Brahmamudi February 23rd Episode: బ్రహ్మముడి సీరియల్.. రాజ్‌ను తప్పించేందుకు అనామిక ప్లాన్.. కావ్యకే షాక్ ఇచ్చిన బావ-brahmamudi serial february 23rd episode anamika wicked plan on raj and rudrani big sketch brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi February 23rd Episode: బ్రహ్మముడి సీరియల్.. రాజ్‌ను తప్పించేందుకు అనామిక ప్లాన్.. కావ్యకే షాక్ ఇచ్చిన బావ

Brahmamudi February 23rd Episode: బ్రహ్మముడి సీరియల్.. రాజ్‌ను తప్పించేందుకు అనామిక ప్లాన్.. కావ్యకే షాక్ ఇచ్చిన బావ

Sanjiv Kumar HT Telugu
Feb 23, 2024 08:38 AM IST

Brahmamudi Serial February 23rd Episode: బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 23వ తేది ఎపిసోడ్‌లో కావ్యను ఇంప్రెస్ చేసేందుకు రాజ్ తెగ ప్రయత్నాలు చేస్తాడు. మరోవైపు రాజ్‌పై అనామిక కన్నింగ్ ప్లాన్ వేస్తుంది. ఆమె మాటలు విన్న తనకంటే ఎక్కువగా రుద్రాణి స్కెచ్ వేస్తుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 23వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 23వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో రాత్రిపూట కావ్య, తన బావ ముచ్చట్లు పెట్టుకుంటారు. అది చూసి రాజ్ ఉడికిపోతాడు. వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో వినేందుకు చాటుగా వస్తాడు. కానీ, పూల కుండీ కాలికి తగిలి వాళ్ల ముందు పడిపోతాడు. దాంతో అది చూసిన కావ్య ఇక్కడే కూర్చుని మా మాటలు వినొచ్చు అని చెబుతుంది. దాంతో ఛీ ఛీ అలాంటిదేం లేదని అన్న రాజ్.. ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతాడు.

హ్యాపీగా మాట్లాడుకుందాం

చిన్ననాటి స్నేహితులం, విడిపోయిన పక్షులం అంటూ ఏదోదో చెబుతుంది కావ్య. దాంతో ఎహే ఆపమంటూ అరుస్తాడు రాజ్. దానికి అవునన్నయ్యా అంటూ కావ్య బావ వత్తాసు పలుకుతాడు. తమ్ముడు అన్నయ్య ఇక నువ్ ఆపమని రాజ్ అంటాడు. బావ మనం వెళ్లి పడుకుందాం. రేపు మనం మాట్లాడుకోవడానికి చాలా టైమ్ ఉంటుంది. మా ఆయనను ఆఫీస్‌కు పంపించి హ్యాపీగా మాట్లాడుకుందాం అని కావ్య అంటుంది. నాకు తలనొప్పిగా ఉంది. కాఫీ పెట్టివ్వమని రాజ్ అంటాడు.

దానికి అలా చేయలాంటే పెరుగుకు తోడు పెట్టిన పాలు తీయాలి. అలా చేస్తే చిన్ననాటి స్నేహితులను విడదీసినట్లు అవుతుందని ఇంకా రెచ్చగొడుతుంది కావ్య. ఏం వద్దంటూ రాజ్ వెళ్లిపోతాడు. మరుసటి రోజు ఉదయం రన్నింగ్ చేసి అలసిపోయి కూర్చుంటుంది అప్పు. అప్పుడే అక్కడికి వచ్చిన ఓ పెద్దాయన ఈ ఫిట్‌నెస్ సరిపోదు. పోలీసు కావాలంటే ఇంకా కావాలి అని అంటాడు. దానికి వెటకారంగా మాట్లాడుతుంది అప్పు. నేను ఇదివరకు పోలీస్ కాబట్టే చెబుతున్నాను అని ఆయన అంటే.. ఈ పొట్ట వేసుకుని మీరు పోలీస్ ఏంటని అప్పు సెటైర్లు వేస్తుంది.

రిటైర్డ్ ఎస్సై అని తెలిసి

ఇప్పుడు కాదు. ఒకప్పుడు. నేను రిటైర్డ్ అయ్యాను అని అతను అంటాడు. అది అప్పు నమ్మదు. పైగా నవ్వుతుంది. ఇంతలో ఓ కానిస్టేబుల్ వచ్చి ఆయనకు సెల్యూట్ చేస్తాడు. క్షేమసమాచారాలు అడిగి వెళ్లిపోతాడు. అప్పుడే అతను రిటైర్డ్ ఎస్సై అని అప్పుకు తెలుస్తుంది. దాంతో అతనికి సారీ చెప్పి.. అతన్ని తన గురూజీగా ఉండమని కోరుతుంది. దానికి ఆయన ఒప్పుకుంటాడు. ముందు కానిస్టేబుల్‌కు అప్లై చేయమని, అప్పుడు ఎస్సై జాబ్‌కు ఈజీగా ఉంటుందని ఆయన సలహా ఇస్తాడు. దానికి సరేనంటుంది అప్పు.

