Brahmamudi February 26th Episode: బ్రహ్మముడి సీరియల్.. ఆఫీస్‌కు అనామిక.. కల్యాణ్ బండారం బయటకు.. కావ్యదే తప్పంటూ అరుపులు
Brahmamudi Serial February 26th Episode: బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 26వ తేది ఎపిసోడ్‌లో కావ్యకు రాజ్ లవ్ ప్రపోజ్ చేస్తాడు. అనంతరం ఆఫీస్‌కి వెళ్లిన అనామిక భర్త కల్యాణ్ చేస్తున్న నిర్వాకం చూసి ఇంట్లో ఫైర్ అవుతుంది. కావ్యే కారణమంటూ అరిచేస్తుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కావ్యకు బావ లవ్ ప్రపోజ్ చేయనున్నాడను, ఇవాళ వాలంటైన్స్ డే అని, అందుకే కేక్, ఫ్లవర్ బుకే ఆర్డర్ చేశాడని రాజ్‌కు చెబుతాడు వెయిటర్. దాంతో షాక్ అవుతాడు రాజ్. చూశావా వాడు లవ్ ప్రపోజ్ చేయడానికే వచ్చాడు అని రాజ్ గింజుకుంటాడు. దానికి అలా చేస్తే నీకేంటీ. నువ్ ఎలాగు తన జీవితంలో నుంచి వెళ్లిపో అన్నావ్‌గా అని శ్వేత అంటుంది.
ఇంకా విడాకులు ఇవ్వలేదు
కావ్య తప్పు చేయదు అని రాజ్ అంటాడు. అది తప్పు ఎలా అవుతుంది. ఇన్నాళ్లు నిన్ను నమ్ముకుంది. నువ్ వెళ్లిపో అన్నావ్ కాబట్టి.. తన జీవితం తాను చూసుకుంది. నువ్ వద్దన్నావని ఏడుస్తూ కూర్చోవాలా. ఇంకా చెప్పాలంటే ఆ లవ్ ప్రపోజ్‌ను కావ్య యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటున్నాను అని శ్వేత అంటుంది. ఏ.. ఆపు.. నేను ఇంకా విడాకులు ఇవ్వలేదు కదా అని రాజ్ అంటే.. ఇప్పుడు లవ్ యాక్సెప్ట్ చేసి విడాకులు ఇచ్చాక పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందేమో అని శ్వేత అంటుంది.
నా భార్యకు వాడు ఎలా లవ్ ప్రపోజ్ చేస్తాడు అని రాజ్ తెగ గింజుకుంటాడు. ఆ కేక్, ఫ్లవర్ బుకే చూసి బావ ఏంటిది అని కావ్య అడుగుతుంది. ఇంతలో సీతారామయ్య, ఇందిరాదేవి వస్తారు. వాళ్లను చూసి షాక్ అయిన కావ్య వాళ్లు వస్తున్నట్లు భాస్కర్‌తో (బావ) చెబుతుంది. నేనే రమ్మన్నాను అని బావ షాక్ ఇస్తాడు. నానమ్మ, తాతయ్యను చూసిన రాజ్ వెంటనే కావ్య వాళ్ల దగ్గరికి వెళ్లిపోతాడు. ఆ ముగ్గురిని చూసిన సీతారామయ్య.. రాజ్ మీరు కూడా ఇక్కడికే వచ్చారా. ఏంట్రా కావ్యకు లవ్ ప్రపోజ్ చేద్దామని వచ్చావా అని అంటాడు.
ప్రేమ ఇంకా మారలేదు
అవును తాతయ్య.. ఇవాళ వాలంటైన్స్ డే కదా. అందుకే లవ్ ప్రపోజ్ చేద్దామనుకుంటున్నాను అని రాజ్ అంటాడు. దానికి ఆశ్చర్యపోతుంది కావ్య. మీరు ఏంటీ ఇక్కడ అని రాజ్ అడిగితే.. ఇవాళ ప్రేమికుల దినోత్సవం అని నేనే తీసుకొచ్చాను అని ఇందిరాదేవి అంటుంది. ఈ వయసులో అని రాజ్ అంటే.. ప్రేమకు వయసుతో సంబంధం ఏంట్రా.. మా ప్రేమ ఇంకా మారలేదు అని సీతారామయ్య అంటాడు. నీ ప్రేమ మారిందేంట్రా.. ఎవరికీ తెలియకుండా ఇక్కడికి తీసుకొచ్చి.. నీ ప్రేమను వ్యక్తపరచాలనుకున్నావ్ కదా అని ఇందిరాదేవి అంటుంది.
