Brahmamudi January 31st Episode: సైకోలా శ్వేతను కొట్టిన భర్త.. అరవింద్‌కు రాజ్ వార్నింగ్.. నిజం చెప్పి నిలదీసిన కావ్య
Brahmamudi Serial January 31st Episode: బ్రహ్మముడి సీరియల్ జనవరి 31వ తేది ఎపిసోడ్‌లో రాజ్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతాయి. కావ్య ఆఫీస్‌కు వెళ్లేందుకు అపర్ణ ఒప్పుకోవడం, ఆఫీస్ వాళ్లు బొకేలతో ఉండటం చూసి రాజ్ దిమ్మతిరిగిపోతుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో రాజ్ ఆఫీస్‌లోకి కావ్య వెళ్తుంది. తను ఎక్కడ కూర్చోవలానే విషయంపై రాజ్‌తో సరదాగా గొడవ పడుతుంది. మీ సీటులో కూర్చోమంటారా అని కావ్య అంటుంది. దానికి రాజ్ సీరియస్ అవుతాడు. నాకు చాలా పనులు ఉన్నాయని చెబుతాడు. నాకు తెలుసు. మీరు భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో ఏ పనులు చేస్తున్నారో అని కావ్య అంటుంది. ఏంటే ఈ వ్యాఖరణం క్లాస్. దేని గురించి మాట్లాడుతున్నావ్ అని రాజ్ అంటాడు.
గట్టిగా అరిచిన రాజ్
ఇద్దరు అలా సరదాగా గొడవ పడుతుంటారు. ఇలా ఇంట్లో పిలిచినట్లు రావే పోవే, ఒసేయ్ అంటే కుదరదు. ఉద్యోగులతో మర్యాదగా నడుచుకోవాలని కావ్య చెబుతుంది. తర్వాత నాకు పని చెప్పమని కావ్య అడుగుతుంది. అలాంటిదేం లేదని ముందు రాజ్ అంటాడు. దాంతో మీరు నాకు పని ఇచ్చేవరకు మిమ్మల్నే చూస్తూ కూర్చుంటాను అని కావ్య అంటుంది. దాంతో శ్రుతి అని సెక్రటరిని గట్టిగా అరుస్తాడు రాజ్. దాంతో ఏమైంది సార్ అని శ్రుతి అడుగుతుంది.
వేయాల్సిన డిజైన్స్ గురించి మేడమ్‌కి ఎక్స్ ప్లేన్ చేసి వేయించు అని రాజ్ అంటాడు. దాంతో వాళ్లిద్దరు వెళ్లిపోతారు. తర్వాత మమ్మీ. అసలు ఎందుకు ఇలా చేశావ్ అని రాజ్ అనుకుంటాడు. మమ్మీ కాదు డాడ్ చేశాడు అని సుభాష్‌కు కాల్ చేస్తాడు రాజ్. ఏంటీ డాడ్ ఇలా చేశారు అని రాజ్ అంటే.. నేను కాదు కావ్య చేసిందని స్వీట్ గురించి చెబుతాడు. స్వీట్ గురించి కాదు కావ్యకు మీరు ఇచ్చిన సీట్ గురించి. ఇంకా పదేళ్ల అగ్రిమెంట్ కూడా ఇచ్చారు రాజ్ అడుగుతాడు. అంటే నేను, ల్యాప్‌ట్యాప్ ఖాలీగా ఉన్నామని అలా ఇచ్చేశాను. సాలిడ్‌గా ఉంటుందని పదేళ్లు రాశానని సుభాష్ అంటాడు.
