Brahmamudi: శ్వేతకు కావ్య కౌంటర్, రాజ్‌పై ఫైర్.. శైలేంద్ర మాటలు విన్న ధరణి.. కృష్ణకు షాక్ ఇచ్చిన దేవుడు
Brahmamudi Serial Promo: స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతున్న టాప్ పాపులర్ తెలుగు సీరియల్స్ గుప్పెడంత మనసు, బ్రహ్మముడి, కృష్ణ ముకుంద మురారి చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్నాయి. అలాంటి ఈ సీరియల్స్ ఫిబ్రవరి 5వ తేది ఎపిసోడ్స్‌లలో ఏం జరిగిందని ప్రోమోల్లో చూస్తే..
Brahmamudi Serial Promo: బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 5వ తేది ఎపిసోడ్ ప్రోమోలో కావ్యను చాలా మోడ్రన్‌గా రెడీ చేస్తుంది స్వప్న. దాంతో స్వప్నను ఇందిరాదేవి, అపర్ణ మెచ్చుకుంటారు. తర్వాత కావ్య కారులో చాలా స్టైలిష్‌గా ఆఫీస్‌కు వెళ్తుంది. కారు నుంచి దిగిన కావ్యను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్. అక్కడ ఆఫీస్‌కు శ్వేత కూడా వస్తుంది. ఆఫీస్‌లో రాజ్ ముందే కావ్య, శ్వేత కలుసుకుంటారు.
కావ్య కౌంటర్
మనం డైరెక్ట్‌గా కలవడం ఇదే మొదటిసారి కదా అని కావ్యతో శ్వేత అంటుంది. హా అవును.. ఇదే చివరిసారి కూడా అని కావ్య సమాధానం ఇస్తుంది. దానికి రాజ్ ఏంటీ ఇలా అంటుంది అన్నట్లుగా చూస్తాడు. కావ్య అలా అనడంతో అదేంటీ అని శ్వేత అంటుంది. ఓ.. మీరు మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటారా అని కావ్య వెటకారంగా అడుగుతుంది. తర్వాత కావ్య మనల్ని అపార్థం చేసుకుందని తెలిసాకా నేను ఊరుకోలేకపోతున్నాను అని శ్వేత అంటుంది.
అపార్థాలు దూరం చేస్తా
ఆమె అంటే నా మనసులో ప్రేమ లేదు. అందుకే తనతో విడిపోవాలని నిర్ణయించుకున్నాను అని రాజ్ అంటాడు. దాంతో కోపంగా షటప్ అని రాజ్‌పై కోప్పడుతుంది శ్వేత. దానికి రాజ్ షాక్ అవుతాడు. ఇప్పుడే వెళ్లి మన మధ్య ఉన్నది కేవలం స్నేహమే అని చెప్పి ఈ అపార్థాలను చెరిపేస్తాను అని శ్వేత బయలుదేరుతుంది. దానికి షాక్ అయిన రాజ్ అలాగే చూస్తుండిపోతాడు. మరోవైపు శ్వేత అలా రావడం గురించి ఆలోచిస్తుంటుంది కావ్య. మరి శ్వేత వెళ్లి నిజం చెబుతుందా..? అసలు కావ్య చెప్పనిస్తుందా? చెబితే నమ్ముతుందా? అనేది తర్వాతి ఎపిసోడ్‌లో చూడాలి.
Guppedantha Manasu Serial Promo: గుప్పెడంత మనసు సీరియల్‌లో వసుధార కోసం కంగారుగా ఎదురచూస్తుంటారు మహేంద్ర, అనుపమ. ఇంతలో వచ్చిన వసుధార జరిగింది చెబుతుంది. ఆ భద్ర శైలేంద్ర మనిషి అని.. తనను ముకుల్‌కు పట్టించినట్లు చెబుతుంది. ఆ శైలేంద్రను కూడా అరెస్ట్ చేయిస్తే అయిపోయేదని మహేంద్ర అంటే.. భద్రను ఇంట్రాగేట్ చేసిన తర్వాత శైలేంద్రను కూడా అరెస్ట్ చేస్తారు అని వసుధార అంటుంది. ఇంట్రాగేషన్‌లో రిషి గురించి కూడా తెలిసే అవకాశం ఉందని వసుధార అంటుంది.
