Brahmamudi February 15th Episode: బ్రహ్మముడి సీరియల్.. కావ్య శీలంపై మచ్చ? అమ్మమ్మ మాస్టర్ ప్లాన్.. రంగంలోకి కళావతి బావ-brahmamudi serial february 15th episode indra devi master plan for kavya raj and swapna defends kavya about theft ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi February 15th Episode: బ్రహ్మముడి సీరియల్.. కావ్య శీలంపై మచ్చ? అమ్మమ్మ మాస్టర్ ప్లాన్.. రంగంలోకి కళావతి బావ

Brahmamudi February 15th Episode: బ్రహ్మముడి సీరియల్.. కావ్య శీలంపై మచ్చ? అమ్మమ్మ మాస్టర్ ప్లాన్.. రంగంలోకి కళావతి బావ

Sanjiv Kumar HT Telugu
Feb 15, 2024 08:16 AM IST

Brahmamudi Serial February 15th Episode: బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 15వ తేది ఎపిసోడ్‌లో కావ్య కోసం ఇందిరాదేవి సూపర్ ప్లాన్ వేస్తుంది. మరోవైపు కావ్య దొంగతనం చేసిందంటూ ధాన్యలక్ష్మీ, రుద్రాణి వెటకారంగా మాట్లాడుతారు. వారికి స్వప్న గట్టి కౌంటర్ ఇస్తుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 15వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 15వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో కావ్య ఇంటికి ఇందిరాదేవి వెళ్తుంది. కావ్యకు నచ్చ జెప్పాలనుకుంటుంది. నువ్ నీ స్నేహితురాలి కథ చెబుతున్నప్పుడే నీ కథ అని నాకు అర్థమైంది. అందుకే కంగారుపడకుండా నీ సమస్యను పరిష్కరించుకునే దారి చెప్పాను. కానీ, నువ్ ఇలా తప్పుకుంటానని రావడం నేను సమర్థించను. ఎన్నో కుటుంబాల్లో భార్యాభర్తలు సంతోషంగా ఉన్నారు, సర్దుకుపోతున్నారు, గొడవలు పడుతున్నారు. ఏ ఇంటి కిటికీ తెరచి చూసిన ఇదే పరిస్థితి అని ఇందిరాదేవి అంటుంది.

బానిసలా ఉండటమే

నేను ఇక ఆయన జీవితంలో నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను అని కావ్య అంటుంది. తప్పుకోవడంలోనే తప్పు అని హెచ్చరిక ఉంది అని ఇందిరాదేవి అంటుంది. సర్దుకుపోవడం గురించి అంటున్నాను. అలా అనీ, నీ ఉనికిని, అస్థిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని చంపుకుని బానిసలా బతకమనడం లేదు అని ఇందిరా దేవి అంటుంది. కానీ మీరు చెప్పినట్లు చేస్తే నేను బానిసలా ఉండటమే అవుతుంది అమ్మమ్మ గారు అని కావ్య అంటుంది.

రాజ్ నిన్నెప్పుడు అయిన కొట్టాడా, ఇంట్లో వాళ్లు నిన్ను అంటుంటే వాళ్లను మందలించకుండా ఉన్నాడా, నీ వాళ్లకు సహాయం చేస్తానంటే వద్దాన్నాడా.. నీ పుట్టింటివాళ్లకు హెల్ప్ చేయలేదా అని ఇందిరాదేవి అంటుంది. అన్నీ చేశారు కానీ, ఆయన మనసులో నాపై ప్రేమే లేదు. మంచి తనం వేరు, మనసులో ప్రేమ ఉండటం వేరు అని కావ్య అంటుంది. నీపై రాజ్‌కు ప్రేమ ఉంది. నీకోసం అన్నం కలుపుకుని తీసుకుని రావడం నేను చూశాను. నువ్ బాధలో ఉన్నావని భోజనం చేస్తున్నావాడు లేచి వచ్చాడు. నీకు భోజనం తినిపించలేదా అని ఇందిరాదేవి అంటుంది.

