Brahmamudi March 9th Episode: బ్రహ్మముడి సీరియల్.. బికినీ యాడ్‌లో స్వప్న, ఆస్తి రాసిచ్చిన తాతయ్య.. ధాన్యలక్ష్మీ రచ్చ-brahmamudi serial march 9th episode swapna bikini ad and sitaramayya wrote property to swapna brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi March 9th Episode: బ్రహ్మముడి సీరియల్.. బికినీ యాడ్‌లో స్వప్న, ఆస్తి రాసిచ్చిన తాతయ్య.. ధాన్యలక్ష్మీ రచ్చ

Brahmamudi March 9th Episode: బ్రహ్మముడి సీరియల్.. బికినీ యాడ్‌లో స్వప్న, ఆస్తి రాసిచ్చిన తాతయ్య.. ధాన్యలక్ష్మీ రచ్చ

Sanjiv Kumar HT Telugu
Apr 03, 2024 11:30 AM IST

Brahmamudi Serial March 9th Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 9వ తేది ఎపిసోడ్‌లో స్పప్న మోడలింగ్ కోసం బయటకు వెళ్తుంటే రుద్రాణి అడ్డుకుంటుంది. దాంతో బికినీ యాడ్ అగ్రిమెంట్ చేసుకోడానికి వెళ్తున్నట్లు స్వప్న చెబుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ మార్చి 9వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ మార్చి 9వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో స్వప్న మోడలింగ్ కోసం అని రెడీ అవుతుంటుంది. అదంతా రుద్రాణి, రాహుల్ చూస్తారు. నిన్న అంత గొడవ జరిగింది. అయినా కూడా తను మోడలింగ్‌కు రెడీ అవుతుంది. నీకు నచ్చని పని చేస్తుంటే ఏం అనవేంటి మామ్. ఇప్పుడు దాన్ని ఆపుతాను ఉండు అని రాహుల్ అంటాడు. ఆగరా.. అది గడప దాటి బయటకు వెళ్తేనే కదా మనం అనుకున్నది జరుగుతుంది. అది బయటకు వెళ్లాలి మళ్లీ పెద్ద గొడవ చేయాలి అని రుద్రాణి అంటుంది.

స్వప్నకు రాహుల్ సపోర్ట్

ఇప్పుడు నువ్ వెళ్లి స్వప్నకు సపోర్ట్ చేస్తూ మాట్లాడు. నువ్ చేసేదే కరెక్ట్ అని చెప్పి పంపించు అని రుద్రాణి అంటుంది. దాంతో రాహుల్ వెళ్లి స్వప్నను పొగుడుతూ నువ్ చేసేదే కరెక్ట్. ఇతరుల మీద ఆధారపడకుండా నీ కాళ్లమీద నిలబడాలనుకుంటున్నావ్ చూడు అది నాకు నచ్చింది అని రాహుల్ అంటాడు. నాకు సపోర్ట్ చేసినట్లు చేసి నాకు వచ్చే ఆదాయం తీసుకోవాలని అనుకుంటున్నావా. మోడలింగ్ ద్వారా వచ్చే ఏ ఒక్క రూపాయి కూడా నీకు ఇవ్వను అని చెప్పేసి వెళ్లిపోతుంది స్వప్న.

హాల్లో అందరు ఉంటారు. స్వప్న మోడలింగ్‌కు వెళ్లడం చూసి షాక్ అవుతారు. ఎక్కడికి అని రుద్రాణి అడుగుతుంది. దాంతో బికినీ యాడ్ ఒకటి ఉంది. దాన్ని అగ్రిమెంట్ చేసుకుందామని వెళ్తున్నా అని స్వప్న అంటుంది. దాంతో అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటీ ఇప్పుడు నువ్ బికినీ వేసుకుంటావా అని రుద్రాణి షాకింగ్‌గా అడుగుతుంది. అవును, మరి నువ్ వేసుకుంటావా. నా బాధ చెప్పి ఇంత సేపు అయింది. అయినా మీ తల్లీకొడుకుల నుంచి ఉలుకు లేదు పలుకు లేదు అని స్వప్న అంటుంది.

అమ్మడానికి వీళ్లేదు

నా బిడ్డ సంగతి నేను చూసుకోవాలి కదా అని స్వప్న అంటుంది. ఇంతలో సీతారామయ్య ఎంట్రీ ఇస్తాడు. అలా అవసరం లేదు. నువ్ నీ బిడ్డ కోసం గర్భిణీగా ఉన్నప్పుడు కష్టపడాల్సిన అవసరం లేదు. ఇది మా స్థిరాస్తిలో ఒకటి. అబిడ్స్‍‌లోని షాపింగ్‌ మాల్‌కి నెలకు లక్షల్లో రెంట్ వస్తుంది. అది నీ బిడ్డకు భరోసాగా ఉంటుంది. దీన్ని నీ పేరు మీద రాశాను. అయితే, ఈ ఆస్తిని నువ్ కానీ, ఇంకెవరైనా సరే అమ్మడానికి వీళ్లేదు. కేవలం దీనిపై వచ్చే ఆదాయం నీకు మాత్రమే చెందుతుంది అని సీతారామయ్య చెబుతాడు.

