Brahmamudi January 19th Episode: అనామిక చిత్రాంగీ అన్న స్వప్న.. అర్ధరాత్రి శ్వేత ఇంట్లో రాజ్.. భయపెట్టిన అజ్ఞాత వ్యక్తి-brahmamudi serial january 19th episode raj in swetha home at midnight and unknown person send video to kavya ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi January 19th Episode: అనామిక చిత్రాంగీ అన్న స్వప్న.. అర్ధరాత్రి శ్వేత ఇంట్లో రాజ్.. భయపెట్టిన అజ్ఞాత వ్యక్తి

Brahmamudi January 19th Episode: అనామిక చిత్రాంగీ అన్న స్వప్న.. అర్ధరాత్రి శ్వేత ఇంట్లో రాజ్.. భయపెట్టిన అజ్ఞాత వ్యక్తి

Sanjiv Kumar HT Telugu
Jan 19, 2024 07:23 AM IST

Brahmamudi Serial January 19th Episode: బ్రహ్మముడి సీరియల్ జనవరి 19వ తేది ఎపిసోడ్‌‌లో ఇంట్లో ఎదురుతిరగమని కావ్యకు సలహాలు ఇస్తుంది స్వప్న. తర్వాత ఆఫీస్‌లో వర్క్ ఉందని చెప్పిన రాజ్ శ్వేత ఇంటికి అర్ధరాత్రి వెళ్లిపోతాడు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ జనవరి 19వ తేది ఎపిసోడ్‌‌
బ్రహ్మముడి సీరియల్ జనవరి 19వ తేది ఎపిసోడ్‌‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో రాత్రిపూట టేబుల్ క్లీన్ చేస్తూ కావ్య ఉంటుంది. కావ్య దగ్గరికి వెళ్లిన స్వప్న నువ్ ఎందుకు చేస్తున్నావ్. పని మనిషి ఏమైందని అడుగుతుంది. ఇప్పటిదాకా పనిమనిషి ఎందుకు ఉంటుందే అని కావ్య అంటుంది. అయితే, నువ్ చేస్తావా. ఇలాగే చేస్తూ ఉంటే నీతో బాత్రూమ్‌లు కూడా క్లీన్ చేయిస్తారు. ఈ ఇంట్లో నిన్ను ఎవరైనా గౌరవంగా చూస్తున్నారా అని స్వప్న అంటుంది.

చిన్నత్తయ్య తోడైంది

ఇది మన పనే కదా. చేస్తే ఏమైందని కావ్య అంటుంది. ఎవరి మెప్పు కోసమే ఇదంతా చేస్తున్నావ్. గట్టిగా మాట్లాడవే. మొన్న వచ్చిన అనామిక మాట్లాడుతోంది. ఒక అమ్మమ్మ గారు తప్పితే ఇంట్లోవాళ్లు నిన్ను మనిషిలా చూస్తున్నారా. ఎప్పుడు సంధు దొరికితే నిన్ను అందామా అని చూస్తున్నారు. మాట పడితే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. పెద్దయ్య, మా అత్తయ్యకు తోడు చిన్నత్తయ్య తయారైంది. ఇక ఆమె కోడలు చిత్రరాంగీలా ఉంది అని స్వప్న అంటుంది.

వాళ్లు రోజుకో కొత్త చీర కట్టుకుని సింగారించుకోవడం తప్ప.. ఏదైనా పని చేశారా. ఇవన్ని పనులు చేయనని చెప్పు. పనిమనిషిని పెట్టమని కండిషన్ పెట్టు. కావాలంటే వండి మొహనా పడేస్తానని చెప్పు అని స్వప్న అంటుంది. ఇది మన ఇల్లే. ఈ గొత్రం, వంశం మనదైంది. ఏదో పరిస్థితుల వల్ల మనస్పర్థలతో అలా అంటున్నారే తప్పా.. గట్టిగా ఎదురిస్తే అది పోదు. మనుషులను ప్రేమతో గెలవాలే. అలా కండిషన్స్ పెట్టి ఉండలేం. ఎప్పటికీ ఇదే ఇంట్లో ఉండాలి. అలాంటిది మాటలు అనుకోవడం కన్నా.. సర్దుకుపోవడమే మంచిది అని కావ్య అంటుంది.

తెలివితేటలు మాకెక్కడివి

నీకు చెప్పాను చూడా నన్ను అనుకోవాలే అని స్వప్న వెళ్లిపోతుంది. మరోవైపు కనకం దగ్గరికి పక్కింటి ఆమె శాంత తన కూతురు పెళ్లి ఫిక్స్ అయిందని, కార్డ్ ఇవ్వడానికి వస్తుంది. పెళ్లి కొడుకు ఏం చేస్తాడే అని అన్నపూర్ణ అడిగితే.. ఏదో చిన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి. కనకం అక్కలా కోట్ల ఆస్తి ఉన్న వాన్ని అల్లుడుగా తీసుకురాలేం కదా. ఆమెకున్న తెలివితేటలు మాకు ఎక్కడివి. మీ చిన్న కూతురుని కూడా ఆ ఇంటి చిన్న కొడుకుతో పెళ్లి చేయాలని చూశావట కదా అని శాంత అంటుంది.

