Brahmamudi: కావ్యకు తెలిసిపోయిన రాజ్ డ్రామా.. వసుధారకు కోర్టు సమస్య.. కృష్ణకు షాక్, ముకుందలో ప్రేమ ఆశలు-brahmamudi guppedantha manasu krishna mukunda murari serial february 12th episode promo kavya knows raj divorce drama ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi: కావ్యకు తెలిసిపోయిన రాజ్ డ్రామా.. వసుధారకు కోర్టు సమస్య.. కృష్ణకు షాక్, ముకుందలో ప్రేమ ఆశలు

Brahmamudi: కావ్యకు తెలిసిపోయిన రాజ్ డ్రామా.. వసుధారకు కోర్టు సమస్య.. కృష్ణకు షాక్, ముకుందలో ప్రేమ ఆశలు

Sanjiv Kumar HT Telugu
Feb 11, 2024 07:11 AM IST

Brahmamudi Serial Promo: స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతున్న టాప్ పాపులర్ తెలుగు సీరియల్స్ గుప్పెడంత మనసు, బ్రహ్మముడి, కృష్ణ ముకుంద మురారి చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్నాయి. అలాంటి ఈ సీరియల్స్ ఫిబ్రవరి 12వ తేది ఎపిసోడ్స్‌లలో ఏం జరిగిందని ప్రోమోల్లో చూస్తే..

కావ్యకు తెలిసిపోయిన రాజ్ డ్రామా.. వసుధారకు కోర్టు సమస్య.. కృష్ణకు షాక్, ముకుందలో ప్రేమ ఆశలు
కావ్యకు తెలిసిపోయిన రాజ్ డ్రామా.. వసుధారకు కోర్టు సమస్య.. కృష్ణకు షాక్, ముకుందలో ప్రేమ ఆశలు

Brahmamudi Serial Promo: బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 12వ తేది ఎపిసోడ్ ప్రోమోలో శ్వేత నేను పెళ్లి చేసుకుంటున్నాం. నా జీవితంలో నుంచి తప్పుకో. వెళ్లిపో.. అని కావ్యతో గట్టిగా అరుస్తాడు రాజ్. దానికి షాక్ అయిన కావ్య వెళ్లిపోతుంది. తర్వాత ఒక అమ్మాయి మనసు ఇంత దారుణంగా ముక్కలు చేస్తే తను ఏమైపోతుంది అని ఆవేదనగా అంటుంది శ్వేత. దానికి దూరమైపోతుంది అని రాజ్ అంటాడు. కళావతి నాతో ఉంటే సుఖపడిందే లేదు అని రాజ్ అంటాడు.

వదిలి వెళ్లిపోతుంది

అప్పుడే తిరిగి వెనక్కి వచ్చిన కావ్య రాజ్ అన్న మాటలు విని ఆగిపోతుంది. కావ్య సుఖపడిందే లేదు. అందుకోసం మన స్నేహాన్ని వాడుకుని ఆమెతో అబద్ధం చెప్పాను. మనసు విరిచేస్తేనైనా వదిలి వెళ్లిపోతుంది కదా అని రాజ్ అంటాడు. అది విన్న కావ్య బాధగా, ఏడుస్తూ ఆఫీస్ నుంచి వెళ్లిపోతుంది. బ్యాక్ గ్రౌండ్‌లో సాడ్ సాంగ్‌తో ఎమోషన్ పండేలా చేశారు. మరి రాజ్ మాటలు విన్న కావ్య అతనికి నచ్చినట్లు చేస్తుందా.. ఇంకా ఏదైనా మనసు మారేలా ప్రయత్నిస్తుందా అనేది తర్వాతి పూర్తి ఎపిసోడ్‌లో చూడాలి.

Guppedantha Manasu Serial Promo: గుప్పెడంత మనసు సీరియల్‌లో వసుధార ఆఫీస్‌లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో కాలేజీకి ఇద్దరు వస్తారు. రిషి సార్ చనిపోయారని తెలిసి బాధపడ్డాం. అయితే ఆయన కాలేజీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని మా దగ్గర్ రూ. 40 కోట్లు అప్పుగా తీసుకున్నారు. అందుకు కాలేజీని మార్గిగేట్ చేశారు అని చెబుతారు. అది విని షాక్ అయిన వసుధార నమ్మదు. దాంతో వాళ్లు ఆధారాలు చూపిస్తారు. బోర్డ్ మీటింగ్ పెట్టి మా డబ్బు మాకు ఇచ్చేయండి. అందాకా ఎదురుచూస్తాం అని చెప్పి వెళ్లిపోతారు.