భర్తకు ధరణి పంచ్
మరోవైపు భద్ర దొరికిపోయాడని తెలిసిన శైలేంద్ర ఏం చేయాలో రాత్రిపూట ఆలోచిస్తుంటాడు. అది చూసిన ధరణి పంచులు వేస్తుంది. తర్వాత భద్రను ముకుల్ ఇంట్రాగేట్ చేస్తుంటాడు. మహేంద్ర వాళ్ల ఇంటికి ఎందుకు వచ్చావ్, వసుధారపై ఎందుకు అటాక్ చేయాలనుకున్నావ్, ఎవరు చేయమన్నారు అని అడిగితే సైలెంట్‌గా ఉంటాడు భద్ర. నువ్ ఇదంతా చేసి డబ్బు కోసమే కదా. వాళ్లు ఆఫర్ చేసినదానికంటే ఎక్కువగా డబ్బు ఇస్తాను అని ముకుల్ అంటే.. ఆలోచించుకోడానికి ఉదయం వరకు సమయం ఇవ్వమని కోరతాడు భద్ర. దానికి సరేనంటాడు ముకుల్.
భద్రను తప్పించమని, అందుకు ఎంత డబ్బైన ఇస్తానని ఇంట్రాగేషన్‌లో ఉన్న కానిస్టేబుల్‌కు శైలేంద్ర కాల్ చేస్తాడు. కట్ చేస్తే ఉదయం మహేంద్ర వాళ్ల ఇంటికి వెళ్లిన ముకుల్ భద్ర తప్పించుకున్నాడని చెబుతాడు. దాంతో వసుధార, మహేంద్ర, అనుపమ షాక్ అయి లేచి నిల్చుంటారు. మరోవైపు భద్ర తప్పించుకున్నాడన్న సంతోషంలో ఉంటాడు శైలేంద్ర. దేవయాని దగ్గరికి వెళ్లి తనను చుట్టూ తిప్పుతాడు.
ధరణికి నిజం తెలుస్తుందా?
నేను భద్ర నిజాలు చెబుతాడని కంగారుపడుతుంటే సంతోషంగా ఉంటావేంటని దేవయాని అంటుంది. అసలు వాడు ఉంటే కదా అని శైలేంద్ర అంటాడు. ఆ మాటలు అన్నింటిని పక్కన చాటుగా ఉండి ధరణి వింటుంది. భద్రను శైలేంద్ర తప్పించిన విషయం, తనకు కానిస్టేబుల్ సహాయం చేసిన విషయం ధరణికి తెలుస్తుందా?, ఒకవేళ తెలిస్తే ఆ విషయాలు వసుధార వాళ్లకు ధరణి చెబుతుందా? అనేది తర్వాతి ఎపిసోడ్‌లో చూడాలి.
Krishna Mukunda Murari Promo: కృష్ణ ముకుంద మురారి ఫిబ్రవరి 5వ తేది ఎపిసోడ్ ప్రోమోలో మురారి, కృష్ణ గుడికి వెళ్తారు. నువ్ అనవసరంగా ఏదేదో ఊహించుకుని భయపడుతున్నావ్ అని మురారి అంటాడు. ఒక్కసారి జరిగే ప్రమాదం అనుకోవచ్చు. పదే పదే జరిగితే ఏమనుకోవాలి అని కృష్ణ తనలోని అనుమానాన్ని బయటపెడుతుంది. దాంతో కృష్ణ ఒక్కతే గుడి లోపలికి వెళ్తుంది. అక్కడ ఒక పూజారిని కలుస్తుంది. పూజారితో తనకు జరుగుతున్న ప్రమాదాలు లేదా శోభనం గురించి చెప్పిట్లు తెలుస్తోంది.
కృష్ణకు పెద్ద షాక్
దాంతో నీకు మృత్యంజయ మంత్రం ఉపదేశిస్తా. దాన్ని పటిస్తూ దేవుడి ముందు హారతి కర్పూరం వెలిగించు అని ఆ పంతులు కృష్ణకు చెబుతాడు. దాంతో అలాగే చేసేందుకు సిద్ధం అవుతుంది కృష్ణ. ఒక ఆకులో కర్పూరాన్ని వెలిగిస్తుంది కృష్ణ. అలా వెలిగించి సంతోషంగా దేవుడికి మొక్కుకుంటుంది. ఇంతలో ఆ కర్పూరం గాలికి ఆరిపోతుంది. అది చూసిన కృష్ణ ఒక్కసారిగా షాక్ అవుతుంది. కృష్ణకు దేవుడు కూడా షాక్ ఇచ్చినట్లు అయింది. ఏంటీ ఇలా జరిగింది అన్నట్లుగా కంగారుగా, భయంగా చూస్తుంది. దేవుడిపై వైపు దీనంగా చూస్తుంది కృష్ణ. పక్కనే పంతులు కూడా ఉంటాడు.