Kurnool News: హోలీ పండుగ రోజు మహిళలుగా పురుషులు.. ఈ వింత ఆచారం మన దగ్గరే-different ritual in holi festival celebrations in adoni kurnool district ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Kurnool News: హోలీ పండుగ రోజు మహిళలుగా పురుషులు.. ఈ వింత ఆచారం మన దగ్గరే

Kurnool News: హోలీ పండుగ రోజు మహిళలుగా పురుషులు.. ఈ వింత ఆచారం మన దగ్గరే

Mar 26, 2024 12:41 PM IST Muvva Krishnama Naidu
Mar 26, 2024 12:41 PM IST

  • హోలీ అంటే మనకు వెంటనే టక్కున గుర్తొచ్చేది రంగులు చల్లుకోవడం, కాముని దహనం. ఈ పండుగ సందర్భంగా చిన్న పెద్దా అనే తేడా లేకుండా రంగుల ఆట ఆడుతూ సంబరాల్లో మునిగి తేలుతారు. అయితే కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతకుళ్లారు గ్రామంలో అనాదిగా ఓ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. హోలీ రోజున పురుషులు మహిళల వేషధారణలోకి మారతారు. చీర కట్టుకుని, పువ్వులు పెట్టుకుని ఆభరణాలు సింగారించుకుంటారు. ఆ స్త్రీ వేషధారణతో రతీ మన్మథులకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చేస్తే తాము కోరిన కోర్కెలు తీరుతాయని వారి నమ్మకం.

More