Brahmamudi March 7th Episode: బ్రహ్మముడి సీరియల్.. రాజ్‌తో ఇన్నర్ వేర్స్ తెప్పించిన కావ్య బావ.. స్వప్న మోడలింగ్ పంచాయితీ-brahmamudi serial march 7th episode swapna modeling photoshoot duggiral family support to swapna brahmamudi today episod ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Brahmamudi Serial March 7th Episode Swapna Modeling Photoshoot Duggiral Family Support To Swapna Brahmamudi Today Episod

Brahmamudi March 7th Episode: బ్రహ్మముడి సీరియల్.. రాజ్‌తో ఇన్నర్ వేర్స్ తెప్పించిన కావ్య బావ.. స్వప్న మోడలింగ్ పంచాయితీ

Sanjiv Kumar HT Telugu
Mar 07, 2024 07:53 AM IST

Brahmamudi Serial March 7th Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 7వ తేది ఎపిసోడ్‌లో స్వప్న మళ్లీ మోడలింగ్ ఫొటోషూట్ చేస్తుంది. అది చూసి మొదట షాక్ అయిన దుగ్గిరాల ఫ్యామిలీ తర్వాత స్వప్నకు సపోర్ట్‌గా నిలుస్తుంది. అంతా రాహుల్, రుద్రాణిని తప్పుబడతారు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ మార్చి 7వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ మార్చి 7వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో భాస్కర్‌ను రాజ్ బాత్రూమ్‌కు తీసుకెళ్తాడు. బాత్రూమ్‌లోకి వెళ్లిన భాస్కర్ కావాలనే రాజ్‌తో ఆటాడుకుంటాడు. రాజ్ వెళ్లిపోతుంటే.. బుజ్జి అని పిలుస్తాడు రాజ్. దాంతో ఇప్పుడు మళ్లీ బుజ్జి ఎందుకురా అని రాజ్ అంటాడు. సబ్బు అయిపోయింది అన్నయ్య అని భాస్కర్ అంటాడు. అరేయ్.. నిన్నే మోసాను. నాకు సబ్బు ఓ లెక్కనారా తీసుకొస్తానని వెళ్లి తీసుకొస్తాడు రాజ్.

ఇన్నర్ వేర్స్

అదంతా చూస్తూ నవ్వుకుంటాడు భాస్కర్. తర్వాత పాట పాడమంటాడు భాస్కర్. నాకు పాటలు రావని రాజ్ అంటే.. చేతిలో చేయి వేసి చెప్పు బావ అని కావాలనే రాజ్ మరింత ఉడికిపోయేలా పాడతాడు భాస్కర్. తర్వాత అన్నయ్యా.. ఇది నీకు చెప్పాల వద్దా అని ఆలోచిస్తున్నాని అని భాస్కర్ అంటే.. చెప్పమని రాజ్ అంటాడు. నాకు డీబీలు కావాలని భాస్కర్ అంటాడు. అవేంట్రా అని రాజ్ అంటే.. ఇన్నర్ వేర్స్ అన్నయ్యా.. డ్రాయర్, బనియన్. స్వరాజ్ గ్రూప్ ఇండస్ట్రీస్ ఛైర్మన్‌వి నీకు ఇవి చెప్పడం ఎలా అని భాస్కర్ అంటాడు.

ఎలాంటి వాన్ని ఎలా చేశావురా. ఆ నిప్పు కణికమీద నువ్ కాలు వేయడం వల్లే నా తలరాత మారిందిరా అని విసుక్కున్న రాజ్ పోయి ఇన్నర్ వేర్స్ తీసుకొస్తాడు. ఇంత బరువు మోసుకుంటూ వచ్చినవాడివి ఇవి తెచ్చుకోవాలని తెలియదారా అని రాజ్ అంటే.. తెలుసు అన్నయ్యా కానీ, మర్చిపోయా అని భాస్కర్ అంటాడు. వీడు అమెరికా నుంచి వచ్చాడా అనకాపల్లి నుంచి వచ్చాడా అని రాజ్ అనుకుటాడు. మరోవైపు రుద్రాణి లేవగానే ఉదయం ఇంటి బయట స్వప్న మోడలింగ్ ఫొటో షూట్ చేస్తుంది.

