Brahmamudi January 29th Episode: రాజ్‌కు షాక్‌ల మీద షాక్‌లు.. అత్త కారులో ఆఫీస్‌కు కావ్య.. ధాన్యలక్ష్మికి స్వప్న పంచ్‌లు
Brahmamudi Serial January 29th Episode: బ్రహ్మముడి సీరియల్ జనవరి 29వ తేది ఎపిసోడ్‌లో రాజ్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతాయి. కావ్య ఆఫీస్‌కు వెళ్లేందుకు అపర్ణ ఒప్పుకోవడం, ఆఫీస్ వాళ్లు బొకేలతో ఉండటం చూసి రాజ్ దిమ్మతిరిగిపోతుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో కల్యాణ్ లాంటి వాన్ని పెళ్లి చేసుకుని లైఫ్ సెటిల్ చేసుకునే అవకాశం వదిలేసుకుని వచ్చావని అప్పు ఫ్రెండ్ మధు అంటుంది. నేను అలా లైఫ్ సెటిల్ చేసుకోడానికి ప్రేమించలేదు. నిజంగానే ప్రేమించాను అని అప్పు అంటుంది. దానికి అందుకేనా కరెక్ట్ కల్యాణ్ పెళ్లి సమయానికే తెలిసేలా చేశావ్. బాగా ప్లాన్ చేసి పెళ్లి టైమ్‌కు ప్రేమిస్తున్నట్లు తెలిసేలా చేశావ్. అప్పుడే ప్రేమించావన్న సింపతితో పెళ్లి చేసుకుంటావునుకున్నావ్. కానీ, నీ బ్యాడ్ లక్ అలా జరగలేదు అని మధు అంటుంది.
కోపంగా వెళ్లిపోయిన అప్పు
అలా అప్పును అంటూ మధు, ఇంకో ఫ్రెండ్ ఇద్దరు నవ్వుతుంటారు. నువ్ నా ఫ్రెండ్‌వేనా. చిన్నప్పటి నుంచి చూస్తున్నావ్. ఇదేనా అర్థం చేసుకుంది. నీకన్న కల్యాణే నయం. ప్రేమిస్తున్నానని తెలిసి నా పరువు కాపాడాడు. డబ్బు కోసం నేను ప్రేమించలేదు. ఏదో జాబ్ ఇప్పించావని ఊరుకుంటున్నాను. లేకుంటే ఇక్కడ చంపి బొంద పెట్టేదాన్ని అని కోపంగా వెళ్లిపోతుంది అప్పు. అది కాదు అప్పు అంటూ మధు అంటుంది. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో టిఫిన్ కోసం ప్రకాశం ఆకలితో ఎదురుచూస్తుంటాడు.
ఇంతలో బ్రెడ్ టోస్ట్ తీసుకొచ్చి ఇస్తుంది ధాన్యలక్ష్మీ. ఇది ఆరోగ్యానికి మంచిది అని ధాన్యలక్ష్మీ అంటుంది. నాకు ఏమొద్దు. ఆ గడ్డి నువ్వే తిను. నీకే కరెక్ట్. అమ్మా కావ్య నువ్ చేసిన అమృతం లాంటి ఆ పెసరట్టు ఇవ్వమ్మా అని ప్రకాశం అంటాడు. అనామికను నువ్ ఏం తినట్లేదేంటి. అనామికకు కూడా పెసరట్టు వేయమని కావ్యకు చెబుతాడు ప్రకాశం. ఏమొద్దు. అనామిక ఇదే తింటుంది అని ధాన్యలక్ష్మీ అంటే.. బలవంతంగా ఒప్పుకుంటుంది అనామిక. వదినా విషయం చెప్పు అని కల్యాణ్ అంటాడు.
పిచ్చి రాతలు
అత్తయ్య.. మీరు ఒప్పుకుంటే మన ఆఫీస్‌కి డిజైనర్‌గా జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను అని కావ్య అడుగుతుంది. సూపర్ వదినా. వంటింటికే పరిమితం కాకుండా నీ ప్రతిభను ఆఫీస్ దాకా తీసుకెళ్లాలనుకుంటున్నావ్. మంచి ఆలోచన అని కల్యాణ్ పొగుడుతాడు. రేయ్ ఆపుతావా అని ధాన్యలక్ష్మీ అంటే.. ఏంటీ ఆగేది అమ్మా. గదిలో పిచ్చి రాతలు రాసుకుంటున్న నాలోని కవిని గుర్తించి.. వాటిని అచ్చు వేయించి పుస్తకం చేసింది. అది చదివేగా అనామిక నన్ను ప్రేమించింది అని కల్యాణ్ అంటాడు.
