Brahmamudi: బ్రహ్మముడి సీరియల్.. రాజ్, శ్వేతలు హగ్ చేసుకోవడం కావ్య చూస్తుందా?.. కొడుకును తల్లి నిలదీస్తుందా?
Brahmamudi December 16th Episode Promo: బ్రహ్మముడి సీరియల్ డిసెంబర్ 16వ తేది ఎపిసోడ్ ప్రోమోలో రాజ్‌ను హగ్ చేసుకుని శ్వేత ఎమోషనల్ అవుతుంది. ఆమెను రాజ్ ఓదార్చడం తల్లి అపర్ణ చూస్తుంది. మరోవైపు భర్త కోసం కావ్య వెతుకుతూ ఉంటుంది.
Brahma Mudi Serial Today Episode Promo: బ్రహ్మముడి సీరియల్‌లో దుగ్గిరాల కుటుంబం అంతా కలిసి కోనేటిలో దీపాలు ఒక్కొక్కరుగా వదులుతుంటారు. ఇంతలో రాజ్‌కు శ్వేత ఫోన్ చేస్తుంది. నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురుచూస్తున్నానో తెలుసా అని శ్వేత అంటుంది. దానికి ఎక్కడున్నావ్ అని నోరు చేయి అడ్డుపెట్టుకుని మెల్లిగా అడుగుతాడు రాజ్.
శ్వేత ఎమోషనల్
రాజ్ అడిగినదానికి నీ వెనుకే అని శ్వేత బదులిస్తుంది. దాంతో రాజ్ చూడటంతో సంతోషంతో చేయి ఊపుతుంది శ్వేత. తొందరగా రా అని శ్వేత పిలుస్తుంది. నానమ్మ నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి రాజ్ వెళ్లిపోతాడు. తర్వాత రాజ్‌ను హగ్ చేసుకుని ఏదో చెప్పుకుంటూ శ్వేత ఎమోషనల్ అవుతుంది. శ్వేతను రాజ్ ఓదారుస్తుంటాడు. శ్వేతను తన గుండెలపై అలాగే ఉంచుకుంటాడు రాజ్.
షాక్ అయిన అపర్ణ
మరోవైపు అటుగా వెళుతున్న అపర్ణ.. రాజ్‌ను శ్వేత హగ్ చేసుకోవడం చూస్తుంది. తన కొడుకు మరో అమ్మాయితో అలా ఉండటం చూసిన అపర్ణ ఒక్కసారిగా షాక్ అవుతుంది. వాళ్లను అలాగే చూసి నిర్ఘాంతపోయి ఉంటుంది. మరోవైపు భర్త రాజ్ కోసం కావ్య గుడి మొత్తం వెతుకుతూ కనిపిస్తుంటుంది.
కావ్య నిర్ణయం ఏంటీ?
ఓవైపు వేరే అమ్మాయితో రాజ్‌ను చూసిన అపర్ణ షాక్‌లో ఉంటే.. మరోవైపు భర్త కోసం కావ్య వెతుకుతూ ఉంటుంది. ఇలా నేటి ఎపిసోడ్ ప్రోమోను ఆసక్తికరంగా చూపించారు. మరి కొడుకు రాజ్‌ను అపర్ణ నిలదీస్తుందా?. రాజ్, శ్వేత ఇద్దరూ కావ్య కంట పడతారా?. ఒకవేళ కావ్య చూస్తే తాను ఏం చేస్తుంది?. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది తెలియాలంటే డిసెంబర్ 16న ప్రసారం అయ్యే ఎపిసోడ్ టెలీకాస్ట్ అయ్యాకా చూడాల్సిందే.