Brahmamudi February 12th Episode: బ్రహ్మముడి సీరియల్.. బెడిసికొట్టిన అనామిక ప్లాన్.. ధాన్యంపై అపర్ణ ఫైర్, రాజ్‌కు పంచ్‌-brahmamudi serial february 12th episode anamika rudrani plan fail over to prove kavya is thief aparna angry at dhanyam ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi February 12th Episode: బ్రహ్మముడి సీరియల్.. బెడిసికొట్టిన అనామిక ప్లాన్.. ధాన్యంపై అపర్ణ ఫైర్, రాజ్‌కు పంచ్‌

Brahmamudi February 12th Episode: బ్రహ్మముడి సీరియల్.. బెడిసికొట్టిన అనామిక ప్లాన్.. ధాన్యంపై అపర్ణ ఫైర్, రాజ్‌కు పంచ్‌

Sanjiv Kumar HT Telugu
Feb 12, 2024 07:35 AM IST

Brahmamudi Serial February 12th Episode: బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 12వ తేది ఎపిసోడ్‌లో కావ్యపై దొంగతనం నేరం మోపడానికి ట్రై చేసిన అనామిక, రుద్రాణి ప్లాన్ బెడిసికొడుతుంది. ధాన్యలక్ష్మీపై అపర్ణ తెగ ఫైర్ అవుతుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 12వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 12వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో పార్టీ చేసుకుందామని రాజ్, శ్వేత కారులో వెళ్తుంటారు. ఆఫీస్‌లో క్లైంట్స్‌తో మీటింగ్ ఉందని కావ్య కాల్ చేస్తుంది. కానీ, రాజ్ లిఫ్ట్ చేయడు. మనల్ని చూసి కుళ్లుకుంటుంది అని రాజ్ అంటే.. ఏదైనా ఇంపార్టెంట్ పని ఉండొచ్చు కదా అని శ్వేత అంటుంది. నాకు దాని గురించి చాలా బాగా తెలుసు. ఇదంతా కుల్లుతనంతో చేస్తుందని రాజ్ అంటాడు. రాజ్ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో సర్ చాలా బిజీగా ఉన్నట్లున్నారు మావయ్య అని సుభాష్‌కు చెబుతుంది కావ్య.

క్లైంట్స్ మీటింగ్ ముఖ్యం

క్లైంట్స్ వచ్చారు. ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచిస్తుంటారు సుభాష్, కావ్య. ఇంతలో కల్యాణ్‌ను పక్కకు తీసుకెళ్తుంది కావ్య. ఆయన శ్వేతకు విడాకులు వచ్చిన ఆనందంలో తెగ సంతోషంలో ఉన్నారు. ఇక వాళ్లు పెళ్లి చేసుకోడానికి ఏ అడ్డంకి లేదని ఆనందంలో మునిగిపోతున్నారు అని కావ్య అంటుంది. అవునా.. అని షాక్ అవుతాడు కల్యాణ్. అది తర్వాత ఆలోచిద్దాం. ముందు క్లైంట్స్ మీటింగ్ ముఖ్యం. ఓసారి మీరు కాల్ చేయండి అని కావ్య అంటుంది. దాంతో కల్యాణ్ కాల్ చేస్తాడు.

అది చూసిన రాజ్ చూశావా దాని డెత్ తెలివితేటలు.. తన కాల్ లిఫ్ట్ చేయలేదని నా తమ్ముడి ఫోన్ నుంచి కాల్ చేయిస్తుంది. ఇప్పుడు దానికి తినిపిస్తా.. మండేలా చేస్తా అని రాజ్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఏంటీ కుళ్లుబోతు మేం శ్వేత పార్టీ చేసుకుంటామని తెలిసి తట్టుకోలేక మా తమ్ముడి ఫోన్ నుంచి కాల్ చేయిస్తున్నావా అని రాజ్ అంటాడు. చేయించడం కాదు. నేనే మాట్లాడుతున్నాను. ఆ ముద్ర వాళ్లతో మీటింగ్ పెట్టుకుని ఎక్కడ ఉన్నావన్నయ్య అని కల్యాణ్ అంటాడు.

సుభాష్ ఆర్డర్

అయ్యో.. మర్చిపోయాను. వస్తున్నాను. పదే నిమిషాల్లో ఉంటాను అని రాజ్ అంటాడు. సారీ శ్వేత ముఖ్యమైన మీటింగ్ ఉంది. ఆఫీస్‌కు వెళ్దాం అని రాజ్ అంటాడు. మరోవైపు సార్ రాజ్ సర్ వచ్చేలా లేరు. కానీ, ఆ డిజైన్స్ గురించి మొత్తం కావ్యకు తెలుసు. ఆ డిజైన్స్ వేసిందే కావ్య మేడమ్. కానీ, ఇలా చేస్తే రాజ్ సర్‌కు కోపం వస్తుంది అని సెక్రటరీ శ్రుతి అంటుంది. అది ఇప్పుడా చెప్పేది అని కావ్యను పిలిచి డెమో ఇవ్వమంటాడు సుభాష్. రాజ్ సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి క్లైంట్స్‌కు కావ్యను పరిచయం చేస్తాడు సుభాష్.

