Brahmamudi February 16th Episode: బ్రహ్మముడి సీరియల్.. స్వప్న దెబ్బకు రుద్రాణి విలవిల.. 5 లక్షలు మాయం.. పాపం అనామిక-brahmamudi serial february 16th episode swapna warning to rudrani rahul over kavya issue brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi February 16th Episode: బ్రహ్మముడి సీరియల్.. స్వప్న దెబ్బకు రుద్రాణి విలవిల.. 5 లక్షలు మాయం.. పాపం అనామిక

Brahmamudi February 16th Episode: బ్రహ్మముడి సీరియల్.. స్వప్న దెబ్బకు రుద్రాణి విలవిల.. 5 లక్షలు మాయం.. పాపం అనామిక

Sanjiv Kumar HT Telugu
Feb 16, 2024 08:19 AM IST

Brahmamudi Serial February 16th Episode: బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 16వ తేది ఎపిసోడ్‌లో రుద్రాణి, అనామికకు కోలుకోలేని ట్విస్ట్ ఇస్తుంది స్వప్న. దాంతో రుద్రాణి ఏడ్చినంత పని చేస్తుంది. రాహుల్‌కు కూడా వార్నింగ్ ఇస్తుంది స్వప్న. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 16వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 16వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో కావ్య దొంగతనం చేసిందని ధాన్యలక్ష్మీ, రుద్రాణి వెటకారంగా మాట్లాడుతుంటారు. డబ్బు తీసుకున్నట్లు నాకైనా చెబితే సరిపోయేది కదా అని అపర్ణ అంటుంది. అప్పుడే ఎంట్రీ ఇచ్చిన స్వప్న ఆ డబ్బు పోలేదని, తనకే కావ్య ఇచ్చిందని చెబుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. అందుకేనా ఈ షాపింగ్ ఇదంతా. దీనికోసం రెండు లక్షలు మొత్తం ఖర్చు పెట్టావా అని రుద్రాణి అంటుంది.

రెండు లక్షలు ఇచ్చినట్లు

మీ ఇద్దరికి నోరు ఇచ్చాడు కానీ, బ్రెయిన్ ఇవ్వలేదు. మా కావ్యకు బ్రెయిన్ ఇచ్చాడు కానీ, నోరు ఇవ్వలేదు అని స్వప్న కౌంటర్ వేస్తుంది. పూర్తిగా చెప్పకముందే అడ్డు పడేవారు ఉంటే ముందు బయటకు వెళ్లండి అని ఇందిరాదేవి అంటుంది. తను కొత్తగా ఆఫీస్‌కు వెళ్తుంది. ఇంటి తాళాలు కూడా ఇచ్చారు. ఇంట్లో వాళ్లకు డబ్బు అవసరం అయితే ఇబ్బందిపడకూడదని స్వప్న తనకు రెండు లక్షలు ఇచ్చినట్లు చెబుతుంది స్పప్న. దాంతో లేదు అబద్ధం. మీ ఇద్దరూ కూడబలుక్కుని అబద్దం చెబుతున్నారా అని రుద్రాణి అంటుంది.

అవునా.. మరి నిజం ఏంటీ.. నేను చెప్పింది అబద్దం అని వెంటనే ఎలా చెబుతున్నారు. రెండు లక్షలు పోలేదు అన్నాను. షాపింగ్ చేయలేదు అన్నాను. మా పుట్టింటివాళ్లకు ఇవ్వలేదు అని చెప్పాను. అయినా మీకెలా తెలుసు అని స్వప్న రివర్స్ అవుతుంది. దాంతో అవును స్వప్న చెప్పడం పూర్తి కాకముందే అబద్ధం అని టక్కున ఎలా అన్నావ్ అని ఇందిరాదేవి కూడా అంటుంది. దాంతో రుద్రాణి షాక్ అయి అలాగే ఉండిపోతుంది. అనామిక కూడా కంగారు పడుతుంది.