దాంతో కల్యాణ్, సుభాష్, ప్రకాశం, స్వప్న హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ, ధాన్యలక్ష్మీ, అనామిక కోప్పడతారు. అలా ఎలా స్వప్నకు రాసి ఇస్తారు మావయ్య. స్వప్నకు భర్త ఉన్నాడు. ఏదైనా సరే అతను పోషించుకోవాలి. రుద్రాణి కోడలికి మీరు ఆస్తి దానం చేయడం ఏంటీ అని ధాన్యలక్ష్మీ అంటుంది. అది నా భర్త స్వయంగా సంపాదించుకున్న ఆస్తి. అందులో నీకు వచ్చిన అభ్యంతరం ఏంటీ అని ఇందిరాదేవి అంటుంది.

అసలు రంగు బయటపడింది

కానీ, తాతగారి ఆస్తులు మనవళ్లకే కదా. అలాంటప్పుడు స్వప్న బిడ్డకు ఎలా ఇస్తారు ధాన్యలక్ష్మీ అంటుంది. రుద్రాణి ఈ ఇంటి ఆడపడుచు. కూతురు మనవడికి కూడా ఆస్తి వస్తుంది అని ఇందిరాదేవి అంటే.. రుద్రాణి మీ సొంత కూతురు కాదు కదా అత్తయ్య. వాళ్లకు ఆస్తి దానం చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇప్పుడు నీ అసలు రంగు బయటపడింది. శతకోటి లింగాల్లో ఓ బోడిలింగాన్ని ఇస్తుంటే తట్టుకోలేకపోతుంది అని రుద్రాణి అంటుంది.

మా అత్తయ్య అన్నదాంట్లో తప్పేముందు. మీరు ఈ ఇంటి కూతురు కాదు కదా అని అనామిక అంటుంది. అనామిక నీ అనుభవం ఎంత నీకు ఏ అర్హత ఉందని మా అత్తయ్య రిలేషన్ గురించి మాట్లాడుతున్నావ్. నీకు ఏం హక్కు ఉందని అంటున్నావ్ అని కల్యాణ్ అంటాడు. కల్యాణ్ మీ అమ్మ కన్నా నీ భార్య నాలుగు ఆకులు ఎక్కువే చదివింది. నీ వ్యక్తిగత జీవితాల్లో తలదూర్చి తలకు బొబ్బి కట్టింది. ఇప్పుడు వాళ్ల విషయాల్లో దూరుస్తుంది అని స్వప్న అంటుంది. నేను మాట్లాడేదాంట్లో తప్పేముందని అనామిక అంటుంది.

నోరు మూస్తే మంచిది

దాంతో షటప్ అని అరిచిన స్వప్న.. నీ ఆలోచనల్లోనే తప్పుంది. నీ అత్త మాట్లాడితే ఒక లెక్క.. నువ్వో పిల్ల కాకివి నీకేం అర్హత ఉందని మాట్లాడుతున్నావ్ అని స్వప్న అంటుంది. ఆ అత్తనే మాట్లాడుతున్నా అని ధాన్యలక్ష్మీ మళ్లీ అదే అంటుంది. నేను వచ్చిన నాలుగేళ్లకు నువ్ ఈ ఇంటికి కోడలిగా వచ్చావ్. మావయ్య గారి నిర్ణయాన్ని కాదనే అనుభవం అర్హత రెండు నీకు లేవు. కాబట్టి నువ్ నీ కోడలు నోరు మూస్తే మంచిది అని అపర్ణ అంటుంది.

ఈ ఇంట్లో పుట్టిన వారికి బారసాల కానుకగా ఒక ఆస్తి కానుకగా ఇవ్వడం ఆనవాయితీ. అది ఇప్పుడు కాస్తా ముందుగానే అందింది అనుకోండి. అరేయ్.. నీ భార్య కోడలు నాన్న నిర్ణయాన్నే ధిక్కరిస్తున్నారు. నువ్ చవటవు అయితేనే ఇలాంటివి పుట్టుకొస్తాయి. వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్లు అని సుభాష్ అంటాడు. నాన్న మాటలకే ఎదురు చెబుతున్నావ్ అంటూ ధాన్యలక్ష్మీని ప్రకాశం తీసుకెళ్తాడు. తాతయ్య మాట కాదనే హక్కు మా అమ్మకే లేదు. నీకు ఎక్కడిది. లోపలికి వెళ్లు అని అనామికను కల్యాణ్ అంటాడు. దాంతో అనామిక వెళ్లిపోతుంది.