అప్పుపై ఫైర్
నిజానికి ఆఫీస్‌లు మనం చూసుకుంటున్నాం. మనల్ని నడిపించేది మన భార్యలే కదరా అని సుభాష్ అంటే.. మమ్మీ చెప్పిందా అని రాజ్ అడుగుతాడు. అంతే కదా. లేదంటే మీ మమ్మీకి చెప్పి కావ్య అగ్రిమెంట్‌ను క్యాన్సిల్ చేయించనా అని సుభాష్ అడుగుతాడు. డాడీ ఇందాకే చెప్పాను. నా రాతలు రాయొద్దు. ఆడుకోవద్దు అని కాల్ కట్ చేస్తాడు రాజ్. మరోవైపు నిద్రపోయిన అప్పుకు షాప్ ఓనర్ కాల్ చేస్తాడు. చేరిన రోజే ఇలా లేట్ చేస్తా ఎలా అని సీరియస్ అవుతాడు. వెళ్లి 2 గంటలు అవుతుంది ఇంకా రాలేదని అరుస్తాడు.
తప్పు నాదే సార్. టైమ్ చూసుకోలేదు అని అప్పు లేచి వెళ్తుంది. ఎక్కడికీ వెళ్తున్నావ్. భోజనం తినేసి వెళ్లు అను కనకం అంటే.. నీకు బుద్ధి ఉందా. నేను అడిగినప్పుడే అన్నం పెట్టాలని తెలియదా అని అప్పు అంటుంది. నేను తీసుకొచ్చానే కానీ నువ్ పడుకున్నావ్. ఎంత లేపిన లేవలేదు. లేవలేనంత అలసిపోయి పడుకున్నావ్. అదంతా వదిలేయ్ ఇప్పుడు తిందువు దా అని కనకం అంటుంది. తినే టైమ్ అంతా నిద్రలేనే పోయింది అని కోపంగా వెళ్లిపోతుంది అప్పు. ఇప్పుడు నేను ఏం అన్నానయ్యా అని కృష్ణమూర్తితో కనకం అంటుంది.
ఆఫీస్‌కు వెళ్లొచ్చు కదా
నీకు అప్పులో అరవడమే తెలుస్తుంది. నాకు బాధ కనిపిస్తుంది. జరిగిన విషయం మనమే మర్చిపోలేదు. ప్రేమించిన తను ఎలా మర్చిపోతుంది. తను కష్టపడి తన బాధను పోగొట్టుకోవాలని అనుకుంటుంది. అప్పుకు పెళ్లి చేస్తేనే మళ్లీ ఎప్పటిలా అవుతుంది. కానీ, పెళ్లికి అప్పు ఒప్పుకోవాలి అని కృష్ణమూర్తి అంటాడు. మరోవైపు రెస్టారెంట్‌లో అనామిక, కల్యాణ్ కూర్చుంటారు. మీ అన్నయ్య లాగా నువ్ కూడా ఆఫీస్‌కు వెళ్లొచ్చు కదా అని అనామిక అంటుంది. నువ్ నన్ను నా కవితలను చూసేకదా ప్రేమించింది అని కల్యాణ్ అడుగుతాడు.
హా అవును.. లేకుంటే నీ ఆస్తి చూసి అనుకున్నావా అని అనామిక అంటుంది. కదా. నాకు ఇలా ఉండటమే ఇష్టం అని కల్యాణ్ అంటాడు. ఇంతలో పలావ్ వస్తే తింటారు. ఇది పలావా చెత్తలా ఉంది. పలావ్ అంటే మా వదిన చేసిందానిలా ఉండాలని కల్యాణ్ అంటాడు. ఇక్కడ కూడా మీ వదినా గోలేనా అని అనామిక అంటుంది. గోలేంటి. ఓసారి తిని చూస్తే నీకే తెలుస్తుంది. నాకోసం నువ్ నేర్చుకుని చేయొచ్చు కదా అని కల్యాణ్ అంటే.. ఏంటీ అని అనామిక అంటుంది. ఏం లేదులే అని కల్యాణ్ అంటాడు. ఇంతలో అక్కడికి అప్పు వచ్చి రెస్టారెంట్ ఓనర్‌తో మాట్లాడుతుంది.