రుద్రాణి, అనామిక సైగలు

అంటే ఇంతకుముందు వీళ్లిద్దరు కలిసి నాటకం ఆడారు కదా అని రుద్రాణి అంటే.. అది గతం.. ఇప్పుడు గతం కాదు. ఇప్పుడు జరిగింది చెప్పు. నువ్ ఎలా అబద్ధం అన్నావ్ అని గట్టిగా అడుగుతుంది అపర్ణ. రుద్రాణి నోరుకు అడ్డు అదుపు ఎక్కడుంది అని సుభాష్ అంటాడు. ఆ డబ్బు నా దగ్గరే లాకర్‌లో సేఫ్‌గా ఉంది. వెళ్లి తీసుకొస్తాను అని పైకి వెళ్తుంది స్వప్న. అసలు ఏంటీ ఇది అన్నట్లుగా రుద్రాణి, అనామిక సైగలు చేసుకుంటారు. పైకి వెళ్లిన స్వప్న డబ్బు తీసుకొని వచ్చి అపర్ణకు ఇస్తుంది.

నాకు ఇచ్చినట్లు చెబితే అయిపోయేది కదే. ఎందుకే సైలెంట్‌గా ఉన్నావ్ అని కావ్యను అంటుంది స్వప్న. దాంతో లేచిన అపర్ణ.. ఏవమ్మా నా తోటి కోడలా ఇప్పుడు ఏం అంటావ్. ఇప్పటివరకు పడేసుకున్న నోరు ఏమైంది. ఇప్పటివరకు సాక్ష్యం లేదని ఊరుకున్నాను. పోయిందనుకున్న డబ్బు వచ్చింది. మరి నా కోడలిని అన్న మాటల సంగతి ఏంటీ అని అపర్ణ అంటుంది. వదిన అడుగుతుంది నిన్నే ధాన్యలక్ష్మీ. నోరు పడిపోయిందా. చెవులు పని చేయట్లేదా అని ప్రకాశం అంటాడు. రుద్రాణి కూడా అంది కదా ప్రకాశం అని సుభాష్ అంటాడు.

అపర్ణ ఫైర్

అంతేకాకుండా మా పుట్టింటికి ఏదో దోచి పెడుతున్నట్లు నానా మాటలు అన్నారు. డబ్బు దొరికినా కూడా మా అక్క ఒక్క మాట కూడా అనలేదు. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అని స్వప్న అంటుంది. లేని పెత్తనం ఎందుకు చూపిస్తున్నావ్. ఎవరి మీద అక్కసు ఎవరీ మీద తీస్తున్నావ్. ఎందుకు గయ్యాలీ దానిలా తయారు అవుతున్నావ్ అని ఇందిరాదేవి అంటుంది. ఇప్పుడు అడుగుతున్నాను. నా కోడలిని ఏమన్నావ్ అని అపర్ణ అంటే.. ఇంకా చూస్తుండటానికి సిగ్గు లేదా.. పో.. లోపలికి పో.. అని ప్రకాశం ఫైర్ అవుతాడు. దాంతో ధాన్యలక్ష్మీ లోపలికి వెళ్లిపోతుంది.

అనామిక, రుద్రాణి కూడా వెళ్లిపోతారు. తాళం పోతే కొత్తది కొనుక్కోవచ్చు. కానీ, పరువు పోతే తెచ్చుకోలేం. ఇలా బురదజల్లేవాళ్లు ఉంటూనే ఉంటారు. జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వెళ్లిపోతుంది అపర్ణ. రుద్రాణి, రాహుల్ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని అనుకుంటారు. ఇంతలో రుద్రాణికి తను దాచుకున్న డబ్బు గుర్తు వస్తుంది. వెళ్లి చూస్తుంది. అందులో ఉన్న రెండు లక్షలు కనిపించవు. నీ తల్లి డబ్బు నొక్కేసి తన చెల్లెలిని కాపాడుకుందిరా అని రుద్రాణి అంటుంది. నాకు తెలికుండా రెండు లక్షలు ఉంచుకున్నావా అని రాహుల్ అంటాడు.

నేనే మీకు కరెక్ట్

మన సంగతి అని అనబోయిన రుద్రాణికి మళ్లీ గుర్తుకువచ్చి లాకర్ చూస్తుంది. అందులో మొత్తం ఐదు లక్షలు ఉండాలి. మొత్తం ఊడ్చేసింది అని రుద్రాణి తెగ బాధపడిపోతుంది. ఒకరికీ తెలియకుండా ఇంకొరిని అడిగి మరి దాచుకున్న డబ్బు అని ఏడ్చినంత పని చేస్తుంది రుద్రాణి. ఇంతలో వచ్చిన స్వప్న ఏంటీ తెలిసిపోయిందా. నా చెల్లిని దొంగలా చేద్దామనుకున్నారు. నేనే మీకు కరెక్ట్ అందుకే రెండు లక్షలు తీసి ఇచ్చాను. అలాగే ఆ మూడు లక్షలు షాపింగ్ చేశాను అని స్వప్న అంటుంది.