కమెడియన్‌కి తక్కువ

తనకు ఆస్తి ఇచ్చినందుకు సీతారామయ్యకు చాలా థ్యాంక్స్ అని చెబుతుంది స్వప్న. మరోవైపు కోపంగా వెళ్లిన అనామికకు తన తల్లి కాల్ చేసి ఏమైందని అడుగుతుంది. ఆ స్వప్న కావ్య ఉన్నంతవరకు నా పని అయ్యేలా లేదని చెబుతుంది అనామిక. మరి మీ అత్త ఏం చేస్తుందని అడిగితే.. ఆవిడ విలన్‌కి ఎక్కువ కమెడియన్‌కి తక్కువ అని అనామిక అంటుంది. మరి నీ భర్త ఏం చేస్తున్నాడని తల్లి అడుగుతుంది. ఆయన నేను చెప్పేది వింటే ఇంత బాధ ఎందుకు అని బెడ్ రూమ్ గొడవ గురించి చెబుతుంది అనామిక.

అలా దూరంగా పడుకుంటే నీ కాపురం కూడా అలాగే ఉంటుంది. గొడవ వల్ల, దూరం పెట్టడం వల్ల నీ పని జరగలేదు కాబట్టి ప్రేమగా దగ్గరకు తీసుకుని చూడు. భర్తను దారికి తెచ్చుకోడానికి ఎన్నో దారులు ఉన్నాయి. దూరం పెడితే పని జరగనప్పుడు ప్రేమగా ఆదరించి. మీది లవ్ మ్యారేజ్. అదే నీ అడ్వాంటేజ్. పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తూ దగ్గరికి తీసుకో అని అనామికకు తల్లి చెబుతుంది. ఇప్పుడు చూడు నా స్టైల్ అని అనామిక అంటుంది. నువ్ సాధిస్తావని నాకు తెలుసు బేబీ. ఆల్ ది బెస్ట్ అని అనామిక తల్లి అంటుంది.

షాక్ అయిన రాజ్

మరోవైపు భాస్కర్ లేడని తెగ సంతోషపడతాడు రాజ్. కావ్యను కాఫీ తెమ్మంటాడు. దాంతో సరేనని కావ్య వెళ్లడంతో వాడు లేకపోయేసరికి పనులు ఎలా చేస్తుందో చూడు అని రాజ్ అనుకుంటాడు. రాజ్‌కు షాక్ ఇద్దామని ఇందిరాదేవి అంటుంది. దాంతో వెళ్లి ప్రొటీన్ షేక్, కాఫీ తీసుకెళ్తుంది కావ్య. మా బావ లేడని ప్రొటీన్ షేక్ నువ్ తాగుతున్నావా అని రాజ్ అంటాడు. ఇది మా బావ కోసం. గార్డెన్‌లో ఉన్నాడని కావ్య చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు.

ఎవరు రమ్మన్నారు అని రాజ్ అడిగితే.. నేనే రమ్మన్నాను. అతనికి కాలింది కదా. కనకంను ఇబ్బంది పెట్టడం ఎందుకు. ఇక్కడైతే అందరం ఉన్నాం కదా అని పిలిపించాను అని ఇందిరాదేవి అంటుంది. దాంతో ఏం అనలేక ఊరుకుంటాడు రాజ్. నీకు ఏమైనా ఇబ్బందా చెప్పు పంపిస్తాను అని ఇందిరాదేవి అంటే.. అలా ఏం లేదు నానమ్మ అని అతికష్టంగా చెబుతాడు రాజ్. తర్వాత భాస్కర్‌కు ప్రొటీన్ షేక్ ఇచ్చిన కావ్య తన బావతో కావాలనే ఓవరాక్షన్ చేస్తుంది. అదంతా రాజ్ చూస్తుంటాడు.

వాడు ఎగురేసుకుపోతాడు

భాస్కర్ కూడా రాజ్‌ను చూసి డ్రామా స్టార్ట్ చేస్తాడు. ఇంతలో ఇందిరాదేవి వచ్చి వాళ్లతో కూర్చుని ఉంటుంది. అదంతా చూసిన రాజ్ జెలసీ ఫీల్ అవుతాడు. ఇంతలో రాజ్ అంతరాత్మ వచ్చి రాజ్‌తో మాట్లాతుంటాడు. కళావతి మొహం ఎంత కళగా వెలిగిపోతుంది. నీ మొహం ఏంట్రీ పెలవెళ బోతుంది. ఇలాగే చూస్తూ ఊరుకుంటే కళావతిని ఆ భాస్కర్ గాడు ఎగరేసుకుపోతాడు. నీ మనసులోని ప్రేమను బయటపెట్టు అని రాజ్ అంతరాత్మ అంటాడు. దాంతో రాజ్ ఆలోచనలో పడిపోతాడు.