Brahmamudi February 7th Episode: బ్రహ్మముడి సీరియల్.. కావ్యకు రాజ్ విడాకులు.. కన్నీళ్లతో కళావతి.. క్లారిటీ వస్తుందంటూ!
Brahmamudi Serial February 7th Episode: బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 7వ తేది ఎపిసోడ్‌లో ల్యాప్‌ట్యాప్‌లో ఎవరితోనో రాజ్ మాట్లాడుతుంటే కావ్య వచ్చి లైట్ ఆఫ్ చేస్తుంది. దాంతో రాజ్ ఎందుకు లైట్ ఆఫ్ చేశావని అంటాడు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శ్వేత భర్తను ఒక దుమ్ము దులిపి ఇంటికి వెళ్తుంది కావ్య. ఇదెక్కడి ఆడదిరా బాబు. నా పెళ్లాం కూడా నన్ను తిట్టలేదు. నేను తిడితే పడింది.. కొడితే కింద పడింది కానీ, ఏనాడు నన్ను అనలేదు. నా పెళ్లాం నా మాట వింటలేదని ఇటు నుంచి నరుక్కొద్దామనుకుంటే ఇదే నన్ను నరికేసేలా ఉంది. ఇందుకేనేమో ఆ దరిద్రుడు నా పెళ్లాం వెంట పడినట్లు ఉన్నాడు.. ఛ.. అని శ్వేత భర్త తనలో తానే అనుకుంటాడు.
నిద్ర రాదు
కావ్య కారులో ఇంటికి వెళ్తుంది. ఇంటికెళ్లిన తర్వాత రాత్రి పూట గదిలో పడుకుందామని లైట్ ఆఫ్ చేస్తుంది కావ్య. అప్పుడు ల్యాప్‌ట్యాప్‌లో ఎవరితోనే రాజ్ కాల్ మాట్లాడుతుంటాడు. కావ్య లైట్ ఆఫ్ చేయడంతో దాంతో ఉలిక్కి పడి లేచిన రాజ్.. నేను మాట్లాడుతుంటే లైట్ ఆఫ్ చేస్తావేంటీ అని అంటాడు. నాకు లైట్ ఉంటే నిద్ర రాదు అని కావ్య కోపంగా చెబుతుంది. దానికి నీ పక్కన ఉంటే నాకు అసలు మాట్లాడాలన్న మూడే రాదు అని రాజ్ అంటాడు.
కాన్ఫిడెంట్‌గా ఎలా ఉంటావో
కావ్య బెడ్ మీద పడుకుంటుంది. అటు పక్కకు రాజ్ కూడా పడుకుంటాడు. అప్పుడు కావ్య వైపు తిరిగి.. నన్ను ఏడిపించడమే నీ పని కదా అని రాజ్ అంటాడు. ఆ పని చేస్తుంది మీరు అని కావ్య అంటుంది. దానికి రాజ్ షాక్ అవుతాడు. దాంతో కావ్య ఇటువైపు తిరిగి పడుకుని బాధపడుతుంది. త్వరలో నీకే క్లారిటీ వస్తుందిలే. అప్పుడు కూడా ఇంత కాన్ఫిడెంట్‌గా ఎలా ఉంటావో నేను కూడా చూస్తా అని రాజ్ మనసులో అనుకుంటాడు. ఇటువైపు పడుకున్న కావ్య బాధతో కన్నీళ్లు పెట్టుకుంటుంది.
శ్వేత చెప్పిన వినని రాజ్
కావ్య పక్కకు రాజ్ ఫొటో చూపిస్తారు. బ్యాక్ గ్రౌండ్‌లో ఒకరకమైన సాడ్ బీజీఎమ్ వినిపిస్తుంది. చూస్తుంటే కావ్యకు రాజ్ విడాకులు ఇచ్చేలా ఉన్నాడు. అందుకే తనపై కావ్యకు కోపం వచ్చేందుకు కావాలనే శ్వేతతో చనువుగా ఉంటున్నాడు. కావ్య చూస్తుందని కావాలనే శ్వేతకు మరింత దగ్గర అవుతున్నాడు. అలాగే తమది స్నేహమని శ్వేత చెప్పి అపార్థాలు తొలగిపోయేలా చేస్తానని శ్వేత చెప్పిన రాజ్ వినలేదు. తనకు కావ్య అంటే ఇష్టం లేదని, తనకు సూట్ కాదని, అందుకే విడిపోవాలనుకుంటున్నట్లు నిన్నటి ఎపిసోడ్‌లో రాజ్ చెప్పాడు.
అపార్థం చేసుకుంది
బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (ఫిబ్రవరి 6) నాటి ఎపిసోడ్ విశేషాలు చూస్తే.. కావ్య మనల్ని అపార్థం చేసుకుంటుంది, మన మధ్య ఉన్నది స్నేహమని చెప్పేస్తాను అని శ్వేత వెళ్తుంది. కానీ రాజ్ ఆపుతాడు. మరోవైపు కల్యాణ్‌తో ఫోన్‌లో శ్వేత ఇక్కడే ఉందని చెబుతుంది. తన ఒళ్లు మండిపోతుందని అంటుంది. వాళ్లు ఏం చేస్తున్నారో చూద్దామని వెళ్తే.. బయట రాజ్ శ్వేత మాట్లాడుకుంటారు. కావ్యతో విడిపోవడం కరెక్ట్ కాదని శ్వేత ఎంత చెప్పిన రాజ్ వినడు.
కంట్రోల్‌లో పెట్టకుండా
ఇక కావ్య చూస్తుందని కావాలనే శ్వేత భుజంపై చేయి వేసి మరి కారు ఎక్కించి పంపిస్తాడు. అనంతరం కావ్య ఇంటికి వెళ్తుండగా.. దారిలో శ్వేత భర్త తన కారుతో అడ్డం వస్తాడు. దాంతో కోపంగా కావ్య మాట్లాడుతుంది. తనకు రాజ్, శ్వేత ఫొటోలు పంపింది తానేనని, తాను శ్వేత భర్తను అని చెప్పుకుంటాడు. నీ భార్యను కంట్రోల్‌లో పెట్టకుండా ఇలా క్యాండిడ్ ఫొటోలు తీస్తూ కూర్చుంటున్నావా అని శ్వేత భర్తను కావ్య ఎడా పెడా వాయిస్తుంది. దాంతో కావ్య మాటలకు బెంబేలు ఎత్తిపోతాడు శ్వేత భర్త.
సంబంధిత కథనం