Brahmamudi March 8th Episode: బ్రహ్మముడి సీరియల్.. జానా బెత్తడు అనామిక అన్న స్వప్న.. విడిపోవడమే మంచిదన్న కల్యాణ్-brahmamudi serial march 8th episode prakasham suggetions to kalyan about anamika brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi March 8th Episode: బ్రహ్మముడి సీరియల్.. జానా బెత్తడు అనామిక అన్న స్వప్న.. విడిపోవడమే మంచిదన్న కల్యాణ్

Brahmamudi March 8th Episode: బ్రహ్మముడి సీరియల్.. జానా బెత్తడు అనామిక అన్న స్వప్న.. విడిపోవడమే మంచిదన్న కల్యాణ్

Sanjiv Kumar HT Telugu
Apr 03, 2024 11:14 AM IST

Brahmamudi Serial March 8th Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 8వ తేది ఎపిసోడ్‌లో కల్యాణ్ బెడ్ రూమ్ నుంచి బయటకు వెళ్లి పడుకుంటానంటాడు. అర్థం చేసుకోని మనసులో బతకడం కంటే విడిపోవడమే మంచిది అని కల్యాణ్ వెళ్లిపోతాడు. మరోవైపు కావ్యకు స్వప్న సలహా ఇస్తుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ మార్చి 8వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ మార్చి 8వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో స్వప్న మోడలింగ్ పంచాయితీ తర్వాత అక్కను కావ్య గదిలోకి తీసుకెళ్తుంది. ఏం చేస్తున్నావ్ అక్క. మోడలింగ్ వద్దని చెప్పారుగా. మళ్లీ ఎందుకు చేస్తున్నావ్ అని కావ్య అడుగుతుంది. చేయొద్దన్న పని చేయాలని నాకు ఏం లేదు. ఇంకా కడుపుతో ఉండగా ఇలా కష్టపడాలని అంతకన్నా లేదు. కానీ, నా భర్త, అత్తలను ఎండు చేపలను ఎండగట్టినట్లు చేయాలనే ఇలా చేశాను అని స్వప్న చెబుతుంది.

కావ్యకు రివర్స్ క్వశ్చన్

నేను క్రెడిక్ కార్డ్ బిల్స్ కట్టాలని అడిగితే ఏం పట్టనట్లు ఉన్నారు. అందుకే ఇలా మోడలింగ్ పేరుతో అందరిముందు వారి పరువు తీద్దామనుకున్నాను అని స్వప్న అంటుంది. కావచ్చు, కానీ కుటుంబ గౌరవం కూడా చూడాలి కదా. సర్దుకుపోవాలి కదా అని కావ్య అంటుంది. అంటే.. ఏమన్నా తలదించుకోని మంచిదానిలా ఉండాలా. నువ్ మంచిదానిలా ఉన్నావ్ ఏం చేశారు అని స్వప్న రివర్స్ క్వశ్చన్ వేస్తుంది.

ఇంట్లోవాళ్లు నిన్ను ఏం అనకుండా ఉంటున్నారా. నీకు ఇచ్చే గౌరవం పూర్తిగా ఇస్తున్నారా. మనం పేద కుటుంబంలో పుట్టడమే మన తప్పా. నిన్న గాక మొన్న వచ్చిన ఆ జానా బెత్తడు అనామిక కూడా నిన్ను అంటుంది. అదే నా జోలికి రమ్మను గుండు గీసి సున్నంబొట్లు పెడతాను. ఆ విషయం దానికి తెలుసు. అందుకే నా జోలికి రాదు. నువ్ ఏమన్నా సైలెంట్‌గా ఉంటావ్ కాబట్టే నీపై అలా రెచ్చిపోతుంది. మీ అత్తయ్య నీపై ప్రేమతో, నువ్ పెద్ద కొడలివి అనే గౌరవంతో నీకు అన్ని ఇస్తుందా. పిచ్చిదానా నువ్ ఇంకా అమ్మమ్మ అమ్మమ్మల కాలంలోనే ఉన్నావే. తన తోడి కోడలిపై పంతం నెరవేర్చుకునేందుకు నీతో అలా ఉంటుంది అని స్వప్న చెబుతుంది.

అనామిక చేస్తే

మరోవైపు ఇంట్లో జరుగుతున్నవి చూస్తుంటే భయంగా ఉంది బావ అని సీతారామయ్యతో ఇందిరాదేవి చెబుతుంది. నాకు కూడా అదే భయంగా ఉంది చిట్టి. చిన్న చిన్న గొడవలే గాలి వానగా చీలి పెద్ద సమస్య అవుతుందేమో అని భయంగా ఉంది అని సీతారామయ్య అంటాడు. స్వప్న ఇవాళ అలా చేసింది. అది చూసి రేపు అనామిక చేస్తే అని ఇందిరాదేవి అంటుంది. స్వప్న చేసిందాంట్లో తప్పు లేదు. పెళ్లయి ఇన్నాళ్లు అయిన భర్త రాహుల్ బాధ్యతగా లేనప్పుడు ఏ భార్య అయితే ఏం చేస్తుంది అని సీతారామయ్య అంటాడు.

