Brahmamudi January 24th Episode: కావ్యకు శ్వేత గురించి చెప్పిన కల్యాణ్.. రెచ్చగొట్టిన రుద్రాణి, టెన్షన్‌లో అనామిక-brahmamudi serial january 24th episode kalyan reveals shwetha is a classmate at college and anamika tensed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi January 24th Episode: కావ్యకు శ్వేత గురించి చెప్పిన కల్యాణ్.. రెచ్చగొట్టిన రుద్రాణి, టెన్షన్‌లో అనామిక

Brahmamudi January 24th Episode: కావ్యకు శ్వేత గురించి చెప్పిన కల్యాణ్.. రెచ్చగొట్టిన రుద్రాణి, టెన్షన్‌లో అనామిక

Sanjiv Kumar HT Telugu
Jan 24, 2024 07:18 AM IST

Brahmamudi Serial January 24th Episode: బ్రహ్మముడి సీరియల్ జనవరి 24వ తేది ఎపిసోడ్‌‌లో అపర్ణ, ధాన్యలక్ష్మీ ఇద్దరికి తమ భర్తలు సుభాష్, ప్రకాశం బెదిరిపోతారు. ఇంట్లో ఏం యుద్ధం తీసుకొస్తారో అనుకుని మందేద్దామని ఫిక్స్ అవుతారు. మరోవైపు శ్వేత గురించి కావ్యకు చెబుతాడు కల్యాణ్. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో

బ్రహ్మముడి సీరియల్ జనవరి 24వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ జనవరి 24వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో శ్వేతతో రాజ్ ఉన్న విషయాలను గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది కావ్య. ఇంటి బయట మంచులో కూర్చుని కుమిలిపోతుంటుంది. ఇంతలో అక్కడికి రాజ్ వస్తాడు. పక్కన కూర్చుని ఒంట్లో బాగోలేదట. నీరసంగా ఉన్నావట అని రాజ్ అడుగుతాడు. ఇప్పుడు బాగానే ఉందని కావ్య అంటుంది. హాస్పిటల్‌కు వెళ్లావట కదా. డాక్టర్ ఏమన్నారు అని రాజ్ అడుగుతాడు. మందులు రాసి ఇచ్చాడని కావ్య చెబుతుంది. వేసుకున్నావా అని రాజ్ అడిగితే.. లేదని కావ్య చెబుతుంది.

నాకు తెలుసు

వేసుకోవచ్చు కదా అని రాజ్ అంటే.. ఇప్పుడు వేసుకుంటానని కావ్య బదులిస్తుంది. ఎందుకు ఇలా మంచులో కూర్చున్నావ్. గదిలో పడుకోవచ్చు కదా అని రాజ్ అంటే.. సరే అని లేచి వెళ్లిపోతుంది కావ్య. నువ్ కాల్ చేసినప్పుడు నేను అని రాజ్ చెప్పబోతుంటే.. ఆఫీస్‌లో ఉన్నారు. అర్జంట్ మీటింగ్‌లో ఉన్నారని కావ్యే సమాధానం ఇస్తుంది. అవును, బిజీగానే ఉన్నాను అని రాజ్ అంటాడు. మీరు ఎంత బిజీగా ఉంటారో నాకు తెలుసు అని చెప్పి వెళ్లిపోతుంది కావ్య. రాజ్ ఆలోచనలో పడిపోతాడు.

మరోవైపు అపర్ణ రగిలిపోతుంటుంది. అక్కడకి వచ్చిన సుభాష్‌తో మీ తమ్ముడి గారి భార్యకు స్వార్థం బాగా పెరిగిపోయిందని ధాన్యలక్ష్మీ అంటుంది. ఎవరు ధాన్యలక్ష్మా అని సుభాష్ అంటే.. మీ తమ్ముడికి ఎంతమంది భార్యలు అని అపర్ణ అంటుంది. నేను అదే అందామనుకున్నా. నా తమ్ముడి భార్య ఏంటీ.. ధాన్యలక్ష్మీ అని అనొచ్చు కదా అని సుభాష్ అంటాడు. మనస్తత్వాలు మారడం ఎంతసేపండి.. నేను రాజ్‌ను ఒకలా కల్యాణ్‌కు మరోలా చూశానా అని అపర్ణ అడిగితే.. లేదని సుభాష్ అంటాడు.

కల్యాణ్ ఒంటరివాడు

కల్యాణ్‌ను నా చిన్నకొడుకు అనుకున్నాను. రాజ్ కంటే కల్యాణ్‌నే గారాబం చేశాను. ఇవాళ కల్యాణ్‌కు ఒక పని చెబితే.. వాన్ని నేను ఇంట్లో పనోడిలా చూస్తున్నానని ధాన్యలక్ష్మీ అంది. నేను ఉరిమిచూస్తేనే భయపడే ధాన్యలక్ష్మీ ఇవాళ అందరిముందు నన్ను అంది అని అపర్ణ ఆవేదనగా, ఆవేశంగా చెబుతుంది. ధాన్యలక్ష్మీ అనడంలో తప్పేం లేదు. ఇన్నాళ్లు అంటే కల్యాణ్‌ ఒంటరివాడు. ఏం చెప్పిన ఏం కాదు. కానీ, ఇప్పుడు పెళ్లి అయిందిగా. తన భార్య ముందు కొడుకును తక్కువ చూడటం తనకు నచ్చలేదు అంతే అని సుభాష్ వివరించి చెబుతాడు.