నువ్ చెప్పేది నిజమేరా. కానీ, కావ్య ఆఫీస్‌కు వెళ్లకూడదని చెప్పిన వదిననే కావ్య అడుగుతుంది అని రుద్రాణి అంటుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వీళ్ల కుటుంబంలోనే లేదు. మాట తప్పడం, మోసం చేయడం తప్పా వీళ్లకు ఏం చేతన అవుతుందిలే అని ధాన్యలక్ష్మీ అంటుంది. పశువు లక్షణాలు బాగానే బయటపడుతున్నాయని ప్రకాశం అంటాడు. చిన్నత్తయ్య నేను ఆఫీస్‌కు వెళ్తానని చెప్పట్లేదు. అత్తయ్య పర్మిషన్ అడుగుతున్నాను అని కావ్య అంటుంది. చిన్నత్తయ్య అని పిలిచే అర్హత నీకు లేదని ధాన్యలక్ష్మీ అంటుంది.
స్వప్న పంచ్‌లు
అయితే ధాన్యలక్ష్మీ అని పిలవ్వే అని స్వప్న కౌంటర్ వేస్తుంది. ఏంటీ ఎంత ధైర్యం నీకు. నన్నే పేరు పెట్టి పిలవమంటావా అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఏంటీ ఆటలుగా ఉందా మీకు. అత్తయ్య అని పిలిస్తే అర్హత లేదంటున్నారు. పేరు పెట్టి పిలిస్తే.. ధైర్యం అంటున్నారా. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి. ఇందాకా మా వంశం కూడా ఏదో మాట్లాడుతున్నారు. కొంచెం మర్యాదా ఇచ్చిపుచ్చుకోండి అని స్వప్న అందరిముందు ధాన్యలక్ష్మీని కడిగిపారేస్తుంది. దాంతో నువ్ సూపరమ్మా. చాలా లాజిక్‌గా మాట్లాడావ్ అని ప్రకాశం మెచ్చుకుంటాడు.
ఇందులో లాజిక్ ఏం కనిపించింది మీకు. కావ్యను మా అక్క ఆఫీస్‌కు వెళ్లొద్దని ఎప్పుడో చెప్పింది. ఆఫీస్‌కు వెళ్లి రాజ్యమేలుదాం అని చూస్తుంది. ఒక్కసారి వద్దని చెప్పాకా మళ్లీ నిన్ను ఎలా వెళ్లమంటుంది. నీకు వంటిల్లే కరెక్ట్ అని ధాన్యలక్ష్మీ అంటుంది. నా కోడలు ఎక్కడ ఉండాలో డిసైడ్ చేయడానికి నువ్వు ఎవరు. నా కోడలు వండి తగిలేయడానికి వంటమనిషిలా కనిపిస్తోందా. అయినా నువ్ ఏదో ఇంటిని ఏలే మహారాణిలా శాసనాలు మొదలుపెట్టావేంటీ. నీకు నీ కోడలుకు ఇంటి ముందు ముగ్గు వేయడం వచ్చా అని అపర్ణ ఫైర్ అవుతుంది.
ఆఫీస్‌కు వెళ్లు
నా కోడలు వేసిన డిజైన్స్‌కు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ వచ్చింది. ఏవండి కావ్య డిజైన్స్‌కు ఏ కాంట్రాక్ట్ వచ్చిందండని అపర్ణ అడిగితే.. ఫారెన్‌లో ఉండే దేవలయాలకు ఉండే దేవత విగ్రహాలకు ఆర్నమెంట్స్ తయారు చేసే కాంట్రాక్ట్ అని సుభాష్ అంటాడు. కావ్య రుచిగా వండుతుందని వంట చేస్తుంది. అంతేకానీ వంటమనిషిలా చూస్తావేంటీ అని ఇందిరాదేవి అంటుంది. కావ్య నువ్ ఆఫీస్‌కు వెళ్లు. ఏడ్చే వాళ్లు ఏడవని నువ్వు, నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అపర్ణ అంటుంది.
పోయిపోయి ఈ మహాతల్లిపైనే ఏడవాలి అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో ధాన్యలక్ష్మీ అని ఒక్కసారిగా షటప్ అని అరుస్తూ పైకి లేస్తుంది అపర్ణ. ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావేంటీ. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమంటుంది. దాంతో అపర్ణ నువ్ కూర్చోమని సుభాష్ అంటాడు. ధాన్యలక్ష్మీ తినేదగ్గర ఏంటీది. ముందు తిను. అమ్మా కావ్య నువ్ ఆఫీస్‌కు రావొచ్చు. నీకు ఆ హక్కు ఉంది అని సుభాష్ అంటాడు. శుభం ఇవాళ మంచిరోజు కాబట్టి ఆఫీస్‌కు వెళ్లి నీకు నచ్చిన పని చేసుకోమ్మా అని ఇందిరాదేవి అంటుంది. దాంతో కోపంగా ధాన్యలక్ష్మీ వెళ్లిపోతుంది.