స్వప్న సంగతి సరే.. ఈ ధాన్యలక్ష్మీకి ఏమైంది. అన్ని ఉన్నాయిగా. ఇవాళ సుభాష్‌పై కూడా అరిచేసిందట. నీకు చెబితే బాధపడతావని చెప్పలేదు. ప్రకాశంని అంటుంటే వాడిపై కోప్పడిందంట. దాంతో నా తమ్ముడిని తిట్టే అధికారం కూడా నాకు లేదా అని పెద్దోడు బాధపడ్డాడట. అనామిక వచ్చినప్పటినుంచి ధాన్యలక్ష్మీ మారిపోయింది. కోడలు వచ్చినందుకు మారిందా. అపర్ణపై పంతం నెరవేర్చుకోడానికి మారిందా అర్థం కావట్లేదు అని ఇందిరాదేవి అంటుంది.

ఇంటి కోడలు కష్టపడటం

నీకు ఇంకా అర్థం కాలేదా. రాజ్‌లాగే కల్యాణ్‌ను చూడాలని, అలాగే గౌరవం దక్కాలని కోరుకుంటుంది. కానీ, వాళ్లిద్దరు ఒక్కటే అని తనకు తెలియదు. కల్యాణ్ సున్నిత మనస్కుడు. అది చూసి రాజే ఒక్కోసారి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. కల్యాణ్‌ను సరిగ్గా అర్థం చేసుకుంటే వాళ్లకు తెలుస్తుంది అని సీతారామయ్య అంటాడు. అనామిక కూడా కల్యాణ్‌ను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదని ఇందిరాదేవి అంటుంది. ఇప్పుడు అయితే స్వప్న సంగతి చూద్దాం. కడుపుతో ఉన్న ఇంటి కోడలు కష్టపడటం ఇంటికి గౌరవం కాదు. ధాన్యలక్ష్మీ గురించి ప్రకాశంకు చెప్పు. అప్పుడు కూడా మితి మీరిపోతే నువ్ చెప్పు అని సీతారామయ్య అంటాడు.

మరోవైపు కల్యాణ్ కవితలు రాసుకుంటూ ఉంటే.. అనామిక వస్తుంది. దాంతో దిండు దుప్పటి తీసుకుని బయటకు వెళ్లిపోతాడు. ఎక్కడికి అని అనామిక అడిగితే.. బయట పడుకుందామని వెళ్తున్నాను అని కల్యాణ్ అంటాడు. అంటే ఇక్కడ నీకు ఊపిరి ఆడట్లేదా అని అనామిక అంటుంది. జైళ్లో ఉన్నవాడికి బయట ఉన్నవాడికి ఇద్దరికి గాలి ఆడుతుంది. కానీ, బయట ఉన్నవాడికి స్వేచ్ఛ ఉంటుంది. నాకు ఈ గది ఒక్కటే కాదు ఈ ఇల్లు కూడా జైలే. అర్థం చేసుకోలేని మనుషుల మధ్య ఒంటరిగా ఉండటం అంటే జైళ్లో ఉన్నట్లే అని కల్యాణ్ అంటాడు.

అర్థం చేసుకుంటావనే

అర్థం చేసుకునే అమ్మాయి దొరికింది అని పెళ్లి చేసుకున్నాను. కానీ, అది జరగలేదు. అర్థం చేసుకోని మనసులతో కలిసి ఉండటం కంటే విడిపోవడమే మంచిది. మనకు గొడవలు ఉన్నాయని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ తెలుసు. నీ పరువు తీయాలని నాకు లేదు. నీతో ఒక్కటి అవుతానన్న ఆశతో వెళ్లిపోతున్నాను. నువ్ ఎప్పటికైనా అర్థం చేసుకుంటావనే నమ్మకంతో వెళ్తున్నాను, అప్పుడు వచ్చి ఈ గదిలో కాదు నిన్ను హత్తుకుని పడుకుంటాను అని కల్యాణ్ వెళ్లిపోతాడు.

ఎప్పటికైనా నేనే కరెక్ట్ అని నా దగ్గరికి వస్తావ్ అని అనామిక అనుకుంటుంది. హాల్లో పడుకున్న కల్యాణ్‌ను చూసి ధాన్యలక్ష్మీ షాక్ అవుతుంది. వెంటనే వెళ్లి భర్త ప్రకాశంని లేపి కల్యాణ్ గురించి చెబుతుంది. ఇద్దరు కిందకు వస్తారు. వాన్ని ఇలా చూస్తే అక్క దెప్పి పొడుస్తుంది. ఏమైందో అడగండి అని అంటుంది ధాన్యలక్ష్మీ. కొడుకు కాపురం ఏమవుతుందని లేదు కానీ, మా వదిన దెప్పి పొడుస్తుందన్న బాధ ఎక్కువైందా అని వెళ్లి కల్యాణ్‌ను లేపుతాడు ప్రకాశం.