స్వప్న మోడలింగ్ ఫొటోషూట్

అది చూసి షాక్ అయిన రుద్రాణి.. ఏంటిది. ఇంట్లో వాళ్లు మోడలింగ్ చేయొద్దన్నారుగా అని అంటుంది. నీ కొడుకు కోట్ల ఆస్తి కూడబెడుతుంటే టైమ్ పాస్‌కి మోడలింగ్ చేయట్లేదు. మీరే ఇక్కడ అడుక్కు తింటున్నారు. నా సంగతి నేను చూసుకోవాలి కదా. అందుకే మోడలింగ్ స్టార్ట్ చేశాను. దాన్ని ఆపే హక్కు ఎవరికీ లేదు అని స్వప్న అంటుంది. దాంతో రుద్రాణి ఇంట్లోకి వెళ్లి అందరినీ పిలచుకుని వస్తుంది. వాళ్లంత బయటకు వచ్చి స్వప్న మోడలింగ్ ఫొటో షూట్ చూసి షాక్ అవుతారు.

ఇప్పుడు మన ఇంటి గౌరవం దెబ్బతినదా. ఇంది అందాల ప్రదర్శనే. ఇలాంటి ఫొటోలు బయటకు వెళితే దుగ్గిరాల పరువు ఎమౌవుతుంది అని అపర్ణతో వెటకారంగా అంటుంది ధాన్యలక్ష్మీ. ఏంటీ దరిద్రం మమ్మీ అని రాహుల్ అంటే.. తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టి. ఇప్పుడు ఏంటీ అంటే ఎలా అని రుద్రాణి అంటుంది. అత్త, భర్త చేతులు ఎత్తేస్తే ఎలా. కొంచమైనా కంట్రోల్‌లో పెట్టాలి కదా అని అపర్ణ అంటుంది. ఇప్పుడు ఏం వద్దు. ఆ ఫొటోషూట్ అయిన తర్వాత స్వప్నతో మాట్లాడుదామని సుభాష్ అంటాడు.

కాళ్లు విరగొడతాను

మరోవైపు వీడిని ఎలా వదిలించుకోవాలి. కావ్యను కలవకుండా ఎలా చేయాలని రాజ్ ఆలోచిస్తుంటాడు. తర్వాత కావాలనే భాస్కర్‌కి కావ్య ఇడ్లీ తినిపించేందుకు ట్రై చేస్తుంది. అది చూసి వాట్.. అంటూ గట్టిగా ఫోన్ తీసుకుని అరుస్తాడు రాజ్. దాంతో అంతా షాక్ అవుతాడు. ఫోన్‌లో ఏదో ఒకటి రాజ్ మాట్లాడుతుంటే కావ్య భాస్కర్‌కు ఇడ్లీ తినిపించేందుకు చూస్తుంది. దాంతో కాళ్లు విరగొడతాను, మొహం చట్నీ చేస్తాను అని ఇన్ డైరెక్ట్‌గా వార్నింగ్ ఇస్తాడు రాజ్.

తర్వాత కాల్ కట్ చేసి.. నేను ఒక్కరోజు ఆఫీస్‌లో లేకపోతే ఇలా చేస్తారా. ఆఫీస్‌లో కొంపలు అంటుకుంటున్నాయి. మనం ఆఫీస్‌కు వెళ్లాలి పదా అని కావ్యతో రాజ్ అంటాడు. ఇప్పుడా.. మా బావ అని కావ్య అంటే.. చూసుకోడానికి ఇద్దరూ ఉన్నారు అని కావ్యను లాక్కెళ్తాడు రాజ్. ఇక్క బుజ్జీ.. బావా అంటూ ప్రేమగా నటిస్తారు కావ్య, భాస్కర్. అది చూసి ఎహే ఆపండి అని కావ్యను తీసుకెళ్లిపోతాడు రాజ్. తర్వాత ఇంటికివచ్చిన కావ్య, రాజ్ స్వప్న ఫొటోషూట్ చూసి షాక్ అవుతారు.