సముద్రంలోని అలలు

ఆయన దేవుడే, కానీ తప్పు చేయడం తప్పడం లేదు. నన్ను వదిలించుకోడానికి ఆఖరికి మరో అమ్మాయిని అడ్డు పెట్టుకున్నారు అని కావ్య అంటుంది. అడ్డు పెట్టుకున్నాడు. కానీ, ఆ అమ్మాయితో ఎలాంటి సంబంధం పెట్టుకోలేదు. అవకాశం ఉన్న ఆ అమ్మాయిని ఎంత దూరం ఉంచాలో అంతే స్థానం ఇచ్చాడు. నీపై రాజ్‌కు ప్రేమ ఉంది. కానీ అది బయటకు రావడం లేదు. సముద్రంలోని అలలు ఎంత ముందుకు వెళ్లిన చివరికి సముద్రంలోనే కలవాలి. సముద్రం లేనిదే అలలు లేవు. అలానే మీ భార్యాభర్తలు అని ఇందిరాదేవి అంటుంది.

దేవుడిని నిందించలేక.. కన్న ప్రేమతో ఉన్న మా పరిస్థితి గురించి ఆలోచించండి. దుగ్గిరాల ఇంటికి కోడలు కావాలంటే అదృష్టం ఉండాలి. కానీ నా కూతురు జీవితం బాగుపడాలంటే ఏం చేయాలి అని కృష్ణమూర్తి అంటాడు. సహనం వహించాలి అని ఇందిరాదేవి అంటుంది. ఎన్ని రోజులు అని కనకం అంటుంది. నీపై ఉన్న రాజ్ ప్రేమను బయటకు తీయాలి. ముల్లును ముల్లు తోనే తీయాలి. వేరే అమ్మాయిని అడ్డు పెట్టుకుని నిన్ను వదిలించుకుందామనుకున్న రాజ్‌కు నువ్ కూడా వేరే అబ్బాయిని అడ్డుపెట్టుకుని నువ్ దూరం అవుతున్నట్లు చేయాలి అని ఇందిరాదేవి అంటుంది.

శీలంపై మచ్చ పడుతుంది

దానికి అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటమ్మా మీరు చెప్పేది అని కనకం అంటే.. ఇందులో తప్పేముందు. కావ్య జీవితం బాగుపడాలంటే ఇదే దారి అని కృష్ణమూర్తి అంటాడు. నీ మతిగాని పోయిందా. నువ్ ఇది సమర్థించడం ఏంటని కనకం ఫైర్ అవుతుంది. అబ్బాయికి కాబట్టి నడుస్తుంది. అమ్మాయికి ఎలా ఇలాంటివి కుదుర్తుంది. దాని శీలంపై మచ్చ పడుతుంది. అప్పుడెలా అని కనకం అంటుంది. మన అమ్మాయి తప్పు చేయనంతవరకు అలాంటిదేం జరగదు. దీన్నే లౌక్యం అంటారు అని ఇందిరాదేవి అంటుంది.

లేదు అమ్మమ్మ గారు ఇందులోనే పెద్ద తిరకాసు ఉంది. మా అక్కలాగే నన్ను కూడా అనుమానిస్తారు అని కావ్య ఆవేదనగా అంటుంది. అప్పుడు నేను రంగంలోకి దిగుతాను. ఇదంతా నేను ఆడించిన నాటకం అని తెలిసాకా ఇంకెవరు అనరు అని ఇందిరాదేవి అంటుంది. కానీ, ఆయనేదో చేశారని వేరే అబ్బాయితో నేను చనువుగా ఉండటం అంటేనే నాకు అదోలా ఉందని కావ్య అంటుంది. అప్పుడు ఒక పాము, సాధువు స్టోరీ చెబుతుంది ఇందిరాదేవి. పాము కాటు వేయద్దు, కాను బుస కొట్టాలి అని ఇందిరాదేవి అంటుంది.

తండ్రిగా చెప్పకూడదు

నేను నీ వెనుక ఉంటాను కాబట్టి, నీ శీలంపై మచ్చ పడదు అని ఇందిరాదేవి అంటుంది. కానీ, అలా నటించడానికి అబ్బాయి ఎవరున్నారని కనకం అంటుంది. మా చెల్లెలి అబ్బాయి రేపే వస్తున్నాడు. వాడిని అడుగుదాం అని కృష్ణమూర్తి అంటాడు. ఇంకే ఇంట్లోవాడు, వరుసకు బావ అయితే ఎలాంటి తప్పు లేదు అని ఇందిరాదేవి అంటుంది. అమ్మా కావ్య.. తండ్రిగా నేను చెప్పకూడదు. కానీ, నా కూతురు జీవితం బాగుపడాలంటే ఇలా చేయకతప్పదు అని కృష్ణమూర్తి అంటుంది.

