Brahmamudi: శ్వేతపై రాజ్ ప్రేమను చూసి కుమిలిపోయిన కావ్య.. రాజీవ్‌తో దేవయాని కొత్త ప్లాన్.. మురారిని గుర్తుపట్టని ఆదర్శ్-brahmamudi guppedantha manasu krishna mukunda murari serial january 20th episode promo kavya collpsed emotionally ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi: శ్వేతపై రాజ్ ప్రేమను చూసి కుమిలిపోయిన కావ్య.. రాజీవ్‌తో దేవయాని కొత్త ప్లాన్.. మురారిని గుర్తుపట్టని ఆదర్శ్

Brahmamudi: శ్వేతపై రాజ్ ప్రేమను చూసి కుమిలిపోయిన కావ్య.. రాజీవ్‌తో దేవయాని కొత్త ప్లాన్.. మురారిని గుర్తుపట్టని ఆదర్శ్

Sanjiv Kumar HT Telugu
Jan 21, 2024 07:22 AM IST

Brahmamudi Serial Promo: స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతున్న టాప్ పాపులర్ తెలుగు సీరియల్స్ గుప్పెడంత మనసు, బ్రహ్మముడి, కృష్ణ ముకుంద మురారి చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. అలాంటి ఈ సీరియల్స్ జనవరి 22వ తేది ఎపిసోడ్స్‌లలో ఏం జరిగిందని ప్రోమోల్లో చూస్తే..

శ్వేతపై రాజ్ ప్రేమను చూసి కుమిలిపోయిన కావ్య.. రాజీవ్‌తో దేవయాని కొత్త ప్లాన్.. మురారిని గుర్తుపట్టని ఆదర్శ్
శ్వేతపై రాజ్ ప్రేమను చూసి కుమిలిపోయిన కావ్య.. రాజీవ్‌తో దేవయాని కొత్త ప్లాన్.. మురారిని గుర్తుపట్టని ఆదర్శ్

Brahmamudi Serial Promo: బ్రహ్మముడి సీరియల్ జనవరి 16వ తేది ఎపిసోడ్ ప్రోమోలో ఆఫీస్‌కు వెళ్తున్నాను అని చెప్పాను. కానీ వెళ్లలేదు. ఇది తెలిసిన కళావతి నన్ను అర్థం చేసుకుని ఉంటుందా.. లేదా అపార్థం చేసుకుంటుందా. ఏం అర్థం కావడం లేదే అని తనలో తానే ఆలోచిస్తుంటాడు రాజ్.

కాబోయే మొగుడేనంట

మరోవైపు హాస్పిటల్‌లో శ్వేత ఎత్తుకుని మరి రాజ్ తీసుకెళ్తుంటాడు. అది చూసిన కావ్య చాలా షాక్ అవుతుంది. రాజ్, శ్వేత వెంటే వెళ్లిపోతుంది. తర్వాత ఏయ్.. ఏంటే కేసు అని ఒక నర్సును మరో నర్స్ అడుగుతుంది. అప్పుడు కావ్య అక్కడే ఉండి వాళ్ల మాటలు వింటూ ఉంటుంది. నర్స్ అడిగిన దానికి ఏదో చిన్న గాయం అయింది. పక్కన ఉన్నది కాబోయే మొగుడేనంట అని మరో నర్స్ చెబుతుంది.

నర్సు చెప్పింది విని కావ్య గుండెల్లో అగ్ని పర్వతం బద్దలవుతుంది. షాక్ అయి అలానే చూస్తుంటుంది. ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో తెలుసా అని నర్సు అంటుంది. ఆ మాటలకు మరింత కుంగిపోయిన కావ్య వెళ్లి రాజ్, శ్వేతలను చూస్తుంది. హాస్పిటల్ వార్డ్ రూమ్‌లో బెడ్‌పై శ్వేత ఉంటుంది. శ్వేత చేతిని పట్టుకుని రాజ్ ఏదో మాట్లాడుతుంటాడు.

కావ్య ఏం చేస్తుంది

శ్వేతతో రాజ్ అంత ప్రేమగా మాట్లాడటం, శ్వేత నుదుటిపై ప్రేమగా నిమరడం అంతా డోర్ అద్దం నుంచి కావ్య చూస్తూ ఉంటుంది. అదంతా చూస్తూ కావ్య కుమిలిపోతుంది. వెక్కి వెక్కి ఏడుస్తుంది. మరి శ్వేత గురించి రాజ్‌ను కావ్య నిలదీస్తుందా.. మారతాడు అనుకున్న భర్త ఇలా చేస్తాడని ఊహించని కావ్య ఏం చేస్తుందో తర్వాతి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.

