Brahmamudi February 29th Episode: బ్రహ్మముడి సీరియల్.. అనామికపై చేయెత్తిన కల్యాణ్.. ఈడ్చి కొడతానన్న స్వప్న-brahmamudi serial february 26th episode kalyan raise hand on anamika and swapna get angry brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Brahmamudi Serial February 26th Episode Kalyan Raise Hand On Anamika And Swapna Get Angry Brahmamudi Today Episode

Brahmamudi February 29th Episode: బ్రహ్మముడి సీరియల్.. అనామికపై చేయెత్తిన కల్యాణ్.. ఈడ్చి కొడతానన్న స్వప్న

Sanjiv Kumar HT Telugu
Feb 29, 2024 07:23 AM IST

Brahmamudi Serial February 29th Episode: బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 29వ తేది ఎపిసోడ్‌లో అనామికకు కావ్య నీతులు చెబుతుంటే వినిపించుకోదు. అది చూసిన స్వప్న వచ్చి పైర్ అవుతుంది. ఈడ్చి కొడితే ఈతపళ్లు రాలినట్లు మూతి పళ్లు రాలుతాయని మాస్ వార్నింగ్ ఇస్తుంది స్వప్న. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 29వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 29వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో కల్యాణ్ రాసిన కవితను తీసుకెళ్లి అనామికకు ఇస్తుంది కావ్య. కల్యాణ్ లోకం ఏంటీ, అతనికి వ్యాపారం అంటే పడదని, భర్త ప్రేమ అందరికీ దొరకదని, అది దొరకని వారికే ఆ బాధ ఏంటో తెలుస్తుందని చాలా మాటలు చెబుతుంది కావ్య. ఇది కవిత అనుకుంటావో, లవ్ లెటర్ అనుకుంటావో నాకు తెలీదు. కానీ భార్యాభర్తల బంధం ఇలా లెటర్స్‌లో కాదు. నమ్మకంలో ఉండాలి అని కావ్య అంటుంది.

నా చెల్లిని అంటున్నా

ఏం చెప్పకుండానే అర్థం చేసుకోవాలి. కవిగారి మనసేంటో అర్థం చేసుకుని నడుచుకో అని అనామికకు కావ్య చెబుతుంది. మా ఆయన ఇలా పిచ్చి రాతలు రాసుకుంటూ కూర్చుంటే నువ్వు నీ భర్థ అందలం ఎక్కాలని చూస్తున్నారా అని అనామిక ఎప్పుడు అనేదే అంటుంది. అది విన్న స్వప్న ఏ మెంటల్ అని గట్టిగా అరుస్తుంది. వాళ్ల దగ్గరికి వచ్చి నిన్ను కాదమ్మా.. నా చెల్లిని అంటున్నా. ఏమే కావ్య.. నీకు బుద్ధిందా.. ఇలాంటి మూర్ఖులకు ఎందుకే సూక్తులు చెబుతున్నావ్ అని కావ్యపై ఫైర్ అవుతుంది స్వప్న.

బర్రె పేడ ఉందమ్మా.. తొక్కుతావ్ జాగ్రత్త అని చెబితే.. లేదు నేను తొక్కుతా అనే తెలివిలేని వారికి ఏం నీతులు చెబుతున్నావే. గాడిదకు ఏం తెలుసు గంధపు చెక్కల వాసన అని కవితలు, ప్రేమ గురించి దీనికి ఎందుకే చెబుతున్నావ్. దీని వంకర బుద్ధి ఇంకా అర్థం కాలేదా. తన భర్తను ఆఫీస్‌లో అందలం ఎక్కించి ఇక్కడ ఇంట్లో తను మహారాణిలా చక్రం తిప్పుదామని అనుకుంటుందే. కానీ, వాళ్ల అత్త, మీ అత్త గురించి తనకు తెలీదు. ఏదో ఒక మూలన పెట్టేదాకా బూజూ కర్రలా పైకి చూస్తూనే ఉంటుంది అని స్వప్న అంటుంది.

ఈడ్చి కొడితే ఈత పళ్లు రాలినట్లు

దాంతో స్వప్న అని గట్టిగా అరుస్తుంది అనామిక. చూశావా నన్ను పేరు పెట్టి పిలుస్తుంది. దానికి ఎంత పొగరో. ఇలాంటి దానికి నీతులు చెబుతావేంటో బుద్ధి లేని దానా. నిన్ను కాదమ్మా నా చెల్లిని అంటున్నా అని స్వప్న అంటుంది. నువ్ అంటుంది నన్నే. అర్థం చేసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు అని అనామిక అంటుంది. హమ్మయ్యా అర్థమైంది కదా. ఇప్పుడు నిన్నే అంటా. ఏమే.. వేలడంతా లేవు. ఈడ్చి కొడితే ఈత పళ్లు రాలినట్లు మూత పళ్లు రాలుతాయ్.. అని స్వప్న మాస్ వార్నింగ్ ఇస్తుంది.