సరే అని కావ్య ఒప్పుకుంటుంది. ఆయన అమ్మాయిని ఎలా అయితే అడ్డుపెట్టుకున్నారో నేను కూడా అలాగే అబ్బాయిని అడ్డుపెట్టుకుని ఆయన్ను దక్కించుకుంటాను అని కావ్య అంటుంది. ఇదేం అనైతికం కాదు. నీ మనసులో ఎలాంటి సంశయాలు పెట్టుకోకుండా వెళ్లు. విజయం నీదే అని ఇందిరాదేవి అంటుంది. దాంతో ఇందిరాదేవిని కావ్య హగ్ చేసుకుంటుంది. అనంతరం దుగ్గిరాల ఇంట్లోకి కావ్య వెళ్తుంది. తను రాగానే రా అమ్మా అని ధాన్యలక్ష్మీ, రుద్రాణి వెటకారంగా అంటారు.

వదినను అడుగు

ఏంటీ రాగానే ఈ పనికిమాలిన పంచాయతీ. మీ కోడలు మీకు సరిగా బుద్ధి పెట్టడం లేదా అని కావ్య అంటే షటప్ అని రుద్రాణి ఫైర్ అవుతుంది. అది నువ్ కూడా చేస్తే బాగుంటుంది. అసలు ఏమైందని రాగానే కావ్యపై విరుచుకుపడుతున్నారు అని ఇందిరాదేవి అంటుంది. లాకర్‌లో రెండు లక్షలు కనిపించడంలేదు. వెళ్లి వాళ్ల పుట్టింటికి ఇచ్చి వచ్చింది కావ్య. కావాలంటే వదినను అడుగు అని రుద్రాణి అంటుంది. ఏంటీ అపర్ణ నిజమా అని ఇందిరాదేవి అంటుంది.

తను ఇంట్లో వాళ్లకు ఏం ఇచ్చిందో నాకు తెలియదు. కానీ, 2 లక్షలు కనిపించడం లేదు. నువ్ రెండు లక్షలు తీసుకోవడం తప్పు కాదు. నాకు కానీ రౌజ్‌కు గానీ చెప్పి తీసుకుంటే అయిపోయేది కదా. ఇదేనా మీ అత్తకు ఇచ్చే గౌరవం. పూచికకు పనికిరాని వాళ్లతో మాటలు పడాల్సిన అవకాశం ఎందుకు ఇస్తున్నావ్ అని కావ్యను అంటుంది అపర్ణ. అంతలో ఆపండి అని స్వప్న గట్టిగా అరుస్తుంది. నువ్ ఇలా సైలెంట్‌గా ఉంటే నిజమే అనుకుంటారు. నిజం చెబితే అయిపోతుంది కదా అని స్వప్న అంటుంది. అసలు నిజం చెప్పే అవకాశం ఎవరు ఇవ్వట్లేదు అని సుభాష్ అంటాడు.

నీకేంటి మర్యాదా

అసలు కావ్య గురించి తెలిసి కూడా దొంగ అని ఎలా అంటారు అని రుద్రాణిని చూస్తే.. నేను కాదు ధాన్యలక్షే అని భయంగా చెబుతుంది రుద్రాణి. నేనే అన్నాను అని ధాన్యలక్ష్మీ అంటే.. నువ్వు అంటూ మాట్లాడుతుంది స్వప్న. మర్యాద లేకుండా నువ్వు అంటావేంటీ అని ధాన్యం అంటే నా చెల్లిని మర్యాద లేకుండా దొంగ అంటే నీకేంటి ఇచ్చేది మర్యాదా. అయినా నేను నీకు చెప్పను అసలు విషయం. ఆంటీకి చెబుతాను అని స్వప్న అంటుంది.

సారీ అత్తయ్య తనపై మొదటిసారి ఇంతపెద్ద నింద పడేసరికి తను బ్లాంక్ అయింది. ఆ రెండు లక్షలు కావ్యే నాకు ఇచ్చింది అని స్వప్న చెబుతుంది. దాంతో అనామిక, రుద్రాణి తెగ షాక్ అవుతారు. అపర్ణ ఆశ్చర్యంగా చూస్తుంది. బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో శ్వేతతో రాజ్ కావాలనే ప్రేమగా మాట్లాడుతుంటే.. కావ్య మీరు ఇలాగే మాట్లాడుకోండి నాకు ఏం ప్లాబ్లమ్ లేదు. రేపు మీకు సర్‌ప్రైజ్ ఉందని అంటుంది. దాంతో ఆ సర్‌ప్రైజ్ ఏంటని అస్సలు నిద్రపోకుండా అడుగుతుంటాడు రాజ్.

Whats_app_banner