Brahmamudi February 17th Episode: బ్రహ్మముడి సీరియల్.. రాజ్‌ను ఆటాడేసుకున్న కావ్య, ఇందిరాదేవి.. అనామిక కొత్త ఫిటింగ్
Brahmamudi Serial February 17th Episode: బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 17వ తేది ఎపిసోడ్‌లో రాజ్‌తో సర్‌ప్రైజ్ అని చెప్పి కావ్య తెగ ఆట ఆడేసుకుంటుంది. ఇందిరాదేవి కూడా అలాగే చేస్తుంది. మరోవైపు ఇంట్లో అనామిక కొత్త ఫిటింగ్ పెట్టేందుకు ట్రై చేస్తుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శ్వేతను అక్క అని పిలవాలా.. చెల్లి అని పిలవాలా అడగండి అని రాజ్‌ను అడుగుతుంది. దాంతో ఇదేంటీ శ్వేతతో మాట్లాడితే ఉడుకిపోయి పెట్టే సర్దుకుని ఇంటికి వెళ్లిపోతుందనుకుంటే ఇలా మాట్లాడుతుంది అని రాజ్ కన్ఫ్యూజ్ అవుతాడు. తర్వాత రేపు మీకు ఓ సర్‌ప్రైజ్ ఉందని కావ్య అంటుంది. దాంతో ఏంటా సర్‌ప్రైజ్ అని రాజ్ అడుగుతాడు. చెబితే అది సర్‌ప్రైజ్ ఎలా అవుతుంది అని కావ్య అంటుంది.
ఏం పనులు చేశావ్
చెప్పకుండే అది సస్పెన్స్ సినిమాలా అవుతుంది అని రాజ్ అంటాడు. సర్‌ప్రైజ్ కోసం ఆమాత్రం సస్పెన్స్ భరించాలండి అని పడుకుంటుంది కావ్య. దాంతో ఏంటా ఆ సర్‌ప్రైజ్ అని ఆలోచించినా రాజ్.. అయినా దాని సర్‌ప్రైజ్ గురించి మనకెందుకు అని పడుకుంటాడు. మరోవైపు ఆఫీస్‌కు వెళ్లావ్ కదా ఏమైంది, ఏం చేశావ్, ఎలాంటి పనులు చేశావ్ అని కల్యాణ్‌ను అడుగుతుంది అనామిక. దాంతో ఆఫీస్‌లో ఎంప్లాయిస్‌కు, వాచ్‌మెన్‌కు కవితలు చెప్పింది గుర్తు చేసుకుంటాడు కల్యాణ్.
ఏం చెబుతాడో అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అనామికకు అబ్బో అకౌంట్స్ చూశాను, ఎంప్లాయిస్ నుంచి వాచ్‌మెన్ వరకు ఎవరినీ వదలలేదు అని కల్యాణ్ అంటాడు. చూశావా.. ఇది నీ రేంజ్.. ఇక్కడ కూర్చోని పిచ్చి రాతలు రాసుకుంటూ ఉంటే నీ గొప్ప ఎలా తెలుస్తుంది. నేను నిన్ను ఆఫీస్‌కు పంపించాను కాబట్టే నీ టాలెంట్ బయటపడింది. ఇలాగే చేస్తూ ఉండూ.. ఎక్కడికో వెళ్లిపోతావ్ అని అనామిక అంటుంది. నువ్ చెప్పింది చేశాను కదా.. మరి మన సంగతి. కనీసం టిఫిన్స్ అయినా లేవా అని కల్యాణ్ అంటాడు.
సర్‌ప్రైజ్ ఏంటీ
అవన్నీ ఉన్నాయి కానీ. ఇప్పటికీ ఈ ఫ్లైయింగ్ కిస్‌తో సరిపెట్టుకో అని ఇస్తుంది అనామిక. దాంతో ఆ కిస్‌ను మంచం కిందకు తోసేస్తాడు కల్యాణ్. మరోవైపు కావ్య చెప్పిన సర్‌ప్రైజ్ ఏంటా అని సతమతం అవుతున్న రాజ్ కావ్యను లేపుతాడు. నిద్రలో నుంచి లేచిన కావ్య రాజ్‌కు పెళ్లి అయిపోయినట్లు మాట్లాడుతుంది. అప్పుడే నా పెళ్లి అయిపోయినట్లు అనుకున్నావా. సరే సర్‌ప్రైజ్ ఏంటీ అని అడుగుతాడు రాజ్. నేను చెప్పను. రేపు చూడండి అని పడుకుంటుంది కావ్య.
