Brahmamudi February 6th Episode: పోలీస్ అవుతానన్న అప్పు.. కావ్యను కలిసిన శ్వేత భర్త.. విరుచుకుపడిన కళావతి.. పాపం!-brahmamudi serial february 6th episode kavya warning to swetha husband and appu wants to become a police ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi February 6th Episode: పోలీస్ అవుతానన్న అప్పు.. కావ్యను కలిసిన శ్వేత భర్త.. విరుచుకుపడిన కళావతి.. పాపం!

Brahmamudi February 6th Episode: పోలీస్ అవుతానన్న అప్పు.. కావ్యను కలిసిన శ్వేత భర్త.. విరుచుకుపడిన కళావతి.. పాపం!

Sanjiv Kumar HT Telugu
Feb 06, 2024 08:10 AM IST

Brahmamudi Serial February 6th Episode: బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 6వ తేది ఎపిసోడ్‌‌లో కావ్యను శ్వేత భర్త కలుస్తాడు. కానీ, అతనిపై కావ్య విరుచుకుపడుతుంది. మరోవైపు పోలీస్ కావాలని ఉందని కనకం, కృష్ణమూర్తికి అప్పు చెబుతుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 6వ తేది ఎపిసోడ్‌‌
బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 6వ తేది ఎపిసోడ్‌‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో రాజ్, శ్వేత గొడవపడుతుంటారు. కావ్య మనల్ని తప్పుగా అర్థం చేసుకుందంటే నేను తట్టుకోలేకపోతున్నాను. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వస్తే ఎలా ఉంటుందో అనడానికి నేనే ఉదాహరణ. నా జీవితం ఎలా అయిందో చూశావ్‌గా అని శ్వేత అంటుంది. శ్వేత అని అరుస్తూ కుర్చీలోనుంచి లేచిన రాజ్ నీది వేరు ఇది వేరు అని అంటాడు. నాకు తనంటే ఇష్టం లేదు. అందుకే విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను అని రాజ్ అంటాడు.

ఒక్క కారణం లేకుండా

దానికి షటప్ రాజ్.. అలా అయితే నీకు నా భర్తకు తేడా ఏముంది. వాడు పైకి కనిపిస్తాడు. నువ్ పైకి కనిపించకుండా వదిలించుకుందామనుకుంటున్నావ్ అంతేగా. అసలు కావ్యకు విడాకులు ఇవ్వడానికి ఒక్క కారణం చెప్పు. పని రాదా, ఇంట్లోవాళ్లను గౌరవంగా చూసుకోవట్లేదా.. నీకు భర్తగా గౌరవం ఇవ్వట్లేదా అని శ్వేత అడుగుతుంది. అలాంటిదేం లేదని రాజ్ అంటాడు. మరి ఒక్క కారణం కూడా లేకుండా విడిపోతానంటావేంటీ. అసలు నీతో నన్ను చూసినందుకు తను ఇవ్వాలి విడాకులు అని శ్వేత అంటుంది.

నేను నీతో ఉన్నందుకు ఆక్రోశంతో ఊగిపోతుందే తప్పా.. నిన్ను కాదనుకోవడం లేదు. వదిలించుకోవాలని అనుకోవడం లేదు. నేను ఇప్పుడే ఈ అపార్థాలను తొలగించి. మన మధ్య ఉన్నది స్నేహమే అని చెబుతాను అని చెప్పేందుకు బయలుదేరుతుంది శ్వేత. కానీ రాజ్ వచ్చి ఆపుతాడు. మరోవైపు కోపంతో ఊగిపోతుంది కావ్య. ఏదో ఒకటి చేయాలి అని కల్యాణ్‌కు కాల్ చేస్తుంది కావ్య. ఆ గెటప్‌లో మిమ్మల్ని చూసి అన్నయ్య ఫిదా అయ్యాడా అని కల్యాణ్ అడిగితే.. హా వచ్చి నన్ను గింగిరాలు తిప్పాడు అని వెటకారంగా సమాధానం ఇస్తుంది కావ్య.

