Brahmamudi February 9th Episode: బ్రహ్మముడి సీరియల్.. కావ్యకు ఇంటి తాళాలు.. అత్తాకోడళ్లకు కోలుకోలేని దెబ్బ.. పాపం రాజ్!
Brahmamudi Serial February 9th Episode: బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 9వ తేది ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంటి బాధ్యతలన్నీ కావ్యకు అప్పజెబుతుంది అపర్ణ. దాంతో అనామిక, ధాన్యలక్ష్మీ ఉలిక్కిపడతారు. ఏ అవసరం ఉన్న నీ దగ్గరికే రావాలని ఇంటి తాళాలు కావ్యకు ఇస్తుంది అపర్ణ. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కావ్య, కల్యాణ్ ఇంటి బయట కూర్చుని రాజ్ గురించి మాట్లాడుకుంటారు. అసలు అన్నయ్య గురించి ఏం తెలిసింది వదినా, అన్నయ్యకు శ్వేతకు మధ్య ఉన్నది ఏంటో తెలిసిందా అని కల్యాణ్ అంటాడు. దానికి నేను పాతకాలం అమ్మాయిని కాదు. భర్త ఏం చేసినా నా భర్తే. నాపై ప్రేమ చూపిస్తే చాలు అని అనుకోడానికి. కానీ, ఆయనకు శ్వేత మధ్య ఏం లేదని అనిపిస్తోంది అని కావ్య అంటుంది.
వర్కౌట్స్ చేయాలని
మరి అలాంటిదేం లేకుంటే.. అందరికీ చెప్పి ఓపెన్‌గా ఉండొచ్చు కదా. ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా ఎందుకు అని కల్యాణ్ అంటాడు. దాంతో కావ్య ఆలోచనలో పడుతుంది. ఇంతలో బయటకు రాజ్ వస్తాడు. వర్కౌట్స్ చేసేందుకు డంబెల్స్, స్క్రిప్పింగ్ త్రెడ్ తీసుకొచ్చుకుంటాడు. కావాలనే కావ్య ముందు ఎక్సర్‌సైజ్ చేస్తుంటాడు. ఇంతలో ఇందిరాదేవి, ప్రకాశం, సుభాష్ వస్తారు. నీకు వర్కౌట్స్ చేయాలని ఉంటే జిమ్‌కు వెళ్లొచ్చు కదరా అని సుభాష్ అంటాడు. నేను ఇంట్లోనే కండలు పెంచుతా. నాకు ఇల్లే వ్యాయామ శాల అని రాజ్ అంటాడు.
పెళ్లయిన ఇన్నేళ్లకు దీనిపై ధ్యాస పడిందేంటి రాజ్ అని ఇందిరాదేవి అంటుంది. నా ఫిట్‌నెస్ తగ్గిపోయిందని నా ఫ్రెండ్ ఒకరు చెప్పారు నానమ్మ. అంతేకాదు నేను నిత్య పెళ్లి కొడుకుని కదా అని రాజ్ అంటాడు. దాంతో చూశారా కవిగారు నిత్య పెళ్లి కొడుకు అట అని కావ్య అంటుంది. నవ్ అన్నయ్యను సరిగా అర్థం చేసుకోవట్లేదు వదినా. అన్నయ్య శ్వేత మధ్య ఏం లేదని అనిపిస్తోంది అని కల్యాణ్ అంటాడు. నాకు కూడా అదే అనిపిస్తుందని కావ్య అంటుంది.
గీజర్ పని అటకెక్కింది
తర్వాత బాగా వేడిగా ఉన్న నీళ్లను పైకి తీసుకెళ్తుంటుంది కావ్య. ఏంటమ్మ కావ్య నీళ్లను ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నావ్ అని ప్రకాశం అడుగుతాడు. గీజర్ పని చేయట్లేదని అత్తయ్య కవిగారికి చెప్పింది. దానికి చిన్నత్తయ్య మా అత్తయ్యను ఏదో అంది. దాంతో అప్పటి నుంచి కవిగారికి అత్తయ్య పని చెప్పడం లేదు. అలా గీజర్ పని అటకెక్కింది. అందుకే స్టౌవ్‌పై నీళ్లు వేడి చేసి ఆయనకు తీసుకెళ్తున్నాను అని పైకి వెళ్తుంది కావ్య. నేను అయినా టెక్నిషీయన్‌ను పిలిపించాలి అని ప్రకాశం అనుకుంటాడు.
