Krishna mukunda murari april 26th: ముకుందకు వార్నింగ్ ఇచ్చిన ఆదర్శ్.. నిజం తెలుసుకున్న కృష్ణ, మురారికి దూరం అవుతుందా?-krishna mukunda murari serial april 26th episode adarsh warns mukund to agree with bhavani proposal ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari April 26th: ముకుందకు వార్నింగ్ ఇచ్చిన ఆదర్శ్.. నిజం తెలుసుకున్న కృష్ణ, మురారికి దూరం అవుతుందా?

Krishna mukunda murari april 26th: ముకుందకు వార్నింగ్ ఇచ్చిన ఆదర్శ్.. నిజం తెలుసుకున్న కృష్ణ, మురారికి దూరం అవుతుందా?

Gunti Soundarya HT Telugu
Apr 26, 2024 01:13 PM IST

Krishna mukunda murari serial april 26th episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. తనకి నచ్చకపోతే భవానీ మేడమ్ నిర్ణయానికి నిర్మొహమాటంగా నో చెప్తానని ముకుంద అనేసరికి ఆదర్శ్ షాక్ అవుతాడు. అటు కృష్ణకి నిజం తెలిసిపోతుంది.

కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఏప్రిల్ 26వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఏప్రిల్ 26వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Krishna mukunda murari serial april 26th episode: ఆదర్శ్ ముకుందని తీసుకుని జాగింగ్ కి వెళ్లాలని వస్తాడు. తనని చూసి ముకుంద గది డోర్ వేసేసుకుంటుంది. వెళ్తే ప్రపోజ్ చేస్తాడు ఎలాగైనా తప్పించుకోవాలని అనుకుంటుంది.

జాగింగ్ కి వెళ్దామని ఆదర్శ్ చెప్పగానే ముకుంద కాలు బెణికిందని అబద్ధం చెప్తుంది. చిన్న దెబ్బ అని నిర్లక్ష్యం చేయకూడదని తెగ సేవలు చేస్తాడు. ఇలా ఎన్ని రోజులు తప్పించుకోవాలి ఏదో ఒకటి చేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని ముకుంద డిసైడ్ అవుతుంది.

మురారికి అబద్ధం చెప్పిన కృష్ణ 

మురారి డల్ గా ఉండటం వెనుక కారణం ఏదో ఉందని అది ఏంటో కనుక్కోవాలని కృష్ణ అనుకుంటుంది. హాస్పిటల్ కి వెళ్ళి పరిమళని విషయం అడిగి తెలుసుకోవాలని నిర్ణయించుకుంటుంది. మురారి నిద్రలేచేసరికి కృష్ణ రెడీ అయి ఉండటం చూసి ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతాడు.

గుడికి వెళ్తున్నానని అబద్ధం చెప్తుంది. ముకుంద వెంటనే నేను కూడా రావచ్చా అంటుంది. లేదు నేను ఒక్కదాన్నే వెళ్తాను దేవుడితో పర్సనల్ గా మాట్లాడాలి అంటుంది. మురారికి కూడా తెలియకూడదా? నీ భర్తకి చెప్పకూడని విషయాలు కూడా మీ మధ్య ఉన్నాయా? మీది ఇంకా అన్యోన్య దాంపత్యం అనుకున్నాను అని పుల్ల పెట్టడానికి చూస్తుంది.

ఏసీపీ సర్ కి ఏమైంది?

మీరాని తోడుగా తీసుకుని గుడికి వెళ్ళమని మురారి చెప్తాడు. తనని గుడికి తీసుకెళ్తే హాస్పిటల్ కి ఎలా వెళ్లాలని కృష్ణ మనసులో అనుకుంటుంది. ఏమైంది ఏసీపీ సర్ కి ఎప్పుడైనా నేను ఎక్కడికైనా వెళ్తాను అంటే తోడుగా వస్తానని అంటాడు. కానీ ఇప్పుడు మీరాని తీసుకుని వెళ్ళమని చెప్తున్నాడు.

ఎందుకు నాకు దూరంగా ఉంటున్నారు. దీనికి సమాధానం పరిమళ దగ్గర దొరుకుతుంది. ఎవరికి తెలియకుండా హాస్పిటల్ కి వెళ్ళి రావాలని కృష్ణ అనుకుంటుంది. కృష్ణ ఎందుకు నన్ను ఎవాయిడ్ చేస్తుంది, నిజంగానే గుడికి అయితే నన్ను వద్దని ఎందుకు అంటుందని ముకుంద ఆలోచిస్తుంది.

కృష్ణకి నా మీద ఏమైనా అనుమానం వచ్చిందా? వచ్చి ఉంటే అందరి ముందు నిలబెట్టి అడిగేస్తుంది. గుడికి తోడుగా వస్తానంటే ఎవరూ వద్దని అనరు. కానీ కృష్ణ మాత్రం వద్దని ఎందుకు అంటుంది. ఒకవేళ గర్భసంచి బాగోలేదని తెలిసిపోయిందా? ఏదైనా కృష్ణని జాగ్రత్తగా గమనించాలి. లేదంటే నేను అనుకున్నది సాధించలేనని ముకుంద అనుకుంటుంది.

ఆదర్శ్ గాలి తీసేసిన ముకుంద 

ముకుంద తనతో పెళ్లికి ఒప్పుకుంటుందా లేదా అని ఆదర్శ్ ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మ ముకుందకి ఇంట్లో ఏదో ఒక స్థానం ఇస్తానని అన్నది కోడలి స్థానం ఇస్తుందని ఆదర్శ్ సంతోషపడతాడు. ముకుంద వస్తే దాని గురించి మాట్లాడతాడు.