అందరూ చెప్పుకుంటుంటే విన్నాను. ప్రేమ పేరు చెప్పి స్వప్న లాగే నీ చిన్న కూతురును పంపిద్దామనుకున్నావట కదా. కరెక్టుగా పెళ్లి రోజే అప్పు ప్రేమ విషయం చెప్పేలా చేశావట కదా. భలే ప్లాన్ వేశావ్ అక్క అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంది పక్కింటావిడి శాంత. బాధతో కనకం, లోపల అప్పు, అవమానంగా కృష్ణమూర్తి ఫీల్ అవుతుంటారు. అక్క ఒకటి మర్చిపోయానంటూ లోపలికి వెళ్లిపోతుంది కనకం. కృష్ణమూర్తి కూడా వెళ్లిపోతాడు.

మాపై ఏడుస్తావ్

మాట్లాడుతుంటే అలా వెళ్లిపోతారేంటి అని శాంత అంటే.. అసలే జరిగిన అవమానాన్ని ఎలా దిగమింగుకోవాలో మదనపడుతుంటే నువ్ వచ్చి మాపై ఏడుస్తావేంటే అని అన్నపూర్ణ అంటుంది. ఏడుపు కాదక్క.. నేను అలా అల్లుడుని తేలేకపోయానని బాధ. అయినా జరిగిందే కదా అన్నాను అని శాంత అంటుంది. ఇంకోసారి ఇటు వచ్చావంటే చెప్పుతో కొడతాను. వెళ్లవే అని అన్నపూర్ణ వార్నింగ్ ఇస్తుంది. ఉన్నదే కదా అన్నది అనుకుంటూ శాంత వెళ్లిపోతుంది.

మరోవైపు రాజ్ అప్పుడే పడుకోవడం చూసి ఆశ్చర్యపోతుంది కావ్య. తను కూడా దుప్పటి కప్పుకుని నిద్రపోతుంది. అప్పుకు భోజనం తీసుకొస్తుంది అన్నపూర్ణ. తినాలని లేదు, ఆకలి లేదు అని అప్పు అంటుంది. కారణం సరిగా లేదు అప్పు. మనసు బాగోలేదని చెప్పు. నిజమేంటో నీకు తెలుసు అని అన్నపూర్ణ అంటుంది. వాళ్లు ఎందుకు అలా అంటున్నారు అని బాధగా అడుగుతుంది అప్పు. అలా వాళ్లు అనేలా మనమే చేసుకున్నాం అని అన్నపూర్ణ అంటుంది.

వాళ్లే ప్రేమిస్తారా?

ఆ కుటుంబంలో మీ అమ్మ నమ్మకం కోల్పోయింది. మీ అక్కల కోసం కాస్తా అబద్దాలు ఎక్కువ చెప్పింది. అందులో తన స్వార్థం లేదు. కూతుళ్లు బాగుండాలని, తను నెరవేర్చుకోలేనిది మీకు ఇవ్వాలనుకుంది. ఇప్పుడు నీది కూడా నాటకంలాగే అందరికీ కనిపిస్తుంది అని అన్నపూర్ణ అంటుంది. మధ్య తరగతి వాళ్లు ప్రేమించకూడదా. ఆస్తి ఉన్నవాళ్లే నిజాయతీగా ప్రేమిస్తారా అని అప్పు అంటుంది. నిజాయితీకి అర్థమే మారిపోయింది. లేనోళ్లు ఉన్నోళ్లను ప్రేమిస్తే ఆశ కనిపిస్తుందే తప్పా మనసు కనిపించదు అని అన్నపూర్ణ అంటుంది.

అయినా వాళ్లను ఎప్పుడూ పట్టించుకోని అప్పు. ఇప్పుడు ఎందుకు పట్టించుకుంటుంది. అప్పు ఇంతకుముందులానే ఉండాలి. ఉంటుందు కూడా. వాళ్లు అన్నారని భోజనం మానేయడం ఎందుకు. ఇప్పటికే అంతా బాధలో ఉన్నాం. ఇంకా బాధపెట్టకే అని చెప్పిన అన్నపూర్ణ భోజనం తినిపిస్తుంది. మరోవైపు రాజ్ ఫోన్‌లో అలారం మోగుతుంది. కాల్ అనుకుని హలో అంటూ మాట్లాడుతుంది కావ్య. అది ఫోన్ కాదు. అలారం. నా ఫోన్‌లో అని రాజ్ అంటాడు.