డిజైన్స్ గురించి కావ్య చెబుతుంది. మరోవైపు రాజ్ వేగంగా కారు నడపడం చూసి భయమేస్తుందని శ్వేత అంటుంది. 11 గంటలకు మీటింగ్ అన్నాను. కానీ, 12 అవుతుంది. అసలే ఐదు కోట్ల ప్రాజెక్ట్ అని రాజ్ అంటాడు. అందుకే కావ్య మీద కోపంతో చేస్తే ఇలాగే ఉంటుంది. తను బాధపడాలనే ఆగిపోయావ్. లేకుంటే ఆఫీస్‌కు వెళ్లేవాడివి కదా అని శ్వేత అంటుంది. టెన్షన్ పెట్టకు అని రాజ్ అంటాడు. మరోవైపు ఇంట్లో చదువుకోడానికి ఉన్న వస్తువులతో మేనేజ్ చేస్తుంది. అది చూసి కనకం, కృష్ణమూర్తి మెచ్చుకుంటారు.

కావ్యను మెచ్చుకున్న క్లైంట్స్

పక్కకు వచ్చి అప్పును చూస్తుంటే అనుకున్నది సాధించేలా ఉంది. తను జీవితంలో కచ్చితంగా పైకి వస్తుందని కృష్ణమూర్తి అంటాడు. అవును, ఆ కల్యాణ్‌ను మర్చిపోయి ఇలా నార్మల్ అవుతుందని అనుకోలేదు అని కనకం అంటే.. ఇంకోసారి అతని పేరు తీసి అప్పును బాధపెట్టకు. అతని పేరు వింటే బాధపడుతుంది అని కృష్ణమూర్తి అంటాడు. మరోవైపు డిజైన్స్ చాలా బాగున్నాయని, డీల్ ఓకే అని క్లైంట్స్ కావ్యను మెచ్చుకుంటారు. ఇంతలో రాజ్, శ్వేత వస్తారు.

రాజ్ రాగానే సర్ మీరు మీటింగ్ మిస్ అయ్యారు. కానీ మేము మిమ్మల్ని మిస్ అవ్వలేదు. మాకు డీల్ ఓకే. మీ మిస్సెస్ గారి డెమో బాగుంది. కంగ్రాట్స్ అని చెప్పి వెళ్లిపోతారు ముద్ర వాళ్లు. నీకు కొంచెమైనా రెస్పాన్సిబులిటీ లేదా. ముఖ్యమైన మీటింగ్ పెట్టుకుని ఎక్కడికి వెళ్లావ్. అయినా ఎవరు ఈ అమ్మాయి అని సుభాష్ అడుగుతాడు. దానికి రాజ్ అది ఇది అంటూ సైలెంట్‌గా ఉంటే.. ఆయనకు ఆమె బెస్ట్ ఫ్రెండ్ అని కావ్య అంటుంది. చాలా క్లోజ్ ఫ్రెండ్ పెదనాన్న అని కల్యాణ్ అంటాడు.

కాలేజీ నుంచే ఫ్రెండ్స్ కదా

బెస్ట్ ఫ్రెండ్ అయితే ఇప్పటివరకు మాకు ఒక్కసారి కూడా పరిచయం చేయలేదని సుభాష్ అంటాడు. మీకు ఆఫీస్‌లో జరిగే విషయాలు తెలియదు మావయ్య. మీరు పైన ఉంటారు. ఆమె రోజు వచ్చి వెళ్లిపోతుంది అని కావ్య అంటుంది. పెదనాన్న అడిగేది అది కాదు వదినా. ఇలాంటి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉందని, కనీసం మాట వరుసకు అయినా చెప్పలేదే అని కల్యాణ్ అంటాడు. ఏదో ఈ మధ్య కలిసింది అని రాజ్ అంటే.. అదేంటీ తను నీ క్లాస్‌మేట్ కదా. కాలేజీ నుంచి ఫ్రెండ్స్ కదా. ఏం శ్వేత అని కల్యాణ్ అంటాడు. అవును అని శ్వేత అంటుంది.

