Brahmamudi January 25th Episode: రాజ్‌ శ్వేత చాటింగ్ మొత్తం చూసేసిన కావ్య కల్యాణ్.. అధికారం కోసం ధాన్యలక్ష్మీ గొడవ-brahmamudi serial january 25th episode kavya kalyan secret plan on raj about relation with swetha ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi January 25th Episode: రాజ్‌ శ్వేత చాటింగ్ మొత్తం చూసేసిన కావ్య కల్యాణ్.. అధికారం కోసం ధాన్యలక్ష్మీ గొడవ

Brahmamudi January 25th Episode: రాజ్‌ శ్వేత చాటింగ్ మొత్తం చూసేసిన కావ్య కల్యాణ్.. అధికారం కోసం ధాన్యలక్ష్మీ గొడవ

Sanjiv Kumar HT Telugu
Jan 25, 2024 10:04 AM IST

Brahmamudi Serial January 25th Episode: బ్రహ్మముడి సీరియల్ జనవరి 25వ తేది ఎపిసోడ్‌‌లో ఇందిరాదేవి ఇచ్చిన సలహాతో రాజ్, శ్వేత బంధం ఏంటో తెలుసుకునేందుకు కల్యాణ్‌తో కలిసి కావ్య సీక్రెట్ ప్లాన్ చేస్తుంది. మరోవైపు అధికారంపై అపర్ణతో ధాన్యలక్ష్మీ గొడవకు దిగుతుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ జనవరి 25వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ జనవరి 25వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో కావ్య పడుకుని ఉంటే రాజ్ పడుకున్నావా అని అడుగుతాడు. పడుకున్నట్లు నటించలేను. కళ్లు తెరుచుకున్నాయని కావ్య అంటుంది. అసలు ఏం మాట్లాడుతున్నావ్. నేను అడిగినదానికి నువ్ చెప్పినదానికి ఏమైనా సంబంధం ఉందా అని రాజ్ అంటే.. నేను అడగనిదానికి మీరు చెప్పనిదానికి సంబంధం ఉందని కావ్య అంటుంది. నువ్ నన్నేం అడగలేదు. నేను ఏం చెప్పలేదని రాజ్ అంటాడు. నేను ఏం అడగలేను మీరు ఏం చెప్పలేరని కావ్య అంటుంది.

ఇంతలా సాధించాలా

అసలు దేని గురించి నువ్ మాట్లాడేది. క్లారిటీ వచ్చాకా అడుగుతానులేండి అని కావ్య. సరే తిన్నావా అని రాజ్ అడిగితే.. తిట్లా.. ఇవాళ ఎవరు తిట్టలేదు అని కావ్య చెబుతుంది. కడుపుకి అన్నం తిన్నావా అని అడుగుతాడు రాజ్. కడుపు నిండా దుఖం. ఇంకా అన్నం ఎక్కడ పడుతుంది అని కావ్య అంటుంది. ఒక్కసారికి నేను నీతో రాకుంటే ఇంతలా సాధించాలా. అలా నువ్ తినకుండా పడుకుంటే నాకు ఏదోలా ఉంటుందని రాజ్ అంటే.. నేను పడుకుంటాను అని దుప్పటి కప్పుకుంటుంది కావ్య. దాంతో కోపంగా సరే నీ ఇష్టం అని వెళ్లిపోతాడు రాజ్.

తర్వాత భోజనం తీసుకొచ్చి కావ్యను లేపుతాడు. మీరెందుకు తీసుకొచ్చారు అని కావ్య అంటే.. పటు తిను అని అంటాడు. కానీ, కావ్య తినకుండా ఆ ప్లేట్ తీసుకొచ్చిన చోటే పెట్టండి అని అంటుంది. దాంతో లాగి ఒక్కటి అంటూ చేయి లేపుతాడు రాజ్. తర్వాత ఆగిపోయి.. నువ్ ఇలా ఎందుకు తింటావే. తిక్క కదా అని కావ్య చేతులు కట్టేసి మరి భోజనం తినిపిస్తాడు రాజ్. అప్పుడు రాజ్‌తో కలిసి ఉన్న విషయాలు, శ్వేతతో రాజ్ చనువుగా ఉన్నది అంతా గుర్తు చేసుకుంటుంది కావ్య. ఈ సీన్ ఎమోషనల్‌గా సాగుతుంది.