టీమ్ వర్క కదా

అప్పుడే తెల్లారిందా అని కావ్య అడిగితే.. లేదు. ఆఫీస్‌లో వర్క్ ఉంది. ముద్ర వాళ్లు చేసిన డిజైన్స్ నచ్చలేదు. 12 వరకు వెళ్లి అక్కడే ఉండి. ఫైనల్ చేయాలి. రెండు గంటలు పడుకుంటే తలనొప్పి రాదని రాజ్ అంటాడు. మీరు ఒక్కరే వెళ్తున్నారా అని కావ్య అడుగుతుంది. ఆఫీస్ వాళ్లు కూడా వస్తారు. టీమ్ వర్క్ కదా అని రాజ్ రెడీ అవుతుంటాడు. మరోవైపు శ్వేత పడుకుని ఉంటే ఆమె ఇంట్లోకి ఎవరో వస్తారు. అతనెవరో చూపించరు. కానీ, కాళ్లు చూపిస్తుంటారు.

అతను కత్తి తీసుకుని శ్వేత ఇంట్లో ఉంటాడు. ఇంతలో నిద్రలేచిన శ్వేత డోర్ వేసాను కదా. తెరుచుకుందేంటి అని బెడ్ రూమ్ వేస్తుంది. ఇంతలో ఏదో చప్పుడు అయి ఆగిపోతుంది. వెళ్లి డోర్ తీసి చూస్తుంది. ఫ్లవర్ వాజ్ ఎలా పడిందనుకున్న శ్వేత దాన్ని పక్కన పెడుతుంది. ఇంతలో డోర్ కర్టెన్స్ పక్కన ఎవరో ఉన్నట్లు చూసిన శ్వేత.. ఎవరు. మర్యాదగా బయటకు రా అంటూ చూసేందుకు భయం భయంగా వెళ్తుంది. భయంతోనే డోర్ కర్టెన్ తీసి చూస్తుంది శ్వేత. కానీ, అక్కడ ఎవరు ఉండకపోయేసరికి ఊపిరి పీల్చుకుంటుంది.

ఎవరో ఉన్నట్లు

ఎవరు లేరనుకుని తన బెడ్ రూమ్‌లోకి వెళ్లి నీళ్లు తాగుతుంది. ఇంతలో రాజ్ కాల్ చేసి ఈవెనింగ్ కాల్ మి అని మెసేజ్ పెట్టావుగా అని అంటాడు. ఏదో పెట్టానులే అని శ్వేత అంటే.. ఏంటీ టెన్షన్‌గా ఉన్నావని రాజ్ అడుగుతాడు. ఏమో తెలియదు. ఇంట్లో ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకో అలా అనిపిస్తుంది అని శ్వేత అంటుంది. మీ ఇంటికి ఈ టైమ్‌లో ఎవరొస్తారు. సరే నేను రానా. నేను బయట ఉన్నాను. ఆఫీస్‌కు వెళ్తున్నాను అని రాజ్ అంటాడు.

వద్దులే రాజ్ ఈ టైమ్‌లో బాగోదు. మీ ఇంట్లోవాళ్లకు తెలిస్తే బాగుండదు అని శ్వేత కాల్ కట్ చేసి పడుకుంటుంది. ఇంతలో హాల్లో టీవీలో ఏదో పోగ్రామ్ ప్లే అవుతుంది. అది విని ఒక్కసారిగా షాక్ అవుతుంది శ్వేత. భయంగా కర్ర తీసుకుని హాల్లోకి వెళ్లి చూస్తుంది శ్వేత. టీవీ ఆఫ్ చేస్తుంది. కంగారుగా అటు ఇటు చూస్తుంది. ఇంతలో మరోసారి నీడ కనిపిస్తుంది. తర్వాతి ఎపిసోడ్‌లో రాజ్ సర్ ఆఫీసులో లేరని, కాల్ కట్ చేస్తున్నాడని, డిజైన్స్ రేపటిలోపు ఇవ్వాలని సెక్రటరీ కావ్యకు కాల్ చేసి చెబుతుంది.

వీడియో చూసిన కావ్య

అదేంటీ ఆఫీసులో లేకపోవడం ఏంటీ అనుకున్న కావ్య.. సరే మెయిల్ చేయు నేను చూస్తాను అని కావ్య అంటుంది. మరోవైపు రాజ్‌తో ఇంట్లో జరిగే సంఘటనల గురించి శ్వేత చెప్పినట్లుగా చూపించారు. శ్వేత ఇంట్లో ఉన్న వ్యక్తి దాన్ని వీడియో తీసి కావ్యకు పంపిస్తాడు. ఆ వీడియోలో అర్దరాత్రి శ్వేతతో రాజ్ చనువుగా ఉండటం చూసి కావ్య షాక్ అవుతుంది.

Whats_app_banner