Ram Charan: అమ్మమ్మ ఇంటి నుంచి మెగా ఇంట్లోకి అడుగుపెట్టిన రామ్‍చరణ్ కుమార్తె.. ఘనంగా వినాయక చవితి పూజ-ram charan chiranjeevi family celebrates ganesh chaturthi with klin kaara ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan: అమ్మమ్మ ఇంటి నుంచి మెగా ఇంట్లోకి అడుగుపెట్టిన రామ్‍చరణ్ కుమార్తె.. ఘనంగా వినాయక చవితి పూజ

Ram Charan: అమ్మమ్మ ఇంటి నుంచి మెగా ఇంట్లోకి అడుగుపెట్టిన రామ్‍చరణ్ కుమార్తె.. ఘనంగా వినాయక చవితి పూజ

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 18, 2023 03:37 PM IST

Ram Charan: మెగా కుటుంబం ఘనంగా వినాయక చవితిని జరుపుకుంది. రామ్‍చరణ్‍, ఉపాసన దంపతులకు క్లీంకార జన్మించాక వచ్చిన తొలి వినాయకచవితి ఇది. తాము పండుగ నిర్వహించుకున్న ఫొటోలను రామ్‍చరణ్ షేర్ చేశారు.

Ram Charan: అమ్మమ్మ ఇంటి నుంచి మెగా ఇంట్లోకి అడుగుపెట్టిన రామ్‍చరణ్ కుమార్తె.. ఘనంగా వినాయక చవితి పూజ
Ram Charan: అమ్మమ్మ ఇంటి నుంచి మెగా ఇంట్లోకి అడుగుపెట్టిన రామ్‍చరణ్ కుమార్తె.. ఘనంగా వినాయక చవితి పూజ

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ కుమార్తె క్లీంకార మెగా ఇంట్లో అడుగుపెట్టారు. రామ్‍చరణ్ భార్య ఉపాసన ఈ ఏడాది జూన్ 20న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో పెళ్లయిన సుమారు 11ఏళ్లకు రామ్‍చరణ్, ఉపాసన తల్లిదండ్రులయ్యారు. దీంతో మెగా, అపోలో కుటుంబాలు ఆనందంలో మునిగితేలుతున్నాయి. కూతురికి జన్మనిచ్చాక ఉపాసన.. తన తల్లి అయిన శోభన కామినేని ఇంట్లోనే ఉంటున్నారు. బారసాల కూడా అక్కడే జరిగింది. తమ కూతురికి క్లీంకార కొణిదెల అని పేరుపెట్టారు రామ్‍చరణ్, ఉపాసన. తాజాగా, అమ్మమ్మ ఇంటి నుంచి తాత మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోకి క్లీంకార అడుగుపెట్టారు.

చిరంజీవి మెగాస్టార్ ఇంట్లో నేడు వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. పూజను గ్రాండ్‍గా చేశారు మెగా కుటుంబ సభ్యులు. క్లీంకార జన్మించాక వచ్చిన తొలి వినాయక చవితి కావటంతో వారికి ఈ పండుగ మరింత ప్రత్యేకంగా ఉంది. ఈ పండుగ సందర్భంగా క్లీంకారతో పాటు తన అత్తవారింటికి వచ్చారు ఉపాసన. ఈ పూజలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ వారి కూతుళ్లు, మనువరాళ్లు పాల్గొన్నారు. పూజలో పాల్గొన్న ఉపాసన.. క్లీంకారను ఎత్తుకున్న ఫొటోను రామ్‍చరణ్ షేర్ చేశారు. అలాగే.. పూజకు సంబంధించిన మరిన్ని ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు.

అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు అంటూ ఈ ఫొటోలను రామ్‍చరణ్ షేర్ చేశారు. క్లీంకారతో కలిసి తొలి వినాయకచవితిని జరుపుకోడం.. ఈసారి ప్రత్యేకత అని క్యాప్షన్ రాశారు. అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగి.. శుభాలు కలగాలని కోరుకుంటున్నట్టు రామ్‍చరణ్ తెలిపారు. మనవరాలు ఇంట్లో అడుగుపెట్టడంతో మెగాస్టార్ చిరంజీవి చాలా సంతోషంగా కనిపించారు.

సినిమాల విషయానికి వస్తే.. శంకర్ దర్శకత్వంలో రామ్‍చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ జోరుగా సాగుతోంది. దిల్‍రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్‍చరణ్‍కు జోడీగా కియారా అడ్వానీ హీరోయిన్‍గా చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీని రిలీజ్ చేయాలని చిత్ర బృందం టార్గెట్‍గా పెట్టుకుంది. గ్లోబల్ హిట్ అయిన ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్‍చరణ్ చేస్తున్న మూవీ కావటంతో గేమ్ ఛేంజర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.