అప్పు బాధపడాలని
సారీ సార్ లేట్ అయింది. ఇంకోసారి అలా చేయను అని రిక్వెస్ట్ చేస్తుంది అప్పు. మధు చెప్పింది కదా అని పనిలో పెట్టుకున్నాని. ఇలా చేస్తే బాగోదు అని అతను అంటాడు. ఇంతలో అప్పుని అనామిక చూస్తుంది. అది చూసి కావాలనే కల్యాణ్‌కు ఐస్ క్రీమ్ తినిపిస్తుంది అనామిక. అది చూసిన అప్పు బాధగా ఫీల్ అవుతుంది. తర్వాత వెళ్లిపోతుంది. అప్పు అక్కడ లేకపోవడం చూసి అనామిక ఐస్ క్రీమ్ పెట్టడం ఆపేస్తుంది. అదేంటి ముందు అరిచావ్. తర్వాత ప్రేమ చూపించావ్. మళ్లీ ఇంతలోనే చిరాకు పడుతున్నావ్ అని కల్యాణ్ అంటాడు.
అమ్మాయిలం కదా మూడ్ స్వింగ్స్ అలాగే ఉంటాయి అని అనామిక అంటే.. అన్ని తట్టుకోవడం అబ్బాయిల వల్ల కాదు అని కల్యాణ్ అంటాడు. అబ్బాయిలకు కాదు కానీ, భర్తలకు ఇంకో ఆప్షన్ లేదని అనామిక అంటుంది. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటు ఉంటారు. మళ్లీ అక్కడికి వచ్చిన అప్పు వాళ్లిద్దరు సంతోషంగా ఉండటం చూసి వెళ్లిపోతుంది. మరోవైపు నేను వేయమన్నా డిజైన్స్ ఏంటీ.. వేసిన డిజైన్స్ ఏంటని రాజ్ ఫైర్ అవుతాడు. మీరు ఇచ్చినవాటి కంటే ఇవి బాగుంటాయని మేడమ్ చెప్పారు అని శ్రుతి అంటుంది.
శ్వేత నుంచి కాల్
నీకు బాస్ నేనా మేడమా అని రాజ్ అంటే.. మీకు కూడా మేడమే కదా అని శ్రుతి అంటుంది. ఇక్కడ బాస్ నేను. నేను చెప్పినట్లే చేయాలని రాజ్ అంటాడు. అయితే జాబ్ నుంచి తీసేయండి అని కావ్య అంటుంది. డాడ్ పదేళ్లు అగ్రిమెంట్ రాసిచ్చారు కదా అని ఓవర్ చేయకు. అవసరం అయితే ఫెనాల్టి కట్టి మరి పంపిచేస్తా. నేను చెప్పిన డిజైన్స్ మాత్రమే వేయాలి అని చెప్పి వెళ్లిపోతాడు రాజ్. ఇంతలో శ్వేత నుంచి కాల్ వస్తుంది. భర్త అరవింద్ వచ్చి గొడవ చేస్తున్నాడని, డోర్ బయట ఉన్నాడని, ఇంటికి రమ్మని శ్వేత చెబుతుంది.
దాంతో వాట్ అని రాజ్ గట్టిగా అరుస్తాడు. మనమే వెళ్లి కలుద్దామనుకున్నాం కదా అని రాజ్ అంటే.. విడాకులు పంపించాం కదా అందుకు వచ్చినట్లు ఉన్నాడు. చాలా కోపంగా ఉన్నాడు అని శ్వేత అంటుంది. సరే వస్తున్నాని రాజ్ అంటాడు. అదంతా విన్న కావ్య శ్వేత దగ్గరికే అనుకుంటా. ఇవాళ వీళ్ల బంధం ఏంటో తెలుసుకోవాలని రాజ్ వెంటే కారులో ఫాలో అవుతుంది కావ్య. కానీ, దారిలో రాజ్‌ను మిస్ చేస్తుంది. మరోవైపు శ్వేతను కొడతాడు అరవింద్.
