Brahmamudi February 19th Episode: బ్రహ్మముడి సీరియల్.. ధాన్యలక్ష్మీకి ఇత్తడవుద్దన్న స్వప్న.. అనామికకు అప్పు వార్నింగ్-brahmamudi serial february 19th episode appu advice to anamika about kalyan swapna warns dhanyam brahmamudi today episod ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi February 19th Episode: బ్రహ్మముడి సీరియల్.. ధాన్యలక్ష్మీకి ఇత్తడవుద్దన్న స్వప్న.. అనామికకు అప్పు వార్నింగ్

Brahmamudi February 19th Episode: బ్రహ్మముడి సీరియల్.. ధాన్యలక్ష్మీకి ఇత్తడవుద్దన్న స్వప్న.. అనామికకు అప్పు వార్నింగ్

Sanjiv Kumar HT Telugu
Feb 19, 2024 07:13 AM IST

Brahmamudi Serial February 19th Episode: బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 19వ తేది ఎపిసోడ్‌లో అనామికకు బాధ్యతలు అప్పాజెప్పాలని పంచాయితీ పెడుతుంది ధాన్యలక్ష్మీ. అంతా విన్న స్వప్న గట్టి కౌంటర్స్ వేస్తుంది. తనతో పెట్టుకుంటే ఇత్తడవుతుందని వార్నింగ్ ఇస్తుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 19వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 19వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో నా భర్తతో బయటకు వెళ్లాలంటే ఆ కావ్య దగ్గర పర్మిషన్ తీసుకుని, చేయి చాచి డబ్బు తీసుకుని వెళ్లాలా. తనంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి, అందరినీ చేయి చాచి అడుగుతుందేమో. నేను రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నాకు ఆ అలవాటు లేదు. కల్యాణ్ ఇలా తనను అడిగితే భార్యగా నాకు ఎలా ఉంటుంది చెప్పండి అని ధాన్యలక్ష్మీతో అంటుంది అనామిక.

లాక్కెళ్లిన ధాన్యలక్ష్మీ

నువ్ కూడా చెప్పింది నిజమే అనుకో అని ధాన్యలక్ష్మీ అంటే.. నిజమే అని ఇలా ఊరుకుంటారేంటీ అత్తయ్య. కావ్య ఆఫీస్‌కు వెళ్తుంది కాబట్టి.. ఇంటి పెత్తనం మీరైనా తీసుకోండి. లేదా నాకైనా ఇప్పించండి. లేకుంటే జీవితాంతం కల్యాణ్ పరిస్థితి చేయి చాచడమే అవుతుంది అని అనామిక పెద్ద ఫిటింగ్ పెడుతుంది. అలా జరగనివ్వను రా చెబుతాను అని అనామికను లాక్కెళ్తుంది ధాన్యలక్ష్మీ. పైనుంచి నేను మిస్ అయ్యానని, మీకు మిసెస్ అయ్యానని మా బావ టీలు ఎక్కువగా తాగుతూ ఛాయ్ దాసు అయ్యాడు అని రాజ్‌తో కావ్య చెబుతుంది.

ఛాయ్ దాసు ఏంటని రాజ్ అంటే.. మందు తాగడు కదా. అందుకే ఛాయ్ దాసు అని కావ్య అంటుంది. అప్పుడే అనామికను లాక్కొచ్చిన ధాన్యలక్ష్మీ.. మాకు ఏ పనులు చెబుతావో చెప్పు. ఇల్లు ఊడవాలా. నా కోడలు బట్టలు ఉతకాలా. తోటమాలిలు కూడా అవసరం లేదు. మా ఆయన, నా కొడుకు ఉన్నారు. వాళ్లు ఆ పని చేస్తారు అని అరుస్తుంది. దాంతో చెప్పాలనుకుంటిద స్పష్టంగా చెప్పు అని అపర్ణ అంటుంది. నా కోడలిని ఏనాడు అయినా కోడలిగా చూశారా, గౌరవం ఇచ్చారా అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఎవరు ఇవ్వలేదు, ఏమైందని ఇందిరాదేవి అంటుంది.

పెద్ద కోడలికే బాధ్యతలు

ఇంకా నోటీతో చెప్పాలా అని ధాన్యలక్ష్మీ అంటే.. చెప్పాలి. చెబితేనే కదా తెలిసేది. ఇప్పుడు ఎవరు గౌరవం ఇవ్వలేదు అని అపర్ణ అంటుంది. దుగ్గిరాల ఇంట్లో ఇంటి పెద్ద కోడలిదేనా అధికారం. ఇది మారదా అని ధాన్యలక్ష్మీ అంటుంది. అధికారం అనే పదం ఎందుకు. వంశపారపర్యంగా ఇంట్లో పెద్ద కోడలే అన్ని బాధ్యతలు చూసుకుంటుంది. అప్పుడు అపర్ణ, ఇప్పుడు కావ్య అని ఇందిరాదేవి అంటుంది. ఇన్నాళ్లు నన్ను ఆవిడ అణగదొక్కింది. ఇప్పుడు నా కోడలును కావ్య అణగదొక్కుతుంది అని ధాన్యలక్ష్మీ అంటుంది.

