Brahmamudi March 4th Episode: బ్రహ్మముడి.. 50 లక్షల నష్టం, తమ్ముడిపై సుభాష్ అరుపులు.. కావ్య బావకు పెళ్లి, రాజ్‌కు షాక్-brahmamudi serial march 4th episode subhash angry at prakasham and says sorry to dhanya lakshmi brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi March 4th Episode: బ్రహ్మముడి.. 50 లక్షల నష్టం, తమ్ముడిపై సుభాష్ అరుపులు.. కావ్య బావకు పెళ్లి, రాజ్‌కు షాక్

Brahmamudi March 4th Episode: బ్రహ్మముడి.. 50 లక్షల నష్టం, తమ్ముడిపై సుభాష్ అరుపులు.. కావ్య బావకు పెళ్లి, రాజ్‌కు షాక్

Sanjiv Kumar HT Telugu
Mar 04, 2024 08:16 AM IST

Brahmamudi Serial March 4th Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 4వ తేది ఎపిసోడ్‌లో తమ్ముడు ప్రకాశంపై సుభాష్ విపరీతంగా ఫైర్ అవుతాడు. 50 లక్షలు నష్టం వచ్చిందని అరుస్తాడు. దాంతో సుభాష్‌పై ధాన్యలక్ష్మీ ఫైర్ అవుతుంది. దాంతో క్షమించమని చెబుతాడు సుభాష్. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ మార్చి 4వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ మార్చి 4వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో రాజ్ లగేజ్ తీసుకొస్తుంటే.. అదేంటి మా అల్లుడు.. ఆ.. అదే మా మేనల్లుడి బ్యాగ్ తీసుకొస్తున్నారు అని కనకం అడుగుతుంది. అదేంటీ నేను వస్తున్నట్లు వీళ్లకు ఇన్ఫర్మేషనే లేదా అని రాజ్ అనుకుంటాడు. అయ్యో అమ్మా ఆయన మన ఇంట్లోనే ఉండేందుకు వస్తున్నారు అని కావ్య చెబుతుంది. దాంతో అవునా అని కనకం, కృష్ణమూర్తి కావాలనే పెద్దగా అరుస్తారు. మా ఇంట్లో ఉంటాననడం మా అదృష్టం అని కృష్ణమూర్తి అంటాడు.

మీ తమ్ముడే

తర్వాత అంతా కలిసి లోపలికి వెళ్లిపోతారు. మరోవైపు ఆఫీస్ స్టాక్ గోడౌన్‌లో ఫైర్ యాక్సిడెంట్ అయిందని, దానికి ఇన్సూరెన్స్ చేయించలేదని, 50 లక్షలు నష్టం వచ్చిందని సుభాష్‌కు మేనెజర్ కాల్ చేసి చెబుతాడు. దాంతో ఒక్కసారిగా అతనిపై అరుస్తాడు. ఎందుకు ఇన్సూరెన్స్ చేయించలేదు అని కోపంతో అరుస్తాడు. మీ తమ్ముడు చూసుకుంటానని చెప్పారు అని మేనేజర్ చెబితే.. వాడికి సవా లక్షా పనులు ఉంటాయి. మిమ్మల్ని ఎందుకు పెట్టుకున్నాను. ఇవన్నీ చూసుకుంటారనే కదా అని ఫైర్ అయి కాల్ కట్ చేస్తాడు.

ఇంతలో వచ్చిన అపర్ణతో ప్రకాశం ఎక్కడ అని సుభాష్ అరుస్తుంటే.. మెట్లు దిగుతూ వస్తాడు ప్రకాశం. ఏమైంది అన్నయ్య అరుస్తున్నావ్. వదినా ఏమైనా తప్పు చేసిందా అని ప్రకాశం అంటాడు. తప్పు చేసింది వదినా కాదు. నువ్వు. గోడౌన్‌లోకి స్టాక్ రాగానే ఇన్సూరెన్స్ చేయించమన్నాను కదా. ఎందుకు చేయించలేదు. దాని వల్ల 50 లక్షలు నష్టం వచ్చింది అంటూ చాలా సీరియస్‌గా కోప్పడతాడు సుభాష్. ధాన్యలక్ష్మీ కూడా అక్కడే ఉండి అంతా వింటుంది.