మేడమ్ నిర్ణయం నా మనసుకి నచ్చకపోతే నిర్మొహమాటంగా తిరస్కరిస్తానని చెప్పేస్తుంది. ఆ మాట విని ఆదర్శ్ టెన్షన్ పడతాడు. నచ్చనిది అయితే మాత్రం ఒప్పుకోను, నచ్చితే అంగీకరిస్తానని అంటుంది. నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉందో లేదో తెలుసుకోవడం ఎలా? అనుకుంటాడు.

అమ్మకి నో చెప్పొద్దు 

మొహం మీద అలా తిరస్కరించొద్దు, నువ్వు కాదని అంటే మా అమ్మ హర్ట్ అవుతుందని అంటాడు. పెద్దవాళ్ళు ఏం చెప్పినా కాదనకుండా చేయాలి. మనసులో ఏం పెట్టుకోకుండా దానికి ఎస్ అని ఊరికే ఏవో కారణాలు చెప్పి తప్పించుకోవాలని చూడొద్దని ఆదర్శ్ గట్టిగా చెప్తాడు.

తన ప్లాన్ కి ఆదర్శ్ అడ్డుపడుతున్నాడు. అత్తయ్య నిజంగా ఆదర్శ్ ని పెళ్లి చేసుకోమని అడిగితే ఏం చేయాలి. ఒకవేళ ఆవిడ మాట కాదంటే ఇంట్లో నుంచి వెళ్లిపోయే పరిస్థితి రావచ్చని ముకుంద టెన్షన్ పడుతుంది. కృష్ణ ఎవరికీ తెలియకుండా హాస్పిటల్ కి వస్తుంది.

హాస్పిటల్ లో ఒకావిడ కడుపు నొప్పితో బాధపడుతుంటే కృష్ణ ఏమైందని అంటుంది. ఆమె భర్త కోపంగా సమాధానం చెప్పకుండా చిరాకుగా మాట్లాడతాడు. బైక్ మీద నుంచి కిందపడి దెబ్బ తగిలింది గర్భసంచి తీసేయాలని చెప్పారు. భర్తగా సంతకం పెట్టి తర్వాత విడాకులు ఇస్తానని అంటాడు.

మధు సాయం కోరిన సంగీత 

పిల్లల్ని కనలేని పెళ్ళాం నాకెందుకు అంటాడు. అది విని కృష్ణ సీరియస్ అవుతుంది. కానీ అతడు మాత్రం తనకి పిల్లలు కావాలని చెప్పి నిర్లక్ష్యంగా మాట్లాడతాడు. సంగీత మధు దగ్గరకు వచ్చి హెల్ప్ చేయమని అడుగుతుంది. మధు తెగ బిల్డప్ ఇస్తాడు.

నాకు ఆదర్శ్ బావకి పెళ్లి జరిగేలా ఏదైనా ప్లాన్ చేయమని మధుని అడిగేసరికి బిత్తరపోతాడు. ఆదర్శ్ బావకి నేనంటే ఇష్టమే లేదని చెప్తుంది. మరి ఇష్టం లేనప్పుడు ఎందుకు చేసుకోవడం నువ్వు ఊ అనాలే కానీ ఎంతమంది ఉండరు అని తనని దృష్టిలో పెట్టుకుని మధు మాట్లాడతాడు.

సంగీత మాత్రం అర్థం చేసుకోలేకపోతుంది. నాకు ఇష్టం లేదు ఆస్తి కోసం చేసుకోవాలి. ఆదర్శ్ బావని పెళ్లి చేసుకుంటేనే ఆస్తి వస్తుంది లేదంటే రాదు కదా అంటుంది. మధు కోపంగా ఎవరు చెప్పారని అంటే మా అమ్మ చెప్పింది అందుకే వచ్చిన దగ్గర నుంచి ఆదర్శ్ బావ చుట్టూ తిరుగుతున్నానని చెప్తుంది.

ఆదర్శ్ తో పెళ్లి జరగనివ్వనన్న మధు 

ఆస్తి కోసం ఎంత పెద్ద స్కెచ్ వేశావ్ నీ సంగతి చెప్తానని మధు అనుకుంటాడు. అమ్మ తిడుతుందని నీకు ఇష్టం లేనిది చేసుకోవద్దని అంటుంటే రజిని వచ్చి మధు చెంప పగలగొడుతుంది. మధుతో ఇంకోసారి మాట్లాడితే చంపేస్తానని రజిని వార్నింగ్ ఇస్తుంది.

సంగీత పుట్టింది ఆదర్శ్ కోసం ఎలాగైనా వాళ్ళిద్దరి పెళ్లి చేసి తీరతానని రజిని అంటుంది. నీ కూతురు జీవితాన్ని నాశనం కాకుండా చూస్తానని మధు ధీటుగా ఛాలెంజ్ చేస్తాడు. కృష్ణ పరిమళ కోసం వస్తే తను యూఎస్ వెళ్ళిందని రావడానికి టైమ్ పడుతుందని అక్కడి డాక్టర్ చెప్తారు. ఇక రేపటి ఎపిసోడ్లో కృష్ణ తన గర్భసంచి డ్యామేజ్ అయిన విషయం తెలుసుకుంటుంది. ఇక జీవితంలో పిల్లలు పుట్టరని తెలిసి గుండెలు పగిలేలా ఏడుస్తుంది.

IPL_Entry_Point