పైకి వెళ్లి బాత్రూమ్‌లో చాలా వేడి ఉన్న నీళ్లు పెడుతుంది కావ్య. తర్వాత కావ్యను రాజ్ ఏదో ఒకటి అంటాడు. చూశావా నా కండలు ఎలా ఉన్నాయో. ఉక్కు.. నొక్కుతావా అని రాజ్ అంటాడు. నాకు ఏం అవసరం లేదు అని కావ్య అంటే.. నీకు కుళ్లు కదా అని రాజ్ అంటాడు. అవును, నాకు మీలాగా కండలు లేవని చాలా ఫీల్ అవుతున్నాను అని కావ్య అంటుంది. తర్వాత రాజ్‌కు శ్వేత నుంచి ఫోన్ వస్తుంది. అది చూసి కావ్య ఇరిటేట్ అవుతుంది. ఫోన్ ఎవరు అని రాజ్ అడిగితే.. కావ్య సైలెంట్‌గా ఉంటుంది.
రాజ్ ఎగతాళి
వినిపించిందా అని రాజ్ అంటే.. కనిపించింది అని కావ్య అంటుంది. దాంతో రాజ్ వచ్చి ఫోన్ తీసుకుని మాట్లాడుతాడు. కావాలనే కావ్య ముందు ఓవర్‌గా శ్వేతతో మాట్లాడుతాడు. హాయ్, గుడ్ మార్నింగ్, ఇవాళ నీకు చాలా ఇంపార్టెంట్ రోజు అని నాకు తెలుసు బేబి, నాకు గుర్తుంది అని రాజ్ అని కాల్ పెట్టేస్తాడు. దాంతో కావ్య ఫీల్ అవుతుంటే.. కాలిందా.. బాగా కాలిందా అని రాజ్ ఎగతాలి చేస్తాడు. అనంతరం రాజ్ స్నానానికి వెళ్తుంటే.. వేడి నీళ్ల గురించి కావ్య చెప్పాలని చూస్తుంది. కానీ, రాజ్ వినిపించుకోడు. నువ్ కావాలనే శ్వేతను కలవకుండా ఉండేందుకు లేట్ చేయిస్తున్నావని అంటాడు.
అదికాదండి నీళ్లు అని కావ్య అంటే.. నేను చిన్నప్పటి నుంచి చేస్తున్న నీళ్లే. నీళ్లే ఉంటాయి కాఫీ, టీలు ఉండవు అని లోపలికి వెళ్లిన రాజ్ ఒక్కసారిగా అరుస్తాడు. దాంతో నవ్వుకుంటూ బాత్రూమ్ దగ్గరికి కావ్య వెళ్తుంది. బయటకు వచ్చిన రాజ్ కన్ను మూసుకుని ఉంటాడు. వేడి నీళ్ల సంగతి గురించి చెప్పలేదని అంటే.. చెప్పనిస్తే కదా. నేను లేట్ చేయిస్తున్నాని, జీనియస్ అని, మోనార్క్ అంటూ వెళ్లారు కదా. కాలిందా, బాగా కాలిందా అని రాజ్ అన్న డైలాగ్స్ కొడుతుంటుంది. నేను అన్నాననే కదా నన్ను అంటున్నావ్ అని రాజ్ అంటే.. ఇప్పటికైనా చెప్పేది వినిపించుకోవాలని అర్థం కాలేదా అని కావ్య అంటుంది.
ఉలిక్కిపడిన రాజ్
అనంతరం అంతా టిఫిన్ చేస్తుంటారు. రాజ్ కన్నుకు ఫ్యాన్ పెట్టుకుని వస్తాడు. ఏంటి రాజ్ వేడిగా ఉందా అని రుద్రాణి అంటే.. వేడా.. ఎక్కడ ఉంది అని కంగారుపడిపోతాడు రాజ్. సరే రా వేడి వేడిగా టిఫిన్ తిందువు అని అంటే.. వేడా.. నో.. అని ఒక్కసారిగా అరుస్తాడు రాజ్. దాంతో అంతా షాక్ అవుతారు. అది నార్మల్‌గా చెప్పొచ్చు కదా అన్నయ్య అని కల్యాణ్ అంటే.. అవును అని రాజ్ అంటాడు. తర్వాత అంతా వేడి గురించి మాట్లాడుతుంటారు. అలా మాట్లాడిన ప్రతిసారీ రాజ్ ఉలిక్కిపడుతుంటాడు. ఆ వేడి గురించి నాకు తెలుసంటూ ప్రకాశం అంటాడు.
