Brahmamudi January 12th Episode: అప్పు కోసం పూజ వదిలేసిన కల్యాణ్.. కావ్యపై ధాన్యలక్ష్మి తిట్లదండకం.. పాపం అనామిక-brahmamudi serial january 12th episode kalyan gives blood to appu for save life ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi January 12th Episode: అప్పు కోసం పూజ వదిలేసిన కల్యాణ్.. కావ్యపై ధాన్యలక్ష్మి తిట్లదండకం.. పాపం అనామిక

Brahmamudi January 12th Episode: అప్పు కోసం పూజ వదిలేసిన కల్యాణ్.. కావ్యపై ధాన్యలక్ష్మి తిట్లదండకం.. పాపం అనామిక

Sanjiv Kumar HT Telugu
Jan 12, 2024 08:35 AM IST

Brahmamudi Serial January 12th Episode: బ్రహ్మముడి సీరియల్ జనవరి 12వ తేది ఎపిసోడ్‌‌లో అప్పుకు బ్లడ్ కావాలని రాజ్‌కు కాల్ చేస్తుంది కావ్య. ఆ ఫోన్ తీసుకుని విన్న కల్యాణ్ బ్లడ్ ఇవ్వడానికి హాస్పిటల్‌కు వెళ్తాడు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ జనవరి 12వ తేది ఎపిసోడ్‌‌
బ్రహ్మముడి సీరియల్ జనవరి 12వ తేది ఎపిసోడ్‌‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో కావ్య వెళ్లాలనకుంటే మీతోపాటు ఇక్కడ అందరికీ చెప్పి వెళ్లొచ్చు కదా అని రాజ్‌ను అనామిక అంటుంది. భర్తకు చెబితే అందరికీ చెప్పినట్లే. నీకు ఏదైనా ఉంటే నీ భర్తతో మాట్లాడుకో. అంతే గానీ, రాజ్ నీకు బావ. తనను అనే అర్హత నీకు లేదు అని ఇందిరాదేవి అంటుంది. ఇలా అందరి నోళ్లు మూయించకండి అత్తయ్య. ఇలా చేయడంతోనే కావ్య కళ్లు నెత్తిమీదకు వెళ్తున్నాయని ధాన్యలక్ష్మీ అంటుంది.

పూజకంటే పని ఏముంది

అవును అమ్మా. కావ్య కావాలనే వెళ్లింది. తనకు ఈ పూజ ఇష్టం లేదు. తనకు ద్వేషం, ఈర్శ్యతోనే వెళ్లిపోయింది అని రుద్రాణి అంటుంది. అత్తా.. నిజనిజాలు తెలియకుండా అనొద్దు. బలమైన కారణం ఉండే వెళ్లిపోయిందని రాజ్ అంటాడు. అంత బలమైన కారణం ఏంటీ రాజ్. ఇప్పటివరకు నీ భార్యను బాగానే వెనుకేసుకొచ్చావ్. కానీ, పూజకంటే అత్యవసర పని ఏముందని రుద్రాణి అడుగుతుంది. అత్తా.. నిజంగా అత్యవసర పరిస్థితి ఉంది కాబట్టే వెళ్లింది అని రాజ్ అంటాడు. ఏమైంది అన్నయ్య అని కల్యాణ్ అడుగుతాడు.

దాంతో రాజ్ సైలెంట్‌గా ఉంటాడు. రాజ్ ఎందుకు వెళ్లిందో చెప్పు. లేకుంటే తలొకరు నింద వేసేలా ఉన్నారు అని సుభాష్ అంటాడు. కావ్యను ఒక్క మాట అనడం నాకు ఇష్టం లేదు. చెప్పు అని ఇందిరాదేవి అంటుంది. దాంతో అప్పుకు యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్‌లో చేర్పించారు. అందుకే వెళ్లిపోయింది అని రాజ్ అంటాడు. ఏంటీ అన్నయ్యా చెప్పేది. అప్పుకు యాక్సిడెంట్ అయిందా అని కల్యాణ్ అంటాడు. ఇప్పుడు అర్థమైందా కావ్య ఎందుకు వెళ్లిందో అని అంటాడు.

సీరియస్ అయితే

తనతో పూజలో కూర్చోవడం ఇష్టం లేదని ఒకరు. తను కావాలనే బయటకు వెళ్లిందని మరొకరు నానా మాటలు అన్నారు. చెబితే పూజ ఎక్కడ ఆగిపోద్దో అని ఒంటరిగా ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది అని రాజ్ అంటాడు. అన్నయ్య.. అప్పుకు యాక్సిడెంట్ అయితే నేను ఇక్కడే ఎందుకు ఉంటాను. నేను కూడా వెళ్తాను అని కల్యాణ్ అంటాడు. లేదు పూజా ఆగిపోవద్దనే కావ్య వెళ్లింది. సీరియస్ అయితే కాల్ చేస్తుంది. నువ్ పూజలో కూర్చో అని రాజ్ అంటాడు.