మరోవైపు స్వప్నకు జ్యూస్ తీసుకొస్తుంది పనిమనిషి. అది చూసి ఫైర్ అయిన స్వప్న మా అత్త ఎక్కడ, తను తీసుకురాకుండా నువ్వెందుకు తీసుకొచ్చావ్ అని అరుస్తుంది. దాంతో రుద్రాణి దగ్గరికి వెళ్తుంది స్వప్న. అప్పుడు ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అని పాట పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ ఆస్వాదిస్తుంది రుద్రాణి. అది చూసిన స్వప్వ వచ్చి రుద్రాణి చేయి పట్టుకుని చుట్టూ తిప్పుతుంది. అప్పుడే తేరుకున్న రుద్రాణి స్వప్నను చూసి షాక్ అవుతుంది. మామయ్యను పంపించేసి ఇప్పుడు పాటలు పాడుకుంటే ఏం లాభం అని స్వప్న అంటుంది.
నువ్వే చేయాలి
నా భర్త గురించిన విషయాలు నీకు అనవసరం అని రుద్రాణి అంటే.. నాకు చేయాల్సిన పనులు చేయకపోతే ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది అని స్వప్న అంటుంది. నీకు పని మనిషిని పెట్టాను కదా, ఇంకేంటి అని రుద్రాణి అంటే.. తనుక జాగ్రత్తగా నా పనులు చూసుకునే అక్కర ఏముంటుంది. ఏం జరిగినా మీకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి నువ్ సరిగా చేస్తావ్. నువ్వే నా పనులు చేయాలి అని స్వప్న అంటుంది. ఏంటీ బెదిరిస్తున్నావా.. ఏం చేయగలవు నువ్ అని రుద్రాణి అంటుంది.
మీకు ఏమైనా అల్జీమర్స్ ఉన్నాయా. చేసిన పాపాలు మర్చిపోతున్నారు. రెండు లక్షలు కొట్టేసి కావ్యపై నేరం మోపాలని చూశారు. అది అందరికీ చెప్పమంటారా. పాపాలు చేసేవారికి సొంతంగా ఆలోచించే అవకాశం ఉండదు. మీరే నాకు పని చేయాలి. అప్పుడే నీకు ఏ సమస్య ఉండదు. అర్థమైందా అని వెళ్లిపోతుంది స్వప్న. అర్థమైంది. ఒక్క అవకాశం దొరకని నిన్ను నామరూపం లేకుండా చేస్తాను అని రుద్రాణి మనసులో అనుకుంటుంది.
ఆడుకున్న ఇందిరాదేవి
మరోవైపు ఉదయం సర్‌ప్రైజ్ ఏంటని రాజ్ కలవరిస్తాడు. ఇంతలో సడెన్‌గా లేచి వంటింట్లో ఉన్న కావ్య దగ్గరికి వెళ్లి అడుగుతాడు. మీరు రాత్రంతా దాని గురించే ఆలోచించారు కదా అని కావ్య అంటుంటే ఇందిరాదేవి వస్తుంది. నువ్వేంటీ కావ్య ఇంకా ఇలాగే ఉన్నావ్. సర్‌ప్రైజ్ ఉందిగా. వెళ్లి రెడీకా అని ఇందిరాదేవి అంటుంది. దాంతో వెళ్లిపోతుంది కావ్య. ఏంటా సర్‌ప్రైజ్ అని ఇందిరాదేవిని అడుగుతాడు రాజ్. నిన్ననే చెప్పింది. సర్‌ప్రైజేరా. అలాగే చెప్పింది అని ఇందిరాదేవి అంటుంది. దాంతో అయోయమంగా రాజ్ కూడా వెళ్లిపోతాడు.
మళ్లీ కావ్య దగ్గరికి వెళ్లిన రాజ్ ఏంటీ మళ్లీ అప్పలమ్మలా రెడీ అయ్యావ్ అని రాజ్ అడిగితే.. అలా అనకండి ఇలా కూడా నన్ను ఇష్టపడేవాళ్లు ఉన్నారు అని కావ్య అంటుంది. ఎవరా అంధులు అని రాజ్ అడుగుతాడు. అదే సర్‌ప్రైజ్. సరే ఎయిర్ పోర్ట్‌కు వెళ్లాలి అని కావ్య అంటే.. అదేం ఎర్రబస్సు కాదు. చాలా కాస్ట్‌లీ, ముందుగా టికెట్ బుక్ చేసుకోవాలి. అయినా ఏయిర్ పోర్ట్‌కు ఎందుకు ఎవరొస్తున్నారు అని రాజ్ అడుగుతాడు. అది.. అంటూ సిగ్గుపడిన కావ్య మా బావ వస్తున్నాడు అని చెబుతుంది.