చుక్కలు చూపిస్తా

వసుధార బోర్డ్ మీటింగ్‌లో కంగారుగా ఉంటుంది. అది గమనించిన శైలేంద్ర నన్నే చెంపదెబ్బ కొడతావ. ఇక నుంచి నీకు చుక్కలు చూపిస్తాను చూడు అని శైలేంద్ర అనుకుంటాడు. మహేంద్ర వచ్చి ఏమైందని వసుధారను అడుగుతాడు మహేంద్ర. రిషి వీళ్ల దగ్గర డబ్బులు తీసుకుని కాలేజీని మార్టిగేట్ చేశారని వీళ్లు అంటున్నారు మావయ్య అని వసుధార చెబుతుంది. వాట్ నాన్సెన్స్. మీరు ఏదో పొరపాటు పడుంటారు. రిషికి కాలేజీ అంటే ప్రాణం. కాలేజీ కోసం ప్రాణాలు ఇస్తాడు కానీ, ఇలా చేయడు అని మహేంద్ర అంటాడు.

డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్‌గానే ఉన్నాయి మహేంద్ర అని అనుపమ అంటుంది. ఇంకేంటి మేడమ్ అన్ని పర్ఫెక్ట్‌గానే ఉన్నాయి కదా అని వాళ్లు అంటారు. నేను కూడా చూశాను. డాక్యుమెంట్స్‌లో అయితే రిషి తీసుకున్నట్లే ఉంది అని శైలేంద్ర అంటాడు. ఇవి ఫేక్ డాక్యుమెంట్స్ అని మహేంద్ర అంటాడు. అయితే మేము కోర్టుకు పోతాం అని వాళ్లు అంటారు. సరే కోర్టుకు వెళ్లండి అని మహేంద్ర అంటాడు. కోర్టుకు వెళ్లిన వాళ్లే గెలుస్తారు మహేంద్ర అని అనుపమ అంటుంది. దీంతో వసుధార ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా శైలేంద్ర వల్ల మరోసారి వసుధార, కాలేజీ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది.

షాక్ అయిన కృష్ణ

Krishna Mukunda Murari Promo: కృష్ణ ముకుంద మురారి ఫిబ్రవరి 12వ తేది ఎపిసోడ్ ప్రోమోలో హాల్లో అందరికీ కృష్ణ టీ ఇస్తుంటుంది. మరోవైపు మధుకర్ ఇవాళ వాలెంటైన్స్ డే. సాయంత్రం సెలబ్రేషన్స్ ఉన్నాయి. కానీ, కపుల్స్ ఎవరి లోకంలో వాళ్లు ఉన్నారు. సరదా లేదు సందడి లేదు అని అంటాడు. అందరికీ టీ ఇచ్చిన కృష్ణ చేతికి రింగ్ లేకపోవడం చూసి కృష్ణ నీ రింగ్ ఏది మురారి చెల్లెలు అంటుంది. దాంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది కృష్ణ.

చివరిగా ఎప్పుడు చూసుకున్నావ్ కృష్ణ అని ముకుంద అడుగుతుంది. పొద్దున లేచి ముగ్గేసా అని అంటుంది కృష్ణ. దాంతో అయితే అప్పుడే జారిపోయి ఉంటుంది. వెళ్లి అక్కడ చూడుపో అని రేవతి అంటుంది. దాంతో పరుగెత్తుకుని వెళ్తుంది కృష్ణ. తులసి కోట, ముగ్గు వేసిన దగ్గర వెతుకుతూ ఉంటుంది. మురారికి కృష్ణ వేలుకు తొడగమని నేనే కదా ఇచ్చాను. అదే ప్రేమికుల రోజు చేజారిపోయిందంటే.. ఇంకా నా ప్రేమ మీద ఆశలు పెంచుకోవచ్చని అర్థమా అని మనసులో అనుకుంటుంది ముకుంద.

Whats_app_banner