సలసల మండిపోతుంది

నా ఒళ్లు సలసల మండిపోతుందని కావ్య అంటే ఎందుకు శ్వేత అక్కడే ఉందా అని కల్యాణ్ అంటాడు. పక్కనే ఉంది.. అదే ఇక్కడే ఉంది. ఉండండి వాళ్లు ఏం చేస్తున్నారో చూసొస్తా అని వెళ్తుంది కావ్య. మరోవైపు శ్వేతను ఆఫీస్ బయటకు తీసుకెళ్తాడు రాజ్. తను వద్దనడానికి ఒక్క కారణం కూడా చెప్పట్లేదు. మీ మధ్య ఉన్నది దూరం అంతే. దానికే విడిపోవాలా. నా జీవితం కాపాడటానికి వచ్చిన నీకు నేను సమస్య కాకూడదు. నా వల్ల మీరు విడిపోవడం అంటే నేను ఎలా ఊరుకుంటాను అని శ్వేత అంటుంది.

నాకు తనతో ఉండటం ఇష్టం లేదు. నేను విడిపోడానికి కారణం వెతుకున్నాను. ఇప్పుడు మనిద్దరిని చూసింది. ఇప్పుడు నాకు సులభం అవుతుంది అని రాజ్ అంటే.. నాకు, నీకు క్యారెక్టర్ లేదనుకుంటే ఎంత అవమానంగా ఉంటుందో ఆలోచించావా. కావ్య చాలా మంచి అమ్మాయి. నేను నీతో ఉంటే తను తట్టుకోలేకపోయింది. నీ మీద ఎంత ప్రేమ ఉంటే అలా ఉంటుంది అని శ్వేత అంటుంది. నేను పెళ్లి అయినప్పుడే ఫిక్స్ అయ్యాను. తను నాకు కరెక్ట్ కాదు. తనను ఇంట్లో ఉంచి ఇంకా బాధపెట్టలేను అని రాజ్ అంటాడు.

కావాలనే పొగరుగా

నీ ఆలోచనలోనే తప్పు ఉంది రాజ్ అని శ్వేత అంటుంది. ఇంతలో కావ్య వచ్చి చూస్తుంది. అది రాజ్ చూస్తాడు. కావ్యను చూసి రాజ్ నవ్వుతూ కావాలనే శ్వేతతో ప్రేమగా ఉన్నట్లు నటిస్తాడు. నీకు నవ్వులాటగా ఉందా అని శ్వేత అంటే.. అదేం ఆలోచించకు.. ఇప్పుడు వెళ్లు అని భుజంపై చేయి వేసి మరి కారు ఎక్కిస్తాడు రాజ్. అది చూసి కావ్య చాలా బాధపడుతుంది. ఇక రాజ్ కావాలనే పొగరుగా తనను చూసుకుంటూ వెళ్లిపోతాడు. మరోవైపు అప్పుకి పెళ్లి సంబంధం వస్తుంది.

అప్పుని పిజ్జా డెలివరీ ఇచ్చేటప్పుడు చూసి మావాడు ఇష్టపడ్డాడు. అందుకే నేరుగా వచ్చాం. మా అబ్బాయి సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్. నెలకు 50 వేలు, ఇల్లు కూడా ఉంది. అమ్మాయి గురించి అంతా తెలుసుకుని వచ్చాం. ఎవరినో ప్రేమించిందని తెలిసింది. కానీ, అతనికి పెళ్లి అయిపోయిందట కదా. ఈరోజుల్లో ఇవన్ని పట్టించుకుంటే ఎలా అని అబ్బాయి తల్లి అంటుంది. ఇంతలో అప్పు వచ్చి ఏం జరుగుతుందని అంటుంది. చెప్తా పదా అని లోపలికి తీసుకెళ్తుంది. కనకం ఎంత నజ్జజెప్పిన అప్పు ఒప్పుకోదు. నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు అని అప్పు అంటుంది.

పెళ్లి ఎందుకు వద్దు

వాళ్ల దగ్గరికి వెళ్లిన అప్పు ఇప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలని లేదు అని అంటుంది. దాంతో అమ్మాయికి ఇష్టం లేనప్పుడు ఏం చేయలేం కదా. మనసు మారితే మాకు ఫోన్ చేయండి అని వెళ్లిపోతారు పెళ్లి సంబంధం వాళ్లు. దాంతో అప్పుపై ఫైర్ అవుతుంది కనకం. అప్పుని కొట్టబోతుంటే.. కృష్ణమూర్తి ఆపుతాడు. ఇష్టంలేనప్పుడు ఏం చేయలేప్పుడు ఏం చేయలేం కదా అని కృష్ణమూర్తి అంటాడు. నీకు పెళ్లి ఎందుకు వద్దు ఏం చేయాలనికుంటున్నావ్ అని కనకం అడిగితే.. ఇది నా జిందగీ.. జిందగీలో మస్త్ ఉన్నాయ్ అని అప్పు అంటుంది.