ఆఫీస్ ఎలా ఇవ్వగలను

అయ్యో మర్చిపోయాను అన్నయ్య. మర్చిపోవద్దు అనే అనుకుంటాను. కానీ, మర్చిపోతున్నాను ప్రకాశం అంటాడు. ఇలా ఎన్నిసార్లురా.. లాస్ట్ ఇయర్ ఇలాగే చేశావ్. మర్చిపోయాను అని తప్పించుకోకు. నీకు మేనెజర్స్‌ని పెట్టింది ఇవి గుర్తు చేసేందుకే కదా. ఇలా చేస్తే మేము బయటకు వెళ్లినప్పుడు నీకు ఆఫీస్ ఎలా అప్పజెప్పగలను. నిన్ను నమ్మి నీకు ఆఫీస్‌ను ఒక్కరోజైనా ఎలా ఇవ్వగలను అని సుభాష్ కట్టలు తెంచిన కోపంతో అరుస్తూనే ఉంటాడు.

ఇంతలో ఆపండి బావగారు. ఆయన మీతోపాటే ఆఫీస్ చూసుకుంటారు. ఆయనేదే మీ బానిసలా తిడుతున్నారు. ఆయనేమైనా చిన్నపిల్లాడా అలా తిడుతున్నారు. ఆయనకు పెళ్లి అయి పిల్లలకు కూడా పెళ్లి అయింది. మీరు ఇంకా చిన్నపిల్లాడిలా చూస్తున్నారు అని ధాన్యలక్ష్మీ సీరియస్ అవుతుంది. అది కాదు ధాన్యలక్ష్మీ అని సుభాష్ మెల్లిగా సంజాయిషీ ఇచ్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఏం చెబుతారు బావగారు. నోటికి వచ్చినట్లు అంటూనే ఉన్నారు అని ధాన్యలక్ష్మీ అంటుంది.

ఇన్ని ఉంటాయని అనుకోలేదు

ధాన్యం వారి మధ్యలోకి నేనే వెళ్లను నువ్ ఎందుకు వెళ్తున్నావ్ అని అపర్ణ అంటుంది. ఆయన మహారాజులా తిడుతుంటే నువ్ మహారాణిలా చూస్తున్నావ్. నువ్ ఎందుకు వెళ్తావ్ అని ధాన్యం అంటుంది. హేయ్ నువ్ ఆగు ప్రకాశం అంటాడు. మీరు ఆపండి. మీకు అవమానం జరిగితే నాకు జరిగినట్లే అని ధాన్యం అంటుంది. సారీ అమ్మా నన్ను క్షమించు. అన్నయ్యగా నా తమ్ముడిని అంటున్నాను కానీ, మా మధ్య ఇన్ని ఉంటాయని అనుకోలేదు. తను చెప్పింది కరెక్టే. నేను ఇలా అనకూడదు. నన్ను క్షమించు అని చేతులతో దండం పెట్టి వెళ్లిపోతాడు సుభాష్.

చాలా.. నీ కోరిక తీరిందా. తమ్ముడికి అన్నయ్య సారీ చెప్పే దుస్థితి తీసుకొచ్చావ్ అని అపర్ణ అంటుంది. నోటికి వచ్చినట్లు అనకుంటే అలా జరగదు కదా అక్కయ్య అని ధాన్యం అంటుంది. హేయ్ ఆపు.. అని ఫైర్ అయిన ప్రకాశం తనను లోపలికి తీసుకెళ్తాడు. నీకు పిచ్చి పట్టిందా. అన్నయ్యతో ఎందుకు అలా ప్రవర్తించావ్ అని ప్రకాశం అంటాడు. మీకు అంతా అవమానం జరుగుతుంటే ఎలా ఊరుకుంటాను అని ధాన్యం అంటుంది.

కళ్లు నెత్తికెక్కాయి

చాల్లే ఆపు.. మా అన్నయ్య నన్ను ఇంతకాలం భరిస్తూ సహిస్తూ వచ్చాడు. ఇప్పుడు తప్పు చేస్తే అన్నాడు. ప్రతిసారి నాకు అవకాశం ఇస్తూనే వస్తున్నాడు. నువ్ నీ కొడుకుపై అరవలేదా. ఇది కూడా అలాగే. అవమానం కాదు. మాటలు పడిన నేనే పట్టించుకోవట్లేదు. నీకేంటీ. ఇన్నాళ్లు మనవాళ్లు అనుకున్నావ్ అందుకే తప్పులు కనిపించలేదు. ఇప్పుడు నీ కళ్లు నెత్తికెక్కాయి. నువ్ చాలా మారిపోయావ్. ఆ మైకం నుంచి బయటకు వచ్చాకా ఎంత పెద్ద తప్పు చేశావో నీకే అర్థమైతుంది. ఇంకోసారి నాకు మా అన్నయ్య మధ్యలో నువ్ రాకు అని కోపంతో చెప్పేసి వెళ్లిపోతాడు ప్రకాశం.

