Feeling Angry: అప్పుడప్పుడు కోపం కూడా ఆరోగ్యకరమే, ఎందుకో తెలుసా?
కోపం ఒక రకమైన భావోద్వేగం. అయితే ఇది చేసే మేలు తక్కువే. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం కోపం ఆరోగ్యానికి మేలే చేస్తుంది. ఏఏ సందర్భాల్లో కోపం మేలు చేస్తుందో తెలుసుకోండి.
(1 / 6)
మనిషికి ఉన్న భావోద్వేగాలలో కోపం కూడా ఒకటి, మనసుకు నచ్చనిది జరిగినప్పుడు ఎవరికైనా సర్రున కోపం వచ్చేస్తుంది. కొందరిలో మాత్రం కోపం హద్దులు దాటుతుంది. ఇలాంటి సమయంలోనే జరగరాని నష్టాలు జరుగుతాయి. ఆ రేంజ్ కోపం రావడం మంచిది కాదు, కానీ ఎంతో కొంత కోపం రావడం మాత్రం మంచిదే.
(Unsplash)(2 / 6)
ఎక్కువ సహనం ఒక్కోసారి ఎదుటివారి దగ్గర మనల్ని చులకన చేస్తుంది. మీకు నచ్చని విషయాన్ని వ్యక్తీకరించడానికి కోపం చాలా అవసరం.
(Unsplash)(3 / 6)
కొన్ని సార్లు మనసు తేలికపడాలంటే త్వరగా మనుసులో ఉన్న బాధని, అసహనాన్ని బయటపెట్టేయాలి. వాటిని బయటపెట్టాలంటే కోపం ఒక్కటే దారి. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది.
(Unsplash)(4 / 6)
ఎదుటివారు తమ హద్దులు దాటి ప్రవర్తించినప్పుడు కచ్చితంగా మీ కోపాన్ని చూపించాలి. లేకుంటే చాలా నష్టపోవాల్సి వస్తుంది.
(Unsplash)(5 / 6)
కోపాన్ని ఆరోగ్యకరమైన రీతిలోనే వ్యక్తపరచాలి. కేవలం నోటితోనే కోపాన్ని వ్యక్తపరచాలి కానీ ఎదుటి వారిని కొట్టేదాకా వెళ్లకూడదు. అది కూడా సవ్యమైన పదజాలంతోనే మీ కోపాప్ని ఎదుటివారిపై చూపించాలి. అప్పుడే ఆరోగ్యకరం.
(Unsplash)ఇతర గ్యాలరీలు