కావ్య, స్వప్న ఇద్దరు అక్కాచెల్లెల్లు. వాళ్లిద్దరిలోనే ఎంతో తేడా ఉంది. అలాంటిది తోడి కోడళ్ల మధ్య ఉండదా అని సుభాష్ సర్దిచెబుతాడు. మీ లాజిక్‌లు నా కోపాన్ని చల్లార్చలేవండి అని అపర్ణ వెళ్లిపోతుంది. ఇక్కడ నా పరిస్థితి ఇలా ఉంటే నా తమ్ముడి పరిస్థితి ఎలా ఉందో అని సుభాష్ అనుకుంటాడు. కట్ చేస్తే.. ల్యాప్ టాప పాస్ వర్డ్ ఏంటబ్బా అని గుర్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు ప్రకాష్. ఇంతలో కోపంతో వచ్చిన ధాన్యలక్ష్మీని చూసి హా.. పిచ్చిమాలోకం పాస్ వర్డ్ అను గుర్తుకు తెచ్చుకుని టైప్ చేస్తుంటాడు.

బానిసలా చూస్తోంది

ఇంట్లో ఎం జరుగుతుందో పట్టించుకునే పని లేదా అని ధాన్యలక్ష్మీ అంటే.. చెప్పాలని నీకు లేదా అని ప్రకాషం అంటాడు. రాజ్‌ను కల్యాణ్‌ను వేరుగా చూస్తున్నారని ధాన్యలక్ష్మీ అంటే.. ఇంట్లో అలా చూసేవారు ఎవరున్నారే అని ప్రకాశం అంటాడు. మీ వదిన గారు అని ధాన్యం అంటే.. నాలుకు కోస్తాను. మా వదినగారు ఏంటీ. అక్క అని పిలిచేదానివిగా కొత్తగా ఇదేంటని ప్రకాశం అంటాడు. రాజ్‌ను మహరాజ్‌లా కల్యాణ్‌ను బానిసలా చూస్తోంది. రాజ్‌కు ఎప్పుడైన పని చెబుతుందా.. కల్యాణ్‌కే పని చెబుతుందని ధాన్యలక్ష్మీ అంటుంది.

ఇన్నాళ్లు కుడా చెప్పింది కదా. ఇప్పుడు చెబుతే ఏం వచ్చిందని ప్రకాశం అంటే.. కల్యాణ్‌కు పెళ్లి అయింది. భార్య వచ్చింది. భార్య ముందు చెబితే ఎలా ఉంటుందని ధాన్యలక్ష్మీ అంటుంది. పెళ్లి మాత్రమే అయింది. కొమ్ములు రాలేదు. ఇన్నాళ్లు చెప్పినట్లే ఇప్పుడు చెప్పింది అంతే అని ప్రకాశం అంటే.. ఇది ఎక్కడికీ దారి తీస్తుందో.. ఎంతవరకు లాగుతానో చూడండి అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో సైలెంట్‌గా అక్కడి నుంచి జారుకుంటాడు ప్రకాశం. మెట్లపై సుభాష్ కూర్చుని ఉంటాడు. అక్కడికి ప్రకాశం వస్తాడు. బాగా అయిందా అని సుభాష్ అంటే.. అయిందని ప్రకాశం అంటాడు.

నా కుటుంబం అనేవరకు

సరే పదా మందేద్దామని ఇద్దరు వెళ్లిపోతారు. మరోవైపు కావ్య ఒంటరిగా బాల్కోని కూర్చుని ఉంటుంది. కల్యాణ్ వచ్చి నేను హాస్పిటల్‌కు తీసుకెళ్లేవాన్ని కదా అని అంటే.. లేదు లేండి కవిగారు. పెద్దత్తయ్య మీకు పని చెబితే చిన్నత్తయ్య ఏదో అన్నారట కదా. అక్క చెప్పింది. మళ్లీ నన్ను అనేవాళ్లు అని కావ్య అంటుంది. ఈ ఇంట్లో అందరూ పెద్దరికి మర్చిపోయి మన కుటుంబం నుంచి నా కుటుంబం అనేవరకు వచ్చారు. కొడుకుకి పట్టాభిషేకం చేద్దామనుకున్న కైకేయి పరిస్థితి ఏమైందో తెలిసి కూడా ఇలా చేస్తున్నారని కల్యాణ్ అంటాడు.