మీరు శ్వేతను మీ క్యాబిన్‌కు తీసుకెళ్లండి. మర్యాదలు చేయండి అని కావ్య అంటుంది. సరే సరే మొత్తానికి కావ్య వల్ల ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వచ్చింది అని సుభాష్ అంటాడు. మరోవైపు చిచ్చు నువ్వు పెట్టు, ఆజ్యం మీ అత్త పోస్తుంది. మనం వేడుక చూద్దాం అని రుద్రాణి అంటుంది. దాంతో అపర్ణ దగ్గరకు వెళ్లిన అనామిక ఇంటి తాళాలు చూపించి.. ఇవి మీరు కావ్యకు ఇచ్చినవే కదా. కావ్య బెడ్ రూమ్‌లో పడి ఉన్నాయి అని అనామిక చెబుతుంది. దాంతో అపర్ణ షాక్ అవుతుంది. దొరికింది మా అక్కయ్య అని ధాన్యలక్ష్మీ అనుకుంటుంది.

డిలీట్ చేసి మర్చిపోయాడు

ఇదే అదనుగా కావ్యను అంటూ నానా మాటలు అంటుంది ధాన్యలక్ష్మీ. ఇలాంటి కోడలు ఎక్కడైనా ఉందా.. తాళాలు ఇచ్చి పూటైన గడవలేదు, గంటైనా కాలేదు అని ఇలా పారేసుకుంది. ఎంత చక్కని కోడలు అని వెటకారంగా ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో అనుకున్నాను. నువ్ ఇలా వచ్చి అంటావని. ఏంటీ సుధీర్ఘమైన వెటకారం పద్యం చదివావు. నీ భర్త ల్యాప్‌ట్యాప్‌లో ముఖ్యమైన డేటాను డిలీట్ కొట్టి మర్చిపోయాను అన్నయ్య అన్నప్పుడు నేను ఇలాగే అన్నానా అని అపర్ణ అంటుంది.

అక్కడ మూతి బిగపట్టి చూస్తున్నా ఆ రుద్రాణి తన కొడుకు రాహుల్ స్వప్నను ట్రాప్ చేసి పెళ్లిపీటలపై నుంచి లేపుకెళ్లినప్పుడు ఏమైనా అన్నానా. ఇంక నువ్వు బ్యూటిపార్లర్‌కు వెళ్లి హారం పోగొడితే ఇంకోటి కొనిచ్చానే కానీ ఒక్క మాట అనలేదు. ఇవాళ నీకు, నీ కోడలికి, అక్కడ నిల్చున్న వింతజీవిని నేను ఇవాళ నిరాశపరుస్తున్నాను. ఏదో పొరపాటుగా తాళాలు మర్చిపోయి ఉంటుంది. కానీ నా కోడలు పొరపాట్లు చేసే మనిషి కాదు. కంగారులో మర్చిపోయి ఉంటుంది కానీ, తప్పు చేసే మనిషి కాదు అని అపర్ణ అంటుంది.

పెద్ద కోడలిదే పెత్తనం

మీరు అన్నారు కదా అని ఉగ్రరూపంతో ఊగిపోను. కావ్య ఎప్పుడు వస్తుందా అని కాలు కాలిన పిల్లిలా ఎదురుచూడను. సగం తాగిన కాఫీ చల్లారిపోయి ఉంటుంది. ఇంకోటి కలుపుకో పో అని అపర్ణ అంటుంది. తాళాలు నా కోడలు పారేస్తే ఏం చేస్తావ్ అని ధాన్యలక్ష్మీ అంటే.. అసలు నీ కోడలుకి నేను ఎందుకు తాళాలు ఇస్తాను. ఎప్పుడైన ఇంటి పెత్తనం పెద్ద కోడలిదే అని అపర్ణ అంటుంది. నా మీద కోపంతోనే కదా కావ్యను వెనుకేసుకొస్తున్నావ్ అని ధాన్యలక్ష్మీ అంటే.. ఇంతకుముందు నువ్వు అలాగే చేశావ్ కదా అని అపర్ణ అంటుంది.

అర్హత లేని వాళ్లకు అందలం ఎక్కిస్తే ఎలా ఉంటుందో నీకు త్వరలోనే తెలుస్తుందని ధాన్యలక్ష్మీ అంటే.. అయితే ఆ మాటలు అప్పుడు అను. అప్పటివరకు దాచి ఉంచుకో అని వెళ్లిపోతుంది అపర్ణ. తర్వాత అనామిక దగ్గరికి వచ్చిన రుద్రాణి మీ అత్త మీద ఫైర్ అయింది ఏంటీ అని అంటుంది. ఇంటి పెత్తనం ఎప్పుడు పెద్ద కోడలిది అంటుంది. నేను ఎప్పుడు ఈ ఇంటికి దాసోహం అన్నట్లుగానే ఉండాలా అని అనామిక అంటుంది. అలా ఏం ఉండదు. ఒక్కసారి 2 లక్షలు పోయాయని తెలియని. అప్పుడు చూస్తావ్ నీ పెద్దత్తయ్య విశ్వరూపం అని రుద్రాణి అంటుంది.

Whats_app_banner