తర్వాత అన్నయ్య.. ఇది అంటూ బావ అంటుంటే.. తెలుసు తమ్ముడు.. ఇదంతా నాకోసం అని. కావ్యకు సర్‌ప్రైజ్ అని రాజ్ అంటాడు. దాంతో బావ, కావ్య, శ్వేత నవ్వుకుంటారు. ఇంతలో మీడియా వస్తుంది. మీడియా వస్తుందని మాత్రం ఊహించలేదు అని రాజ్ అంటాడు. అనంతరం అందరిని ఇందిరాదేవి పిలుస్తుంది. మా మనవడు లవ్ ప్రపోజ్ చేస్తున్నాడని అంటుంది. దాంతో అంతా వస్తారు. అప్పుడు ఫ్లవర్ బుకే ఇచ్చి కావ్యకు రాజ్ లవ్ ప్రపోజ్ చేస్తాడు. అందులోనుంచి రెడ్ రోజ్ తీసుకుని రాజ్‌కు కావ్య ప్రపోజ్ చేస్తుంది.
నమ్మకం ఉండాలి
దాన్ని అయోమయంగా తీసుకుంటాడు రాజ్. అనంతరం కావ్య, రాజ్ కేక్ కట్ చేస్తారు. ఒకరికొకరు కేక్ తినిపించుకుంటారు. వీడికి తిక్క బాగా కుదిరింది అని శ్వేత అనుకుంటుంది. బావ కూడా కేక్ తినిపిద్దామని వెళ్తుంటే రాజ్ ఆపుతాడు. ఇది వాలంటైన్స్ డే అంటాడు రాజ్. ఇది ప్రేమంటే. పెళ్లికి ముందు వాళ్లను కలిపి ఉంచేందుకు ఏదో ఒక ఆకర్షణ ఉంటుంది. కానీ పెళ్లి తర్వాత బంధం నిలుపుకోవాలంటే ప్రేమ ఉండాలి. నమ్మకం ఉండాలి అంటూ పెద్ద లెక్చర్ ఇస్తుంది ఇందిరాదేవి.
మేము 50 ఏళ్లు ఎలాంటి కలత లేకుండా ఉన్నామంటే అందుకు కారణం మేమే. ప్రేమ పంచుకున్నాం. తేడాలు వస్తే కలిసి చర్చించుకున్నాం. సర్దుకుపోయాం అని రాజ్‍కు అర్థమయ్యేలా చాలా మాటలు చెబుతుంది ఇందిరాదేవి. దాంతో అంతా చప్పట్లు కొడతారు. ఇక మీరు వెళితే మా ప్రేమను పంచుకుంటాం అని ఇందిరాదేవి అంటుంది. దాంతో అంతా నవ్వుతారు. అమ్మో కావ్య ఇక్కడే ఉంటే వీడు ప్రపోజ్ చేస్తాడు అని కావ్య మనం ఆఫీస్‌కు వెళ్దాం. పని ఉందని రాజ్ అంటాడు.
నాకోసం కాదా
అన్నయ్య మరి నేను అని బావ అంటే.. నువ్ ఇక్కడే ఉండి నానమ్మ తాతయ్యను చూసుకో అని కావ్యను తీసుకెళ్లిపోతాడు రాజ్. కారులో వెళ్తుండగా.. ఆ కేక్, బుకె ఎందుకు తెప్పించాడు. నీకు లవ్ ప్రపోజ్ చేద్దామనుకున్నాడా అని రాజ్ అంటాడు. ఏంటీ.. అవునా అని ఆశ్చర్యంగా అంటుంది కావ్య. అంటే ఆ కేక్ నాకోసం మీరు తెప్పించలేదా. మీరు లవ్ చేయరు. చేసేవాళ్లను చేయనివ్వరు. మా బావ లవ్ ప్రపోజ్ చేస్తే ఎంత బాగుండేది అని కావ్య అంటుంది.
అక్కడికి మీడియా వాళ్లు వచ్చారు. వాళ్లు మీ బావతో కేక్ కట్ చేయించిన ఫొటోలు వేస్తే ఎలా ఉండేది. నువ్ దుగ్గిరాల ఇంటికి కోడలివి. అదంతా బయటకు వస్తే ఎలా ఉండేది అని రాజ్ అంటాడు. అవును కదా.. కానీ, అలా జరిగితే మన రూట్ క్లియర్ అయ్యేది కదా. ఎలాగు మీరు నన్ను వదిలించుకుందామనుకుంటున్నారు కదా అని కావ్య అంటుంది. దానికి రాజ్ అరుస్తాడు. ఏంటీ ఆ శ్వేతను వదిలి నాతోనే ఉండాలని నిర్ణయ మార్చుకుంటున్నారా అని కావ్య అంటుంది. లేదు, నాది ఎప్పుడు ఒకే మాట అని రాజ్ అంటాడు.
కల్యాణ్ గురించి తెలుసుకోవాలి
ఇదంతా మా బావకు తెలియనంత వరకే. లేకుంటే నన్ను పెళ్లి చేసుకుని అమెరికా తీసుకెళ్లిపోతాడు అని కావ్య అంటుంది. దాంతో చెప్పవే.. అందరికీ చెప్పు అని రాజ్ అంటాడు. అలా చెబితే అందరూ నన్నే తప్పు బడతారు. మీరే అందరికీ చెప్పండి. నాకు నా పెళ్లాం వద్దు అని కావ్య అంటుంది. మరోవైపు అనామిక దగ్గరికి వచ్చిన రుద్రాణి.. కల్యాణ్‌ను ఆఫీస్‌కు పంపిస్తే సరిపోదు. నీకు కావాల్సిన పనులు కల్యాణ్ చేస్తున్నాడో తెలుసుకోవాలి కదా అని రుద్రాణి అంటుంది.