మరోవైపు కావ్య ఇంట్లో అరిటాకుపై అన్ని రకాల వంటకాలు చేసి పెడతారు. ఇవాళ సూపర్‌గా లాగించేయాలని అని రాజ్ అనుకుంటాడు. అయితే, ఆ అరిటాకుపై భాస్కర్‍కు వడ్డిస్తారు. పోయినసారి ఇలా అరిటాకుపై వడ్డిస్తే కోప్పడ్డారు కదా అని రాజ్‌తో అంటుంది అప్పు. మీరు స్పెషల్ డైట్ ఫాలో అవుతున్నారట కదా. మీ కోసం వేరే ఆర్డర్ పెట్టాను అని కూరగాయలతో ఉన్న ఫుడ్ తీసుకొస్తుంది అప్పు. ఇక బాగా తినమని భాస్కర్‌ను అంతా ఎంకరేజ్ చేస్తారు. అది చూసి ఇరిటేట్ అవుతాడు రాజ్.

అంకుల్ అంటారు

ఇదంతా చూసి అన్నయ్య జెలసీ ఫీల్ అవ్వట్లేదు కదా అని భాస్కర్ అంటాడు. లేదు లేదు నాది పెద్ద బ్రాండ్ మైండ్ అని రాజ్ అంటాడు. మీది బ్రాడ్ మైండ్ అయితే మా బావది ఆ సిటీలో ఉంటున్న పెద్ద బ్రాడ్ మైండ్ అని కావ్య అంటుంది. తర్వాత మీ మేనల్లుడికి పెళ్లి చేసి అమెరికా పంపించేయొచ్చు కదా అని రాజ్ అంటాడు. గౌడు గేదేలా ఉన్నాడు. ఇంకొన్నాళ్లు పోతే అందరూ అంకుల్ అని పిలుస్తారు. లేకుంటే నేనే నీకు మంచి అమ్మాయిని చూసి పెడతాను. ఎలాంటి అమ్మాయి కావాలని రాజ్ అడుగుతాడు.

దాంతో కావ్యనే చూస్తాడు భాస్కర్. కావ్యలా నవ్వాలి, వండాలి, ప్రేమగా వడ్డించాలి అని కావ్య పేరే చెబుతాడు భాస్కర్. నాకు అర్థమైంది బావ నీకు మా కావ్య అక్కలా ఉన్న అమ్మాయి కావాలి. కానీ, అలాంటి అమ్మాయి ఎక్కడా ఉండదు. కావ్యను చేసుకున్న భర్త ఇక్కడే ఉన్నాడు. మా బావ మా అక్కను వద్దనుకుని రెండో పెళ్లి చేసుకుంటే తప్పా నీకు ఆ ఛాన్స్ లేదు. అయినా దేవతలాంటి మా అక్కను మా బావ ఎందుకు వదులుకుంటాడు. ఏం బావ అని అప్పు అడుగుతుంది.

సైట్ లేదన్నయ్యా

దానికి ఆపవే పొట్టి జుట్టు దానా అని రాజ్ లోపల అనుకుంటాడు. తర్వాత ఆపు అంటాడు. ఇలా రాజ్‌ను తన అత్తింట్లో అంతా ఆడుకుంటారు. మరోవైపు ధాన్యలక్ష్మీ అన్న మాటలు తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు సుభాష్. ఇంతలో ప్రకాశం వచ్చి అన్నయ్య అని పిలుస్తాడు. నాకు మతిమరుపు ఉందన్నయ్యా. సైట్ లేదు. నువ్ బాధపడుతుంటే ఆ మాత్రం చూడలేనా అని ప్రకాశం అంటాడు. తర్వాతి ఎపిసోడ్‌లో ఇన్ని రోజుల తర్వాత కావ్య బావ ఎందుకు వచ్చాడు అని కావ్యపై మరింత డౌట్ పెరిగేలా చేస్తుంది శ్వేత.