దురదృష్టవశాత్తు మీతో పెళ్లి
మా బావ.. చాలా పొడుగ్గా. ఎర్రగా బుర్రగా ఉంటాడు. అమెరికా నుంచి వస్తున్నాడు. అక్కడ బిజినెస్ చేస్తున్నాడు అని కావ్య అంటే.. దానికే ఇంతలా పరవశించిపోవాలా అని ఉడుక్కుంటాడు రాజ్. దీనికి ఒక కారణం ఉంది. మా బావ నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఫారెన్‌కి కూడా తీసుకుపోవాలని అనుకున్నాడు. కానీ, దురదృష్టవశాత్తు మీతో పెళ్లి అయింది. ఇదివరకు మీరే అన్నారు గా, నాతో మీకు దురదృష్టవశాత్తు పెళ్లి అయిందని అని కావ్య అంటుంది.
అనంతరం వెళ్లిపోతున్న కావ్యను మీ బావ పేరు ఏంటీ అని అడిగితే.. బావే అని చెప్పి వెళ్లిపోతుంది. ఇదా సర్‌ప్రైజ్.. అయినా తను వస్తే నాకెందుకు. ఏదో వాళ్లు బావా మరదల్లు అని అనుకుంటాడు రాజ్. మరోవైపు ఆఫీస్‌కు రెడీ అవుతున్న కల్యాణ్‌తో ఇవాళ ప్లాన్ మారింది అని అనామిక అంటుంది. ఓకే అర్థమైంది.. ఇవాళ అంతా రెస్ట్. బెడ్ రూమ్ తలుపులకు తాళం వేద్దామా అని శోభనం జరుగుతుందన్న ఇంటెన్షన్‌లో అంటాడు కల్యాణ్. ఛీ.. ఛీ.. అది కాదు అని అనామిక అంటుంది.
క్రెడిట్ కార్డ్స్ మరిచిపోయేవాన్ని
మనం ఇప్పుడు షాపింగ్‌కు వెళ్తున్నాం అని అనామిక అంటుంది. సరే ఉండు క్రెడిట్ కార్డ్స్ తీసుకొస్తా. ఇన్నాళ్లు పెద్దమ్మ చూసుకునేది. ఇప్పుడు కావ్య వదినా చూసుకుంటుంది అని కల్యాణ్ అంటాడు. దాంతో కోపగించుకున్న అనామిక అంటే నీ దగ్గర డబ్బు ఉండదా అంటుంది. ఒకప్పుడు ఉండేది. నేను డబ్బుకు అంతా వాల్వ్యూ ఇచ్చేవాన్ని కాదు. కవితలు రాస్తూ క్రెడిట్ కార్డ్స్ మరిచిపోయేవాన్ని. దాంతో నా దగ్గర క్రెడిట్స్ వద్దని అన్నారు అని కల్యాణ్ అంటాడు. అంటే ఇప్పుడు కావ్యను అడుక్కోవాలా అని అనామిక అంటుంది.
అడుక్కోవడం ఏంటీ వదినా అంటే అమ్మే కదా. అమ్మ దగ్గర అడగడానికి నామోషి ఏంటీ అని కల్యాణ్ అంటాడు. మీకు ఉండకపోవచ్చు. మీ పెళ్లాంగా నాకు ఉంటుంది అని అనామిక అంటుంది. ఇప్పుడు షాపింగ్‌కు వెళ్లాల వద్దా అని కల్యాణ్ అంటాడు. కావ్యను అడిగి వెళ్లడం అయితే వద్దని కోపంగా వెళ్లిపోతుంది అనామిక. వెళ్లి ధాన్యలక్ష్మీతో పరువు పోయేలా ఉంది. నేను ఈ ఇంటి కోడలినే కదా. కావ్యకన్నా నాకు ఎక్కువ అధికారాలు ఉన్నాయి కదా. ఏం కావాలన్న ఆ కావ్య దగ్గరికి వెళ్లి చేయి చాచి అడగాలా అత్తయ్య అంటుంది అనామిక. దాంతో ఆలోచనలో పడిపోతుంది ధాన్యలక్ష్మీ.