ఏముంది నీ జిందగీలో చెప్పు అని గట్టిగా నిలదీస్తుంది కనకం. దాంతో నేను పోలీస్ అవ్వాలనుకుంటున్నాను. ఎప్పటి నుంచో అనుకున్నాను. కానీ, ఇప్పుడు చెప్పాను అని అప్పు అంటుంది. దాంతో కనకం, కృష్ణమూర్తి ఆశ్చర్యపోతారు. మరోవైపు కారులో వెళ్తున్న కావ్య భర్త రాజ్, శ్వేత గురించి ఆలోచిస్తుంటుంది. ఇంతలో తన కారుకు ఎదురుగా శ్వేత భర్త వచ్చి కారు ఆపుతాడు. దాంతో అతనిపై ఫైర్ అవుతుంది కావ్య. కావ్య మాటలు తట్టుకోలేక నీకు ఫొటోలు పంపింది నేనే అని చెబుతాడు.

అనుమానం తింటున్నావా?

నేను శ్వేత భర్తను అని అతను చెబితే.. సిగ్గుందా, బుద్ధుందా. నీ పెళ్లాం ఎవరితోనే తిరిగితే కంట్రోల్ చేయడం మానేసి క్యాండిడ్ ఫొటోలు తీసుకుంటూ ఉన్నావా అని కావ్య అంటుంది. నీ మొగుడు నీకు, నా భార్య నాకు విడాకులు ఇచ్చి వాళ్లిద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు అని అతను అంటాడు. దాంతో కావ్య షాక్ అవుతుంది. ఏరా నువ్ అన్నం తింటున్నావా. అనుమానం తింటున్నావా. పెళ్లాన్ని అదుపులో పెట్టుకోని వాన్ని మా ఏరియాలో ఏమంటారో తెలుసా చవట, దద్దమ్మ, వాజమ్మ అని కావ్య తిట్లు తిడుతూనే ఉంటుంది.

హే ఆపు అని అతను అంటే.. ఏంట్రా ఆపేది.. ఆ గుండోడిని చూశావా అని డ్రైవర్‌ను చూపించి.. వాడో పెద్ద బండోడు.. గుండుతోనే గుద్ది చంపుతాడు. పెళ్లాం ఎవడితో మాట్లాడుతుందో కనిపెట్టాలు. గడపదాటకుండా కాపలా ఉండాలి. ఇదంతా మానేసి ఇప్పుడు తాపీగా ఇది చెబుతున్నావా. నీకు నచ్చినట్లు ఊహించుకుంటావా. నా భర్తను ఇంకోసారి ఏమైనా అంటే ఊరుకోను. నువ్ చేసిన దానికి మమ్మల్ని బాధ్యులను చేస్తావా. ఇంకోసారి ఇలా కారుకు అడ్డం వస్తే కారుతోనే గుద్దిస్తాను అని వెళ్లిపోతుంది కావ్య.

ఇదెక్కడి ఆడదిరా బాబు

దాంతో షాక్ అయిన శ్వేత భర్త.. ఇదెక్కడి ఆడదిరా బాబు. నా పెళ్లాం కొడితే కొట్టించుకుంది. తిడితే పడింది కానీ నన్ను ఒక్క మాట అనలేదు. ఇటునుంచి నరుకొద్దాం అనుకుంటే ఇలా అయింది. ఇందుకేనేమో ఆ దరిద్రుడు నా పెళ్లాం వెంట పడ్డాడు అని శ్వేత భర్త అనుకుంటాడు. తర్వాతి ఎపిసోడ్‌లో రాత్రిపూట నేను మాట్లాడుతుంటే లైట్ ఆఫ్ చేస్తావేంటీ అని రాజ్ అంటాడు.

నాకు లైట్ ఉంటే నిద్ర రాదని కావ్య అంటుంది. నాకు నువ్వుంటే మాట్లాడలనే మూడ్ రాదు. నన్ను ఏడిపిస్తున్నావా అని రాజ్ అంటాడు. అది చేస్తుంది మీరు అని అటువైపు తిరిగి కన్నీళ్లు పెట్టుకుంటుంది కావ్య. త్వరలోనే నీకు పూర్తి క్లారిటీ వస్తుంది. అప్పుడు కూడా ఇంత కాన్ఫిడెంట్‌గా ఎలా ఉంటావో చూస్తా అని రాజ్ అనుకుంటాడు.

Whats_app_banner