అసలు నీకు ఏమైంది. కొత్త కోడలు వచ్చాకా పుట్టింటికి పంపిస్తే బాగుండదని ఊరుకున్నాను. గౌరవం లేకుండా మాట్లాడితే పుట్టింటికి పంపించేస్తాను. టికెట్‌కు డబ్బులు కూడా ఇవ్వాల్సిన పనిలేదు అని ప్రకాశం అంటాడు. నువ్ ఆగరా, అసలు ఏమైందని సుభాష్ అడుగుతాడు. దానికి కొవ్వు ఎక్కువైంది అన్నయ్య అని ప్రకాశం అంటాడు. తర్వాత కల్యాణ్‌ను కావ్య బయటకు తీసుకెళ్లమనడం, క్రెడిట్ కార్డ్స్ లాకర్‌లో ఉండటం గురించి చెబుతుంది ధాన్యలక్ష్మీ. దానికి నేను కాదు, మా ఆయన కాదు, కల్యాణ్ చెబుతాడు అని అపర్ణ అంటుంది.

కూర్చుని ఉండాల్సిందేనా

నాకు ఖర్చులు పెద్దగా ఉండవని నా కార్డ్స్ లాకర్‌లో పెట్టమన్నాను. ఇంతకుముందు పెద్దమ్మ దగ్గర లాకర్ తాళాలు ఉండేవి. ఇప్పుడు కావ్య దగ్గర ఉన్నాయి. వెళ్లి తీసుకొస్తాను అన్నాను. ఇంతలో అత్తా కోడళ్లు కలిసి ప్రపంచం మునిగిపోయినట్లు విప్లవం లేవదీశారు. ఇందులో పెద్దమ్మ తప్పు గానీ, వదిన తప్పుగాని ఏం లేదు అని కల్యాణ్ చెబుతాడు. ఇప్పుడు అర్థమైందా జరిగింది అని అపర్ణ అంటే.. నా కొడుకు ఎప్పుడు చేయి చాచాల్సిందేనా. కావ్య వచ్చేవరకు కూర్చుని ఉండాల్సిందేనా అని ధాన్యలక్ష్మి అంటుంది.

చేతులు కట్టుకుని కూర్చోవద్దనే కదా. కావ్య రెండు లక్షలు ఇచ్చింది. అలా చేస్తే దొంగతనం అంటగట్టారు. ఇప్పుడు ఇలా అంటున్నారు అని స్వప్న అంటుంది. నువ్ ఎక్కువగా మాట్లడకు. నువ్ దుగ్గిరాల కోడలివి కాదు అని ధాన్యలక్ష్మీ అంటుంది. అసలు నీకు ఇప్పుడు ఏం కావాలి అది చెప్పు అని అపర్ణ అంటుంది. కావ్య ఆఫీస్‌కు వెళ్తుంది కాబట్టి. ఇంటి బాధ్యతలు అనామికకు ఇవ్వండి అని ధాన్యలక్ష్మీ అంటుంది.

అత్తను రాయబారిగా పంపి

ఇది అసలు సంగతి. కావ్యకు తాళాలు ఇవ్వడం ఆమెకు మొదటి నుంచి ఇష్టం లేదు. మా అత్తతో కలిసి మంతనాలు జరిపినప్పుడే నాకు ఇది అర్థమైంది. మా అత్త ఇచ్చిన ట్రైనింగ్‌లో భాగంగానే రెండు లక్షల దొంగతనం అంటగట్టారు. ఇప్పుడు బాధ్యతలు కావాలంటున్నారు. నిన్న గాక మొన్న వచ్చిన పిల్లకాకి పెత్తనం కోసం అత్తను రాయబారిగా పంపింది. నేను దుగ్గిరాల ఇంటి కోడలిని కాదు. నా భర్త, అత్త వేరే. నాతో పెట్టుకుంటే ఇత్తడి అయిపోద్ది. రా చూసుకుందాం అని స్వప్న అంటుంది. దాంతో స్వప్నను కావ్య ఆపుతుంది.

మన మధ్య ఇన్నాళ్లు బేధాలు రాలేదు. నేను నా చెల్లెలిగానే నిన్ను చూశాను. స్వప్న చెప్పినట్లుగానే నువ్ చెప్పుడు మాటలు వినే ఇలా మాట్లాడుతున్నావని అనిపిస్తుంది. ఏదైనా ఇబ్బంది ఉంటే అత్తకో, మామయ్యకే, బావగారికో, లేదా నాకో చెప్పాలి కానీ, ఇలా పంచాయితీ పెట్టడం సరికాదు. ఇలాగే చేస్తే నేను ఓ రూల్ పాస్ చేస్తాను. అప్పుడు ఎవరు ఏం చేయేలేరు అని అపర్ణ అంటుంది. దాంతో అవును, ఇన్నాళ్లు అపర్ణే ఒక్కతాటిపై నడిపించింది. తను ఒక రూల్ చెబితే ఎవరం ఏం చేయలేం. తను చెప్పిందే శాసనం అవుతుంది అని ఇందిరాదేవి అంటుంది.

