NTR 31 Jyothi Rai: ఎన్టీఆర్ 31లో గుప్పెడంత మనసు జగతి.. ఏం ట్విస్ట్ ఇచ్చావ్ ఆంటీ!-guppedantha manasu jagathi aka jyothi rai in ntr 31 movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ntr 31 Jyothi Rai: ఎన్టీఆర్ 31లో గుప్పెడంత మనసు జగతి.. ఏం ట్విస్ట్ ఇచ్చావ్ ఆంటీ!

NTR 31 Jyothi Rai: ఎన్టీఆర్ 31లో గుప్పెడంత మనసు జగతి.. ఏం ట్విస్ట్ ఇచ్చావ్ ఆంటీ!

Sanjiv Kumar HT Telugu
Jan 21, 2024 08:18 AM IST

Guppedantha Manasu Jyothi Rai In NTR 31: గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతిగా ఆకట్టుకున్న జ్యోతి రాయ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న ఎన్టీఆర్ 31 మూవీలో ఛాన్స్ కొట్టేసింది. దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఎన్టీఆర్ 31లో గుప్పెడంత మనసు జగతి.. ఏం ట్విస్ట్ ఇచ్చావ్ ఆంటీ!
ఎన్టీఆర్ 31లో గుప్పెడంత మనసు జగతి.. ఏం ట్విస్ట్ ఇచ్చావ్ ఆంటీ!

Jyothi Rai In NTR 31: తెలుగు ప్రేక్షకులకు బుల్లితెర ధారావాహికలు అదేనండి డైలీ సీరియల్స్ అంటే ఎంతో అభిమానం. ఎంతో ఇష్టంగా ఒక్క ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూస్తారు. అందులోని పాత్రలను నిజ జీవితపు మనుషులను పోల్చుకుంటూ మరి చూస్తారు. ఇక సీరియల్‌లో నటించే నటీనటులపై ఎంతో అభిమానం చూపిస్తుంటారు ప్రేక్షకులు. అలాంటి ఎందరో అభిమానులను సంపాదించుకుంది గుప్పెడంత మనసు జగతి మేడమ్.

స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు టాప్‌ సీరియల్స్‌లో ఒకటి. ఇందులో జగతి మేడమ్‌ పాత్ర రిషికి తల్లిగా, బాధ్యత గల టీచర్‌గా, ప్రేమించే భార్యగా ఎంతో చక్కగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంది. చీరకట్టులో ఎంతో హుందాతనంతో, అందంగా, తియ్యని మాటలతో చక్కని నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న జగతి అలియాస్ జ్యోతి రాయ్ గుప్పెడంత మనసు సీరియల్‌లో నటించడం ఆపేసింది.

గుప్పెడంత మనసులో జగతి పాత్ర చనిపోవడంతో జ్యోతి రాయ్ తప్పుకుంది. కానీ, సీరియల్ తర్వాత సోషల్ మీడియా వేదికగా జ్యోతి రాయ్ చేసిన రచ్చా అంతా ఇంతా కాదు. సెక్సీ పోజులు, హాట్ ఫొటోలతో యంగ్ హీరోయిన్లకు చెమటలు పట్టించేంతలా అందాలను ఆరబోసింది జ్యోతి రాయ్. ఆ ఫొటోలకు హాట్ ఆంటీ, సెక్సీ ఫిగర్, గార్జియస్ అంటూ వివిధ రకాల కామెంట్స్ వచ్చేవి. అయితే జ్యోతి రాయ్ సినిమాలు, వెబ్ సిరీసులతో ఫుల్ బిజీగా ఉంది.

సినిమా ప్రమోషన్ల భాగంగానే జ్యోతి రాయ్ అలాంటి హాట్ ఫొటోలు పోస్ట్ చేసేదని టాక్. ఇక తాజాగా జ్యోతి రాయ్ పోస్ట్ చేసిన ఫొటో చూసి అంతా షాక్ అయ్యారు. అది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన వార్త. జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తోన్న మరో క్రేజీ మూవీ ఎన్టీఆర్ 31లో (NTR31) జ్యోతి రాయ్ నటిస్తున్నట్లు ఉన్న ఫొటోను షేర్ చేసింది. దానికంటే ముందు ప్రశాంత్ నీల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన వ్యాఖ్యతో ఉన్న టైటిల్ ఉన్న న్యూస్‌ను కూడా ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది జ్యోతి రాయ్.

తాజాగా జ్యోతి రాయ్ షేర్ చేసిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎన్టీఆర్ 31లో జ్యోతి రాయ్ నటిస్తున్నట్లు ఎప్పటి నుంచి రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా జ్యోతి రాయ్ స్వయంగా పోస్ట్ షేర్ చేయడంతో ఆమె ఎన్టీఆర్ సినిమాలో నటిస్తున్నట్లు కన్ఫర్మ్ అయింది. ఈ న్యూస్‌కు హాట్ ఆంటీ మంచి ఛాన్స్ కొట్టేసింది, ఏం ట్విస్ట్ ఇచ్చావ్ ఆంటీ, జగతి మేడమ్ కంగ్రాట్స్ అంటూ నెటిజన్స్, అభిమానులు పలు రకాలుగా కామెంట్స్ రూపంలో ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

కాగా గుప్పెడంత మనసు సీరియల్ తర్వాత జ్యోతి రాయ్ సినిమాలతో బిజీగా మారింది. జ్యోతి రాయ్ ఇప్పుడు ప్రెట్టీ గర్ల్ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. ఈ సిరీస్ హిందీ, ఇంగ్లీషు భాషలో తెరకెక్కనుంది. ఈ సిరీస్ త్వరలో లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో విడుదల కానుంది. ఇదే కాకుండా నో మోర్ సీక్రెట్స్ అనే మరో మూవీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదల చేసింది. అందులో జ్యోతి రాయ్ లిప్ లాక్ ఇస్తూ కనపించింది.

అలాగే ఏ మాస్టర్ పీస్ అనే మరో మూవీ చేస్తోంది జ్యోతి రాయ్. ఏ మాస్టర్ పీస్ అనే మూవీకి డైరెక్టర్ సుకుపుర్వాజ్‍ దర్శకత్వం వహిస్తున్నాడు. సుకుపుర్వాజ్‌నే జ్యోతి రాయ్ పెళ్లి కూడా చేసుకోనుంది. ఇప్పటికే జ్యోతి రాయ్‌కు ఒక బాబు ఉన్నాడు.