Brahmamudi January 27th Episode: స్వప్నపై మర్డర్ ప్లాన్.. వణికిపోయిన రుద్రాణి, రాహుల్.. కల్యాణ్ డ్రామా, బుక్కయిన ధాన్యం-brahmamudi serial january 27th episode kavya kalyan plays drama in front of dhanya lakshmi for kavya going to office ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi January 27th Episode: స్వప్నపై మర్డర్ ప్లాన్.. వణికిపోయిన రుద్రాణి, రాహుల్.. కల్యాణ్ డ్రామా, బుక్కయిన ధాన్యం

Brahmamudi January 27th Episode: స్వప్నపై మర్డర్ ప్లాన్.. వణికిపోయిన రుద్రాణి, రాహుల్.. కల్యాణ్ డ్రామా, బుక్కయిన ధాన్యం

Sanjiv Kumar HT Telugu
Jan 27, 2024 08:47 AM IST

Brahmamudi Serial January 27th Episode: బ్రహ్మముడి సీరియల్ జనవరి 27వ తేది ఎపిసోడ్‌‌లో తనమీద మర్డర్ అటెంప్ట్ చేస్తున్నారని వీడియో తీసి రుద్రాణి, రాహుల్ వణికేలా చేస్తుంది స్వప్న. ఎక్స్‌పైర్ అయిన ట్యాబ్లెట్స్ తెచ్చారని గగ్గొలు పెడుతుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ జనవరి 27వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ జనవరి 27వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో తోడి కోడల్లు అయిన అపర్ణ, ధాన్యలక్ష్మీకి బుద్ధి చెబుతుంది ఇందిరాదేవి. ఇద్దరూ ఒకే మాట మీద నిలబడి ఉండాలి. అప్పుడు చెప్పుడు మాటలు వినే అవసరం ఉండదు. ఇదంతా అధికారం కోసం చేస్తున్నట్లు ఉంది. మీరు ఇలా ఉండి మీ కోడళ్లకు ఏం చెప్పాలనకుంటున్నారు. మీ మీద గౌరవం కోల్పోతారు. మీరు అధికారం కోసం చేస్తే వాళ్లు చేస్తే లేనప్పుడు మేం చేస్తే తప్పేంటి అని మీ కోడళ్లు అనుకుంటారు అని ఇందిరాదేవి అంటుంది.

ఇచ్చే విలువ ఇస్తా

కోడల్లకు సలహా ఇచ్చే గౌరవం కోల్పోతారు. ఇకనుంచి అలా ఉండకండి. అర్థమైందా అని క్లాస్ పీకుతుంది ఇందిరాదేవి. నాకు అర్థమైంది. అక్కకు అర్థమైందో లేదో అని ధాన్యలక్ష్మీ అంటే.. ఎహే.. ఈ సన్నాయి నొక్కులు నొక్కకు అని అపర్ణ అంటుంది. మీరు ఇలా గొడవ పడటం ఇంకోసారి నేను చూడకూడదు అని వెళ్లిపోతుంది ఇందిరాదేవి. సారీ అక్క. ఇచ్చే విలువ ఇస్తే నేనెందుకు అలా అంటాను అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇకనుంచి ఇచ్చే విలువ ఇస్తా. నీ జోలికి నేను రాను. నా జోలికే వస్తాను అని చెప్పేసి వెళ్లిపోతుంది అపర్ణ.

అక్క ఇప్పుడు ఏం చెప్పింది. నా జోలికి రానని చెప్పిందా. నాకేంటీ ముందుంది ముసళ్ల పండుగ అని చెప్పినట్లు ఉందని కాస్తా అనుమానంగా ఆలోచిస్తుంది ధాన్యలక్ష్మీ. మరోవైపు స్వప్నకు యాపిల్ కట్ చేసి తీసుకొస్తుంది రుద్రాణి. ట్యాబ్లెట్స్ తీసుకొచ్చావా అని స్వప్న అడిగితే.. రాహుల్ తెచ్చి ఇస్తాడు. ఆ ట్యాబ్లెట్స్‌ను వీడియో తీసి.. అందులో స్వప్న మాట్లాడుతుంది. నా పేరు స్వప్న. వీళ్లు నా అత్త, నా భర్త. నాకు వీళ్లు ఈ ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి ఇచ్చారు అని వీడియోలో చెబుతుంది స్వప్న.