ఇంత జరుగుతున్న అయ్యో అనవేంటీ. మీ తల్లికొడుకులకు నోరు పారేసుకోవడం తప్పా పాపం అనడం ఎక్కడవ వచ్చు అని స్వప్న అంటుంది. నీకు చెల్లే కదా మరి నువ్ కూడా వెళ్లు అని రాహుల్ అంటాడు. వెళ్లు అంటున్నావ్ కానీ, పంపిస్తాను అనట్లేదు. ఆటోకు డబ్పులు కూడా ఇవ్వని గతి నీది అని స్వప్న అంటుంది. ఎక్కువ మాట్లడకు.

కళ్లు చల్లబడ్డాయా

డబ్బులు ఇస్తాను వెళ్లు అని రాహుల్ అంటే.. లేదు వెళ్లను. కావ్య వెళితేనే ఇన్ని మాటలు అన్నారు. నేను వెళితే మా కుటుంబంపై దుమ్మెత్తిపోస్తారు. వెళ్లను పూజలో కూర్చోను. తనకు యాక్సిడెంట్ అయితే నేను సంతోషంగా పూజలో ఎలా కూర్చుంటాను. కల్యాణ్ నువ్ అనామిక కూర్చోండి. లేకుంటే నీ భార్య పుట్టింటికి పోతానని అన్నా అంటుంది అని స్వప్న అంటుంది. అందరి కళ్లు చల్లబడ్డాయా.. కావ్యను ఎన్నెన్ని మాటలు అన్నారు. కల్యాణ్ నువ్ పూజలో కూర్చో అని సుభాష్ అంటాడు.

అవసరం అయితే కావ్య కాల్ చేస్తుంది. నువ్ కూర్చో అని ఇందిరాదేవి అంటుంది. దాంతో కల్యాణ్ పూజలో కూర్చుంటాడు. మరోవైపు బ్లడ్ బ్యాంక్స్‌కు కావ్య కాల్ చేసి బ్లడ్ కోసం ట్రై చేస్తుంటుంది. ఇంతలో డాక్టర్ వచ్చి డోనర్ దొరికారా అంటే అదే ట్రై చేస్తున్నానని కావ్య అంటుంది. ఇంకా లేదా.. చాలా సీరియస్‌గా ఉంది. పరిస్థితి మీకు అర్థం కావట్లేదు. టైమ్‌కు రక్తం ఇవ్వకుంటే కోమాలోకి వెళ్లే అవకాశం ఉందని డాక్టర్ చెప్పి వెళ్లిపోతుంది.

నేను ట్రై చేశాను

ఈ పరిస్థితుల్లో అల్లుడు గారే కాపాడగలరు. ఒక్కసారి కాల్ చేయమ్మా అని కనకం అంటుంది. దాంతో కావ్య కాల్ చేస్తుంది. రాజ్‌కు ఫోన్ వస్తే.. ఎవరన్నయ్యా వదిననా.. అని లేచి ఫోన్ తీసుకుంటాడు కల్యాణ్. ఏవండి అప్పుకు చాలా సీరియస్‌గా ఉంది. రక్తం కావాలంటున్నారు. లేకుంటే కోమాలోకి వెళ్తుందని అంటున్నారు. నేను చాలా బ్లడ్ బ్యాంకుల్లో ట్రై చేశాను. కానీ దొరకట్లేదు. మీకు ఎవరైనా ఓ నెగెటివ్ బ్లడ్ ఉన్నవారు తెలిస్తే పంపిస్తారా అని కావ్య ఏడుస్తూ చెబుతుంది.

దానికి వదినా.. అప్పుకు సీరియస్‌గా ఉంటే ఇప్పుడా చెప్పేది. నాది ఓ నెగెటివే నేను వస్తున్నాను అని కల్యాణ్ అంటాడు. కవిగారు మీరా.. మీరు పూజలో ఉండండి. మీ అన్నయ్యకు ఇవ్వండి అని కావ్య అంటుంది. లేదు వదినా నేను వస్తున్నాను అని కల్యాణ్ కాల్ కట్ చేసి కావ్య చెప్పింది చెబుతాడు. నేను వెళ్తున్నాను అని కల్యాణ్ అంటే.. నేను చూసుకుంటానురా.. నువ్ ఉండు అని రాజ్ అంటాడు. నువ్వెళ్లి ఏం చేస్తావ్ అన్నయ్య.. రక్తం ఇవ్వాల్సింది నేను అని కల్యాణ్ అంటాడు.