Guppedantha Manasu Serial Promo: గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషి ఎక్కడున్నాడో చెప్పమని వసుధారకు దండం పెట్టి మరి వేడుకుంటాడు మహేంద్ర. వాళ్ల మాటలు చాటుగా వింటున్న భద్ర ఫోన్ అప్పుడే రింగ్ అవుతుంది. దాంతో కిటికి పక్కన ఎవరున్నారో చూసేందుకు వసుధార వెళ్తుంది. కానీ, అక్కడ భద్ర ఉండడు. దాంతో మహేంద్ర వాళ్లు జాగ్రత్తపడతారు.

నిలదీసిన వసుధార

రిషి గురించి చెప్పే సమయంలో కాల్ చేసి చెడగొట్టారని శైలేంద్రపో కోప్పడతాడు భద్ర. నువ్ ఎప్పుడు ఏం చేస్తున్నావో నాకెల తెలుస్తుందని శైలేంద్ర వాదిస్తాడు. తర్వాత మహేంద్రతోనే ఉండి రిషి గాడు ఎక్కడున్నాడో తెలుసుకో అని కాల్ కట్ చేస్తాడు. భద్ర ఫోన్ మాట్లాడటం చూసిన మహేంద్ర, వసుధార, అనుపమ ఎవరు అని నిలదీస్తారు.

ఇన్సూరెన్స్ వాళ్లు అని కహానీ చెబుతాడు భద్ర. తర్వాత తనను అవమానిస్తే అక్కడ ఉండలేనని వెళ్లిపోమ్మంటే వెళ్లిపోతానని భద్ర అంటాడు. దాంతో పని చూసుకోమ్మని అనుపమ చెబుతుంది. మరోవైపు దేవయానికి రాజీవ్ కాల్ చేస్తాడు. అది లిఫ్ట్ చేసిన శైలేంద్రకు రాజీవ్‌కు చిన్నపాటి వాగ్వాదం జరుగుతుంది. వీడేంటి ఇంత టార్చర్ పెడుతున్నాడని శైలేంద్ర అనుకుంటాడు.

వసుధారకు సమస్య

తర్వాత వచ్చిన దేవయాని రాజీవ్ అని తెలిసి సంతోషంగా మాట్లాడుతుంది. అది చూసి శైలేంద్ర షాక్ అవుతాడు. తర్వాత రాజీవ్‌ను కలిసేందుకు దేవయాని, శైలేంద్ర వెళ్తారు. రాజీవ్ గురించి శైలేంద్రకు మొత్తం చెబుతుంది దేవయాని. రాజీవ్‌తో దేవయాని ఏం ప్లాన్ చేస్తుంది. వసుధారకు రాజీవ్‌తో మళ్లీ సమస్య తీసుకొచ్చేందుకు ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Krishna Mukunda Murari Promo: కృష్ణ ముకుంద మురారి జనవరి 16వ తేది ఎపిసోడ్ ప్రోమోలో కారులో వెళ్తున్న మురారి, కృష్ణ దారిలో ఓ చోట టీ కోసం ఆగుతారు. అక్కడ టీ తాగిన తర్వాత ఆదర్శ్ ఆచూకీ తెలిసి ఓ ప్లేసుకు వెళ్తారు. అక్కడ గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్‌లో కొంతమందికి పరేడ్ నిర్వహిస్తుంటాడు ఆదర్శ్.

గుర్తుపట్టని ఆదర్శ్

మురారి, కృష్ణలను ఆదర్శ్‌ చూస్తాడు. కానీ, పెద్దగా పట్టించుకోడు. ఆదర్శ్‌ను చూసి మురారి, కృష్ణ సంతోషిస్తారు. వెళ్లి కలుస్తారు. మురారి, కృష్ణను చూసిన ఆదర్శ్ కౌన్ హై తుమ్ లోగ్ (ఎవరు మీరంతా) అని అడుగుతాడు ఆదర్శ్. మురారి అని కృష్ణ సమాధానం చెబుతుంది. అయితే మురారి ఫేస్ మారిపోవడంతో ఆదర్శ్ గుర్తు పట్టడు. అతనే మురారి అని అర్థం అయ్యాకా.. చాలా సంతోషిస్తాడు ఆదర్శ్.

సంతోషంతో వెళ్లి మురారిని హగ్ చేసుకుంటాడు ఆదర్శ్. మురారి, కృష్ణ కూడా చాల ఆనందిస్తారు. ఇదంతా చాలా హృద్యంగా సాగుతుంది. ఆదర్శ్‌ను మురారి వాళ్లు ఇంటికి తీసుకెళ్తారా.. ముకుంద చేసిన పని బయటపడుతుందా అనేది తర్వాతి పూర్తి ఎపిసోడ్ వచ్చేదాకా ఆగాల్సిందే.

Whats_app_banner