అమ్మ చేతికి ఇవ్వకు

బాధ్యతలు ఎవరికి ఇవ్వాలో నాకు బాగా తెలుసు. ఇప్పటికీ అర్థమైంది అనుకుంటా. నీ కోడలికి అర్థమైంది అనుకుంటా. చదువుకుంది కదా. రేయ్ కల్యాణ్ నీ కార్డ్స్ నీ దగ్గరే పెట్టుకో. నీకు పెళ్లి అయింది. ఎంతైనా ఖర్చు పెట్టుకో. ఎవరు అడగరు. లెక్కలు అడగరు. నీ భార్య చేయి నువ్ పట్టుకో మీ అమ్మ చేతికి ఇవ్వకు అని అపర్ణ చెప్పేసి వెళ్లిపోతుంది. దాంతో అనామికను చేయి పట్టుకుని కల్యాణ్, ధాన్యలక్ష్మీని ప్రకాశం, స్వప్నను రాహుల్, రాజ్‌ను కావ్య చేయి పట్టుకుని తీసుకెళ్లిపోతారు. దాంతో ఏకాకిలా మిగిలిపోతుంది రుద్రాణి. నా మొగుడు ఉన్నాడో చచ్చాడో కూడా తెలియదు అని అనుకుంటుంది.

మరోవైపు కావ్య వెళ్లి రెండు గంటలు అవుతుంది ఇంకా రాలేదని ఆలోచిస్తుంటాడు రాజ్. శ్రుతిని పిలిచి అరుస్తాడు. దాంతో అప్పుడే శ్వేత వస్తుంది. అది చూసి ఆవిడ వస్తుందనుకుంటే ఈవిడే మా ఆవిడ అన్నట్లు వచ్చిందేంటి. ఇన్నాళ్లు మా బాస్ రైట్ అనుకున్నాను. కానీ, కాదు మా మేడమే రైట్ అని శ్రుతి అనుకుంటుంది. తర్వాత కావ్య బావ గురించి, చాలా సంతోషంగా ఉన్నట్లు శ్వేతకు చెబుతాడు రాజ్. రాజ్ ఫ్రస్టేట్ అయ్యేది శ్వేత గమనిస్తూ ఉంటుంది. అనంతరం శ్రుతి వచ్చి ఫోన్‌లో తన బావ గురించి మాట్లాడితే.. ఫైర్ అవుతాడు రాజ్.

నీ చుట్టు తిరిగేవాడు

మరోవైపు షాపింగ్ పూర్తి చేసుకుని కారులో అనామికతో కల్యాణ్ వెళ్తుంటాడు. ఇంతలో బైక్‌పై ఫ్రెండ్‌తో అప్పు ఎదురవుతుంది. అలా సడెన్‌గా మలుపు దగ్గర వచ్చేసరికి అప్పు, కారులో నుంచి అనామిక అరుస్తూ బయటకొస్తారు. ఒకరినొకరు చూసుకుని ఆగిపోతారు. హాయ్ బ్రో ఇప్పటివరకు కలవలేదు అని కల్యాణ్ అంటాడు. ఇంతకుముందు ఇలాగే మనం కలిశాం. అప్పుడు బ్రో అంటూ నీ చుట్టు తిరిగేవాడు. ఇప్పుడు నా చుట్టు తిరుగుతున్నాడు. ఓడల బళ్లు అవుతాయంటే ఇదే. ఇప్పుడేం చేస్తుంది. ఇల్లు గడవాలి కదా. పిజ్జా డెలీవరి చేస్తుంటుంది అని అనామిక అంటుంది.

చేసే పనిలో నిజాయితీ ఉంటే చాలు. చిన్న పని అయినా నాకు నామోషీ లేదు అని అప్పు అంటుంది. దాంతో కరెక్ట్‌గా చెప్పావ్ అని కల్యాణ్ అంటాడు. తర్వాత కారులో వెళ్లి కల్యాణ్ కూర్చుంటే.. నువ్ ఎన్ని ప్లాన్స్ వేసినా చివరికీ కల్యాణ్ నావాడు అయ్యాడు చూశావా అని అనామిక అంటుంది. నా స్థాయి ఏంటో అర్థం కాంది నీకు. నేను ఇప్పుడు అయినా నీ మొగున్ని దక్కించుకోగలను. నా ప్రేమలో నిజాయితీ ఉంది. కల్యాణ్ మంచివాడు. వాడిని మంచిగా చూసుకో. అంతేగాని నన్ను రెచ్చగొట్టి నీ కాపురం పాడు చేసుకోకు అని అప్పు హెచ్చరిస్తుంది.

IPL_Entry_Point