సారీ అనామిక

నేను ఇప్పటివరకు ఆగింది అనామిక ఫీల్ అవుతుందనే. ఎవరు ఏమనుకున్నా సరే అప్పు నా ఫ్రెండ్. నా ఫ్రెండ్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని కల్యాణ్ అంటాడు. పూజ మధ్యలో వెళితే అపచారం అని ధాన్యలక్ష్మీ అంటే.. ప్రాణం కాపాడటం కోసం వెళితే దేవుడు శిక్షించడులే. క్షమిస్తాడు. నువ్ వెళ్లురా అని ప్రకాషం అంటాడు. దాంతో సారీ అనామిక అని చెప్పేసి వెళ్లిపోతాడు కల్యాణ్. ఇప్పుడు అర్థమైందా అత్తయ్య అని ధాన్యలక్ష్మీ అంటుంది.

బాగా అర్థమైంది. ఈ ఇంట్లో మానవత్వం మచ్చుకు కూడా లేదని అర్థమైంది అని ఇందిరాదేవి అంటుంది. ఇంటి కోడలికి ఆపద వస్తే.. ఎవరం ఏం చేయలేకపోయాం. వాడు బంధువులా కాదు. ఆత్మ బంధువులా వెళ్లాడు. ప్రాణం కాపాడేందుకు వెళ్లాడు. ఇందులో ఎవరి ఇష్ట అయిష్టాలతో సంబంధం లేదు అని సుభాష్ అంటాడు. హాస్పిటల్‌కు వెళ్లిన కల్యాణ్ అప్పుకు బ్లడ్ ఇస్తాడు. మీరు అప్పుని కాపాడటానికి మీరు వచ్చినందుకు సంతోషపడాలో.. అనామికను బాధ పెడుతున్నందుకు బాధపడాలో తెలియట్లేదని కావ్య అంటుంది.

కావాలని చేసినట్లు

దేవుడు ఎక్కడికి పోడు. పూజ తర్వాత కూడా చేసుకోవచ్చు. కానీ, అప్పు పరిస్థితి వేరు అని కల్యాణ్ అంటాడు. తర్వాత త్వరగా లేచి రా అప్పు. నువ్ తిట్టకుంటే నాకు రోజు గడవదు అని కల్యాణ్ అంటాడు. మరోవైపు పాపం అనామిక అనామకురాలు అయింది. కావ్యను అంటే అందరూ పైకి లేస్తారు. అప్పుకు యాక్సిడెంట్ అవ్వడం, కావ్య వెళ్లడం.. కల్యాణ్‌కు కాల్ చేసి రప్పించడం. ఇదంతా ఎంతో కావ్యంగా లిఖించినట్లు లేదా. మీకు అర్థం కావట్లేదా అని రుద్రాణి పుల్ల వేస్తుంది.

అర్థమైంది. ఇన్నాళ్లు మన కళ్లకు గంతలు కట్టి ఎన్ని గంతులు వేసింది అని ధాన్యలక్ష్మీ అంటుంది. నేను మొదటి నుంచే మొత్తుకుంటున్నాను. మీ దాకా వస్తేకానీ అర్థం కాలేదని అపర్ణ అంటుంది. మేక వన్నే పులికి ఫొటో తీస్తే ఇలాగే ఉంటుందేమో అని రుద్రాణి అంటే.. మరి మీ ఫొటో తీస్తే ఎలా ఉంటుంది. వద్దులే చెబితే చాలా చెండాలంగా ఉంటుందని స్వప్న అంటుంది. మీరంతా ఎందుకు అంటున్నారు. కావ్య నాకే కదా కాల్ చేసింది. కల్యాణే లాగేసుకుని మాట్లాడాడు. రేర్ బ్లడ్ గ్రూప్ కాబట్టి దొరక్కా నాకు కాల్ చేసింది. వాడు ఇస్తానని వెళ్లాడు. స్పష్టంగా ఉంది కదా. ఎందుకు మాటలు అంటున్నారు అని రాజ్ అంటాడు.

ప్రాణాలు నిలబెట్టారు

వీళ్లు బుద్ధి కుక్క తోక వంకరలాంటిది. ఎంత సరి చేసినా వంకరగానే ఉంటుంది అని సుభాష్ అంటాడు. కరెక్ట్‌గా చెప్పావురా. కల్యాణ్ వెళ్లింది ప్రాణం కాపాడటానికి. వాడికి దేవుడు మరింత ఆయుశ్సు పోస్తాడు. అది మీకు ఎందుకు అర్థం కావడం లేదని ఇందిరాదేవి అంటుంది. తర్వాతి ఎపిసోడ్‌లో కల్యాణ్, కావ్య ఇంటికి వస్తారు. కవిగారు వచ్చి అప్పు ప్రాణాలు నిలబెట్టారు అని కావ్య చెబుతుంది. అనామిక సారి అని కావ్య అంటే.. ఎందుకు సారి. ప్రతిదాంట్లో నువ్ తల పెడతావ్ కదా. దీపపు కుందెను కిందపడేసినప్పుడే అనుకున్నాను. ఈ మహాతల్లి పూజ ఆపేస్తుందని అని ధాన్యలక్ష్మీ మాటలు అంటుంది.

Whats_app_banner