కల్యాణ్‌కు ప్రకాశం సలహా

ఏమైంది. మళ్లీ గొడవ పడ్డారా అని ప్రకాశం అడుగుతాడు. తెలిసిందే కదా నాన్న అని కల్యాణ్ అంటే.. అలా అని అందరికీ తెలిసేలా ఇక్కడ పడుకుంటావా. భార్య పరువు తీస్తావా. తను కొత్తగా పెళ్లి అయి వచ్చింది. ఎన్నో ఊహలు, ఆశలు ఉంటాయి. అవి నెరవేరలేకపోయేసరికి నీపై అరిచింది. ఇక్కడ పడుకుంటే పరిష్కారం దొరుకుతుందా అని చాలా మాటలు చెప్పి కల్యాణ్‌కు నచ్చజెపుతాడు ప్రకాశం. సరే నాన్న నేను లోపలికి వెళ్తాను. నాకు ఇష్టం లేదు. కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేక వెళ్తున్నాను. లోపలికి పంపగలరు కానీ కలిసి ఉండేలా మాత్రం చేయలేరు కదా అని కల్యాణ్ వెళ్లిపోతాడు.

హమ్మయ్య ఎవరు చూడకముందే లోపలికి పంపించేశారు అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఎవరు చూడకూడదనే నీ బాధ గానీ, కొడుకు సంతోషంగా ఉన్నాడా లేడా అనేది చూడవా. నువ్ అనామికకు సపోర్ట్ చేయడం వల్లే వాళ్లిద్దరి మధ్య గొడవలు పెరుగుతున్నాయి. ఇలా కాకుండా వాళ్లు సంతోషంగా ఒక్కటయ్యే మార్గం చూడు అని చెప్పేసి వెళ్లిపోతాడు ప్రకాశం. తర్వాత శ్వేతతో రాజ్ ఫోన్‌లో మాట్లాడుతుంటాడు. ఆ బావ గాన్ని అక్కడే వదిలేసేలా చేశాను అని రాజ్ అంటే.. అసలు నువ్ అలా ఎందుకు చేస్తున్నావ్ అని శ్వేత అంటుంది.

డిస్టర్బ్ చేయడం ఎందుకు

నాకు వాడి ప్రవర్తనే చిరాకు తెప్పిస్తుంది. అందుకే అని రాజ్ అంటే.. నీకు అతనితో సమస్య లేదు. కావ్యతోనే కదా. ఎందుకు అని రాజ్ మనసులో ఏముందో అని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది శ్వేత. ఇంతలో కావ్య వచ్చేసరికి రాజ్ కాల్ కట్ చేస్తాడు. మీ బావ రాలేదని ఫీల్ అవుతున్నావా. అసలే కాలు కాలింది కదా. అటు నుంచి అటే అమెరికా వెళ్లిపోతాడేమో అని రాజ్ అంటాడు. మరి పిలవమంటారా అని కావ్య అంటే.. వద్దులే.. కావాలంటే వీడియో కాల్ మాట్లాడు. అతన్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని రాజ్ అంటాడు.

తర్వాత కావ్యతో కావాలనే భాస్కర్ గురించి అదోటి ఇదోటి అంటాడు రాజ్. అనుకున్నది ఒక్కటి అయిందొక్కటి అని పాట పెడతాడు. దాంతో కావ్య వెళ్లిపోతుంది. అనంతరం పుట్టింటికి వెళ్లి నా మనవడిని మార్చి తీసుకొస్తానని చెప్పి ఇలా చేశావ్ అని కావ్యను అడుగుతుంది ఇందిరాదేవి. దాంతో జరిగింది అంతా చెబుతుంది కావ్య. దాంతో మీ బావకు కాల్ చేసి ఉదయాన్నే ఇక్కడ ఉండాలని చెప్పు. నేను పిలిచానని చెబితే రాజ్ ఏమనడు అని ఇందిరాదేవి అంటుంది. దాంతో సరేనని అన్న కావ్య... ఇక రేపు మా బావని చూసి ఆయన వేసే డ్యాన్సులు ఎలా ఉంటాయో చూడాలి అంటుంది.

కావ్యపై రాజ్ ప్రేమ

తర్వాతి ఎపిసోడ్‌లో ఉదయం భాస్కర్‌తో ప్రేమగా కావ్య కాఫీ ఇస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసిన రాజ్ జెలసీ ఫీల్ అవుతాడు. రాజ్ మనసాక్షి బయటకు వచ్చి కళావతి మొహం ఎంత కళకళాడిపోతుందో తెలుసో. ఇలాగే చూస్తే.. ఏదో ఒకరోజు తన బావను తనను ఎగిరేసుకుపోతాడురా. ఇదంతా పక్కన పెట్టి నీ మనసులోని ప్రేమను బయటపెడతావా లేదా అని ఆ మనసాక్షి అంటాడు. దాంతో రాజ్ ఆలోచిస్తాడు.

Whats_app_banner