తర్వాత లక్ష్మమ్మ అని పనిమనిషిని పిలిచి సలాడ్ తెప్పించుకుంటాడు రాజ్. ఏంట్రా ఇది అని అపర్ణ అంటే.. అందులో ఉన్న ఒక్కోదాని వల్ల వచ్చే ఆరోగ్యం గురించి చెబుతాడు రాజ్. దాంతో ఒక్క బకెట్ ఎంత పని చేసిందమ్మా అని ప్రకాశం అంటాడు. ఇదంతా చాలా కామెడీగా నడుస్తోంది. అనంతరం ఒకటో తారీఖు వస్తుంది. అందరికీ కావాల్సిన లిస్ట్ తెప్పించారా అని ఇందిరాదేవి అడిగితే.. ఇంకా ఎవ్వరు ఇవ్వలేదు. అంతా ఒకేసారి తెప్పిస్తాను అని అపర్ణ అంటుంది. దాంతో ధాన్యలక్ష్మీ కంగారుపడుతుంది.
తర్వాత తగ్గించాలి
ఇంతకుముందు తనకు కావాల్సిన లిస్ట్ అంటూ పెద్ద లిస్ట్ ఇస్తుంది. అది చూసి కాస్మోటిక్స్‌కు ఇంత పెద్ద లిస్టా. నువ్వేమైనా పడుచు అమ్మాయివా. త్వరలో కోడలు కూడా రాబోతుంది అని అపర్ణ అంటే.. ఇంట్లోనే రెడీ అవుతాను అక్క. నెక్ట్స్ టైమ్ లిస్ట్ తగ్గించేస్తాను అని ధాన్యలక్ష్మి అంటుంది. ప్రతిసారీ లిస్ట్ పెంచేస్తున్నావ్ అన్న అపర్ణ నెక్ట్స్ టైమ్ తగ్గించాలి అంటుంది. అది గుర్తుకు చేసుకున్న అపర్ణ కంగారుపడుతుంటుంది. ఈసారి ఈవిడను చచ్చినా అడగను అని మనసులో అనుకుంటుంది ధాన్యలక్ష్మి.
అనంతరం 20 వేలు ఇవ్వమని ప్రకాశంను అడుగుతుంది ధాన్యలక్ష్మీ. అదేంటి ఎప్పుడైనా ఏం అవసరం ఉన్నా వదిననే కదా అడిగేది.. ఇప్పుడేంటీ కొత్తగా అడుగుతున్నావ్ అని ప్రకాశం అంటాడు. నేను ఎవరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం లేదు. నేను ఈ ఇంటి కోడలినే అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇదంతా పైనుంచి అపర్ణ వింటుంది. ఇంట్లో ఖర్చులన్నీ ఒక్కరి చేయి మీద నుంచి నడవాలని రూల్ పెట్టిందే నువ్వు. అదంతా వదిన చూసుకోవాలని సలహా ఇచ్చిందే నువ్వు. నువ్వే రూల్ బ్రేక్ చేస్తావా. అలా చేస్తే వదిన గౌరవం తీసినట్లు, అవమానించినట్లు అవ్వదా అని ప్రకాశం అంటాడు.
మంచితనం ఏంటో
అప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు వేరు అని ధాన్యలక్ష్మీ అంటే.. పరిస్థితులు మారుతాయి. కానీ, మనుషులం మారకూడదు. నేను చేయను నువ్ చేయకు. వదినను అడుగు ఆమె కూడా అన్ని మర్చిపోయి ఇస్తుంది అని ప్రకాశం అంటాడు. దాంతో చచ్చినా నేను అడగను అని వెళ్లిపోతుంది ధాన్యలక్ష్మీ. నన్ను అడగాలని లేదా ధాన్యలక్ష్మీ. నా మంచి తనం ఏంటో నీకు తెలిసేలా చేస్తా అని అపర్ణ అనుకుంటుంది. మరోవైపు అప్పు పోలీస్ అయ్యేందుకు రన్నింగ్‌కు వెళ్లాలని, ప్రిపేర్ అవ్వాలని, కోచింగ్ సెంటర్‌లో జాయిన్ కావాలని అంటుంది.
అందుకోసం ఏమైనా చేస్తానని కనకం, కృష్ణమూర్తి చెబుతారు. బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో ఈరోజు నుంచి ఇంటి బాధ్యతలన్ని నువ్వే తీసుకోవాలి అని కావ్యకు అప్పజెబుతుంది అపర్ణ. దాంతో కావ్య ఆశ్చర్యంగా చూస్తుంది. కానీ, ధాన్యలక్ష్మీ, అనామిక, రుద్రాణి షాక్ అయి చూస్తారు. దుగ్గిరాల ఇంటి బాధ్యతలన్నీ ఇంటి పెద్ద కోడలిగా నీకే అప్పగిస్తున్నాను అని అపర్ణ అంటుంది. ఇదిగో ఇంటి తాళాలు. ఎవ్వరికీ ఏం అవసరం వచ్చినా నీ దగ్గరికే రావాలి అని అపర్ణ అంటుంది. దాంతో అనామిక, ధాన్యం ఈసిడించింకుంటారు.