నాలుగో టెస్టుకు టీమిండియాలో రెండు మార్పులు! కేఎల్ రాహుల్ సిద్ధం-jasprit bumrah rajat patidar out and kl rahul is team india likely playing final eleven for fourth test agaisnt england ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  నాలుగో టెస్టుకు టీమిండియాలో రెండు మార్పులు! కేఎల్ రాహుల్ సిద్ధం

నాలుగో టెస్టుకు టీమిండియాలో రెండు మార్పులు! కేఎల్ రాహుల్ సిద్ధం

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 19, 2024 10:16 PM IST

IND vs ENG 4th Test: ఇంగ్లండ్‍తో నాలుగు టెస్టు కోసం టీమిండియా రెండు మార్పులు చేస్తుందని అంచనాలు ఉన్నాయి. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి రావడం దాదాపు ఖాయమే.

నాలుగో టెస్టుకు టీమిండియాలో రెండు మార్పులు!
నాలుగో టెస్టుకు టీమిండియాలో రెండు మార్పులు! (REUTERS)

India vs England 4th Test: సొంతగడ్డపై ఇంగ్లండ్‍తో టెస్టు సిరీస్‍లో భారత్ అదరగొడుతోంది. రాజ్‍కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఏకంగా 434 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. టెస్టు చరిత్రలోనే పరుగుల పరంగా తన అతిపెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది టీమిండియా. ఐదు టెస్టుల సిరీస్‍లో 2-1తో ముందంజ వేసింది. భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు ఫిబ్రవరి 23 నుంచి రాంచీ వేదికగా జరగనుంది. అయితే, నాలుగో టెస్టు కోసం తుది జట్టులో టీమిండియా రెండు మార్పులు చేసే అవకాశం ఉంది.

బుమ్రాకు విశ్రాంతి

భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రాకు నాలుగో టెస్టులో విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్‍మెంట్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అతడిపై వర్క్ లోడ్ తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఈ టెస్టు సిరీస్‍లో మూడు మ్యాచ్‍ల్లో 17 వికెట్లు పడగొట్టాడు బుమ్రా. సిరీస్‍లో లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. రెండో టెస్టులో 9 వికెట్లు పడగొట్టి.. టీమిండియా గెలుపులో ప్రధాన పాత్ర పోషించాడు. అలాగే, ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకుల్లో టాప్ ర్యాంకుకు చేరాడు.

అయితే, ఇంగ్లండ్‍తో నాలుగో టెస్టుకు బుమ్రాకు విశ్రాంతినిచ్చే ఛాన్స్ ఉంది. అతడు తన ఇంటికి వెళ్లనున్నాడని సమాచారం. నాలుగో టెస్టులో ఫలితాన్ని బట్టి.. ధర్మశాలలో జరిగే ఐదో టెస్టుకు ఆడించాలా వద్దా అని మేనేజ్‍మెంట్ నిర్ణయం తీసుకోనుంది. బుమ్రా స్థానంలో నాలుగో టెస్టులో యువ పేసర్ ఆకాశ్ దీప్‍ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అదనపు స్పిన్నర్ కావాలంటే అక్షర్ పటేల్‍ను కూడా తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది.

రాహుల్ ఇన్.. పటిదార్ ఔట్

గాయం నుంచి పూర్తిగా కోలుకున్న భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ నాలుగో టెస్టు ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో యువ బ్యాటర్ రజత్ పాటిదార్‌ తుది జట్టులో చోటు కోల్పోనున్నాడు. రెండు టెస్టుల్లో కేవలం 46 పరుగులే చేసి పటిదార్ నిరాశపరిచాడు. అందులోనే కేఎల్ రాహుల్ వస్తుండటంతో పటిదార్‌కు ఉద్వాసనకు తప్పేలా లేదు.

టీమిండియా ప్రస్తుతం భీకర ఫామ్‍లో ఉంది. ఇంగ్లండ్‍తో జరుగుతున్న టెస్టు సిరీస్‍లో యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఏకంగా రెండు డబుల్ సెంచరీలు బాదేశాడు. టెస్టుల్లో ఇంగ్లిష్ జట్టుపై రెండు ద్విశతకాలు చేసిన తొలి భారత ప్లేయర్‌గా జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. రోహిత్ శర్మ కూడా సెంచరీతో దుమ్మురేపాడు. మూడో స్థానంలో శుభ్‍మన్ గిల్ కూడా గాడిలో పడ్డాడు. మూడో టెస్టుతో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ రెండు అర్ధ సెంచరీలు చేసి సత్తాచాటాడు. జడేజా ఆల్‍రౌండ్ షోతో దుమ్మురేపాడు. నాలుగో టెస్టులోనూ జోరు కొనసాగించి సిరీస్‍ను ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది.

నాలుగో టెస్టులో టీమిండియా తుది జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‍మన్ గిల్, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జుపెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్/ఆకాశ్ దీప్, కుల్‍దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్

Whats_app_banner