు.
మరోవైపు వసుధార ఇంటికి రాజీవ్ వెళ్లింది తెలుసుకున్న శైలేంద్ర ఫైర్ అవుతాడు. ఇప్పుడే ఎందుకు వెళ్లావ్‌రా. కొద్దిరోజులు ఎవరికీ కనపడకుండా ఉండమని చెప్పాను కదా అని శైలేంద్ర అంటాడు. ఎందుకు టెన్షన్ భయ్యా. నా మరదలు విషయంలో నేను ఆగలేను. బాధలో ఉంది కదా అని ఓదారుద్దామని వెళ్లాను అని రాజీవ్ అంటే.. ఓదారుద్దామనా.. దారికి తెచ్చుకుందామనా అని శైలేంద్ర అంటాడు. పైకి కనపడవు కానీ, బాగా టాలెంట్ నువ్ అని రాజీవ్ అంటాడు.
నేను కూడా విలనే
కష్టాల్లో ఉందని వెళితే.. ఎడా పెడా వాయించేసింది అని రాజీవ్ అంటాడు. అంటే కొట్టిందా అని శైలేంద్ర అడిగితే.. కొట్టేంత సీన్ లేదు కానీ. నా మరదలు, మామ రెచ్చిపోయి మాట్లాడారు అని రాజీవ్ అంటాడు. మేము దండేస్తేనే ఊరుకోలేదు. నిన్నేందుకు ఊరుకుంటుందిరా అని శైలేంద్ర అంటే.. ఏదో నా ప్రయత్నం చేశాను భయ్యా అని రాజీవ్ అంటాడు. అయినా రిషి చనిపోయిన విషయం నీకెలా తెలుసు అని శైలేంద్ర అడిగితే.. నువ్వేనా విలన్.. నేను కూడా విలనే. నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని రాజీవ్ అంటాడు.
నువ్ తొందరగా ఆ ఎండీ సీటు దక్కించుకుని వసుధారను గెంటేయు. వసుధారను చంకలో పెట్టుకుని వెళ్లిపోతాను అని రాజీవ్ అంటే నేను అదే పనిలో ఉన్నాను అని శైలేంద్ర అంటాడు. సరే వెళ్తాను అని చెప్పిన రాజీవ్.. భయ్యా.. నువ్ ఎంతమందిని అయినా చంపుకో కానీ, వసుధార జోలికి మాత్రం రాకు. అటాక్స్ చేయడం, చంపించే ప్రయత్నాలు చేయకు. రిషిపై వసుధారకు ఎంత ప్రేమ ఉందో నాకు వసుపై అంతకుమించి ఉంది. వసుధారను ఏమైనా చేయాలని చూస్తే నేను నిన్ను చంపడానికి కూడా వెనుకాడను అని రాజీవ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు.
40 కోట్లు కావాలని అన్నారు
సరేలేరా అని శైలేంద్ర అంటే.. నిజంగా సీరియస్‌గా చెబుతున్నాను భయ్యా. కుర్చీ నీకు.. కుర్చీలోని పిల్ల నాకు అని చెప్పేసి వెళ్లిపోతాడు రాజీవ్. వీడు డఫ్పా గాడు అనుకున్న కానీ పెద్ద జఫ్పా గాడు అని శైలేంద్ర మనసులో అనుకుంటాడు. మరోవైపు వసుధార దగ్గరకి ఇద్దరు వెళ్లి కలుస్తారు. రిషి సార్ చనిపోయారి తెలిసింది. ఆయన మాకు చాలా బాగా తెలుసు. ఆయన మా దగ్గరికి వచ్చి మా కాలేజీ ఇబ్బందుల్లో ఉంది. 40 కోట్లు కావాలని అడిగారు. అంత పెద్ద మనిషి వచ్చి అడిగేసరికి మేము ఇచ్చాం. ఇప్పుడు మేం ఇబ్బందుల్లో ఉన్నాం. వీటిని ఫ్రూఫ్స్‌గా తీసుకుని డబ్బు ఇచ్చాం అని వాళ్లు అంటారు.
లేదు నేను నమ్మను అని వసుధార అంటుంది. ఫ్రూఫ్స్ ఉన్నాయి కదా. మీరు వీలైనంత త్వరగా బోర్డ్ మీటింగ్ పెట్టి మాకు రావాల్సిన డబ్బు మాకు ఇస్తే సంతోషం. బయట ఎదురుచూస్తాం అని చెప్పి వెళ్లిపోతారు. దాంతో తల పట్టుకున్న వసుధార మహేంద్రకు కాల్ చేసి చెబుతుంది. దాంతో అనుపమను తీసుకుని మహేంద్ర బయలుదేరుతాడు. బోర్డ్ ఏర్పాటు చేస్తుంది వసుధార. వసుధార టెన్షన్ చూసి నేను ఇప్పటి నుంచే పగ పట్టాను. చెప్పాను కదా నీకు ఇక ప్రాబ్లమ్సే అని. నన్నే చెంపదెబ్బ కొడతావా అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర.
డాక్యుమెంట్స్ అలా కాదు
ఇంతలో మహేంద్ర వచ్చి ఏమైందని అడిగితే.. వసుధార జరిగింది చెబుతుంది. రిషి అలాంటోడు కాదు. మీరు పొరపాటు పడుతున్నారు. వెళ్లిపోండి అని మహేంద్ర అంటాడు. పొరపాటు పడితే ఇంతసేపు కాలేజీలో ఎలా ఉంటాం. రిషి గొప్పవాడే కానీ. అవసరం ఎంత కిందకు అయినా దిగజారుతారు అని వాళ్లు అంటారు. కరెక్టే కానీ, అంతగొప్ప మనిషే వచ్చి అడిగేసరికి ఇచ్చాం. మాట అంటే చెల్లిపోతుంది. కానీ, డాక్యుమెంట్స్ అలా కాదు కదా. మీరు కూడా చూడండి అని మరో వ్యక్తి అంటాడు.
ఆ డాక్యుమెంట్స్ చూసిన అనుపమ అంతా పర్ఫెక్ట్‌గా ఉన్నాయని అంటుంది. పర్ఫెక్ట్‌గా ఉన్నంతమాత్రాన నిజమని కాదు కదా. ఇవి ఎవరో క్రియేట్ చేశారు. ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారు అని మహేంద్ర అంటాడు. మొదట అలాగే అంటావ్ బాబాయ్. తర్వాత తెలుస్తుంది అని శైలేంద్ర అనుకుంటాడు. రిషి డబ్బు తీసుకున్నాడంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే రిషికి కాలేజీ అంటే ప్రాణం. స్టూడెంట్స్ కోసం అలా రిషి చేయడు అని మహేంద్ర అంటాడు.
వాళ్లే గెలుస్తారు
మీరు ఇలా మాట్లాడితే మేము కోర్టుకు వెళ్తాం అని వాళ్లు అంటారు. సరే కోర్టుకే వెళ్లండి అని మహేంద్ర అంటాడు. కోర్టుకు వెళ్లిన వాళ్లే గెలుస్తారు అని అనుపమ అంటుంది. దాంతో వసుధార ఆలోచనలో పడిపోతుంది. ఇంతటితే నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.