ఇది అందరికీ చెబుతాను అని రాహుల్ అంటే.. చెప్పు ఈ డబ్బు ఎలా వచ్చిందే చెప్పు, ఆ డబ్బు ఎలా తీశారో కారణం కూడా చెప్పు అని స్వప్న అంటుంది. ఇంకోసారి ఇలా చేస్తే మీ కన్నుతో మీ వేలే పొడుస్తాను అని స్వప్న వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. అనంతరం నాపై పడ్డ నిందను క్షణాల్లో తుడిచేసావ్ కదా అని స్వప్నను హగ్ చేసుకుంటుంది కావ్య. నువ్ చాలా మారిపోయావ్ అని కావ్య అంటే.. ఒక్క మంచి పని చేసినంతా మాత్రానా మంచిదాన్ని అయిపోనే.. నేను అప్పటి స్వప్ననే. నాకు స్వార్థం ఎక్కువ. నాకు మారాలని కూడా లేదు. మూడో మనిషి మధ్యకు వస్తే తొక్క నారా తీస్తా అని స్వప్న అంటుంది.

ఇది మా కాపురం

నువ్ నిజంగా మంచి రాక్షసివే అని కావ్య అంటుంది. అనంతరం రాత్రి రాజ్‌ను చూస్తూ ఇందిరాదేవి మనసులో వీడా ఇదంతా చేస్తుంది అనుకుంటుంది. మీ కాపురం నిజంగా బాగానే ఉందా అని ఇందిరాదేవి అడుగుతుంది. దాంతో కంగారుపడిపోయిన రాజ్.. కావ్యను పిలిచి మేము చాలా అన్యోన్యంగా ఉన్నామని చెప్పు అని నాటకం ఆడుతాడు. దాంతో ఇది మా కాపురం అని కావ్య అంటుంది. దాంతో రాజ్ పైకి వెళ్లిపోతాడు. వాడు నా ముందే నాటకం ఆడుతున్నాడు. నువ్ కూడా నాటకానికి తెరతీయి. నీ వెనుక నేను ఉండి ఆడిస్తాను అని ఇందిరాదేవి అంటుంది.

పైన రాజ్ కావాలనే శ్వేతతో ప్రేమగా మాట్లాడుతాడు. అది విన్న కావ్య.. మీ ఇద్దరి మధ్య నేను అడ్డుగా ఉన్నాను. ఇక నేను డిస్టర్బ్ చేయను. మీరు మాట్లాడుకోండి. పెళ్లికి ముందే బాగా మాట్లాడుకోని డీప్‌గా అర్థం చేసుకోండి. లేకుంటే మన కాపురంలా అవుతుంది. నేను మిమ్మల్ని క్లియర్‌గా అర్థం చేసుకున్నాను అని బయటకు వెళ్లి పోతుంది కావ్య. అదంతా విన్న రాజ్ షాక్ అవుతాడు. కానీ, నేను బయట పడుకుంటే అందరికీ అనుమానం వస్తుంది. నేను మన బ్రహ్మముడి తెంపేసి మా పుట్టింటికి వెళ్తాను. నేను ఇక్కడే పడుకుంటాను. నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉంటా. మీరు మాట్లాడుకోండి. శ్వేతను కూడా అడిగినట్లు చెప్పమని కావ్య అంటుంది.

రాజ్‌కు కౌంటర్స్

దాంతో రాజ్ అయోయమంగా ఉంటాడు. బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో ఉదయం మీరు సర్‌ప్రైజ్ గురించి ఆలోచించి నిద్రపోలేదని తెలుస్తోంది అని రాజ్‌ను అంటుంది కావ్య. ఇంతలో వచ్చిన ఇందిరాదేవి కావ్య ఇంకా ఇలా ఉన్నావేంటి. ఆ సర్‌ప్రైజ్ సంగతి చూడు అని ఇందిరాదేవి అంటుంది. నీకు తెలుసా అదేంటో అని రాజ్ అంటే.. సర్‌ప్రైజ్ అని తెలుసు అని ఇందిరాదేవి అంటుంది.