మీ అత్తయ్య అమాయకురాలు. అందుకే మా వదిన బానిసను చేసుకుంది. నిన్ను ఆ కావ్య అలాగే చేసి ఆడిస్తుంది. ఇలా జరగకూడదంటే కల్యాణ్ ఆఫీస్‌లో నీకు పనికి వచ్చే పనులు చేస్తున్నాడో తెలుసుకోవాలి అని రుద్రాణి అంటుంది. కానీ, నేను ఆఫీస్‌కు ఎలా వెళ్లాలి అని అనామిక అంటుంది. ఆ కావ్య రాజ్‌కు భోజనం తీసుకెళ్లేది.. ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్లు. కానీ, తనకు చేయాలనుకుంది చేసేది అని రుద్రాణి అంటుంది. అయితే నేను కూడా లంచ్ తీసుకెళ్తాను అని అనామిక అంటుంది.
సోది మీటింగ్ ఏంటీ
కల్యాణ్ ఒక్కడికే లంచ్ తీసుకెళ్తే అనుమానం వస్తుంది. అందరికీ తీసుకెళ్లు అని రుద్రాణి అంటుంది. మీరు లేకుంటే నేను ఏమైపోయేదాన్నో ఆంటీ. థ్యాంక్స్ అంటుంది అనామిక. నేను ఉన్నంత వరకు నీకు ఏం కాదు అని రుద్రాణి అంటుంది. అనామిక వెళ్లగానే అనుకున్నట్లు పుల్లలు పెట్టాని సంతోషపడుతుంది రుద్రాణి. మరోవైపు ఆఫీస్‌లో మనం పంపిన డిజైన్స్ పై వాళ్లు ఏమైనా చెప్పారా అని శ్రుతిని అడుగుతుంది కావ్య. అక్కడికి వచ్చిన రాజ్ వాళ్లపై ఏంటీ సోది మీటింగ్ పెట్టారు అంటాడు.
దాంతో బావ సెంట్ గురించి, బావ షర్ట్ గురించి అలా అన్నీ కావ్య చెబుతుంది. దాంతో కోపంతో ఆఫీస్‌లో ఆఫీస్ విషయాలే మాట్లాడలాని అంటాడు రాజ్. తర్వాత శ్రుతిని డిజైన్స్ చూపించమని అంటాడు. అవి చూసి ఇవా పంపించారు. నా కంపెనీ రెప్యూటేషన్ పాడు చేస్తున్నారు అని ఫైర్ అవుతాడు రాజ్. ఈ డిజైన్స్‌కు ఏమైంది. మా బావ వచ్చినప్పటి నుంచి కావాలనే నన్ను ఏదో ఒకటి తిడుతున్నారు. మా బావ వచ్చాడని మీకు సూర్యరశ్మీ తగలని చోట మండిపోతుంది కదా అని కావ్య ఇన్ డైరెక్ట్‌గా దాదాపుగా బూతులా అంటుంది.
తెలిసిందే కదా
దానికి శ్రుతి నవ్వుతుంది. అమ్మో అమ్మో ఏం మాట్లాడుతున్నావే అని రాజ్ అంటాడు. మీ గుండెలకు సూర్య రశ్మీ తగలదు కదా. అది కిందకు జారి అని కావ్య అంటుంటే.. ఏయ్.. అని రాజ్ అంటాడు. అదే మీ కడుపులోకి జారి. కడుపులో బాగా మండిపోతుంది కదా అని కావ్య అంటుంది. ఆఖరికి బాగున్న డిజైన్స్ ఏ వెధవ ఒప్పుకోరని అంటున్నారు. నాకు నచ్చలేదు అని రాజ్ అంటాడు. దాంతో నేను మీ భార్య, మీరు నా భర్త ఏం చేస్తాం అని కావ్య అంటుంది.
బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో అసలు నీ బాధ కారణం ఏంటని అనామికను అడుగుతుంది ధాన్యలక్ష్మీ. మీ కొడుకు అని అనామిక అంటుంది. నా మనవడు ఏం నేరం చేశాడని ఇందిరాదేవి అంటుంది. ఆఫీస్‌లో కవి సమ్మేళనం పెట్టి కవితలు చెబుతున్నాడు అని కోపంగా అంటుంది అనామిక. కవిగారి గురించి తెలిసిందే కదా. అది తెలిసే కదా పెళ్లి చేసుకున్నావ్. కవులను ఇలా అవమానించకూడదు అని కావ్య అంటుంది. దాంతో ఆపు.. అసలు ఆయన ఇలా అవ్వడానికి కారణం నువ్వే. మా ఆయన్ను అసమర్థున్ని చేసి మీ ఆయన్ను మహారాజును చేయాలని చూస్తున్నావ్ అని అనామిక అంటుంది.