మా చెల్లి ఏదో నీ మంచికోసం చెబుతుంటే తనగురించి తన భర్త గురించి ఏదేదో అంటున్నావ్. నీకు నా భర్తలాంటి వాడు దొరికితే అప్పుడు తెలిసేది. కల్యాణ్ లాంటి మంచి మనసును ఇరిచేసి దూరం చేసుకుంటే ఆఖరికి అతను రాసిన కవితలను అమ్ముకుని బతకాలి అని స్వప్న అంటుంది. ఇంకా స్వప్న అనబోతుంటే.. కావ్య నోరు మూసి లోపలికి తీసుకెళ్తుంది. అనామిక కోపంతో రగిలిపోతుంది. మరోవైపు అందరూ భోజనం చేస్తుంటారు. కల్యాణ్, అనామిక రారు.

అంతా చేసింది నీ కోడలే

కల్యాణ్ రాలేదా అని రాజ్ అడిగితే.. అంత అవమానం జరిగాక ఎలా వస్తాడు అని రుద్రాణి అంటుంది. కల్యాణే కాదు నా కోడలు కూడా రాలేదు అని ధాన్యలక్ష్మీ అంటుంది. తన భర్త మోసం చేశాడని తను రానని చెప్పింది. ఇంకా నువ్ నీ కోడలినే సపోర్ట్ చేస్తున్నావా అని అపర్ణ అంటుంది. ముమ్మాటికీ.. అయినా ఇందులో తన తప్పు ఏముంది. అంతా చేసింది నీ కోడలే. కల్యాణ్ కవితలు రాసుకుంటూ ఉంటే వద్దని, ఇది పని కాదని మందలించి ఉంటే ఇలా జరిగేది కాదు కదా అని ధాన్యలక్ష్మీ అంటుంది.

రాజ్ కూడా అనకపోడం నాకు బాధగా ఉంది అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో రాజ్ లేచి వెళ్లిపోతుంటే.. నేను కవిగారిని తీసుకొస్తాను. మీరు కూర్చోండి అని పదే పదే చెబుతుందా కావ్య. దాంతో రాజ్ కూర్చుంటాడు. కావ్య కల్యాణ్‌ను తీసుకురావడానికి వెళ్తుంది. ఈ ప్రేమ తమ్ముడి జీవితంలో కూడా చూపిస్తే బాగుండేది రాజ్ అని ధాన్యలక్ష్మీ అంటే.. ఏ.. ఆపు.. కల్యాణ్‌ను మనం కన్నాం అంతే. వాన్ని చూసుకుంది రాజే. కల్యాణ్ చేసింది నీకు ఇప్పుడే తప్పుగా అనిపించిదా. ఇంతకుముందు లేదా. నీకు ఎవరు ఏం చెబుతున్నారో ఏమో నాకు అర్థం కావటలేదు అని ప్రకాశం అంటాడు.

తనకు నచ్చింది చేస్తున్నాడు

ఏంటీ అన్నయ్య నన్ను చూస్తూ అంటున్నావ్. నీ భార్య ఏం చిన్నపిల్ల కాదు. చెబితే నమ్మేయడానికి అని రుద్రాణి అంటుంది. మీరు ఎలాంటి వారినైనా మార్చేస్తారని అంకుల్ అంటున్నారు అని స్వప్న అంటే.. నువ్వెందుకు మధ్యలో వస్తున్నావ్ అని రుద్రాణి అంటుంది. నా చెల్లి, తన భర్త గురించి మాట్లాడితే నేను కాకుంటే నీ కొడుకు వస్తాడా. సారీ నీ కొడుకుది కూడా నీ బుద్ధే కదా. ఇలాంటి మంచి పనులు ఎందుకు చేస్తాడు. కనీసం కల్యాణ్ తనకు నచ్చినపని చేస్తున్నాడు. రాహుల్ అయితే అది కూడా చేయట్లేదు అని స్వప్న అంటుంది.

అది మీ ధాన్యలక్ష్మీ ఆంటీకి కనిపించట్లేదమ్మా. మంచి చేసేవాళ్లను ముంచేవాళ్లలాగా.. ముంచేవాళ్లను మహాత్ముల్లాగా చూస్తుంది అని ప్రకాశం అంటుంది. బాబాయ్.. పిన్ని అన్నదాంట్లో తప్పేముంది. తన భర్త పై స్థాయిలో ఉండాలని అనామిక కోరుకోవడంలో కూడా తప్పులేదు. ఇన్నాళ్లు వాడికి నచ్చింది చేస్తే నేను వెనుక ఉంటాను అనుకున్నాను. కానీ వాడిని నేను మారుస్తాను అని రాజ్ అంటాడు. విన్నావుగా ధాన్యలక్ష్మీ ఇక మనస్ఫూర్తిగా తిను.. నీ కొడుకును రాజ్, కావ్య చూసుకుంటారు అని ఇందిరాదేవి అంటుంది.