మర్డర్ అటెంప్ట్

ఇప్పుడు వీడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నావని రుద్రాణి అడుగుతుంది. అయినా ఆగకుండా స్వప్న వీడియో తీస్తుంది. ఇది ఎవరు తీసుకొచ్చారు అని స్వప్న అంటే.. నేను తీసుకొచ్చాను అని రాహుల్ అంటాడు. ఎవరికి చెప్పాను అని స్వప్న అంటే.. నాకు చెప్పావు అని రుద్రాణి అంటుంది. నేనే తీసుకొచ్చాను అని రాహుల్ చెబుతాడు. చూశారుగా. వీళ్లిద్దరు నా మీద మర్డర్ అటెంప్ట్ చేశారు. ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డర్. గౌరవనీయులైన జడ్జి గారు ఇది మీరు గమనించి ఈ నేరస్తులకు శిక్ష వేయండి అని వీడియోలో చెబుతుంది స్వప్న.

ఏ స్వప్న ఏంటిది.. మేము నిన్ను చంపాలనుకోవడం ఏంటని రుద్రాణి అడుగుతుంది. మీరు నాకు విషయం తీసుకొచ్చి ఇచ్చారు అని ట్యాబ్లెట్స్ చూపిస్తుంది స్వప్న. ఇవి ఏమైనా కత్తులా కటార్లా, గన్నులా వీటితో ఎలా చస్తావ్ అని రుద్రాణి అంటుంది. ఇవి వాటికంటే డేంజర్. మీరు ఎక్స్‌పైర్ అయిన ట్యాబ్లెట్స్ తీసుకొచ్చారు. నేను నా శీలాన్ని నిరూపించుకున్నాను. అయినా మీరు నన్ను వదిలించుకోవాలనుకుంటున్నారు. నేను కోర్టుకు వెళ్తాను. ఇప్పుడు ఇంట్లో అందరి ముందు మీ బాగోతం బయటపెడతాను. మీడియా మిత్రులను పిలిచి మీ దరిద్రపు మొఖాలను 24 గంటలు చూపించేలా చేస్తాను అని స్వప్న వెళ్లిపోతుంటుంది.

దండం పెట్టిన రాహుల్

స్వప్నను ఆపిన రుద్రాణి.. వాడు ఏదో చూసుకోకుండా తెచ్చి ఉంటాడులే అని అంటుంది. నేను నిజంగానే చూసుకోకుండా తెచ్చా. ఇంకోసారి అలా చేయను. నేను ఇండియాలో అన్ని ప్లేసులకు వెళ్లాను గానీ, ఒక జైలుకు వెళ్లలేదు. వెళ్లాలని కూడా అనుకోవట్లేదు. నిన్ను మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నా. ఈ ఒక్కసారికి క్షమించు అని చేతులతో దండం పెడుతాడు రాహుల్. దాంతో సరే అన్న స్వప్న ఇంకోసారి ఇలా చేస్తే మీ పని అంతే.. వీడియో కూడా ఉంది అని స్వప్న బెదిరిస్తుంది.

పాత కక్షలను మనసులో పెట్టుకుని మాకు శిక్ష వేయించాలని అనుకోవడం కరెక్టా. అయినా నువ్ ఒక లాజిక్ మిస్ అవుతున్నావ్. నీకు ఏమైనా జరిగితే ముందు మా మీదే అనుమానం వస్తుందని ప్రతి బచ్చా గాడికి తెలుసు అని రుద్రాణి అంటుంది. అవును, మీ అంతా నీచులు, నికృష్టులు, మేకవన్నె పులులు లేరని ఈ ప్రపంచం మొత్తం తెలుసు. ఏం జరిగినా మీ మీదే అనుమానం వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండని చెప్పిన స్వప్న వెళ్లిపోండి అని కసురుకుంటుంది. దాంతో రుద్రాణి, రాహుల్ ఇద్దరూ బయటకు వెళ్లిపోతారు.

మన మీద పడలేదు

మరోవైపు హాల్లో టిఫిన్ చేయడం గురించి కావ్య చెబుతుంది. అంతా ఓకే చేయమని అంటే మాకు వద్దు. ఇక నుంచి మాకు ఏం కావాలో మేమే చేసుకుంటాం. మీరు కూడా అదే తినాలి అని ధాన్యలక్ష్మీ అడ్డుపడుతుంది. దాంతో ఏమవుతుందో అని ప్రకాశం భయపడిపోతాడు. కావ్య నువ్ పెసరట్టే చేయి.. నచ్చినవాళ్లు తింటారు. లేకుంటే లేదు అని కావ్యకు సపోర్ట్ చేస్తుంది అపర్ణ. ఇదంతా పైనుంచి చూస్తున్న రాజ్, కల్యాణ్ మాట్లాడుకుంటారు. ఈ గొడవలో పడి పిన్ని మన మీద పడలేదు అని రాజ్ అంటాడు.