రాజ్ టెన్షన్

ఇంత ఆకలి పెట్టుకుని తిననంటావ్ అని రాజ్ కోప్పడతాడు. మధ్యలో కావ్యకు పొలమారితే.. తలపై తడుతాడు రాజ్. రాజ్ అలా ప్రేమగా తినిపించడం చూసి ఒకింత కన్ఫ్యూజన్ అవుతుంది కావ్య. తర్వాత ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి ఇస్తాడు. ఇప్పుడు వద్దని అంటే.. డిప్ప మీద ఒక్కటి ఇస్తే.. అంటూ ట్యాబ్లెట్స్ ఇస్తాడు రాజ్. తర్వాత రాజ్‌కు శ్వేత నుంచి కాల్ వస్తుంది. దాంతో రాజ్ టెన్షన్ అవుతాడు. అదంతా గమనిస్తుంటుంది కావ్య. ఇప్పుడే వస్తాను అని చెప్పి పక్కకు వెళ్లిపోతాడు రాజ్.

హలో చెప్పు శ్వేత అని చాలా సంతోషంగా మాట్లాడుతుంటాడు రాజ్. కావ్య మాత్రం బాధగా ఆలోచిస్తూ.. కృష్ణుడి దగ్గరికి వెళ్తుంది. కృష్ణ ఇది నువ్ చేసినట్లే లీలనా. ఒక భార్య దగ్గర ఉండి.. మరో ఏడుగురు భార్యలతో ప్రేమగా ఉంటూ పబ్బం గడుపుకున్నట్లుగానే నా భర్త చేస్తున్నాడా. ఇందాకా నా గదిలో మాయ జరిగింది. నా భర్త నాకు ప్రేమగా భోజనం తినిపించాడు. అంతలోనే ఇంకొకరితో ప్రేమగా ఉన్నాడు. ఏది సత్యం ఏది అసత్యం. నేను ఎలా తేల్చుకోవాలి. ఇందులో నా కర్తవ్యం ఏంటో నువ్వే చూపించాలి. నువ్ నాకు దారి చూపించాలి అని కావ్య కృష్ణుడిని వేడుకుంటుంది.

భర్తను దక్కించుకోవాలా

కావ్యను చూసిన ఇందిరాదేవి వచ్చి ఏంటమ్మా కావ్య ఏమైందని అడుగుతుంది. ఒక భర్తకు భార్యపై లేకపోవడానికి కారణం ఏమై ఉంటుంది. ఇష్టంలేని వివాహమా. ఇంకొకరిపై ప్రేమనా అని కావ్య అడుగుతుంది. రాజ్ ఏమైనా తప్పు చేస్తున్నాడా అని ఇందిరాదేవి అనుమానంగా అడుగుతుంది. దాంతో కంగారుపడిన కావ్య.. లేదు ఇది నా స్నేహితురాలికి ఎదురైన కష్టం అని కావ్య చెబుతుంది. తన భర్తను దక్కించుకోవాలా లేకా ఇంకొకరికి విడిచిపెట్టాలా అని కావ్య అడుగుతుంది.

అలా ఎలా ఇస్తుంది. ఇవ్వడానికి భర్త ఏమైనా వస్తువా. ఒక్కసారి బ్రహ్మముడి పడితే జీవితాంతం కలిసి ఉండాలి. ఆ విషయాన్ని తన భర్తను నిలదీయమను. అది తన హక్కు అని ఇందిరాదేవి అంటుంది. అడిగిన చెప్పలేడని తెలిస్తే, స్నేహితులు కాకుంటే, అనుమానం దాటిపోతే అని కావ్య అంటుంది. అన్ని నువ్వే అనుకుంటే ఎలా అని ఇందిరాదేవి అంటుంది. తను ఇంట్లో ఎవరికీ చెప్పుకోలేదు. అందుకే నన్ను అడిగింది అని కావ్య అంటుంది. అయితే, ముందు తన భర్త ఇంకొకిరిని పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పాడా. లేదా అందుకు రుజువేమైనా ఉందా ముందు అది తెలుసుకోమ్మను అని ఇందిరాదేవి అంటుంది.

గూడు కూలిపోతోనే

కళ్లతో చూసింది. ఎవరో చెప్పింది నిజాలు కాకపోవచ్చు అని ఇందిరాదేవి అంటుంది. నా ప్రశ్నలకు అమ్మమ్మ రూపంలో సమాధానం ఇచ్చావా జగద్గురు. నా కర్తవ్యం ఇలా చూపించావా అని కావ్య మనసులో అనుకుంటుంది. తర్వాత పక్షి గూడు కట్టుకోవడం గురించి చెప్పిన ఇందిరాదేవి.. అనుమానంతో అడిగితే ఏ కాపురం అయినా కూలిపోతుంది. సరైన రుజువుతో అడిగితే నిలబడుతుంది. కట్టిన గూడు కూలిపోతేనే పూర్తిగా కట్టుకునే దాకా పక్షి ఆగదు. అలాంటిది మనం. కాపురం కూలిపోతుంటే ఎంతలా ప్రయత్నించాలి అని ఇందిరాదేవి చెబుతుంది.