పుట్టింటి నుంచి

ఫొటోషూట్ తర్వాత స్వప్నను నిలదీస్తుంది రుద్రాణి. ఏదైనా చేసేముందు మాకు చెబితే బాగుండేది కదా అని అపర్ణ అంటుంది. పరిస్థితుల వల్ల అలా చేయాల్సివచ్చిందని స్వప్న అంటే.. ఏంటా పరిస్థితులు అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఈ ఇంట్లో మా అత్తగారు, భర్త అడుక్కు తింటున్నారట. నాకు ఏమైనా ఖర్చులు ఉంటే పుట్టింటి నుంచి తెచ్చుకోవాలట అని స్వప్న అంటుంది. అదేంటీ రుద్రాణి. అలా ఎలా అన్నావ్. వాళ్లే ఇక్కడ దోచుకుతింటుంటే అని ధాన్యలక్ష్మీ అంటుంది.

చిన్నత్తయ్యా. ఇక్కడ ఎవరు ఎవరిని దోచుకుతినట్లేదు. ఎవరి పని వారు చేసుకుంటున్నారు. ఇక్కడ జరిగేదేంటీ మీరు అనేదేంటీ అని కావ్య అంటుంది. దోచుకుతినకపోతే.. అప్పుని ఎరగా వేసి మా ఆయనను దక్కించుకుందామని అనుకుంటారు అని అనామిక అంటుంది. నా కుటుంబాన్ని అనేముందు నువ్ ఓసారి ఆత్మవిమర్శ చేసుకో. ఇంతకన్న నేను ఏం అనను అని కావ్య అంటుంది. అనామిక ఇక్కడ ఉన్న వాళ్ల గురించి మాట్లాడు. అంతేకానీ లేని వాళ్ల గురించి అనడం సభ్యత కాదు. ఎవరి పుట్టింటికి ఎంత వెళ్లింది అనేది అప్రస్తుతతం అని అనామికను రాజ్ అంటాడు.

ఎలా అడగగలను అంకుల్

భర్తగా, అత్తగా వీళ్లు చేతులెత్తేశారు. రేపు నాకు పుట్టబోయే బిడ్ గురించే నా బాధంతా. వాడు కూడా దేహి అని అడగాలా. వాడికి వీళ్లు ఓ డ్రెస్ తీసుకురాగలరా. అసలు వారసుడిగా చూడగలరా. అందుకే నాకు నచ్చిన పని తెలిసిన పని చేస్తున్నాను అని స్వప్న అంటుంది. మమ్మల్ని అడిగితే అయిపోయేది కదా అని సుభాష్ అంటాడు. మిమ్మల్ని ఎలా అడగగలను అంకుల్ అని స్వప్న అంటుంది. తను చెప్పింది కరెక్టే కదా డాడ్. ఏరా రాహుల్ నీ భార్యను చూసుకోవాల్సిన బాధ్యత నీది కాదా అని రాజ్ అంటాడు.

చూసుకోడానికి నా దగ్గర ఏముందు బూడిద తప్పా.. నా మొగుడు నాకు కోట్ల భరణం ఏమైనా ఇచ్చాడా. నా కొడుక్కి రాజ్‌లాగా వ్యాపారం అప్పజెప్పారా అని రుద్రాణి అంటుంది. నీ కొడుకు ఇప్పటికీ గాలి తిరుగుళ్లు తిరుగుతున్నాడు. ఎలా ఇస్తారు వ్యాపారం అని సుభాష్ అంటాడు. సరే సమస్య మాదాక వచ్చింది కదా. తాతయ్య ఏదో ఒకటి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటాడు. ఇది ఇక్కడితే ఆపేసేయ్ అని స్వప్నతో ఇందిరాదేవి అంటుంది. దాంతో అంతా లోపలికి వెళ్లిపోతారు.

IPL_Entry_Point