సైకోలా శ్వేత భర్త అరవింద్
నాకే విడాకులు పంపిస్తావా. నీ ఆస్తి రాసివ్వమ్మన్నాన్నాను. ఫారెన్‌లో ఉన్నా మీ అమ్మా నాన్న దగ్గరికి పంపించు అని అడిగాను. అన్నింటికి నో అంటే నాకు కోపం రాదా. వద్దని తెడ్డం చూపే భార్యను కొట్టకుండా ఉంటారా అని సైకోలా బిహేవ్ చేస్తాడు అరవింద్. ఆస్తి ఉన్నా నీలాంటి అమ్మాయిని ఎవరైనా వదులుకుంటారా అని మళ్లీ కొట్టబోతుంటే.. రాజ్ వచ్చి కొడతాడు. దాంతో కుర్చిలో పడతాడు అరవింద్. నిన్ను ఇక్కడికి రాకూడదు అని చెప్పాను కదా అని రాజ్ అంటాడు. వచ్చేశాడా మీ బాయ్ ఫ్రెండ్. మీకు కమ్యునికేషన్ బాగానే ఉందని అరవింద్ అంటాడు.
చూడు బాసు.. నువ్ ఆస్తి ఉన్నోడివి. నీ బలం ముందు నేను గెలవలేను. అలా అని నా పెళ్లాన్ని, ఆస్తిని వదిలేయలేసి నేను ఎలా బతకాలి అని అరవింద్ అంటాడు. అది టార్చర్ పెట్టకముందు ఉండాలి అని రాజ్ అంటాడు. నాకు విడాకులు ఇచ్చి మీరు ఇద్దరు కలిసి ఉంటారా. మీరు అక్రమ సంబంధం పెట్టుకుని నాకు విడాకులు ఇవ్వొచ్చు అని అరవింద్ అంటే.. రేయ్.. మా సంబంధం గురించి నీకు అనవసరం. నేను తల్చుకుంటే నిన్ని జీవితాంతం జైల్లో పెట్టించగలను. అనుకుంటే బెడ్‌కు పరిమితం చేయగలను. మర్యాదగా రేపటిలోపు విడాకుల పేపర్స్ పై సైన్ చేసి పంపించు.. గెట్ అవుట్ అని వార్నింగ్ ఇస్తాడు రాజ్.
కుమిలిపోయిన కావ్య
దాంతో అరవింద్ వెళ్లిపోతాడు. తర్వాత శ్వేత కుప్పకూలిపోతుంది. రాజ్ ఓదార్చుతుంటాడు. ఇంతలో అక్కడికి రాజ్ కారు చూసి కావ్య వస్తుంది. రాజ్ ఓదార్చడం చూసి షాక్ అవుతుంది. వాడేదో అన్నాడని ఫీల్ అవుతావా. వాడు విడాకులు ఇచ్చాకా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నాది గ్యారంటీ. నువ్ ఏడుస్తుంటే నేను చూడలేను శ్వేత అంటూ కన్నీళ్లు తుడుస్తాడు రాజ్. దాంతో రాజ్ భుజంపై వాలుతుంది శ్వేత. అదంతా చూస్తున్న కావ్య ఏడుస్తూ ఉంటుంది. అయితే రాజ్ మాటలు విన్నదే లేదే మాత్రం తెలియదు కానీ కావ్య మాత్రం చాలా కుమిలిపోతుంటుంది.
బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో ఎక్కడికెళ్లారు, ఎందుకెళ్లారు, ఎవ్వరిని కలవడానికి వెళ్లారు అని కావ్య నిలదీస్తుంది. నా పనుల్లో జోక్యం చేసుకోడానికి నువ్వు ఎవరు అని రాజ్ అని వెళ్లిపోతాడు. నేను మీరు తాళి కట్టిన భార్యను.. మీరు రహస్యంగా కలుసుకునే శ్వేతను కాదు అని కావ్య అంటుంది. దాంతో రాజ్ ఒక్కసారిగా షాక్ అయి చూస్తాడు.