మరుసటి రోజు ఉదయం కల్యాణ్‌తో కావ్య మాట్లాడుతుంటుంది. నా స్నేహితురాలికి అని అమ్మమ్మ నాకు ఇచ్చిన సలహాను ఎలా మొదలు పెట్టాలి. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని కావ్య అడుగుతుంది. పూర్వ కాలంలో షర్ట్‌కు అంటిన కుంకుమతో, జుట్టుకు ఉన్న వెంట్రుకలతో కనిపెట్టేవారు. ఇప్పుడు మాత్రం అది ఎప్పుడో కనిపెట్టేశారు. అదే సెల్ ఫోన్ అని కల్యాణ్ అంటారు. అంటే ఆయన చాటింగ్ చూద్దామా అని కావ్య అంటే.. అప్పుడే కదా చీటింగ్ బయటపడేదని కల్యాణ్ అంటాడు.

సంసారం ముఖ్యమా

మరోవైపు రాజ్ తన ఫోన్‌లో ఎవరితోనే చాటింగ్ చేస్తూ ముసిముసిగా నవ్వుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కావ్య, కల్యాణ్ డోర్ పక్కన నిలబడి చూస్తుంటారు. హాయ్ డియర్, గుడు డే టు యూ అని రాజ్ మెసేజ్ పెడితే.. మిస్ యూ అని శ్వేత అంటుంది. ఇవాళ కలుస్తాను అని మెసేజ్ పెట్టిన రాజ్ స్నానానికి వెళ్తాడు. అన్నయ్య స్నానానికి వెళ్లాడు. ఆ ఫోన్ తీసుకురండి అని కావ్యను పంపిస్తాడు కల్యాణ్. అక్కడిదాకా వెళ్లిన కావ్య.. ఫోన్ తీసుకురాకుండా వస్తుంది. ఒకరి ఫోన్ చూడటం సంస్కారం కాదని కావ్య అంటే.. ఇప్పుడు సంస్కారం ముఖ్యమా.. మీ సంసారం ముఖ్యమా అని కల్యాణ్ అంటాడు.

వదిలేయండి కవిగారు. జీవితంలో ఏదైనా జరగని. నేనే ఏదో చేస్తాను అని కావ్య అంటుంది. అలా ఎలా వదిలేస్తాను. మీరు మా అమ్మ తర్వాత అమ్మలాంటి వారు. నేను ఊరికే వదిలేయలేను అని చెప్పిన కల్యాణ్ వెళ్లి రాజ్ ఫోన్ తీసుకొస్తాడు. ఇదిగో వదిన శ్వేత అని ఉంది. చూడండి అని కల్యాణ్ అంటే.. కావ్య చూడదు. కానీ, కల్యాణ్ చూసి షాక్ అవుతాడు. అది చూసి కావ్య కంగారు పడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

రాజ్‌దే కదా అధికారం

బ్రహ్మముడి సీరియల్ తర్వాతి ఎపిసోడ్‌లో పెద్దమ్మ గీజర్ రిపేర్ చేసే టెక్నిషీయన్‌ను రమ్మన్నారు కదా. ఎన్నింటికి రమ్మని చెప్పను అని అపర్ణను కల్యాణ్ అడుగుతాడు. అవసరం లేదులే కల్యాణ్ అని అపర్ణ అంటుంది. దాంతో కావ్య షాక్ అవుతుంది. పై నుంచి రాజ్ చూస్తాడు. నేను అన్నందుకే కదా ఇలా చేస్తున్నావ్. కానీ, అలా ఎందుకు అన్నానో ఆలోచించావా. తనకు పెళ్లి అయింది. తనను నమ్ముకుని ఒక ఆడది వచ్చింది. తనకంటూ గుర్తింపు ఉండాలి కదా అని ధాన్యలక్ష్మీ అంటుంది. అది నీ కొడుకు చెప్పు అని అపర్ణ అంటుంది. అధికారం అంతా నీ కొడుకు చేతుల్లోనే ఉంటే.. నా కొడుకుకి ఏం చెప్పను అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో కావ్య, రాజ్ షాక్ అవుతారు.

Whats_app_banner