నేను అయితే వదినా చేసిందే తింటాను అని కల్యాణ్ అంటాడు. మరి పిన్నికి ఏం చెప్తావ్ అని రాజ్ అంటే.. పెద్దమ్మ మీద తోసేస్తాను అని కల్యాణ్ అంటాడు. అంటే.. రెండు పులులు కొట్టుకుంటే మధ్యలో నక్క లాభం పొందినట్లు.. వాళ్ల గొడవను నీకు అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నావన్న మాట అని రాజ్ అంటాడు. దాంతో ఆలోచించిన కల్యాణ్.. అవును.. వీళ్ల గొడవలతో వదినను ఆఫీస్‌కు పంపొచ్చు అని మనసులో అనుకుంటాడు. వావ్.. భలే ఐడియా ఇచ్చావ్ అన్నయ్య. నువ్ నిజంగా జీనియస్. ఒక జీవితాన్ని కాపాడావు అని కల్యాణ్ చెప్పి వెళ్లిపోతాడు.

వాళ్లే కలుస్తారు

నేను సామెతేగా చెప్పాను. ఇందులో ఐడియా ఏముంది అని రాజ్ ఆలోచిస్తుంటాడు. దాంతో కావ్య దగ్గరికి వెళ్లిన కల్యాణ్.. శ్వేతతో అన్నయ్యకు ఉన్న బంధం తెలియాలంటే ఆఫీస్‌కు వెళ్లాలని చెబుతాడు. వాళ్లిద్దరి గొడవను మనం అడ్వాంటేజ్ తీసుకోవాలి అని కల్యాణ్ అంటాడు. కానీ, వాళ్ల మధ్య దూరం ఇంకా పెరుగుతుంది అని కావ్య అంటే.. వాళ్లు భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నారు. వాళ్లే కలుస్తారు. కానీ, ఈ సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా అన్నయ్యకు శ్వేత మధ్య ఉన్న రిలేషన్‌ను తెలుసుకోవాలి అని కల్యాణ్ అంటాడు.

అంటే వాళ్ల గొడవ పెంచి నా పచ్చని కాపురాన్ని కాపాడుకోవాలంటారా. ఇదంతా వద్దని కావ్య అంటే.. ఏం కాదు వదినా రండి అని తీసుకెళ్తాడు. ధాన్యలక్ష్మీ దగ్గరగా ఉండి.. హమ్మయ్యా ఎవరు లేరు ఇక్కడ అని గట్టిగా అంటాడు కల్యాణ్. దాంతో వెనక్కివెళ్లి దాక్కుని దొంగచాటుగా వింటుంది ధాన్యలక్ష్మీ. తన ముందు ఆఫీస్‌కు వెళ్లడం, డిజైన్స్ గీయడం వంటివి కావాలనే మాట్లాడుతూ డ్రామా చేస్తారు కావ్య, కల్యాణ్. దాంతో ఏంటే నా కొడుకుని అసమర్థుడిని చేసి నువ్ ఆఫీస్‌కు వెళ్లి రాజ్యం ఏలుదామనుకుంటున్నావా అని ధాన్యలక్ష్మీ అనుకుంటుంది.

లైఫ్ సెటిల్ చేసుకుంటే

మరోవైపు అప్పుకు తన ఫ్రెండ్ మధు ఉద్యోగం ఇప్పిస్తుంది. దాంతో తన ఫ్రెండ్‌కు థ్యాంక్స్ చెబుతుంది. లైఫ్ సెటిల్ అయ్యే అవకాశాన్ని వదిలేసుకుని వచ్చి ఇప్పుడు పరిస్థితి గురించి మాట్లాడుతున్నావా అని మధు అంటుంది. లైఫ్ సెటిల్ అయ్యే అవకాశామా అని అప్పు అడిగితే.. కల్యాణ్. నాకే అలాంటి బాయ్ ఫ్రెండ్ ఉంటే పెళ్లి చేసుకుని లైఫ్ సెటిల్ చేసుకునేదాన్ని అని మధు అంటుంది. నేను ఫ్రెండ్స్‌ను అలా వాడుకోలేను అని అప్పు అంటుంది. ఊరుకో అప్పు మనలాంటి వాళ్లి ఫ్రెండ్‌షిప్ చేసేది ఎందుకు టైమ్ వచ్చినప్పుడు పెళ్లి చేసుకునేందుకేగా అని మధు అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Whats_app_banner