మీరెందుకు ఈ మధ్య ఒంటరిగా ఉంటున్నారు. అన్నయ్యే కారణమా అని కల్యాణ్ అంటే.. కావ్య ఏం లేదని అంటుంది. అందులోనే చాలా ఉందని అర్థమవుతోంది. నాకు కూడా చెప్పకుండా దాటేస్తున్నారంటే అంతకంటే పెద్ద సమస్యే అని తెలుస్తోందని కల్యాణ్ అంటాడు. ఏం లేదని కావ్య వెళ్లబోతుంటే.. నాకు చెప్పకుంటే నా మీద ఒట్టే అని ఒట్టు వేయించుకుంటాడు కల్యాణ్. కవిగారు ఎంతపనిచేశారు. నాకుంది అనుమానమో, బాధనో, అయోమయమో ఏం తెలియట్లేదని శ్వేతతో రాజ్ ఉన్న ఫొటో చూపిస్తుంది కావ్య. తను శ్వేత కదా అని కల్యాణ్ అంటాడు. మీకు తెలుసా అని కావ్య అడుగుతుంది.

సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారు

నాకు తెలుసు. అన్నయ్య క్లాస్‌మేట్. నేను వాళ్ల జూనియర్‌ని అని కల్యాణ్ అంటే.. వాళ్ల మధ్య ఏమైనా జరిగిందా అని కావ్య అడుగుతుంది. శ్వేత అన్నయ్యను ఇష్టపడింది. కానీ, అన్నయ్యకు ఇష్టమో కాదో తెలియదు. అన్నయ్య అడిగితే ఇంట్లోవాళ్లు కాదనరు కదా. అయినా అదెప్పుడో జరిగిపోయిందని కల్యాణ్ అంటాడు. ఇప్పుడు ఆమె నా జీవితంలోకి వచ్చింది. నా కాపురంలోకి కూడా వచ్చిందేమో అని భయంగా ఉంది. వాళ్లు తరచు కలుస్తూనే ఉన్నారు కావ్య అంటుంది. మరోవైపు కల్యాణ్‌ను బుజ్జగించాలి అని వెతుకుతూ ఉంటుంది. కావ్య, కల్యాణ్‌ను చూసి వీళ్లేం సీక్రెట్ మాట్లాడుకుంటున్నారు అని వెళ్తుంది.

కవిగారు ఇది ఇంట్లో ఎవరికీ చెప్పకండి. మీ అన్నయ్యను దోషిలా నిలబెట్డడం నాకు ఇష్టం లేదు అని కావ్య చెబుతుంటుంది. ఇంతలో అనామిక వస్తే ఆగిపోతారు. ఏంటి నన్ను చూసి ఆగిపోయారు. నా గురించే మాట్లాడుకుంటున్నారా అని అనామిక అంటే.. ఏం లేదని కావ్య చెప్పి వెళ్లిపోతుంది. కల్యాణ్ కూడా అదే అంటాడు. అనామిక వెళ్తుంటే ఎదురుపడిన రుద్రాణి.. పెద్ద గొడవ చేస్తావనుకున్నా. వాళ్లు అలా ఆగిపోయారంటే.. నీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నట్టున్నారు అని మరింత రెచ్చగొడుతుంది రుద్రాణి.

హెచ్చరిస్తున్నా

కావ్య ఏం చెప్పిన కల్యాణ్ మనసు మారదు. నేను ఏం చెబితే అది నమ్ముతాడని అనామిక అంటుంది. అలా అయితే సంతోషమే. కానీ, పెళ్లిలో అప్పు విషయం బయటపడేవరకు నువ్ ఊహించావా. కావ్య పనులు అలా పకడ్బందీగా ఉంటాయి అని రుద్రాణి అంటే.. ఏం చేసినా మా ఇద్దిరిని విడగొట్టలేదని అనామిక అంటుంది. అప్పునే తనను నిజంగా ప్రేమించిందని, నీపై కోపం వచ్చేలా చేస్తే. ఈ ఇంటికి కోడలిగా అప్పుని తీసుకొస్తే.. అది ఫెయిల్ అయిందిగా. అప్పు దగ్గరికే కల్యాణ్ వెళ్లి పెళ్లి చేసుకుంటావా అని అడిగిలా చేస్తే నిలబడుతుండా నీ ప్రేమ. ముందుగానే హెచ్చరిస్తున్నాను అని రుద్రాణి చెప్పేసి వెళ్లిపోతుంది.

దాంతో ఆలోచనలో పడిపోతుంది అనామిక. తర్వాత కావ్య బెడ్‌పై బాధగా పడుకుని ఉంటుంది. పడుకుని ఉన్నావా అని రాజ్ అంటే.. పడుకున్నట్లు నటించలేను. కళ్లు తెరుచుకున్నాయని కావ్య అంటుంది. అసలు ఏం మాట్లాడుతున్నావ్. ఏం అడగాలనుకుంటున్నావని రాజ్ అంటాడు. క్లారిటీ వచ్చాకా అడుగుతానని కావ్య అంటుంది. తర్వాతి ఎపిసోడ్‌లో భోజనం ఇచ్చి తినమని రాజ్ అంటే వద్దంటుంది కావ్య. నువ్ ఇలాగైతే ఎందుకు తింటావే అని చేతులు కొంగుతో కట్టేసి.. కావ్యకు బలవంతంగా తినిపిస్తాడు రాజ్.

Whats_app_banner