RGV: రామ్ గోపాల్ వర్మతో రష్మిక మందన్నా? పవన్ కల్యాణ్‌ను ట్యాగ్ చేసి మరి పోజు.. ఒక్కసారిగా షాక్!-ram gopal varma rashmika mandanna photo fans shocked rgv with masoom shankar celebrating vyooham release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rgv: రామ్ గోపాల్ వర్మతో రష్మిక మందన్నా? పవన్ కల్యాణ్‌ను ట్యాగ్ చేసి మరి పోజు.. ఒక్కసారిగా షాక్!

RGV: రామ్ గోపాల్ వర్మతో రష్మిక మందన్నా? పవన్ కల్యాణ్‌ను ట్యాగ్ చేసి మరి పోజు.. ఒక్కసారిగా షాక్!

Sanjiv Kumar HT Telugu
Feb 09, 2024 01:52 PM IST

Ram Gopal Varma Rashmika Mandanna: సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వ్యూహం రిలీజ్ డేట్ సంతోషంలో ఉన్నాడు. ఈ సందర్బంగా ఆర్జీవీ ఓ ఫొటో షేర్ చేశాడు. అందులో ఉన్న బ్యూటిఫుల్ హీరోయిన్‌ను చూసి నెటిజన్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ ఫొటోకి పవన్ కల్యాణ్‌ను ట్యాగ్ చేయడం మరో విశేషం.

రామ్ గోపాల్ వర్మతో రష్మిక మందన్నా? పవన్ కల్యాణ్‌ను ట్యాగ్ చేసి మరి పోజు.. ఒక్కసారిగా షాక్!
రామ్ గోపాల్ వర్మతో రష్మిక మందన్నా? పవన్ కల్యాణ్‌ను ట్యాగ్ చేసి మరి పోజు.. ఒక్కసారిగా షాక్!

RGV With Rashmika Mandanna: కాంట్రవర్సీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. తాజాగా ఆయన తెరకెక్కించిన మరో పొలిటికల్ చిత్రం వ్యూహం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా, వాటిని ప్రతిబింబించేలా వ్యూహం సినిమాను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వ్యూహం టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచాయి. ఇది పూర్తిగా పొలిటికల్ చిత్రంగా ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.

వ్యూహం చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ బ్యానర్‌లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన వ్యూహం మూవీలో వైఎస్ జగన్ పాత్రను ప్రముఖ నటుడు అజ్మల్ పోషించాడు. వైఎస్ భారతి పాత్రలో మానస రాధాక్రిష్ణర్ కనిపించనుంది. ఈ ఇద్దరితోపాటు వ్యూహం మూవీలో రేఖ నిరోష, సురభి ప్రభావతి, ధనుంజయ్ ప్రభునే, వాసు ఇంటూరి, ఎలెనా టుటేజ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అయితే వ్యూహం సినిమా గతేడాది డిసెంబర్ 29న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కావాల్సింది. కానీ, పలు కారణాల వల్ల వ్యూహం రిలీజ్ డేట్‌పై కోర్టులో కేసు ఫైల్ అయింది. పలు వాయిదాల అనంతరం వ్యూహం విడుదలకు కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రామ్ గోపాల్ వర్మ ఫుల్ ఖుషీలో ఉన్నాడు. వ్యూహం మూవీకి క్లియరెన్స్ వచ్చిందన్న ఆనందంలో పబ్‌లో రాత్రంతా ఎంజాయ్ చేశాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

"మేము వ్యూహం రిలీజ్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం" అంటూ ఓ అమ్మాయితో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. అంతేకాకుండా దానికి నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ అంటూ వాళ్లను ట్యాగ్ చేశాడు. అయితే, ఆ ఫొటో చూసిన నెటిజన్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ ఫొటోలో రామ్ గోపాల్ వర్మతో ఉన్న అమ్మాయి అచ్చం నేషనల్ క్రష్ రష్మిక మందన్నాలాగే ఉంది.

ఆ ఫొటోలో ఆర్జీవీతో చాలా క్లోజ్‌గా ఉన్న ఆ అమ్మాయి కనిపించిన తీరు, పెట్టిన పోజు సేమ్ రష్మిక మందన్నాలాగే ఉండటంతో అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఒక్కసారి రష్మిక మందన్నా అనుకున్నాం కదా అంటూ కామెంట్స్ సైతం చేశారు. అంతేకాకుండా ఈ ఫొటోపై మీమ్స్ కూడా మొదలుపెట్టేశారు. దీంతో ఆ అమ్మాయి ఎవరా అని ఆరా తీయడం స్టార్ట్ చేశారు నెటిజన్స్. అయితే ఆర్జీవీతో పాటు ఆ ఫొటోలో ఉన్న అమ్మాయి పేరు మసూమ్ శంకర్ Masoom Shankar.

RGV Masoom Shankar: మసూమ్ శంకర్ ఒక ఇండియన్ మోడల్ అండ్ నటి. కానీ, మొదట ఆమె తమిళ ఇండస్ట్రీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మసూమ్ శంకర్ ముందుగా 2018లో నగేష్ తిరైయారంగమ్ మూవీతో డెబ్యూ ఎంట్రీ ఇచ్చింది. అనంతరం 2019లో తెలుగులో 90ఎమ్ఎల్ సినిమాలో నటించింది. తర్వాత టెడ్డీ, పాయనిగల్ గవానిక్కవుమ్, డీడీ రిటర్న్స్ సినిమాల్లో నటించింది మసూమ్ శంకర్. మరి ఆమెకు ఆర్జీవీకి ఉన్న కనెక్షన్ ఎంటో తెలియదు గానీ, లేటెస్ట్‌గా అతనితో ఇలా క్లోజ్‌గా కనిపించి షాక్ ఇచ్చింది మసూమ్ శంకర్. కాగా వ్యూహం సినిమా ఫిబ్రవరి 23న విడుదల కానుంది.

WhatsApp channel