శ్వేత వస్తున్నట్లు తెలుస్తుంది
తర్వాత ఏవండి మీ జడ్జిమెంట్ మీద మీకు నమ్మకం ఉందా అని కావ్య అడిగితే.. బోలేడంతా అని రాజ్ అంటాడు. నాకు లేదులేండి అని కావ్య పంచ్ వేస్తుంది. అంటే నా మీద నాకు లేదని తర్వాత కవర్ చేస్తుంది. తర్వాత చీర గురించి జడ్జ్‌మెంట్ గురించి అడుగుతుంది. సరదాగా రాజ్‌తో గొడవ పడుతుంది. తర్వాత ఆఫీస్‌కు వస్తున్నట్లు కావ్య చెబితే రాజ్ అస్సలు నమ్మడు. మా అమ్మకు ఏమైంది. ఇలాంటి వైపరిత్యాన్ని ఎలా ఒప్పుకుంది అని టెన్షన్ పడుతుంటాడు. నేను వస్తే మీకేంటి అడ్డు అని కావ్య అంటే.. శ్వేత రోజు ఆఫీస్‌కు వస్తున్నట్లు తెలుస్తుంది కాబట్టి అని మనసులో అనుకుంటాడు రాజ్.
నేను ఆఫీస్‌కు వెళ్లేందుకు మీ అమ్మగారు ఒప్పుకున్నట్లు మీకు హాల్లో సాక్ష్యం చూపిస్తాను అని కావ్య అంటుంది. రాజ్ హాల్లోకి రాగానే ఒక్కడివే వస్తున్నావ్ కావ్య ఏదని అపర్ణ అడుగుతుంది. ఇంతలో కావ్య వచ్చి రెడీ అయ్యాను అని కావ్య అంటుంది. వంటలాగా ఇలా లేట్ చేస్తే బాగుండదు. ఇలాంటి చీరలే కట్టాలని అపర్ణ అంటుంది. దేవుడుకి దండం పెట్టుకుంటానని కావ్య వెళ్తుంది. ఏంటీ మమ్మీ నువ్ ఎలా ఒప్పుకున్నావని రాజ్ అంటే.. విధివశాత్తు ఒప్పుకోవాల్సింది నాన్నా. గుండె రాయి చేసుకో అని అపర్ణ అంటుంది.
ఒంటరిగా కావ్య
కావ్య వస్తుంది. రాజ్‌ను కదిలించకు. ఏడ్చేసేలా ఉన్నాడని అపర్ణ అంటుంది. అయ్యో ఏమైందని కావ్య అంటుంది. పదా అని రాజ్ అంటాడు. తర్వాత కారులో కావ్యను ఎక్కుంచుకోకుండా రాజ్ ఒక్కడే వెళ్లిపోతాడు. ఎప్పుడు లేనంతగా ఇంతలా ఇరిటేట్ అవుతున్నారంటే.. నా అనుమానమే నిజమా. వీళ్లకు ఆఫీసే వేదిక కానుందా అని కావ్య అనుకుంటుంది. మరోవైపు కల్యాణ్ అనామిక గురించి రాసుకుంటాడు. ఇంతలో అనామిక వస్తే.. అమ్మో అని పక్కకు పెడుతాడు. దాంతో అది చూసి ఇరిటేట్ అయిన అనామిక ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది. తను పట్టనట్లు ఉంటాడు కల్యాణ్.
బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో ఆఫీస్‌కు వెళ్లకుండా అక్కడ ఏం చేస్తున్నావ్ అని అపర్ణ కావ్యను అడుగుతుంది. క్యాబ్ కోసం చూస్తున్నాను అని కావ్య అంటుంది. షేర్ ఆటోలో వెళ్లడం నీకు అలవాటే కదా అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో కావ్య ఈ ఇంటి పెద్ద కోడలు. ఆటోలో వెళ్లాల్సిన కర్మ పట్టలేదు. నా కారు తీసుకుని వెళ్లు అను కారు కీస్ తీసుకుని ఇస్తుంది అపర్ణ. మరోవైపు ఆఫీస్‌లో అంతా బొకేలతో ఉంటారు. అది చూసిన రాజ్ నాకు తెలియకుండా క్లైంట్స్ ఎవరైనా వస్తున్నారా అని రాజ్ అడుగుతాడు. మేడమ్ వస్తున్నారని సెక్రటరీ చెబుతుంది. ఇంతలో కారులోనుంచి కావ్య దిగుతుంది. అది చూసి రాజ్ షాక్ అవుతాడు.