వ్యాపారం చేస్తే డబ్బు వస్తుంది

మరోవైపు కల్యాణ్‍కు కావ్య నచ్చజెబుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి అర్థం చేసుకోవట్లేదు అని కల్యాణ్ అంటాడు. ఎందుకు అర్థం చేసుకోవాలి. మీ ఇద్దరు ఏంటో నాకు తెలుసు. పెళ్లై వచ్చిన భార్య ఎలా ఆలోచిస్తుందో నాకు తెలుసు. పేరు తెచ్చుకోవడం అంటే వ్యాపారం చేసే కాదు. కవితలు రాసి కూడా గొప్ప కీర్తి తెచ్చుకోవచ్చు. వ్యాపారం చేస్తే డబ్బు వస్తుంది. కానీ కవితలతో మంచి పేరు వస్తుంది. డబ్బు ఉన్న వాళ్లలో డబ్బు సంపాదించడం గొప్ప కాదు. మీ లోని కవిని ప్రపంచానికి చాటిచెప్పండి అని కల్యాణ్‌ను భోజనానికి తీసుకొస్తుంది కావ్య.

నేను అనుకున్నా ప్లాన్స్ ఫెయిల్ అయ్యాయి. ఈ ఓటమిని నేను ఒప్పుకోలేను. నేను అనుకున్నది సాధించే దాకా ఎంతకైనా తెగిస్తాను అని అనామిక అనుకుంటుంది. ఇంతలో కల్యాణ్ వచ్చి నేను నువ్ చెప్పావని ఆఫీస్‌కు వెళ్లాను అంతే. నాకు నచ్చి కాదు. అర్థం చేసుకో. కానీ, నావల్ల బాధపడ్డావ్ కాబట్టి సారీ అని అంటాడు. చేసిందంతా చేసి ఇలా నాలుగు గోడల మధ్య సారీ చెబితే అయిపోతుందా. నీది ఇంత ఛీప్ క్యారెక్టర్ అనుకోలేదు అని అనామిక అంటుంది. దాంతో కల్యాణ్ షాక్ అవుతాడు.

అసహ్యం వేస్తుంది

అసలు నేను ఎందుకు సారీ చెప్పానని అనుకుంటున్నావ్ అని కల్యాణ్ అడుగుతాడు. నా పక్క పంచుకుందామనే కదా ఇలా చేస్తున్నావ్ అని అనామిక అంటుంది. దాంతో కోపంతో అనామికపై చేయి ఎత్తుతాడు కల్యాణ్. ఇంతేనా నువ్ నా ప్రేమను అర్థం చేసుకుంది. ఇంతలా నేను దిగజారుతాననుకున్నావా. ఇప్పటివరకు నీపై నమ్మకం ఉండేది. కానీ, ఇప్పుడు నీపై అసహ్యం వేస్తుంది. నీ అంతట నువ్ నచ్చి వచ్చేవరకు నీ నీడను కూడా తాకను అని వెళ్లిపోతాడు కల్యాణ్. మరోవైపు కల్యాణ్‌ను కవితలు కాకుండా ఆఫీస్ చూసుకోమ్మని చెబితేమవు అని కావ్యను అంటాడు రాజ్.

ఎవరికీ నచ్చిన పని వాళ్లు చేస్తున్నారు. మీరు కూడా చెప్పొచ్చు కదా. అయిన మనం కాపురమే సరిగా లేదు. ఇంకొకరి కాపురాన్ని మనం ఎలా సెట్ చేయగలం అని రాజ్‌తో కావ్య అంటుంది. మరుసటి రోజు ఉదయం కల్యాణ్ కిందకు దిగుతాడు. రాజ్ పిలిచి అగ్రిమెంట్ పేపర్స్ అని ఇస్తాడు. అంతా షాక్ అవుతారు. ఏం పేపర్స్ అని కల్యాణ్ అంటే.. ఖైరతాబాద్ బ్రాంచ్ పేపర్స్. ఇక నుంచి ఆ బ్రాంచ్ నువ్వే చూసుకోవాలి. అలా నీకు ఇస్తున్నట్లు అగ్రిమెంట్ పేపర్స్ అని రాజ్ అంటాడు.

మనసుకు నచ్చిన పని చేయండి

దాంతో ధాన్యలక్ష్మీ, అనామిక సంబరపడిపోతారు. కానీ, కల్యాణ్ మాత్రం అందుకు ఒప్పుకోడు. ఇంతేనా అన్నయ్య అర్థం చేసకుంది అని కల్యాణ్ అంటే.. మనకు నచ్చినవారి కోసం చేయడంలో తప్పు లేదని రాజ్ అంటాడు. కాంప్రమైజ్ కావాలంటున్నావా అని కల్యాణ్ అంటాడు. మీ మనసుకు నచ్చిన పని చేస్తూనే ఈ పని కూడా చేయండి అని కావ్య అంటుంది. నా వల్ల కాదు వదినా అని కల్యాణ్ అంటాడు. తర్వాతి ఎపిసోడ్‌లో కావ్య, తన బావ వాళ్ల పుట్టింటికి వెళ్తున్నట్లు రాజ్‌కు చెబుతారు. దాంతో రాజ్ కంగారుపడిపోతుంటాడు.

WhatsApp channel