మరోవైపు ఇంట్లో రాజ్‌కు కావ్య ఎదురుపడుతుంది. తనకు బ్లాక్ కాఫీ అడిగితే.. వాళ్ల బావకు (భాస్కర్ వరప్రసాద్) ప్రోటీన్ షేక్ తీసుకెళ్తుంది. మీలాగే మా బావ కూడా జిమ్ చేస్తాడండీ. మీరు ఇప్పుడే లేచారు కదా. ముందు మా బావకు ఇది వచ్చి. తర్వాత మీకు కాఫీ ఇస్తానని కావ్య అంటుంది. నాకన్న మీ బావే ఎక్కువయ్యాడా అని రాజ్ అంటే.. మీకు మా బావకు పోలిక్ ఏంటండి. మాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. మీరు ఈ మధ్యే వచ్చారు కదా. మనకు గొడవలు తప్పా అలాంటివేం లేవు కదా అని సెటైర్స్ వేస్తుంది కావ్య.

ఫెయిల్ అయ్యావా

అయినా, అతిథి దేవో భవ అన్నారు కదా పెద్దలు అని కావ్య అంటే.. అదే పెద్దలు పతియే ప్రత్యక్ష దైవం అని అన్నది గుర్తులేదా అని రాజ్ అంటాడు. పతి పర్మినెంటా అని కావ్య అంటే.. కాఫీ కోసం భార్య పోస్ట్ పర్మినెంట్ చేయలేను వెళ్లి ఇచ్చుకో అని రాజ్ అంటాడు. అది చేస్తుంటూనే నా టైమ్ వేస్ట్ చేస్తున్నారని చెప్పి వెళ్లిపోతుంది కావ్య. తర్వాత అనామికకు కాల్ చేసి ఏమైంది, ఇంటి బాధ్యతలు వచ్చాయా అని ఆమె తల్లి అడుగుతుంది. లేదు మళ్లీ కావ్య చేతికే వెళ్లిపోయాయి అని అనామిక చెబుతుంది.

నువ్ కూడా మీ డాడా లాగే ఫెయిల్ అయ్యావా అని ఆమె అంటుంది. అలా తీసివేయకు మమ్మీ. కానీ, కల్యాణ్‌ను ఆఫీస్‌కు పంపిస్తున్నాను. ఫస్ట్ నైట్ జరగాలంటే ఆఫీస్‌కు వెళ్లాలని చెప్పాను. అందుకే వెళ్తున్నాడు. ముందు రాజ్‌ను తప్పించి.. కల్యాణ్‌ను డెసిషియన్ మేకర్‌గా చేస్తాను. తర్వాత కల్యాణ్ కింగ్ అవుతాడు. నేను క్వీన్ అవుతాను అని అనామిక తన తల్లితో ఫోన్‌లో చెబుతుంది. ఆ మాటలన్నీ రుద్రాణి వింటుంది. అమ్మా అనామిక.. నువ్ చాలా రిచ్‌ అయి సాధాణంగా ఉండే అమ్మాయివి అనుకున్నా. కానీ, నాలాగే కంత్రిదానివి కదా అని రుద్రాణి అనుకుంటుంది.

పర్మినెంట్ అమ్మ

నువ్ రాజ్‌ను తప్పించేందుకు ఏం చేస్తావో దానికి నేను సహయం చేస్తాను. నువ్ కల్యాణ్‌కు బాధ్యతలు అప్పగించే టైమ్‌కు వాడిని తప్పించి రాహుల్‌కు దక్కేలా చేస్తాను అని అనామికపై రుద్రాణి ప్లాన్ వేస్తుంది. మరోవైపు రాజ్ కాఫీ తాగుతూ ఉంటాడు. మీకు మీరే చేసుకున్నారా అని కావ్య అడిగితే.. నువ్ లేకుంటే నాకు ఇచ్చే దిక్కే లేదా. టెంపరరీ పెళ్లాం ఇవ్వకుంటే పర్మినెంట్ అమ్మ ఉందిగా అని రాజ్ అంటాడు. ఆవిడను చూస్తుంటే జాలి వేస్తుంది. నేను వెళ్లిపోయాకా ఎద్దులాంటి కొడుకుకు సేవలు చేయాలి పాపం అని కావ్య అంటుంది.

నువ్ పోతే ఇంకెవరు రారా. నీ స్థానంలో మరో మంచి అమ్మాయి వస్తుంది అని రాజ్ అంటాడు. మరి ఈ విషయం అందరికీ చెప్పేద్దామా అని అందరినీ పిలుస్తుంది కావ్య. దాంతో రాజ్ నోరు మూస్తాడు. ఇలా టెంపరరీ పెళ్లాంపై చేతులు వేయకూడదు అని కావ్య అంటుంది. నేను వేసింది అందుకు కాదు. నీ నోరు మూయించడానికి అని రాజ్ అంటాడు. టైమ్ చూసుకుని అందరికీ నిజం చెబుతాను. ముందు నన్ను ప్రశాంతగా ఎక్సర్ సైజ్ చేసుకోని అని వెళ్లిపోతాడు. అలా ఎలా ప్రశాంతత దొరకనిస్తాను అని కావ్య అనుకుంటుంది.

పెళ్లి చేసుకుంటాడు

రాజ్ బయటకు రాగానే ఇందిరాదేవి తలకు మసాజ్ చేస్తాడు బావ. అది చూసిన రాజ్‌తో మా బావకు ఎన్ని విషయాలు తెలుసో.. చాలా జీనియస్ అని కావ్య అంటుంది. ఎంత ఇచ్చాడు వాడు అని రాజ్ అంటే.. మిమ్మల్ని కూడా పొగిడాను మీరు ఏం ఇచ్చారు. విడాకులు ఇస్తున్నారు అని కావ్య అంటుంది. అలా అరవకు అని రాజ్ అంటాడు. ఈ విషయం తెలిస్తే మా బావ నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు. మా ఇంట్లోవాళ్ల దగ్గరికి వెళ్లి మా పెళ్లికి ఒప్పిస్తాడు అని కావ్య అంటుంది. దాంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు రాజ్.

మీ బావకు మన సంగతి చెప్పావా అని రాజ్ అడిగితే.. లేదు చెబితే ఇలా కామ్‌గా ఎందుకు ఉంటాడు అని కావ్య అంటుంది. చెప్పకు, వాడు అందరికీ చెప్పేసేలా ఉన్నాడు. ముందు నానమ్మ తల విరిచేసేలా ఉన్నాడు అని ఇందిరాదేవి దగ్గరకు వెళ్తాడు రాజ్. తర్వాత ఇందిరాదేవికి తల్ల తిప్పుతాడు. కానీ, నొప్పి భరించలేక నేను హాస్పిటల్‌కు వెళ్లి చూయించుకుంటాను అని ఇందిరాదేవి అంటుంది. నాకు అన్నీ తెలుసు అని రాజ్ అంటే.. నాకోసం ఓసారి వృశ్చిక ఆసనం వేయమని బావ అడుగుతాడు.

బిగుసుకుపోయిన రాజ్

ఆ ఆసనాన్ని ఫోన్‌లో వెతికి చూసిన రాజ్.. షాక్ అవుతాడు. ఇది ఎంప్టీ స్టమక్‌తో వేయాలని, తర్వాత చేస్తానని రాజ్ చెబుతాడు. పోని భుజంగ ఆసనం వేయమంటే.. భుజాలు నొప్పిగా ఉన్నాయి అని కవర్ చేస్తాడు రాజ్. పోని పద్మాసనం ఓకేనా అని రాజ్ అంటే బావ ఓకే అంటాడు. కానీ, పద్మాసనం వేసిన రాజ్ ఒక్కసారిగా బిగుసుకుపోతాడు. అది చూసి చాలా బాగుంది అని ఫొటోలు తీసుకుంటాడు బావ. అలాగే బావ ఫొటోలు తీస్తుంటాడు. కానీ, రాజ్ వల్ల కాదు. ఇక చాలు అంటాడు. కానీ, బావ వినడు.

దాంతో ఇక చాలు బావ అని కావ్య అంటే.. హమ్మయ్య బతికించింది అని రాజ్ అంటాడు. తర్వాత ఫోన్ వచ్చినట్లు వెళ్లిపోతాడు రాజ్. నీ బావ కంటే గొప్ప అని చెప్పేందుకు అన్ని పాట్లు పడుతున్నాడు. నువ్ ఎక్కడ తగ్గకు నీపై ప్రేమ చూపించేవరకు అని ఇందిరాదేవి అంటుంది. బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో వాలంటైన్స్ డే సందర్భంగా కావ్యను ఓ రెస్టారెంట్‌కు తీసుకెల్లి సర్‌ప్రైజ్ అని చెప్పి కావ్యకు షాక్ ఇస్తాడు బావ. అది చూసి రాజ్ చాలా షాక్ అవుతాడు.

Whats_app_banner